మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి.

మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి

Roshan Kanakala:నేటి దాత్రి :

 

 

 

 

‘బబుల్ గమ్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ కనకాల, సుమ కొడుకు రోషన్ ఇప్పుడు యాక్షన్ మూవీ ‘మోగ్లీ 2025’ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా క్లయిమాక్స్ లోని యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు.

 

శ్రీకాంత్, ఊహ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మల కాన్వెంట్’ (Nirmala Convent) తో తెరంగేట్రమ్ చేసిన సుమ (Suma), రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కుమారుడు రోషన్ (Roshan) ‘బబుల్ గమ్’ (Babbulgum) సినిమాతో హీరోగా మారాడు.

ఇప్పుడు మరోసారి ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

‘బబుల్ గమ్’లో లవర్ బాయ్ గా నటించి ఆకట్టుకున్న రోషన్ ఇప్పుడీ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చేస్తున్నాడు.

తాజాగా 15 రోజుల పాటు ఈ సినిమా భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ ను దర్శకుడు, ‘కలర్ ఫోటో’ (Color Photo) ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) పూర్తి చేశాడు.

ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

ఈ షెడ్యూల్ విశేషాలను సందీప్ రాజ్ చెబుతూ, ‘తాజా షెడ్యూల్ ను మారేడుమిల్లిలో చేశాడు.
ఇదో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్స్.
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ ను పెర్ఫార్మ్ చేశాడు.
ఈ సీన్స్ మూవీకి హైలైట్ గా ఉండబోతున్నాయి.
మరో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది.
ఇదే నెలలో టీజర్ ను రిలీజ్ చేస్తాం.
ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.
అలానే మ్యూజిక్ కూ చాలా ప్రాధాన్యం ఉంది.
‘మోగ్లీ’ ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ ఉండబోతున్నాయి.
దీనిని కాలభైరవ అందిస్తున్నారు.
ఈ మూవీతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
అలానే బండి సరోజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ యేడాది చివరిలో మూవీని రిలీజ్ చేస్తాం” అని చెప్పారు.

శివయ్యా ట్రోలింగ్.. స్పందించిన మంచు విష్ణు

శివయ్యా ట్రోలింగ్.. స్పందించిన మంచు విష్ణు

 

Manchu Vishnu: నేటిధాత్రి

 

 

 


 

మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే.

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోస్ ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Maohan Lal), అక్షయ్ కుమార్(Akshay Kumar)  స్పెషల్ క్యామియోస్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే కన్నప్ప సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్,  టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు.. తన సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ మీద జరిగిన ట్రోలింగ్ పై స్పందించాడు. కన్నప్ప  టీజర్  చివర్లో మంచు విష్ణు శివయ్యా అని అరుస్తున్న డైలాగ్ ఉంటుంది. టీజర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో ఆ డైలాగ్ ఒక మీమ్ లా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ అన్నింటిని కలిపి  శ్రీవిష్ణు(Srivishnu) హీరోగా నటించిన సింగిల్(Single) సినిమాలో పెట్టారు. ట్రైలర్ కట్ లో  శివయ్యా డైలాగ్ ను కూడా రీక్రియేట్ చేశారు. 

 

 సింగిల్ ట్రైలర్ రిలీజ్ తరువాత శివయ్యా డైలాగ్ ను ట్రోల్ చేసినందుకు మంచు విష్ణు సీరియస్ అయ్యాడు.  ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి లేఖ రాసి.. ఆ డైలాగ్ ను తీయించేసాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ ట్రోలింగ్ పై మంచు విష్ణు మాట్లాడాడు. సింగిల్ సినిమాలో  శివయ్యా డైలాగ్ ను అల్లు అరవింద్ ఎందుకు తీయించేశాడు.. మీరేమైనా చేశారా.. ? అన్న ప్రశ్నకు మంచు విష్ణు మాట్లాడుతూ.. ” నేను ప్రొడ్యూసర్  కౌన్సిల్ కి ఒక లెటర్ రాశాను. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు .. లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనమందరం ఒకటి అవ్వాలి. మనమందరం ఒకటిగా ఉండాలి.

 

 ఆ సినిమాలో ఒకటి నందమూరి బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. అదే టైమ్ లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది.  ఒక్కరు కూడా ఆయనకు కంగ్రాట్స్  మెసేజ్ పెట్టలేదు కానీ, ఆయన కామెడీ అయితే చేశారు. కన్నప్ప సినిమాది చేశారు. ఇండస్ట్రీలో ఇది కొత్త ట్రెండా.. ? మీరు అడ్రెస్స్ చేస్తారా.. ? లేక రేపు నా సినిమాలో మిగితావాళ్లను పెట్టినప్పుడు ఎవరైనా అడిగితే మాత్రం బావుండదు. ఇది  ఇప్పుడు నార్మల్ గా ఉందా.. ? అలా అయితే నేను కూడా అంగీకరిస్తాను. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది అని చెప్తే నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పాను. వారు అరవింద్ గారితో మాట్లాడారు. అసలు ఎందుకు ఈ డైలాగ్ అందులో పెట్టారు.. ? ఆ తరువాత ఎందుకు తీసేశారు అనేది ఆయననే అడగండి” అంటూ చెప్పుకొచ్చాడు.  

