Strict Warning on New Year Celebrations in Tandur
న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోండి
రోడ్లపై మద్యం తాగి వాహనం నడిపితే జైలు పాలె
డీజేలు పెట్టినా చట్ట ప్రకారం కేసులు తప్పవు
తాండూర్ సీఐ దేవయ్య
తాండూరు నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధిలో గల ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ…
నూతన సంవత్సర వేడుకల పేరుతో అతిగా ప్రవర్తించినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తప్పవని గట్టి హెచ్చరిక చేశారు.డిసెంబర్ 31 రాత్రి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తోందని సీఐ దేవయ్య తెలిపారు.ముఖ్యంగా యువత ఉత్సాహం పేరుతో చేసే విన్యాసాలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి:
మీ పిల్లలను నూతన సంవత్సర వేడుకల్లో ఎటు బయటకు పంపకుండా మీ యొక్క పర్యవేక్షణలో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనికోరారు.అలా కాకుండా అత్యుత్సాహంతో రోడ్లపైకి వచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తప్పవని అన్నారు.
మద్యం తాగి వాహనం నడిపితే అంతే జైలు పాలె
డిసెంబర్ 31 సాయంత్రం నుంచే పట్టణంలోని ప్రధాన రహదారులు,కూడళ్ల వద్ద నిరంతర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని సిఐ స్పష్టం చేశారు.మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలితే ఏమాత్రం ఉపేక్షించకుండా అక్కడికక్కడే వాహనాలను జప్తు చేస్తామని,డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.
డీజేలకు నో పర్మిషన్ రోడ్లపై రచ్చ వద్దు
పట్టణ పరిధిలో ఎటువంటి డీజే సౌండ్ సిస్టమ్స్ కు అనుమతి లేదని అన్నారు.అధిక శబ్దాలతో ఇరుగుపొరుగు వారికి, వృద్ధులకు,రోగులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.బహిరంగ ప్రదేశాల్లో,రహదారుల పైన మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని,అటువంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.
రేసింగ్‌లు చేస్తే క్రిమినల్ కేసులు
యువత బైక్‌లపై రేసింగ్‌లు చేయడం, సైలెన్సర్లు తొలగించి అతి వేగంగా ప్రయాణించడం వంటివి చేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిఐ దేవయ్య తెలిపారు.న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని,చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
