
భద్రాచలం నేటి ధాత్రి
ప్రపంచ మాదిగ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ.
ఈనెల 29న కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్ ( ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ ) ఆధ్వర్యంలో జరిగే ఏడవ ప్రపంచ మాదిగ దినోత్సవం జయప్రదం చేయాలని ఈరోజు భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ఏడవ ప్రపంచం మాదిగ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ చేయడం
జరిగింది.
ఈ సందర్భంగా దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య మాట్లాడుతూ… 2018 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన ప్రపంచ మాదిగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదిగల అందరిని ఏకం చేస్తూ ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ మాదిగల సమగ్ర అభివృద్ధికి ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందని అన్నారు. ఏడవ ప్రపంచం మాదిగ దినోత్సవ సందర్భంగా మాదిగల అందరిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఇంటర్నేషనల్ మాదిగ ఛాంబర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ని ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్ నెలకొల్పటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏడవ ప్రపంచ మాదిగ దినోత్సవానికి ప్రపంచంలో ఉన్న మాదిగ విద్యావంతులు, మేధావులు పాల్గొనే ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు, జాగృతి సంఘం నాయకులు కోటా కిషోర్, నడిపింటి నరేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు, బొక్క రాంబాబు, సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నండ్రురాజు, రాగా వెంకట్ , తెలంగాణ మాదిగ దండోరా మహిళా జిల్లా నాయకురాలు వలదాసి వెంకట నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.