బాలీవుడ్‌లో మళ్లీ రష్మిక

బాలీవుడ్‌లో మళ్లీ రష్మిక

హీరోయిన్‌ రష్మిక మంచి జోరు మీదున్నారు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఆమె బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించిన ‘సికిందర్‌’ చిత్రం…. 

 

హీరోయిన్‌ రష్మిక మంచి జోరు మీదున్నారు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఆమె బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించిన ‘సికిందర్‌’ చిత్రం ఇటీవల ఫ్లాప్‌ అయినా ఆ ప్రభావం ఆమె మీద లేదనే చెప్పాలి. హిందీలో ఆమెకు ఆఫర్లు వస్తునే ఉన్నాయి. ఇంతవరకూ రష్మిక ఐదు హిందీ చిత్రాల్లో నటించారు. వాటిల్లో ‘యానిమల్‌’, ‘చావా’ చిత్రాలు పెద్ద హిట్‌ . మిగిలిన మూడు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా ఇప్పుడు మరో హిందీ సినిమాకు రష్మిక కమిట్‌ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2012లో వచ్చిన ‘కాక్‌టైల్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కాక్‌టైల్‌ 2’ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ సరసన రష్మిక నటించనున్నారు. క్రితీ సనన్‌ మరో కీలక పాత్ర పోషించనున్నారు. యూర్‌పలో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే మనదేశంలో కూడా విభిన్న ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తారట. వచ్చే ఏడాది ‘కాక్‌టైల్‌ 2’ చిత్రం విడుదలవుతుంది.

 

ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చిన‌..

ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చిన‌.. అదిరిపోయే హిందీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ 

 

ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన హిందీ చిత్రం జాట్ ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చేసింది.

ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన హిందీ చిత్రం జాట్ (Jaat ). తెలుగు అగ్ర ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించడం విశేషం. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌న్నీ డియోల్ (Sunny Deol) హీరోగా మ‌రో స్టార్ ర‌ణ‌దీప్ హుడా (Randeep Hooda) ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు. రెజీనా (Regina Cassandra), స‌యామి ఖేర్ (Saiyami Kher), వినీత్ ఉమార్ సింగ్ (Vineet Kumar Singh), జ‌గ‌ప‌తి బాబు, ర‌మ్మ‌కృష్ణ‌, బిగ్‌బాస్ దివి ఇత‌ర‌ పాత్ర‌ల్లో న‌టించారు. అయితే ఇప్పుడీ సినిమా ముందుగా అనుకున్న టైం క‌న్నా ఓ రోజు ముందుగాను ఈ రోజు గురువారం (జూన్ 6) నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. రణతుంగ , అతని సోదరుడు శ్రీలంక నుంచి భారీ నిధిని దోచుకుని పారిపోయి ఇండియాకు వ‌చ్చేస్తారు. ఆపై ఏపీలోని మోటుప‌ల్లిని స్థావ‌రంగా చేసుకుని దాని ప‌రిస‌ర గ్రామాల‌ను త‌మ ఆదీనంలో ఉంచుకుని నియంత‌లా వ్య‌వ‌రిహిస్తుంటాడు. అయితే ఓ రోజు హీరో బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ వెళ్తున్న రైలు ఆ ఊరి స‌మీపంలో ఆగిపోతుంది. దీంతో ద‌గ్గ‌ర్లో ఉన్న హోట‌ల్‌కు వెళ్లి టిఫిన్ చేస్తుండ‌గా లోక‌ల్ రౌడీలు హోట‌ల్ పై దౌర్జ‌న్యం చేస్తూ హీరోను డిస్ట్ర‌బ్ చేస్తారు. దీంతో కోపొద్రిక్తుడైన బ్రిగేడియర్ వారి ప‌ని ప‌డ‌తాడు. ఆపై అనుకోకుండా ఒక‌రి త‌ర్వాత మ‌రొక గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వ‌డం వారంద‌రిని చిత‌క్కొట్టుకుంటూ చివ‌ర‌కు ప్ర‌దాన విల‌న్ రణ‌తుంగ వ‌ర‌కు వెళ‌తాడు. అదే స‌మ‌యంలో ఆ ఊరి అకృత్యాల గురించి హీరోకు తెలియ‌డంతో క‌థ కొత్త మ‌లుపు తిరుగుతుంది. ఇంత‌కు ఆ ఊర్లో ఉన్న స‌మ‌స్య‌ ఏంటి, హీరో ఆ క్రూర‌మైన విల‌న్ల‌ను ఒంట‌రిగా ఎలా ఎదిరించాడ‌నేదే ఈ మూవీ.

ఇప్ప‌టికే తెలుగులో వంద‌ల సంఖ్య‌లో వ‌చ్చిన సినిమాల త‌ర‌హాలోనే ఈ సినిమా సాగుతుంది. అయితే స్క్రీన్ ప్లే , ఎలివేష‌న్లు, ట్రీల్‌మెంట్ అంతా ఓ రేంజ్‌లో ఉంటూ సూప‌ర్ హై ఇస్తుంది. మ‌నం పాత క‌థే చూస్తున్నాం అని తెలిసినా సినిమాలో లీన‌మ‌య్యేలా చేస్తుంది. పైగా ఇది హిందీ సినిమా అయిన‌ప్ప‌టికీ పూర్తిగా తెలుగు ప్రాంతం నేప‌థ్యంలో, ఇక్క‌డి న‌టులే క‌నిపిస్తూ మ‌నం ఓ బాలీవుడ్ సినిమా చూస్తున్నామ‌నే ఫీల్ కూడా రాదు. ప్ర‌స్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix ) ఓటీటీలో హిందీ, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డ‌బ్బింగ్ కూడా స్ట్రెయిట్ సినిమాలానే ఉంది. థియేట‌ర్ల‌లో చూడ‌ని వారు, యాక్ష‌న్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారు ఈ మూవీని మిస్ చేయ‌వ‌ద్దు. ముఖ్యంగా హీరో, విల‌న్ స‌న్నివేశాలు సినిమాకు హైలెట్‌.

