రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో 4.60 లక్షలు సిడిపి నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికై చొప్పదండి శాసనసభ సభ్యులు మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాదు పద్మ మునిందర్ రెడ్డి , దేశరాజుపల్లి గ్రామ సర్పంచ్ కోల రమేష్, ఎంపీటీసీలు గుర్రం దేవిక, బొమ్మరవేణి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ , పంజాల శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు