వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

చిట్యాల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిన సరోజన

వైద్యులపై చట్టపురమైన చర్య తీసుకోవాలని

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ కార్యదర్శి మారపల్లి మల్లేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-54.wav?_=1

భూపాలపల్లి నేటిధాత్రి

సరోజన అనే మహిళ చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లోబీవీ తో రావడం జరిగింది వచ్చిన తర్వాత అంబులెన్స్ లో తీసుకొచ్చినటువంటి ఈ పి టి 12 గంటల సుమారులో ఆక్సిజన్ పెట్టినాడు ఆక్సిజన్ పెట్టిన వెంటనే డమెల్ మనీ పేలింది…..

CPI ML Liberation Secretary Marapalli Mallesh

ఈపీటి వెంటనే తొందరగా బయటికి వచ్చినాడు ఏం జరిగిందని చెప్పేసి పేషెంట్లు అంత నిద్ర లేచారు అప్పటికి సరోజన అరుస్తూనే ఉంది అమ్మా అయ్యాను పేషెంట్ వచ్చి అరగంట ఆయన అప్పటివరకు డాక్టర్ గాని సిస్టర్స్ గాని సెక్యూరిటీ సిబ్బంది గానీ వార్డు భాయ్ వచ్చిన పరిస్థితి కానరాలేదు క్షణమైతే చనిపోతుంది అప్పుడు అందరు వచ్చినారు వచ్చేసరికి ఆమె చనిపోయింది అప్పుడు వచ్చి ఆక్సిజన్ కొడితే అప్పటికే ఆమె చనిపోయింది నేను చేసే ప్రయత్నం చేశాను అంటున్న డ్యూటీ డాక్టర్ వాస్తవంగా రాత్రి 12 కాకముందుకే ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు వార్డు బాయ్ లేసింది లేదు సెక్యూరిటీని లేపింది లేదు సెక్యూరిటీ సిస్టర్ ను లేపింది లేదు సిస్టర్ డాక్టర్ను లేపింది లేదు ఈ సమయంలో అర్ధగంట గడిచిపోయింది ప్రాణాలు కాపాడతారని వస్తే నిర్లక్ష్యం మూలంగా ప్రాణాలు పోయినవి తక్షణమే ఇన్చార్జి సూపర్ డెంట్ సస్పెండ్ చేయాలి నిర్లక్ష్యం వహించిన వీళ్ళందరూ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏ పేషెంట్ వచ్చిన వంద పడకలకు పో గాంధీ హాస్పిటల్ వరంగల్ పో అని రెఫర్ చేస్తా ఉన్నారు ఇక్కడ తగ్గాల్సిన రోగాన్ని అక్కడికి పొమ్మని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు వచ్చిన తర్వాత సిస్టర్ గ్లూకోజ్ పెడతా ఉంది డాక్టర్ మాత్రం గంట తర్వాత వచ్చి కూడా చూడలేని పరిస్థితి అమ్మ ఎప్పుడు వస్తాడు అని అడిగితే తాత వస్తాడని అంటున్నారు నిర్లక్ష్య సమాధానం ఉద్యోగం మీద బాధ్యత లేకపోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే హాస్పిటల్ దివాలా తీస్తోంది గతంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చిట్యాల ఈరోజు దివాలా తీయడానికి కారణం పాలకులే నిర్లక్ష్యం మూలంగా నిండుపానం బలైపోయింది 9 గంటల వరకు డ్యూటీ లో ఉన్నారు తొమ్మిదిన్నరకే అందరు పడుకున్నారు వాస్తవానికి నైట్ డ్యూటీ అంటే రాత్రంతా మేలుకొని ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా డ్యూటీ చేస్తున్నారు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమే తప్ప బాధ్యతతో పనిచేసిన దాఖలు లేవు తక్షణమే హాస్పిటల్ పైదృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని పోలీసులకు డిమాండ్ చేస్తున్నాం

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప..

