వ్యవసాయ రంగంలో సీసీయక్స్ సేవలు మరువలేనివి….

ఆదర్శ రైతుల నియామకం చేపట్టాలి…

విశ్రాంత డిడిఏ ఉపేందర్ రెడ్డి

మంగపేట నేటిధాత్రి

వ్యవసాయ రంగంలో సీసీ ఎక్స్ సేవలు మరువలేనివని విశ్రాంత డిడిఏ ఉపేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి ముల్లారం గ్రామంలో సిసిఎక్స్ ములుగు జిల్లా కోఆర్డినేటర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అధ్యక్షతన జరిగిన ఫార్మర్స్ స్టేక్ హోల్డర్స్ సమావేశానికి విశ్రాంత డి డి ఏ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగులో నీరు ఎక్కువగా నిలువ ఉంచటం వల్ల మిథైన్ గ్యాస్ ఉత్పత్తి పెరిగి పర్యావరణానికి హానికరం జరుగుతుందన్నారు పర్యావరణానికి ముప్పు లేకుండా విషవాయువు మిథైన్ ఉత్పత్తిని తగ్గించేందుకు కోర్ కార్బన్ ఎక్స్ సంస్థ ఏ డబ్ల్యూ డి పథకాన్ని అమలు చేస్తుందన్నారు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు సిసి ఎక్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంకేపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ వరి సాగులో తడి పొడి పద్ధతిని పాటిస్తూ సిసిఎక్స్ ఏడబ్ల్యుడి పథకంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న రైతులందరికీ ఎకరానికి రూ ఎనిమిది వందల చొప్పున సంవత్సరానికి ఒకసారి ప్రోత్సాహక నగదు మంజూరు చేస్తామని తెలిపారు రైతులకి సిసిఎక్స్ సిబ్బందికి అనుసంధానకర్తలుగా ఆదర్శ రైతులను నియమిస్తామని తెలిపారు వ్యవసాయ రంగంలో రోజురోజుకు వస్తున్న అధునాతన సాగు పద్ధతులను రైతులు అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆధునిక సాగు కోసం సిసి ఎక్స్ సంస్థ ఎంతో కృషి చేస్తుందన్నారు సిసిఎక్స్ సిబ్బంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైఫ్ ఇన్స్టాలేషన్ జియో మ్యాపింగ్ లాక్ డీటెయిల్స్ రూపొందించడంలో జాగ్రత్తలు వహించాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు అనంతరం రైతులతో కలిసి సిసిఎక్స్ అధికారులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో తడి పొడి పద్ధతిలో సాగు చేస్తున్నవరి పంట క్షేత్రాన్ని పరిశీలించి రైతు అనుభవాలను తెలుసుకుని క్షేత్ర సందర్శన చేశారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సిసిఎక్స్ కోఆర్డినేటర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి పోతన ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ గడ్డం వెంకట్ రెడ్డి హనుమకొండ జిల్లా మేనేజర్ బియ్యాల ప్రశాంత్ రావు వరంగల్ జిల్లా మేనేజర్ గడిపల్లి దేవేందర్ టీ కొత్తగూడెం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పాడి దామోదర్ రెడ్డి సీసీ పసుపులేటి కార్తీక్ ఫీల్డ్ కోఆర్డినేటర్లు మందడపు సాంబశివరావు సంకాపురం శ్రీనివాస్ కోటగిరి నరేష్ సుమారు వంద మంది రైతులు మహిళా రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!