CPI (ML) Calls for Amaraveerula Remembrance Week
నవంబర్ 1,9 వరకు అమరవీరుల స్మారకోత్సవాలను జరుపండి
సీపీఐ(ఏం-యల్ ) న్యూడెమోక్రసీ,గుండాల మండలకమిటీ పిలుపు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
విప్లవోద్యమంలో అనేకమంది మెరికల్లాంటీ విప్లవ యోధులు, విప్లవ కార్యకర్తలు నవంబర్ మాసంలోనే అమరులయ్యారు. వారందరికీ సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ గుండాల మండలంకమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది.
మంగళవారం గుండాల మండల కేంద్రంలో అమరవీరుల కరపత్రాల ఆవిష్కరణ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కొమరం సీతారాములు, మండల కార్యదర్శి అరెం నరేష్ మాట్లాడుతూ మార్క్సిజం లేనినిజం మావో ఆలోచన విధానం వెలుగులో పిడిత ప్రజల విముక్తి కొరకు భారత విప్లవోద్యమ నిర్మాణ క్రమంలో కామ్రేడ్స్ చండ్ర పుల్లారెడ్డి, చారు మంజుందర్, సత్యనారాయణ సింగ్, దేవులపల్లి వెంకటేశ్వర్ రావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, బత్తుల వెంకటేశ్వర్ రావు, చాగంటి, పొట్ల రామనర్సయ్య,జేసీఎస్, శ్రీపాద, మారోజు, రంగవల్లి, మధుసూదన్, విక్రమ్, ధర్మన్న, ఎల్లన్న, దొరన్న, బాటన్న,రవన్న, లింగన్న లాంటి అనేకమంది అమరులయ్యారు.
నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నగ్జల్బరీ, శ్రీకాకుళం,గోదారిలోయ ప్రతిఘటన పోరాటాలకు వారధిగా, నాయకులుగా అన్నిరకాల అండదండలందించి విప్లవాల ఖిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఖమ్మంజిల్లాలో కాచినపల్లి అమరవీరులు, కామ్రేడ్ ఎల్లన్న, పగడాల వెంకన్న, మురళి, ఇసం పాపన్న, కొండన్న ,లతో పాటు అనేకమందిఅమరులయ్యారు. వీరంతా తమకోసం కాకుండా పేద ప్రజల కోసం పోరాడినారు. దోపిడీ, పీడన, అసమానతలు రద్దుకావాలని కోరుకున్నారు. హిమాలయ ఔన్నత్యాన్ని కప్పుకొని త్యాగాల సాళ్ళలో వేడి నేత్తురునూ చిందించారు. సామ్యవాదా పూదొటలో పరిమళాలు వెదజల్లిన వాళ్ళు. మృత్యువంటే క్రూరమైనదని తెలిసి కూడా పోరాటంలోకి ఊరికి విప్లవ చైతన్యాన్ని ప్రదర్శించినవారు. సారా వ్యతిరేక పోరాటం, జీతగాండ్ల సమ్మె, కూలీ రెట్ల పెంపుకోసం ప్రజలను కార్యోన్ముకులను చేసినవాళ్లు, భూస్వాములకు, దొరలకు, దోపిడీ దారుల ఆగడాలకు చరమగీతం పాడినోళ్లు. దేశంలో కొనసాగుతున్న అర్ద వలస అర్ద భూస్వామ్య దోపిడీ వ్యవస్థను కూకటి వేళ్ళతో సహ కూల్చివేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిస్కారం కావని భావించి ప్రజా విముక్తి కై పోరాడిన అమరవీరుల ను స్మరిస్తూ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల స్మారకోత్సవాలను నిర్వహించాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ గుండాల మండల కమిటీ, పార్టీ, విప్లవ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిస్తుంది.
ఈ కార్యక్రమంలో పర్శిక రవి, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, ఇసం కృష్ణన్న, పెండకట్ల పెంటన్న, ఇసం మంగన్న, పాయం ఎల్లన్న, మానాల ఉపేందర్ ,బానోతులాలు, కల్తీ నరసింహారావు, గొగ్గల శ్రీను, పుణ్యం నరసయ్య, కుంజ నగేష్, పూణేం పొట్టయ్య ,బుఖ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