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-53.wav?_=2

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి అంబేద్కర్ కూడలిలో మలహల్ రావు మండల్ నాచారం గ్రామానికి చెందిన మేకల సారమ్మ వైఫ్ ఆఫ్ రమేష్ అంబేద్కర్ కూడలిలో నిండు గర్భిణీ రక్త స్రావంతో బాధపడుతున్న మహిళను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుష్ప వెంటనే వైద్య సిబ్బందిని కలిసి తక్షణమే డెలివరీ చేయించడం జరిగింది మహిళకు మగ శిశువు జన్మించాడు హక్కున చేర్చుకున్న ఎద్దు పుష్ప వారం రోజులు ఆసుపత్రికి వెళ్లి
జన్మనిచ్చిన తల్లి పుట్టిన బాలుడు మంచి చెడ్డలు చూసుకున్నారు. పుష్ప ను డెలివరీ అయిన మహిళా కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది పలువురు అభినందించారు

కలకాలం సల్లంగ చూడమ్మా గాంధారి మైసమ్మ…

కలకాలం సల్లంగ చూడమ్మా గాంధారి మైసమ్మ…

బోనంతో మొక్కలు చెల్లించిన మంత్రి వివేక్..

మైసమ్మ దీవెనలు అందరిపై ఉండాలి….

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..

మొక్కలు చెల్లించుకున్న ప్రముఖులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-52.wav?_=3

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఆషాఢ మాసం చివరి ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట జాతీయ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు పాలవాగు ఒడ్డున అమ్మవారి బోనంను నెత్తిన ఎత్తుకొని మైసమ్మ ఆలయంలో సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు చేస్తుండగా జోగినిలు భక్తి పారవశ్యంతో అమ్మవారికి బోనం సమర్పించారు. డబ్బు చప్పుళ్ళు వాయిద్యాల నడుమ సుమారు 250 బోనాలతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.కలకాలం సల్లంగ చూడమ్మా మైసమ్మ అని భక్తులు తల్లిని వేడుకొని మొక్కలు చెల్లించుకున్నారు.


బోనంతో మొక్కులు చెల్లించిన మంత్రి వివేక్‌…

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వె ళ్లాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అమ్మవారికి బోనం నెత్తిన పెట్టుకొని మొక్కులు చెల్లించి రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించారు. మంత్రి మాట్లాడుతూ మైసమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలన్నారు. నియోజకవర్గ అ భివృద్ధితో పాటు బొక్కలగుట్ట, గాంధారీ మైసమ్మ ఆలయ అభివృ ద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, జిల్లా నియోజకవర్గ నాయకులు అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వ హించగా మందమర్రి సీఐ శశిధర్‌ రెడ్డి, రామకృష్ణాపూర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌, సర్కిల్‌ పరిధిలో ఉన్నటువంటి ఎస్‌ఐలు ఆయాశాఖల అధికారులు క్యాతన్‌పల్లి మున్సిపాలిటి, బొక్కలగుట్టపంచాయతీ అధికా రులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేపట్టారు.

దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు తలొగద్దు

అవగాహన కార్యక్రమంలో ఎస్సై రణధీర్

నర్సంపేట,నేటిధాత్రి:

గ్రామాల్లో రోజురోజుకు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రావుల రణధీర్ తెలిపారు.దుగ్గొండి మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం ఆవరణలో గ్రామస్తులు,రైతులతో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న దొంగ తనాలు,చైన్ స్నాచింగ్,పట్ల వివరించారు.అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రజలు,ఓటర్లు పాటించ వలసిన జాగ్రత్తల గురుంచి క్షుణ్ణంగా వివరించారు.

ElectionsSI Randhir

మండలంలో ఎవరైనా అనుమానిత వ్యకలు కనపడితే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు.రాబోయే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనవద్దని ఎస్సై రణధీర్ తెలిపారు.

తొలి గేమ్‌లో హంపి గెలుపు..

తొలి గేమ్‌లో హంపి గెలుపు

తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు అర పాయింట్‌ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్‌ సాంగ్‌పై హంపి…

మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌

బటూమి జార్జియా): తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు అర పాయింట్‌ దూరంలో నిలిచింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్‌ సాంగ్‌పై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన హంపి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. ఆదివారం జరిగే రెండో గేమ్‌ను డ్రా చేసుకొన్నా చాలు.. హంపికి సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది. కాగా, భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్‌ మధ్య క్వార్టర్స్‌ మొదటి గేమ్‌ డ్రాగా ముగిసింది. ఇక, మరో క్వార్టర్స్‌ తొలి గేమ్‌లో మాజీ వరల్డ్‌ చాంపియన్‌ జోంగి టాన్‌ (చైనా)తో వైశాలి పాయింట్‌ పంచుకొంది. ఇక, క్వార్టర్స్‌లో హారిక, దివ్య తలపడుతుండడంతో భారత్‌ తరఫున ఒకరు సెమీస్‌ చేరడం ఖాయమైంది.

ఆర్‌ఎఫ్‌సీలో కీలక ఘట్టాలు చిత్రీకరణలో..

ఆర్‌ఎఫ్‌సీలో కీలక ఘట్టాలు చిత్రీకరణలో..

తేజ సజ్జా (Teja sajja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మిరాయ్‌’ (mirai). ‘హనుమాన్‌’ వంటి భారీ విజయం తర్వాత తేజ సజ్జా నటిస్తున్న చిత్రమిది.

తేజ సజ్జా (Teja sajja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మిరాయ్‌’ (mirai). ‘హనుమాన్‌’ వంటి భారీ విజయం తర్వాత తేజ సజ్జా నటిస్తున్న చిత్రమిది.  కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్‌ కథానాయిక. మంచు మనోజ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రియ, జయరామ్‌, జగపతిబాబు కీలక పాత్రధారులు. పీపుల్‌ మీడియా  ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. అక్కడ స్పెషల్‌గా వేసిన సెట్‌లో యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఛేజింగ్‌ సీన్‌ తెరకెక్కిస్తున్నారు. తేజ సజ్జా సూపర్‌ హీరోగా శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయుధం చుట్టూ సాగే ఈ కథని, విజువల్‌ వండర్‌గా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు.

గత సంవత్సరం కంటే మిన్నగా యూరియా నిలువలు.

గత సంవత్సరం కంటే మిన్నగా యూరియా నిలువలు.

యూరియా కొరత అనేది డీలర్ల సృష్టి…

అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట డివిజన్ పరిధిలో
గత సంవత్సరం కంటే మిన్నగా యూరియా నిలువలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట డివిజన్లో యూరియా కొరతలు అధికమవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని వస్తున్న ఫిర్యాదుల మేరకు నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ,సహకార,రెవెన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా యూరియా కొరత రైతులు పడుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా మిన్నగా యూరియా సరఫరా ఉందని,రైతులు ఆందోళన చెందొద్దని తెలియజేశారు.సహకార సంఘం,వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డీలర్ల నుండి రైతులకు యూరియా ఎరువులు పంపిణీ జరిగేలా చూడాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మీ పర్యవేక్షణ లోపం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు అల్ప సంతోషంతో రైతులను రెచ్చగొడుతూ పత్రికల్లో ప్రకటన కోసం హడావుడి చేస్తున్నారని అన్నారు.రైతులు కూడా జాగ్రత్తగా ఎరువులను వాడుకోవాలని,అధిక మోతాదులో యూరియాను వినియోగించకుండా తగిన మోతాదులో వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి నర్సంపేట వ్యవసాయ శాఖ వసంచాలకులు దామోదర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి, నర్సంపేట వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ ప్రసాద్, వివిధ మండలాల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సందేశంతో రాజు గాని సవాల్‌..

సందేశంతో రాజు గాని సవాల్‌

లెలిజాల రవీందర్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘రాజు గాని సవాల్‌’. రితికా చక్రవర్తి కథానాయిక. రక్షా బంధన్‌ పండుగ సందర్భంగా..

లెలిజాల రవీందర్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘రాజు గాని సవాల్‌’. రితికా చక్రవర్తి కథానాయిక. రక్షా బంధన్‌ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లెలిజాల రవీందర్‌ మాట్లాడుతూ ‘నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కల్చరల్‌ ఈవెంట్స్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశం ఇచ్చే చిత్రమిది’ అని తెలిపారు. నిర్మాత దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘సినిమా టీజర్‌ చూశాం చాలా బావుంది. ఇప్పుడు ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంటోంది. రవీందర్‌ కొత్తతరహా కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది’ అని అన్నారు.

బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌.. 

బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌..  ఓర్మాక్స్‌ నివేదిక ఎలా ఉందంటే…

చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగొచ్చేస్తుంది. కాలం పరుగులు తీస్తోంది.  అప్పుడే  ఈ ఏడాది ప్రారంభమై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఏడో నెల కూడా పూర్తి కావొస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.

చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగొచ్చేస్తుంది. కాలం పరుగులు తీస్తోంది.  అప్పుడే  ఈ ఏడాది ప్రారంభమై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఏడో నెల కూడా పూర్తి కావొస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ ఏడాది ఫస్టాఫ్‌లో బాక్సాఫీసుకు రూ.5,723 కోట్లు వసూళ్లు దక్కాయి. ఈ విషయం గురించి చెబుతూ శనివారం ఓర్మాక్స్‌ మీడియా (Ormax media) ‘ఇండియా బాక్సాఫీస్‌ రిపోర్ట్‌: జనవరి-జూన్‌ 2025’ (The India Box Office Report) పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.

‘జనవరి-జూన్‌ నెలల్లో విడుదలైన సినిమాల బాక్సాఫీసు రాబడి రూ.5,723 కోట్లుగా ఉంది. గత సంవత్సరంతో కంపేర్‌ చేస్తే ఈ సంవత్సరం బాక్సాఫీసు దగ్గర వసూళ్లు 14 శాతం పెరిగాయి. ఇందులో భాగంగా 17 సినిమాలు రూ.100కోట్ల మార్క్‌ను దాటాయి’’ అని తెలిపింది.

గాయకుడికి నగదు పురస్కారం.. 

గాయకుడికి నగదు పురస్కారం..  సీఎం మాట నిలబెట్టుకున్నారు 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు (Rahul Sipligunj) ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆ మేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.  సొంత కృషితో ఎదిగిన  రాహుల్  తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కాల భైరవ తో కలిసి అతను పాడిన నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. 

ఉస్తాద్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది..

ఉస్తాద్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది..

రాశీఖన్నా మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. పాటలు పాడే టాలెంటూ ఆమెలో ఉంది.

రాశీఖన్నా (Rashi khanna) మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. పాటలు పాడే టాలెంటూ ఆమెలో ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ అతి తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. 12 ఏళ్లుగా టాలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. పక్కా కమర్షియల్‌, థ్యాంక్యూ చిత్రాల తర్వాత తెలుగులో మరో సినిమా అవకాశం అందుకోలేదు. కొంతగ్యాప్‌ తర్వాత ఓ పెద్ద అవకాశం అందుకున్నారు. రాశీఖన్నా. అది కూడా పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సరసన. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో (Ustaad Bhagat Singh) రాశీ అవకాశాన్ని సొంతం చేసుకొంది. హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీలీల ఓ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే!

కిల్లర్‌ లుక్‌..

కిల్లర్‌ లుక్‌

ఎస్‌. జే సూర్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్‌’. వీసీ ప్రవీణ్‌, బైజు గోపాలన్‌ కలసి నిర్మిస్తున్నారు. ప్రీతి అస్రాని కథానాయిక…

ఎస్‌. జే సూర్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్‌’. వీసీ ప్రవీణ్‌, బైజు గోపాలన్‌ కలసి నిర్మిస్తున్నారు. ప్రీతి అస్రాని కథానాయిక. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. శనివారం చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. గన్‌ పట్టుకొని, ప్రీతి అస్రానీని భుజాన ఎత్తుకున్న లుక్‌ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి ఏ. ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

హరిహర వీరమల్లును డిస్ట్రబ్‌ చేయం నాగవంశీ కామెంట్స్‌..

హరిహర వీరమల్లును డిస్ట్రబ్‌ చేయం.. నాగవంశీ కామెంట్స్‌

తన సినిమాల గురించి విష ప్రచారం చేసే వారిపై సోషల్‌ మీడియా వేదికగానో, ఇంటర్వ్యూ లోనో ఘాటుగా స్పందిస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. మాటకుమాటకు అన్నట్లు ఆయన సమాధానం ఉంటుంది.

తన సినిమాల గురించి విష ప్రచారం చేసే వారిపై సోషల్‌ మీడియా వేదికగానో, ఇంటర్వ్యూలోనో  ఘాటుగా స్పందిస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi). మాటకుమాటకు అన్నట్లు ఆయన సమాధానం ఉంటుంది. దాంతో ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ఏం జరిగినా, ఎవరు ఏం మాట్లాడినా ఆయన చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెబుతారు.

తాజా తన చిత్రాలు గురించి ఫెయిల్యూర్స్‌ (Naga Vamsi Failures) గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కథల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్నిసార్లు పరాజయం పాలవుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంట గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్‌’ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాల పరంగా చేసిన తప్పులు, హరిహర వీరమల్లు సినిమా తదితర విషయాల్లో నాగవంశీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

‘హరి హర వీరమల్లు’ (harihara Veeramallu) చాలా పెద్ద సినిమా. కల్యాణ్‌గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా ఇది. ఒక నగరంలో 10 థియేటర్లు ఉంటే, వీరమల్లు విడుదలైన రోజున అన్ని థియేటర్లలో ఆడుతుంది. తర్వాత వారానికి కనీసం నాలుగైదు థియేటర్లలో వేరే సినిమా వేసుకునే అవకాశం ఉంటుంది.  మాకు ఆ నాలుగు థియేటర్లు చాలు. నేను ‘హరి హర వీరమల్లు’ సినిమాను డిస్ట్రబ్‌ చేయను. ఇప్పటికే మా సినిమా కింగ్డమ్‌ విడుదల చాలా వాయిదాలు పడింది.. మరీ ఆలస్యం చేస్తే ఓటీటీకి ఇబ్బంది అవుతుంది’

ఆ రెండు సినిమాలు తీయకుండా ఉంటే సరిపోయేది..
‘మా బ్యానర్‌లో తెలిసి చేసిన తప్పు ‘రణరంగం’ (Rana rangam) సినిమా తీయడం. శర్వానంద్‌కు ఏజ్డ్‌ క్యారెక్టర్‌ కరెక్ట్‌ కాదని బాబాయ్‌ చెప్పినా నేనూ సుధీర్‌ వినిపించుకోలేదు. అయినా రిస్క్‌ చేసి సినిమా చేశాం.  రవితేజ లాంటి నటుడు చేసి ఉంటే బాగుండేదేమో. ఫస్ట్‌ సీన్‌లో శర్వాను డాన్‌గా చూపించాం. అతడు డాన్‌ ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుడికి ఏం ఉంటుంది? అని ఒక విమర్శకుడు అడిగారు. కరెక్టే కదా అనిపించింది.  ఆ తర్వాత అలాంటి తప్పులు చేయకూడదని కథల విషయంలో నిర్మొహమాటంగా ఉండే వారితో చర్చలు జరుపుతుండేవాడిని. అయినా మళ్లీ దెబ్బ తిన్నాం. ‘ఆది కేశవ’ ఫ్లాఫ్‌ అయింది. అవుట్‌పుట్‌ చూసుకున్న తర్వాత రిపేర్‌ చేయడానికి ప్రయత్నించాం. కానీ రోజురోజుకీ స్టోరీ జానర్‌ మారిపోతుంది. ప్రేక్షకులు ఓ పట్టాన యాక్సెప్ట్‌ చేయడం లేదు. దాంతో రిపేర్లు చేయడం కూడా వృథా అనిపించింది. ఈ రెండు సినిమాలు మా బ్యానర్‌లో చాలా ఖరీదైన తప్పులు.

సామ్రాజ్య టైటిల్‌తో..

సామ్రాజ్య టైటిల్‌తో

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్‌’ చిత్రం ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే…

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్‌’ చిత్రం ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. శనివారం చిత్రబృందం హిందీ టైటిల్‌ను ప్రకటించింది. అక్కడ ఈ చిత్రాన్ని ‘సామ్రాజ్య’ పేరుతో హిందీలో విడుదల చేస్తున్నారు. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సంగీతం: అనిరుధ్‌

కేరళలో పాట చిత్రీకరణ…

కేరళలో పాట చిత్రీకరణ

మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (‘మెగా157-వర్కింగ్‌ టైటిల్‌)’ షూటింగ్‌ కేరళలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం…

మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (‘మెగా157-వర్కింగ్‌ టైటిల్‌)’ షూటింగ్‌ కేరళలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం కేరళలోని అందమైన లోకేషన్లలో చిరంజీవి, నయనతారపై పెళ్లి నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘కొన్ని కీలకమైన ఘట్టాలను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్‌ చేస్తున్నాం, ఈనెల 23 నాటికి ఈ షెడ్యూల్‌ పూర్తవుతుంద’ని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

గాయపడిన షారుక్‌ షూటింగ్‌కు బ్రేక్‌..