పారితోషికం తిరిగిచ్చేసిన పవన్‌కల్యాణ్‌

పారితోషికం తిరిగిచ్చేసిన పవన్‌కల్యాణ్‌

సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్‌ హీరోలు. Some heroes liked the story and made films without taking any remuneration.. but suffered losses after the film was released.

సినిమా టికెట్లు
  • అదే బాటలో సిద్ధు జొన్నలగడ్డ

సినిమాల కోసం కోట్లల్లో పారితోషికాలు తీసుకుంటుంటారు స్టార్‌ హీరోలు. కథ నచ్చి, పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన హీరోలు కొందరైతే.. చిత్రం విడుదలయ్యాక నష్టాలొస్తే తాము తీసుకున్న రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చిన వారు మరికొందరు. అయితే చిత్రసీమలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ, సినిమా విడుదలకు ముందే తన పారితోషికాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఏ.ఎమ్‌.రత్నమ్‌ నిర్మాత. క్రిష్‌ దర్శకత్వంలో 2020లో మొదలైన ఈ చిత్రం పలు కారణాలతో సుదీర్ఘ కాలం పాటు సెట్స్‌లోనే ఉండిపోయింది. ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తిచేసుకుని ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారు. ఇంతకాలం ఈ సినిమా సెట్స్‌ పైనే ఉన్నందుకు నిర్మాతపై పడ్డ అదనపు భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో ముందు వరుసలో ఉంటారని నిరూపించుకున్నారు. మరో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ కూడా తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు. ఆయన కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘జాక్‌’ ఏప్రిల్‌ 10న విడుదలైంది. సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంలో విఫలమైంది. దీంతో పారితోషికంగా తాను తీసుకున్న మొత్తంలో సగం(రూ. నాలుగు కోట్లు) తిరిగిచ్చేసి తన సహృదయాన్ని చాటుకున్నారు.

 

Pawan kalyan

షూటింగ్‌కు సిద్ధం

పవన్‌కల్యాణ్‌ మరోసారి పోలీస్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన ఎక్స్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల రెండో వారం నుంచి మొదలవుతోందని మంగళవారం తిరుమలలో వెల్లడించారు ఆయన. త్వరలోనే పవన్‌కల్యాణ్‌ కూడా సెట్స్‌లోకి అడుగుపెడతారని తెలిపారు.

అనుష్క పోస్టర్‌ 40కి పైగా ప్రమాదాలు

అనుష్క పోస్టర్‌ 40కి పైగా ప్రమాదాలు

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు అల్లు అర్జున్‌…

 

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు అల్లు అర్జున్‌. ‘‘వేదం’కు 15 ఏళ్లు. నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రమిది. ఇతర సినిమాలతో పోలిస్తే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. దర్శకుడు క్రిష్‌కు రుణపడి ఉంటాను. ఎంతో నిజాయితీగా సినిమా తీశారు. ఈ చిత్రంలో మంచు మనోజ్‌, అనుష్క వంటి సహనటులతో ప్రయాణించడం ఓ గొప్ప జ్ఞాపకం. ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు శోభు, ప్రసాద్‌ దేవినేనిలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

ముందు అనుకున్న సినిమా వేరు

ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఓ సందర్భంలో పంచుకున్నారు క్రిష్‌. ‘‘గమ్యం’ తరువాత ఓ పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రానికి ప్లాన్‌ చేశాను. అయితే ఆ సమయంలో అమరావతికి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన ‘వేదం’ కథ సిద్ధం చేసేలా చేసింది. ఓ చిన్న పిల్లాడు వృద్ధుడిని వేలు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యం నన్ను కదిలించింది. ‘ఒక చిన్న పిల్లాడు వెట్టిచాకిరీ చేస్తాడు. వాడిని విడిపించుకోవడానికి వాళ్లమ్మ కిడ్నీలు అమ్ముతుంది’ ఇలాంటి ఓ లైన్‌తో మొదలైంది ‘వేదం’ కథ. అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క భాగం కావడంతో ఈ సినిమా పెద్ద సినిమాలా మారింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క వెనక్కి తిరిగి కొంటెగా చూస్తున్న పోస్టర్‌ను పెద్ద హోర్డింగ్‌గా చేసి పంజాగుట్ట సర్కిల్‌లో పెట్టారు. ఆ సమయంలో 40కి పైగా ప్రమాదాలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించారు. అంతలా అనుష్క ఆకట్టుకున్నారు’’ అని అన్నారు దర్శకుడు క్రిష్‌.

