జమ్మికుంట: నేటి ధాత్రి
ఏఐఎస్ బి 74వ వార్షికోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 25న జరిగే ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ 74 వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలో 74వ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వార్షికోత్సవాల పోస్టర్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్యకిరణ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నతమైన వ్యక్తి నిష్కలంగా దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనుబంధ విద్యార్థి విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ అని అన్నారు 1951లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏర్పడి దేశ పునర్నిర్మాణం కొరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలలు కన్న సమ సమాజ స్థాపన కొరకు పనిచేస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా పోరాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల యూనివర్సిటీల పరిరక్షణకై విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా గత 73 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తుందన్నారు రానున్న రోజుల్లో సైతం విద్యారంగ సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటాలు చేయడానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు అటువంటి మహోన్నతమైన చరిత్ర గలిగిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ 74వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ నాయకులు కుక్కముడి రాజేష్ కొండ్ర నాగేష్ వినయ్ సాగర్ రాము, నవీన్, రాకేష్ అజయ్ అంజి జయరాం తదితరులు పాల్గొన్నారు