గాయపడిన షారుక్‌ షూటింగ్‌కు బ్రేక్‌

సినిమా కోసం చెమటోడ్చే హీరోల్లో షారుక్‌ ఖాన్‌ ముందుంటారు. ప్రేక్షకులను అలరించడానికి మూడు దశాబ్దాలుగా ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. 60 ఏళ్ల వయసులోనూ…

సినిమా కోసం చెమటోడ్చే హీరోల్లో షారుక్‌ ఖాన్‌ ముందుంటారు. ప్రేక్షకులను అలరించడానికి మూడు దశాబ్దాలుగా ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. 60 ఏళ్ల వయసులోనూ తెరపై షారుక్‌ చేసే సాహసాలు అబ్బురపరుస్తూంటాయి. డూప్‌ లేకుండా యాక్షన్‌ సీన్లలో పాల్గొనే షారుక్‌ తాజాగా ‘కింగ్‌’ చిత్రం షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ముంబైలోని గోల్డెన్‌ టుబాకో స్టూడియోలో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ తీస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే ఇది తీవ్రమైన గాయం కాదు, కండరానికి సంబంధించింది కనుక చికిత్స అవసరం అని అమెరికాకు ఆయన్ని తీసుకెళ్లారు. నెల రోజుల పాటు షారుక్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆగస్టు నెల వరకూ ఏకధాటిగా జరగాల్సిన ‘కింగ్‌’ షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. షారుక్‌ కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌లో కానీ అక్టోబర్‌లో కానీ మళ్లీ షూటింగ్‌ను ప్రారంభిస్తామని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇండియాతో పాటు యూర్‌పలో కూడా ‘కింగ్‌’ షూటింగ్‌ జరపాలని ప్లాన్‌ చేశారు. షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘కింగ్‌’ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందిస్తున్నారు.

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం..

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం

‘మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తుల కాలంనాటి కథే ‘హరిహర వీరమల్లు’. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లాము. హరిహర అంటే…

‘మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తుల కాలంనాటి కథే ‘హరిహర వీరమల్లు’. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లాము. హరిహర అంటే విష్ణువు, శివుడు కలయిక. ఆ రెండు పేర్లు సూచించేలా వీరమల్లు అని పెట్టాము. ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం అవుతుంది’ అని అన్నారు నిర్మాత ఏ.ఎం. రత్నం. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘హరిహర వీరమల్లు’ ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నేను ‘భారతీయుడు’ సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. షూటింగ్‌ పూర్తవడానికి బాగా ఆలస్యమవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్‌ విడుదలతో వారి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెబుతున్నా… ‘హరిహర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుంది.
  • సినిమాను మొదట రెండు భాగాలు అని అనుకోలేదు. సినిమా వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన సినిమాలు అలాగే ఉంటాయి. చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే..ఎక్కువ మందికి చేరువవుతుందని భావించాము. అలా చర్చలో కథ విస్తృతి పెరిగింది.
  • ‘ఖుషి, ‘బంగారం’ తర్వాత పవన్‌ కల్యాణ్‌తో చేసిన మూడో చిత్రమిది. పేరుకు మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉంది. పవన్‌ కల్యాణ్‌ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయనను నేను ఎక్కువగా ఇష్టపడతాను.
  • మా అబ్బాయి అని చెప్పడం కాదు గానీ.. జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని సిద్ధం చేశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా ‘ఇండియానా జోన్స్‌’ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు.

ఏపీలో ‘హరిహర వీరమల్లు’ టికెట్‌ ధర పెంపు

14 రోజులు అడిగిన మేకర్స్‌.. పది రోజులకే అనుమతి..

‘హరిహర వీరమల్లు’ టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 24న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు 14 రోజుల పాటు అదనపు రేట్లకు అనుమతించాలని ప్రభుత్వానికి మేకర్స్‌ విన్నవించారు. పరిశీలించి పది రోజుల పాటు పెంపునకు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 23 రాత్రి 9.30 గంటలకు సెకండ్‌ షో, 24వేకువ జామున 4గంటలకు బెనిఫిట్‌ షోలకు అనుమతి పెండింగ్‌లో పెట్టింది. పవన్‌ కల్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతోన్న మొదటి సినిమా కావడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దిగువ తరగతి రూ.100, అప్పర్‌ క్లాస్‌ రూ.150, మల్టీప్లెక్స్‌ రూ.200 అదనంగా పెంచుకోవడానికి అనుమతి లభించడంతో సినిమా టిక్కెట్ల ధరలు సింగిల్‌ స్ర్కీన్‌లో బాల్కనీ రూ.250, మధ్య తరగతి రూ.150-190, మల్టీప్లెక్స్‌లలో రూ.350దాకా ఉండబోతున్నాయి.