పళణి మురుగ‌న్ చెంత‌.. సూర్య‌, వెంకీ అట్లూరి

పళణి మురుగ‌న్ చెంత‌.. సూర్య‌, వెంకీ అట్లూరి

కంగువా, రెట్రో వంటి సినిమాల త‌ర్వాత త‌మిళ‌ స్టార్ సూర్య న‌టిస్తోన్న 46వ‌ చిత్రం ఇటీవ‌ల వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

 

కంగువా, రెట్రో వంటి సినిమాల త‌ర్వాత త‌మిళ‌ స్టార్ సూర్య (Suriya) న‌టిస్తోన్న 46వ‌ చిత్రం ఇటీవ‌ల వెంకీ అట్లూరి (Venky Atluri) ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌మితా బైజు (Mamitha Baiju) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా చాలా గ్యాప్ త‌ర్వాత‌ ర‌వీనా టాండ‌న్ (Raveena Tandon) తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండ‌గా రాధిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుంది. సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ (Sitara entertainments) నిర్మిస్తోంది. జీవీ ప్ర‌కాశ్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఆ మ‌ధ్య పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా ఆరంభించిన మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆప్డేట్ ఇచ్చారు.

 

Suriya46

అయితే.. హీరో సూర్య‌తో పాటు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి (Venky Atluri), నిర్మాత నాగ‌వంశీ (Naga Vamsi) లు గురువారం త‌మిళ‌నాడులోని పళణి మురుగ‌న్‌ సుబ్ర‌మ‌ణ్య స్వామి (Palani Murugan Temple) ఆల‌యాన్ని సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. జూన్ 9 నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ర‌వితేజ‌.. అనార్క‌లి మొద‌లైంది

ర‌వితేజ‌.. అనార్క‌లి మొద‌లైంది

 

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు మాస్ మ‌హా రాజా ర‌వితేజ

Raviteja

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు మాస్ మ‌హా రాజా ర‌వితేజ (Ravi Teja). గ‌త సంవ‌త్స‌రం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ (Mr. Bachchan) చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌ర్చిన ఆయ‌న త్వ‌ర‌లో ప్ర‌స్తుతం మాస్ (Mass Jathara) జాత‌ర సినిమాతో అరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమా ఆగ‌ష్టులో థియేట‌ర్ల‌కు రానుంది. ఈ చిత్రం త‌ర్వాత ఇప్ప‌టికే చేతిలో మ‌రో మూడు సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌వితేజ న‌టించ‌బోయే మ‌రో కొత్త సినిమా RT76 నుంచి తాజాగా అప్డేట్ వ‌చ్చింది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

గ‌తంలో రామ్‌తో నేను శైల‌జా, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ చిత్రాల‌ను రూపొందించిన కిషోర్ తిరుమ‌ల (KishoreTirumala) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా SLV సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఆ పోస్ట‌ర్‌లో బిజినెస్ క్లాస్‌ విమానంలో ర‌వితేజ (Ravi Teja) ద‌ర్జాగా కూర్చోని ఎదుట సీటుపై కాలు వేసి కూర్చోని ఉన్న లుక్ అదిరిపోయేలా ఉంది.

 

కాగా ఈ సినిమాకు అనార్క‌లి (Anarkali) అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉండ‌గా నాగార్జున నా సామిరంగా మూవీ ఫేమ్ క‌న్న‌డ బ్యూటీ అషికా రంగ‌నాథ్ (Ashika Ranganath) సింగిల్ బ్యూటీ కేతిక శ‌ర్మ‌ క‌థానాయిక‌లు. గురువారం షూటింగ్ ప్రారంభించిన మేక‌ర్స్ 2026 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా అదే సంక్రాంతికి చిరంజీవి అనీల్ రావిపూడి చిత్రం విజ‌య్ జ‌న నాయ‌గ‌న్‌, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఓ రాజు, య‌ష్ టాక్సిక్ సినిమాల విడుద‌ల కానుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు సంక్రాంతి సినిమాల విష‌యంలో అప్పుడే చ‌ర్చ మొద‌లైంది.

తొలి ప్రేమే తోపు కాదే.

తొలి ప్రేమే తోపు కాదే

 

నేటి ధాత్రి:

 

 

 

 

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో…

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్‌, ఎస్కేన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌, గ్లింప్స్‌ని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశారు. ‘తొలి ప్రేమేం తోపు కాదు.. ఫస్ట్‌ లవ్‌ ఫెయిలైతే బెస్ట్‌ లవ్‌ ఎక్కడో మొదలవుతుంది’ అని చెబుతూ సాగిన గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. అంతం వరకూ అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమే అనీ, అదే తుది కాదనే కాన్సె్‌ప్టను ఈ గ్లింప్స్‌ ద్వారా మేకర్స్‌ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్‌కు ‘తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..’ అంటూ సంగీత దర్శకుడు మణిశర్మ బీజీఎం కంపోజ్‌ చేశారు.

థగ్‌లైఫ్‌ కమల్‌హాసన్‌ పారితోషికం ఎంత.

థగ్‌లైఫ్‌ కమల్‌హాసన్‌ పారితోషికం ఎంత

 

నేటి ధాత్రి: 

 

 

 

చెన్నైలో జరిగిన ‘థగ్‌లైఫ్‌’ ఆడియో వేడుకలో కన్నడ భాష గురించి కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు..

ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే.

దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల….

చెన్నైలో జరిగిన ‘థగ్‌లైఫ్‌’ ఆడియో వేడుకలో కన్నడ భాష గురించి కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు..

ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన పరిణామాల గురించి తెలిసిందే.

దీంతో ఈ సినిమాను ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు హీరో, చిత్ర నిర్మాతల్లో ఒకరైన కమల్‌హాసన్‌.

