తెలంగాణకల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

తెలంగాణకల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న..
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

అక్టోబర్ 18న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి 10 సంవత్సరంలు పూర్తి చేసుకున్న సందర్భంలో కల్లుగీత కార్మిక సంఘం పదేండ్ల ప్రయాణం పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు నల్లగొండజిల్లా నుండి కల్లు గీత కార్మికులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండవెంకన్న పిలుపునిచ్చారు.
మంగళవారం చండూరు మండల కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 67 వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాడి 10 సంవత్సరంలు పూర్తి అవుతున్న ప్రభుత్వాలు మారిన కల్లు గీత కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కరించ లేకపోయారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించకపోవడం కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల గీత కార్మికుల జీవితాలలో ఎలాంటి మార్పు లేదని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.వృత్తి రక్షణ కోసం. గీత కార్మికుల యువత ఉపాధి అవకాశాలు మెరుగు కోసం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.. గీత కార్మికులందరికీ మోటర్ బైక్ లు ఇవ్వాలని. గీత కార్మికులు సహజ మరణం పొందిన ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా గీతన్న బీమా పథకాన్ని అమలు చేయాలని. ప్రతి గీత కార్మికుల కుటుంబానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం ఇవ్వాలనిఆయన అన్నారు.ఎక్స్గ్రేషియా పదిలక్షలకు పెంచాలని 18 డిమాండ్లతో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు జిల్లా నుండి అధిక సంఖ్యలో గీత కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, కెవిపిఎస్ జిల్లా నాయకులు రవీందర్, కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు చెనగోనికిరణ్, బొమ్మర గోని కిరణ్, ఖమ్మంపాటి యాదయ్య, బొమ్మర గోని కృష్ణయ్య, బిక్షం, చేనగొని పెంటయ్య, బోయపల్లి రోశయ్య, అంజయ్య, శ్రీను, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!