ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో మండల రజక సంఘం అధ్యక్షులు జాలిగాపు అశోక్ అధ్యక్షతన రజకసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శాయంపేట ఎంపిపి మెతుకు తిరుపతి రెడ్డి వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవాలలో పాల్గొన్ని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరవనిత చిట్యాల ఐలమ్మ భూమికోసం భుక్తికోసం, బానిస విముక్తి కోసం పెత్తందారు, దొరల ఆగడాలను ఎదిరించి తెలంగాణలో విప్లవ జ్వాలలు రగిల్చిన నిప్పు కణిక హోరు జ్వాల అని వారు నడిపిన ఉద్యమస్ఫూర్తిని నేటి యువతి యువకులు అలవరుకొని సమాజ శ్రేయస్సుకై నిరంతరం శ్రమించాలని తెలియజేశారు.
చాకలి ఐలమ్మ జీవనం ఎప్పుడు పోరాటలతో, తాడిత పీడిత వర్గాల అభ్యున్నతికై సాగిన మహాసంగ్రహం అని వారి జీవితం ఎందరికో ఆదర్శం అని తెలియజేశారు. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషం అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్,శాయంపేట సర్పంచ్ కందకట్ల రవి, కొప్పుల ఎంపీటీసీ మేకల శ్రీనివాస్, పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ మామిడి అశోక్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గాజే రాజేందర్,పార్టీ నాయకులు దైనంపల్లి పాపయ్య, కిరణ్ బాబు,పొడిశెట్టి గణేష్ మరియు కార్యకర్తలు,రజక సోదరీ సోదరీమణులు, ప్రజలు పాల్గొన్నారు.