ఈ విషయాన్ని ఆయన హైకోర్టుకు తెలిపారు.

అయితే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్‌ ఏ మాత్రం తగ్గట్లేదు.

‘నాయకుడు’ సినిమా తర్వాత 38 ఏళ్లకు కమల్‌ హాసన్‌, మణిరత్నం కలయికలో తెరకెక్కిన చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో హింట్‌ ఇచ్చాయి.

దీంతో సినిమాను తొలిరోజే చూడడానికి సిద్ధమవుతున్నారు సినీ ప్రియులు.

అడ్యాన్స్‌ బుకింగ్స్‌లో జోరు చూపిస్తోందీ చిత్రం.

ఆన్‌లైన్‌లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఈ జోరు చూస్తుంటే ఈ ఏడాదిలో ఇంత వరకూ వచ్చిన సినిమాల కంటే ‘థగ్‌లైఫ్‌’ అత్యధిక ఓపెనింగ్స్‌ను తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు ట్రేడ్‌ పండితులు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్‌, నటీనటుల పారితోషికాల వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

బడ్జెట్‌.. నటీనటుల పారితోషికాలు

 

కమల్‌హాసన్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర బడ్జెట్‌ దాదాపు రూ.300 కోట్లు అని తెలుస్తోంది.

ఈ చిత్రానికి వారిద్దరూ ప్రత్యేకంగా పారితోషికాలు తీసుకోలేదు.

ఈ సినిమా విడుదల తర్వాత వచ్చిన లాభాల్లో వాటాను పంచుకోనున్నారు.

శింబు రూ.40 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారని తెలిసింది.

త్రిష రూ.12 కోట్లు తీసుకున్నారని సమాచారం.

ఇది ఇంతకు ముందు ఆమె నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రం కంటే మూడింతలు ఎక్కువని టాక్‌.

అలాగే, ఇందులో కీలక పాత్రలు పోషించిన జోజు జార్జ్‌, అశోక్‌ సెల్వన్‌, అభిరామి కూడా మంచి మొత్తాన్నే అందుకున్నారట.

ఈ గ్యాంగ్‌స్టర్‌ థ్రిల్లర్‌ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ ద్వారా సుధాకర్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు.

ఇలాంటి సర్కస్ లు వద్దు… మానుకోండి.

ఇలాంటి సర్కస్ లు వద్దు… మానుకోండి:

నేటి ధాత్రి:

 

 

 

  • విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటుడు ధనుష్
  • వ్యతిరేక ప్రచారాలు చేసుకోండి ఏమీ కాదన్న ధనుష్
  • అభిమానులు ఎప్పుడూ తనవెంటే ఉన్నారన్న ధనుష్
  • ఈ నెల 20న విడుదల కానున్న కుబేర

ఇలాంటి సర్కస్‌లు వద్దు.. మానుకోండి అంటూ విమర్శకులకు నటుడు ధనుష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ధనుష్, నాగార్జున కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ కుబేర ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించారు.

తాజాగా ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

‘నేనెప్పుడూ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాపై, నా మూవీలపై ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తారో చేసుకోండి. నా మూవీల విడుదలకు ముందు నెలకు రెండు సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా మీరేమి చెయ్యలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతోనే ఉన్నారు. ఇలాంటి సర్కస్‌లు మానుకోండి. ఇక్కడ ఉన్నవారంతా నా అభిమానులు మాత్రమే కాదు.. వీరంతా 23 సంవత్సరాలుగా నా వెంటే ఉంటున్నారు. మీరెంత వ్యతిరేక ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు’ అని ధనుష్ కుండబద్దలు కొట్టారు. 

సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుక‌దా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుక‌దా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది! ఎప్పుడంటే

 

నేటి ధాత్రి:

 

 

 

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూత‌న‌ చిత్రం ‘తెలుసు కదా’

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూత‌న‌ చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండగా.. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాశీ ఖ‌న్నా (Raashii Khanna), క‌న్న‌డ భామ‌ శ్రీనిధి షెట్టి (Srinidhi Shetty) క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఎప్పుడో ఏడాది కింత మొద‌లైన ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్డేట్ ఇచ్చారు. అక్టోబ‌ర్‌17న సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా హీరో హీరోయున్లు వీడియో కాల్‌లో క‌నెక్ట్ అయి డిటెయిల్స్ చెబుతూ చేసిన వీడియో ఆక‌ట్టుకునేలా ఉంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Telusu Kada

 

 

ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండ‌గా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. అయితే జాక్ డిజాస్ట‌ర్‌తో సిద్ధుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌డంతో ఇప్పుడు ఆయ‌న ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.

ఊహించని ఆ సంఘటన నన్ను ఎంతో బాధించింది.

ఊహించని ఆ సంఘటన నన్ను ఎంతో బాధించింది

 

నేతిధాత్రి:

 

 

 

 

‘సీతారామం’లో సీతగా, ‘హాయ్‌ నాన్న’లో యష్నగా, ‘ఫ్యామిలీస్టార్‌’లో ఇందూగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది మృణాల్‌ ఠాకూర్‌.

