నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలో సోమవారం హోలీ పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో యువతీ ,యువకులు, చిన్నారులు, పెద్దలు సైతం ఒకరినొకరు రంగులు పూసుకుంటూ ఎంతో ఆనందంగా ఆట పాటలతో హోలీ పండుగను హుషారుగా ఎంతో ఉత్సాహంగా సంబరంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ తాము తీసుకున్న హోలీ సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.