నిజాంపేట: నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రము లో గురువారం రోజున ముస్లిం మైనార్టీ కమిటీ సోదరులంతా కలిసి ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండగ జరుపుకుంటామని మండల మైనారిటీ సభ్యులు మహమ్మద్ అజ్గార్ అన్నారు. మసీద్ లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులంతా మండల కేంద్రము లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మసీదు ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంత కరుణామయుడైన అల్లాహ్ సర్వమానవాళి శ్రేయస్సు కొరకు శాంతిని నెలకోల్పవడం కోసం ఆఖరి ప్రవక్త మహమ్మద్ ను ఎన్నుకున్నట్లు అంతిమ(దైవ గ్రంథం)పవిత్ర ఖురాన్ లో చెప్పబడిందని పేర్కొన్నారు.
మహమ్మద్ ప్రవక్త చూపిన అడుగుజాడల్లో ప్రతి ముస్లిం సోదరులు నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మమ్మద్ గౌస్, షాదుల్,అబ్దుల్ షాషా,ఫిరోజ్,షబ్బీర్,షానవాజ్, యువకులు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.