సోదర భావంతో వేడుకలను నిర్వహించుకోవాలి

ఎస్సై దిలీప్

కొత్తగూడ/గంగారం. నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో మండలం లోని ముస్లిం మత పెద్ద లతో ఎస్సై దిలీప్ సమావేశం నిర్వహించరు
ఎస్సైను సన్మానించిన ముస్లిం కమిటీ సభ్యులకు ముందుగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఎస్సై దిలీప్ మాట్లాడుతూ…రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో.. సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని నెల రోజుల పాటు రంజాన్ వేడుకలకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎవరిని ఇబ్బంది కలిగించకుండా ఈ నెల రోజులు నిర్వహించుకునే కార్యక్రమాలకు అనుమతులు తీసుకోవాలన్నారు. అనంతరం కొత్తగూడ పోలీస్ స్టేషన్ కు బదిలీల్లో నూతనంగా విచ్చేసిన ఎస్సై దిలీప్ ను కొత్తగూడ మండల ముస్లీమ్ మైనారిటీ, మజీద్ ఏ అర్ఫాత్ కమిటి అద్యక్షులు మహ్మద్ అజ్మీర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మనించి ఈసందర్బంగా అధ్యక్షులు అజ్మీర్ మాట్లాడుతూ…రంజాన్ వేడుకలను కుల మతాలకు అతీతంగా వేడుకలను నిర్వహించుకుంటారని భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు జరిగే ఉపవాస దీక్షలలో సాయంత్రం దీక్ష విరమణ ఇఫ్తార్ విందులకు బేదాభిప్రాయం లేకుండా హిందూ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హిందు ముస్లిం అంతా కలసి వేడుకలను నిర్వహించుకొని అలై బలై ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం లో మత గురువు ముద్దసిర్,మజీద్ ముఖ్య సలహాదారులు వేంపల్లి యాకుబ్ పాషా, ఎక్స్ వార్డు సభ్యులు యాకుబ్, మౌలానా, యాకుబ్ పాషా,ఖాజా మియా,సర్వర్, ఆఫ్జాల్,సద్దాం, అంజాద్, పాషా,అక్బర్ ఎజాజ్, కానిస్టేబుల్ లు కిషోర్, భరత్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!