 
        CCTV cameras.
బైక్ దొంగను పట్టించిన సిసి కెమెరాలు
మండలంలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
దొంగను పట్టుకున్న ఎస్సై బి అశోక్ ను అభినందించిన సీఐ
రెండు బైకులు స్వాధీనం
చిట్యాల సిఐ డి మల్లేష్.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :
మొగుళ్ళపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలోని కేతిరి రత్నాకర్ ఇంటికి వచ్చి తిరిగి మొగుళ్లపల్లి మండల కేంద్రం చెందిన రాయిశెట్టి లింగయ్య ఇంటి వద్ద పార్కు చేసిన బైకును అర్ధరాత్రి 12 గంటల సమయంలో బైకును 6.7.2025 రోజున తస్కరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మొగుళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎత్తుకెళ్లిన బైక్ దొంగను మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్ సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ని గుర్తించి మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. చిట్యాల ఇన్స్పెక్టర్ డి మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం… హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి గ్రామానికి చెందిన కంది నాగరాజు అనే వ్యక్తి తన సమీప బంధువులైన మొగుళ్ళపల్లి మండల పిడిసిల్ల గ్రామానికి చెందిన కేతిరి రత్నాకర్ ఇంటికి చుట్టూ చూపుగా వచ్చాడు.. పనిలో పనిగా తాను వచ్చిన చోట తన చోర”కళా”ను మొగుళ్ళపల్లిలో చాకచక్యంగా ప్రదర్శించి రావిశెట్టి లింగయ్య ఇంటి ముందు పార్కింగ్ చేసిన స్పెండర్ ప్లస్ బైక్ ను అర్ధరాత్రి అపహరించాడు.. బాధితుల ఫిర్యాదు మేరకు మొగుళ్లపల్లి ఎస్ఐ బి అశోక్ తస్కరించిన దొంగ కోసం అన్వేషణ ప్రారంభించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా.. బైక్ దొంగను గుర్తించి పరకాల శివారు నాగారం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా నడికూడా మండలం రాపర్తి గ్రామానికి చెందిన కంది నాగరాజు గా ఎస్సై గుర్తించారు.. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా… నాగరాజు విన్యాసాలు ఒక్కటొక్కటిగా బయటకు వచ్చాయి.. గతంలో పశ్ర కేయూసి హనుమకొండ పరకాల ప్రాంతాలలో కూడా బైకులను దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు చిట్యాల సిఐడి మల్లేష్ తెలిపారు ఈ కేసులో ప్రతిభను కనబరిచి మొగులపల్లి లో దొంగలించిన బైక్ తో పాటు పరకాల ప్రాంతంలో దొంగలించిన రెండు బైక్లను నిందితుడి నుంచి రికవరీ చేసిన మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్ మరియు కానిస్టేబుల్ విజయ్ కి నగదు రివార్డు అందించి అభినందించారు. ఈ సందర్భంగా చిట్యాల సిఐ డి మల్లేష్ మాట్లాడుతూ… మొగుళ్లపల్లి మండల పరిధిలో సీసీ కెమెరాలను ప్రతి గ్రామస్తులు ఏర్పాటు చేసుకోవాలని.. మండల ప్రజలకు సూచించారు. 25 గ్రామపంచాయతీలలో 15 గ్రామపంచాయతీలో సీసీ కెమెరాల పనితీరు సరిగా లేదని అవిపని చేయడం లేదని “అక్షర దర్బార్” సిఐ దృష్టికి తీసుకుపోగా.. సీసీ కెమెరాలు పునః ప్రారంభించాలని మొగుళ్ళపల్లి ఎస్సై కి సీఐ సూచించారు ఎవరైనా కొత్తవారు మండలంలో కనిపించిన అనుమానస్పదంగా ప్రవర్తించిన మొగుళ్ళపల్లి ఎస్సై కి ఫోన్ చేసి వివరాలను వెల్లడించాలని చిట్యాల సిఐ డి మల్లేష్ తెలిపారు, ఈ సమావేశంలో మొగుళ్ళపల్లి ఎస్సై బోరగల అశోక్ సిబ్బంది తదితరులు ఉన్నారు,

 
         
         
        