‘సీతారామం’(Sitaramam)లో సీతగా, ‘హాయ్‌ నాన్న’లో (Hi Nanna) యష్నగా, ‘ఫ్యామిలీస్టార్‌’లో ఇందూగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది మృణాల్‌ ఠాకూర్‌ (mrunal Thakur). ప్రస్తుతం తెలుగులో ‘డెకాయిట్‌’తో పాటు, బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన గురించి పంచుకున్న తాజా కబుర్లివి…

వాటిపైనే పెట్టుబడి

నేను ఈవెంట్ల కోసం వేసుకునే డ్రెస్సులన్నీ ఫ్యాషన్‌ డిజైనర్లు ఇచ్చేవే.

నిజానికి దుస్తుల కోసం నేను ఎక్కువ డబ్బులు ఖర్చు చేయను.

ఇప్పటివరకు నేను కొన్నవాటిల్లో ఖరీదైన డ్రెస్‌ ధర రూ. 2 వేలు మాత్రమే అంటే నమ్ముతారా? లక్షలు పోసి దుస్తులు కొని, వాటిని బీరువాలో దాచుకోవడం వల్ల ఉపయోగమేమీ ఉండదు.

బ్రాండెడ్‌ దుస్తుల మోజులో పడి డబ్బులు వృథా చేయడం నాకు అస్సలు నచ్చదు. అందుకే ఇళ్లు, భూమిపై పెట్టుబడి పెడతా.

అవమానంగా ఫీలయ్యా…

ఇటీవల నేనొక అవార్డు ఫంక్షన్‌కి హాజరయ్యా.

అక్కడకి అడుగుపెట్టానో లేదో..

మీడియా వాళ్లంతా చుట్టిముట్టి, ప్రశ్నలు సంధించారు.

అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తున్నా.

ఇంతలో జాన్వీ కపూర్‌ అక్కడకు వచ్చింది. అంతే… నన్ను వదిలేసి అంతా జాన్వీ దగ్గరకు పరుగెత్తారు.

ఊహించని ఆ సంఘటన నన్ను ఎంతో బాధించింది.

అవమానంగా ఫీలయ్యా. పరిశ్రమలో వారసత్వానికి ఉన్న ప్రాధాన్యత నాలా కష్టపడి పైకొచ్చిన వాళ్లకు ఉండదనిపించింది.

వాళ్లతో పనిచేయాలనుంది

ఇప్పటికే తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో నటించాను. తమిళ, మలయాళ, ఇంగ్లీషు, స్పానిష్‌ చిత్రాల్లో కూడా నటించి నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని అనుకుంటున్నా.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి నన్ను ప్రేరేపించిన దర్శకులందరితోనూ కలిసి పనిచేయాలనుంది.

సంజయ్‌లీలా భనాల్సీ, ఇంతియాజ్‌ అలీ, అనురాగ్‌ కశ్యప్‌ వంటి నా అభిమాన దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.

 

మొట్టమొదటి అమ్మాయిని…

నాకు కార్లు అంటే పిచ్చి.

చిన్నప్పుడు మా బంధువుల కారు చూడగానే, ఎక్కి కూర్చోవాలని అత్యుత్సాహం చూపా.

అందుకు మా అమ్మ ఒప్పుకోలేదు.

అనుమతి లేకుండా వేరే వాళ్ల కారు ఎక్కితే, వాళ్లు తప్పుగా భావిస్తారని నాకు సర్ది చెప్పింది.

ఆ క్షణమే నిర్ణయించుకున్నా..

నా కష్టార్జితంతో కొన్న కారే ఎక్కాలని.

మా ఫ్యామిలీలో మెర్సిడెస్‌ కొన్న మొట్టమొదటి అమ్మాయిని నేనే అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.

నటి విద్యాబాలన్‌ నాకు స్ఫూర్తి.

సినిమాల్లో ఆమె పాత్రల ఎంపిక నన్ను అడుగడుగునా ప్రేరేపిస్తుంది.

సవాలుతో కూడిన పాత్రల్ని ఎంచుకున్నప్పుడే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాం.

ఆమె అలాంటి ఛాలెంజింగ్‌ పాత్రల్నే ఎంచుకుంటారు. నా గ్రాఫ్‌ కూడా అలాగే దూసుకెళ్లాలని ఆశిస్తున్నా.

 

Branded Clothes.

 

ఆమెతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.

అందుకే బ్రేకప్‌ గురించి చెప్పా

గతంలో చాలామంది నటీనటులు వ్యక్తిగత విషయాల గురించి చెప్పడానికి సంకోచించేవారు.

కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు తారలు రిలేషన్‌షిప్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు.

నేనూ ఇంతకుముందు నా ప్రేమ, బ్రేకప్‌ గురించి చాలా సందర్భాల్లో బయటపెట్టాను. ఎందుకంటే…

వాటిని అందరితో పంచుకుంటేనే, మన నుంచి ఇతరులు ఏదో ఒకటి నేర్చుకుంటారు.

అందుకే ధైర్యంగా చెప్పేశా.

సాదాసీదాగా జీవిస్తే…

ఒక సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది.

నీ వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చు.

ఇక ఇబ్బందులు గురించి చెప్పాలంటే..

కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.

అవసరమైనప్పుడు కుటుంబసభ్యుల పక్కన ఉండలేం.

కొన్నిసార్లు నాకు కూడా సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుంది.

ఇరవై ఏళ్లకే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేసి, భర్తతో కలసి చక్కగా వారానికోసారి రెస్టారెంట్‌కి వెళ్లి, జీవితాన్ని సరదాగా గడిపేయొచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.

మీరే నాకు స్ఫూర్తి.