హైదరాబాద్ మెట్రో దశ 2…

హైదరాబాద్ మెట్రో సేవల విస్తరణ కొనసాగుతోంది. ఇప్పుడు ఫేజ్ 2 ద్వారా నగరానికి మరింత మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది. భారీ మెగా ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి.

నేటి ధాత్రి

ముఖ్యాంశం – ఫేజ్ 2 పూర్తి వివరాలు, పనుల స్థితి, ప్రయోజనాలు.

MetroPhase2

1️⃣ ఫేజ్ 2-A: ప్రాథమిక విస్తరణ (76.4 కిమీ)

ఐదు కారిడార్లు:

  • నాగోల్ – శంషాబాద్ (RGIA)

  • రైడుర్గ్ – కోకాపేట్

  • MGBS – చంద్రాయణగుట్ట

  • మియాపూర్ – పటాన్‌చేరు

  • LB నగర్ – హయత్ నగర్

మొత్తం పొడవు: 76.4 కిమీ
కొత్త స్టేషన్లు (LB నగర్ – హయత్ నగర్ – 7.1 కిమీ):
చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, RTC కాలనీ, హయత్ నగర్

పనుల ప్రారంభం: జనవరి 2025లో భూమి అందజేత కోసం ఇప్పటికే 500కి పైగా ఎస్‌ఖావేషన్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

2️⃣ ఫేజ్ 2-B: నూతన కారిడార్లు (86.1 కిమీ)

  • JBS – మెడ్చల్ (24.5 కిమీ, 18 స్టేషన్లు)

  • JBS – శామిర్‌పేట (22 కిమీ, 14 స్టేషన్లు)

  • RGIA – ఫ్యూచర్ సిటీ (Skill University) (39.6 కిమీ, ఇందులో 1.5 కిమీ అండర్‌గ్రౌండ్)

మొత్తం ప్రాజెక్టు విలువ: ₹19,579 కోట్లు

3️⃣ పథకాల సమగ్ర స్థితి & వ్యయ నిర్వహణ

ఫేజ్ 2-A మొత్తం వ్యయం: ₹24,269 కోట్లు

  • రాష్ట్ర ప్రభుత్వం: ₹7,313 కోట్లు (30%)

  • కేంద్ర ప్రభుత్వం: ₹4,230 కోట్లు (18%)

  • JICA/ADB/NDB రుణాలు: ₹11,693 కోట్లు (48%)

  • PPP మోడల్ ద్వారా: ₹1,033 కోట్లు (4%)

ప్రతి కిలోమీటరుకి ఖర్చు: సుమారుగా ₹318 కోట్లు — ఇది ఇతర నగరాల్లోని అండర్‌గ్రౌండ్ నిర్మాణాల కంటే తక్కువ స్థాయిలోనే ఉంది.

ప్రయాణదారుల అంచనా: రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా

4️⃣ ప్రాజెక్ట్ టైమ్‌లైన్ & ప్రస్తుత స్థితి

  • ఫేజ్ 2-A పనులు: 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యం

  • ఫేజ్ 2-B: DPRs పూర్తయ్యాయి, ప్రభుత్వ సమీక్షకు పంపబడ్డాయి

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: కేంద్ర శాఖలతో చర్చలు జరిపి ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు

5️⃣ ఫేజ్ 2 ప్రయోజనాలు

  • నగర అంతటా రవాణా వేగం పెరుగుతుంది

  • ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం

  • కార్బన్ ఉద్గారాల్లో తగ్గింపు

  • RGIA, JBS, మెడ్చల్, శామిర్‌పేట, ఫ్యూచర్ సిటీ వంటి ప్రధాన కేంద్రాలకు మెట్రో కనెక్టివిటీ

  • ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు మరింత మెరుగైన ప్రయాణ సౌలభ్యం

MetroPhase2


Outro (4:30–5:00)

“మీ అభిప్రాయమేమిటి? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఏ కారిడార్‌కి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి అనిపిస్తోంది? కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి – నెటిధాత్రిలోనే అన్ని తాజా వార్తలు!”