మీరే నాకు స్ఫూర్తి

 

నేతిధాత్రి:

 

 

శేఖర్‌ కమ్ముల సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. చిరంజీవిని తన స్ఫూర్తిగా పేర్కొంటూ శేఖర్‌ కమ్ముల సోషల్‌ మీడియా ద్వారా భావోద్వేగాలను పంచుకున్నారు.

చిరంజీవిని కలసిన శేఖర్‌ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ‘25 ఇయర్స్‌ ఆఫ్‌ శేఖర్‌ కమ్ముల’ సెలబ్రేటింగ్‌ ది సోల్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లింగ్‌ అనే పోస్టర్‌ని చిరంజీవి ఆవిష్కరించి, అభినందించారు. ఈ విషయాన్ని శేఖర్‌ కమ్ముల సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ‘టీనేజ్‌లో ఉన్నప్పుడు మెగాస్టార్‌ చిరంజీవిని ఒకసారి దగ్గర నుంచి చూశాను. ఈయనతో సినిమా చేయాలనే భావన కలిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. దీనిని సెలెబ్రేట్‌ చేసుకుందామని మా టీమ్‌ అనగానే వెంటనే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే. కొన్ని తరాల వారిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. కలలను వెంటాడితే విజయం తప్పకుండా మనల్ని అనుసరిస్తుందని నమ్మకం కలిగించింది ఆయనే. నా ఈ 25 ఏళ్ల వేడుకను ఆయన సమక్షంలో చేసుకోవాలనిపించింది. థాంక్యూ సర్‌. ఈ క్షణంలోనే కాదు నా టీనేజ్‌ నుంచి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’ అని శేఖర్‌ కమ్ముల ఆ పోస్టులో పేర్కొన్నారు. చిరంజీవితో కలసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

శ్రీలీల నిశ్చితార్థం.. అసలు కథేంటంటే.. 

శ్రీలీల నిశ్చితార్థం.. అసలు కథేంటంటే.. 

 

టాలీవుడ్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) శనివారం చేసిన ఓ పోస్ట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే!

నేతిధాత్రి:

 

టాలీవుడ్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) శనివారం చేసిన ఓ పోస్ట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ఆ ఫొటోలు చూసి తను త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి. 

అవి నిశ్చితార్థం (Sreeleela engegment rumours) ఫొటోలని ప్రచారం జరిగింది.

Heroine Sreeleela.

 

దీనిపై శ్రీలీల క్లారిటీ ఇచ్చారు. తన ఇంట్లో జరిగిన ఓ వేడుక గురించి ఆమె వివరించారు.

‘‘నా ప్రీ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్‌ చేసుకున్నాం.

దీనికి సంబంధించిన  ప్ల్లానింగ్‌ అంతా మా అమ్మ చూసుకున్నారు’’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ వేడుకల్లో రానా సతీమణి మిహిక కూడా పాల్గొన్నారు. 

 (Sreeleela Pre birthday Celebs)

ప్రస్తుతం శ్రీలీల దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ కెరీర్‌లో బిజీగా ఉంది.

Heroine Sreeleela.

 

 

సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం ఇన్‌స్టా స్టోరీస్‌లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో కుటుంబ సభ్యులు ఆమెకు నలుగు పెడుతూ కనిపించారు.

ఆయా ఫొటోలకు ‘బిగ్‌ డే’, ‘కమింగ్‌ సూన్‌’ అనే క్యాప్షన్‌ రాసుకొచ్చారు శ్రీలీల.

వాటిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగిందంటూ కామెంట్లు చేయగా ఆ ఫొటోలు హల్‌చల్‌ చేశాయి.

జూన్‌ 14న ఆమె 24వ పుట్టినరోజు చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కథనాలపై ఆమె తాజాగా స్పందించారు. 

సినిమా టికెట్లు

Heroine Sreeleela.

చిరుతో అనిల్‌ వేగం మామూలుగా లేదు..

చిరుతో అనిల్‌ వేగం మామూలుగా లేదు..

నేతిధాత్రి

 

 

 

 

అగ్ర కథానాయకుడు చిరంజీవి మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార (Nayanatara) కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టిన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితోపాటు ప్రధాన తారాగణంపై కీలక టాకీ పార్ట్‌ను పూర్తి చేశారు.  తదుపరి షెడ్యూల్‌ ఈ వారాంతంలోనే మొదలు కానుందని తెలిసింది. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. చిరంజీవి ఇందులో తన సొంత పేరైన శివ శంకర్‌ వరప్రసాద్‌ అనే పాత్రలో కనిపించనున్నారు. వెంకటేశ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 

ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు ఎవ‌రిదంటా గురువు గారు.

ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు.. ఎవ‌రిదంటా గురువు గారు

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది. అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.