హ్యాష్‌ట్యాగ్స్:

#HyderabadMetroPhase2 #NetidhathriNews #MetroExpansion #TelanganaMetro #HyderabadTransport

ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు..

ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు

కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసిన ఎన్ఎంసీ

నేటిధాత్రి, వరంగల్
వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసి, కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది. 150 సీట్లున్న ఆ కళాశాలకు రెండేళ్ల కిందటే ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కళాశాలలో రెండు ఎంబీబీఎస్ బ్యాచుల విద్యార్థులున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కళాశాల గుర్తింపు రద్దు వెనుక గతంలో కళాశాలలో తనిఖీలకు వచ్చిన అధికారులకు యాజమాన్యం లంచం ఇచ్చిన కేసు ప్రభావం చూపిందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. వాటిలో రెండు కళాశాలలు గత ఏడాది డీమ్డ్. యూనివర్సిటీగా మారాయి. ఫాదర్ కొలంబో కళాశాల గుర్తింపు రద్దుతో ఈ ఏడాది మిగిలిన 27 కళాశాలల్లోని సీట్లకే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

లంచం కేసు ప్రభావమే..?

వైద్య కళాశాలల్లో తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందాలకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు, ఎన్ఎంసీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎంసీ నిబంధనల మేరకు కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేకపోయినా.. తమ కళాశాలలకు అనుకూలంగా నివేదికలివ్వాలని మధ్యవర్తుల ద్వారా వాటి యాజమాన్యాలు ఎన్ఎంసీ అధికారులకు లక్షల్లో లంచాలు ముట్టజెప్పాయి. దానిపై గత నెల 30న సీబీఐ కేసు నమోదు చేసింది.

అందులో తెలంగాణకు చెందిన పలు కళాశాలల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో ఫాదర్ కొలంబో వైద్య కళాశాల కూడా ఉంది. కళాశాల ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి రెండు విడుతల్లో 20లక్షల చొప్పున మొత్తం 46లక్షల రూపాయలు లంచం చెల్లించినట్లు సీబీఐ ఎఫ్ఎఆర్ లో పేర్కొంది. ఆ కేసు ప్రభావంతోనే కళాశాల గుర్తింపు రద్దయిందని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. సీబీఐ ఎఫ్ఐఆర్ లో 36 మంది పేర్లుండగా, అందులో ఆరుగురు ఏపీ, తెలంగాణకు చెందిన వారున్నారు. తెలంగాణకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రజనీరెడ్డి పేరును కూడా సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో చేర్చింది.

ఆధార్‌లో సమూల మార్పులు..

ఆధార్‌లో సమూల మార్పులు

ఆధార్‌లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అవసరాలకు…

  • వివరాల్లోంచి తండ్రి/భర్త పేరు తొలగింపు
  • పుట్టిన తేదీకి బదులు పుట్టిన సంవత్సరం మాత్రమే!
  • యూఐడీఏఐ ఉత్తర్వులు.. ఇప్పటికే అమల్లోకి

ఆధార్‌లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అవసరాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్‌ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త పేరు ఉండదు. ఆధార్‌లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు. నిజానికి మొదట్లో తండ్రి/భర్త పేరు అని ఉండేది. తర్వాత కేరాఫ్‌ అని మార్చారు. ఇప్పుడు పూర్తిగా తొలగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి కొత్త ఆధార్‌ నమోదులో తండ్రి/భర్త వివరాలు సమర్పించాలని కోరబోమని యూఐడీఏఐ తెలిపింది. అలాగే పుట్టినతేదీకి బదులు ఇకనుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్నే నమోదు చేస్తారు. దీనికి సంబంధించి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ హిమాన్షు ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా.. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే తండ్రి/భర్త పేరు ఉన్న ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేస్తే ఆ పేర్లు తొలగించబడతాయి. అలాగే పుట్టినతేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది. 18 ఏళ్లలోపు ఉండే పిల్లల (మైనర్ల) ఆధార్‌లోనే మాత్రమే కేరాఫ్‌ స్థానంలో వారి తండ్రి పేరు ఉంటుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version