 

నేటి ధాత్రి:

Rashmika Mandanna
Rashmika
నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక (Rashmika Mandanna) మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది.
అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.
త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, తాజాగా ఎల్లో శారీలో దిగిన ఫొటోలు వాటి గురించి ర‌ష్మిక చెప్పిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) ల‌వ్‌లో ఉన్నారు..
ఏ క్ష‌ణంలోనైనా పెళ్లి పీట‌లు ఎక్కుతార‌నే వార్త‌లు ఎలాగో ఉన్నాయి.
అంతేగాక‌ త‌రుచూ ఇద్ద‌రు ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేకుండా ఒకే లొకేష‌న్‌ ఫొటోలు షేర్ చూస్తూ నెటిజ‌న్ల‌కు దొరికి పోతుంటారు.
తాజాగా ఇలాంటి ఫొటోలే మ‌రోసారి వైర‌ల్ అయ్యాయి.
రీసెంట్‌గా ర‌ష్మిక (Rashmika Mandanna) ప‌సుపు ప‌చ్చ చీర ధ‌రించి ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌ల సినిమా లాంచింగ్‌కు ముఖ్య‌ అతిథిగా హ‌జ‌రైన‌ సంగ‌తి విధిత‌మే.
ఆపై ఆదే చీర‌పై ఫొటోషూట్ చేయుంచుకున్న ర‌ష్మిక ఈ ఫొటోల‌లో నాకు ఇచ్చినవి, విలువైనవి అన్నీ ఉన్నాయి.
Rashmika
ఇష్టమైన రంగుల చీర, గిఫ్ట్‌గా ఇచ్చిన స్పెషల్ లేడీ, ఈ ఫొటోలు తీసిన వ్యక్తి, ఇష్టమైన ప్లేస్ అన్నీ ఉన్నాయి అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇంకేముంది విజ‌య్ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) అభిమానుల‌తో పాటు చాలామంది త‌మ బుర్ర‌ల‌కు, త‌మ అకౌంట్ల‌కు ప‌ని చెప్పి సోష‌ల్ మీడియాల్లో త‌మ స్టైల్ క్రియేటివిటీలతో హాల్‌చ‌ల్ చేశారు.
ఆ ఫోటోలు విజ‌య్ ఇంట్లోనే దిగిన‌వ‌ని, వాటిని విజ‌య్ స్వ‌యంగా తీశాడ‌ని, ఆ చీర‌ను విజ‌య్ అమ్మ‌గారు బ‌హూమ‌తిగా ఇచ్చారంటూ కామెంట్లు చేస్తూ హోరెత్తించారు.
గ‌తంలోనూ ఆ ఫొటోలో ఉన్న‌ బ్యాగ్రౌండ్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం క‌లిసి దిగిన ఓ పాత‌ చిత్రం ఉండ‌డంతో ఈ ఫొటోపై చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. ఇక‌నైనా విజ‌య్‌, ర‌ష్మిక‌లు త‌మ రిలేష‌న్‌ను బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌ని, ఇంకా ఎన్నాళ్లు దాచుతారంటూ హిత‌వు ప‌లుకుతున్నారు.

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే…

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే అభిమానులకు పండగే.

 

నేటి ధాత్రి:

 

 

 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 

భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 
భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూడవ పాటను ట్రైలర్‌తో పాటు ఆవిష్కరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ  చిత్రం, జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.  ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.  జూన్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Harihara veeramallu Release Date)

ఆలస్యాల మధ్య పగ్గాలు చేపట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, కొద్ది నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ, వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

Nani’s HIT 3 Achieves Breakeven In 6 Days.

Nani’s HIT 3 Achieves Breakeven In 6 Days

 

 NETIDHATRI NEWS:

 

 

Natural Star Nani’s HIT: The 3rd Case, directed by Sailesh Kolanu, has emerged as a clear box office winner, achieving break-even status across all territories within just six days of its release.

In an industry climate where many films are struggling to find footing, this achievement stands out as a major success.

The film has already crossed the coveted 100 crore milestone globally and also surpassed the $2 million mark in North America.

With momentum on its side, HIT: The 3rd Case is well on track to become one of the highest-grossing Telugu films of 2025.

Nani’s HIT 3

 

 

 

Its success further reinforces Nani’s reputation as one of Telugu cinema’s most bankable stars. Known for his script sense and consistent box office pull, Nani continues to deliver crowd-pleasing content that resonates across demographics.

In today’s challenging market, where theatrical footfall is unpredictable and only a few films are managing to turn a profit, HIT: The 3rd Case reaching profitability within a week is a rare and commendable accomplishment.

సిరిమల్లె చెట్టు కింద రాగులమ్మ.!

సిరిమల్లె చెట్టు కింద రాగులమ్మ జానపద గేయ చిత్రీకరణ..

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పాట సిరిమల్లె చెట్టు కింద రాగులమ్మ పాట చిత్రీకరణ ములుగు జిల్లా తాడ్వాయి మండలలోని గంగారాం పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిగింది, నరేష్ మాట్లాడుతూ ఎన్నో పాటలు యూట్యూబ్ ఛానల్ కు పాటలు రాశారని పేర్కొన్నారు సామాజిక నేపధ్యంలో సాగే పాట అతి త్వరలోనే ఎన్ ఎస్ ఆర్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ లో ఈ పాట విడుదల కాబోతుంది అని చెప్పారు ఈ పాట లో హీరో నాగునాయక్, హీరోయిన్ సత్య ఈషా, విష్ణు మహంకాళి,కెమెరా మెన్ శ్రీరాజు నాగేళ్ళ, ప్రొడ్యూసర్ లకావత్ రాములు సత్తమ్మ పర్యవేక్షణలో ఈ పాట రాబోతుందనీ అందరూ ఆ పాటను ఆదరించాలని కోరారు కార్యక్రమంలో స్థానిక తాడ్వాయి మండలమాజీ ఎంపీపీ నరేష్, రేణికుంట్ల సంతోష్ , చింతల రమేష్ ,పుల్ల రవి, కాట్రేవుల ఐలయ్య, సరిగొమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version