పూరి మూవీలో సంయుక్త

పూరి మూవీలో సంయుక్త

 

 

shine junior college

పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమాలో విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలోకి తాజాగా సంయుక్త వచ్చి చేరింది.

 

 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మి (Charmy) నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అయ్యింది. ఇందులో ఓ ప్రధాన పాత్రకు టబును తీసుకున్నట్టు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. ఇప్పుడీ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సంయుక్త మీనన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.

 

పూరి, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి ‘బెగ్గర్’ అనే పేరు ఖరారు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ‘బెగ్గర్’ అనే పేరును కోలీవుడ్ వర్గాలు అంగీకరించవు కాబట్టి దాని బదులు ‘బిక్షాందేహి’ అనే టైటిల్ పెడితే మరింత బెటర్ గా ఉంటుందనే సలహా వచ్చిందట. చిత్రం ఏమంటే… తమిళులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ టైటిల్ ను అయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ సంస్కృత పదాన్ని తమ సినిమాకు పేరుగా ఎందుకు ఒప్పుకుంటారు? అని కొందరంటున్నారు. ఏతావాతా ఈ సినిమా టైటిల్ పై ఇంకా అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది.

 

ఇదిలా ఉంటే… సంయుక్త మీనన్ తెలుగులో బాలకృష్ణ సరసన ‘అఖండ -2’ లో నటిస్తోంది. అలానే తన ప్రెజెంటర్ గా, దర్శకుడు యోగి తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ ఆమె నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లోనూ సంయుక్త నాయికగా చేస్తోంది. ఇక పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో తీయబోతున్న సినిమాలో ‘దునియా’ విజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పూరి తనయుడు ఆకాశ్ కూడా ఓ కీ-రోల్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌.

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌

 

 

shine junior college

 

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది…

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎడిటర్‌ మోహన్‌ నిర్మించిన ఈ చిత్రంతోనే ఆయన తనయుడు మోహన్‌ రాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. లయ, స్నేహ, విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రాన్ని ఈ నెల 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ తక్కువగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ‘హనుమాన్‌ జంక్షన్‌’ మళ్లీ తన మ్యాజిక్‌తో మెస్మరైజ్‌ చేస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు.

విభిన్న కథతో.

విభిన్న కథతో

 

shine junior college

 

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి…

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి నటించనున్న కొత్త చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీ అచ్చర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు సత్యదేవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నాగ్‌ అశ్విన్‌ క్లాప్‌ కొట్టారు. వంశీ నందిపాటి ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. షణ్ముఖ ప్రశాంత్‌ ఈ చిత్రానికి కథను అందించారు. 

రెగ్యులర్‌ షూట్‌ షురూ.

రెగ్యులర్‌ షూట్‌ షురూ

 

shine junior college

 

 

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌…

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సోమవారం రెగ్యులర్‌ షూట్‌ను మొదలెట్టారు. హైదరాబాద్‌లో నిర్మించిన ఓ ప్రత్యేక సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజతో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఇది రవితేజ మార్క్‌ కామెడీతో పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. ఇందులో ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, డీఓపీ: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

 

కేవలం నెల రోజుల వ్యవథిలో అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన నాలుగు సినిమాల నుండి నాలుగు సింగిల్స్ రాబోతున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander) ఓ యువ సంచలనం. యుక్త వయసులోని చిత్రసీమలోకి అడుగుపెట్టి సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకుంటున్నాడు. కోలీవుడ్ లోని స్టార్స్ తో అతనికి అనుబంధం ఉన్నా… తన ప్రతిభతోనే అతను ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాడు. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని, తనకంటూ ఓ ప్రత్యేక మార్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు.
shine junior college
విశేషం ఏమంటే… జూన్ మాసం అనిరుధ్‌ దే అని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అతను సంగీతాన్ని సమకూర్చుతున్న నాలుగు సినిమాలకు సంబంధించిన నాలుగు సింగిల్స్ ఈ నెల రోజుల వ్యవధిలో సంగీత ప్రియులను అలరించబోతున్నాయి.
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే చికితూ వైబ్, పవర్ హౌస్ ట్రాక్ విడుదలై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఈ వారంలో చికితూ వైబ్ ఫుల్ వర్షెన్ ను విడుదల చేయబోతున్నారు. ఇందులో రజనీకాంత్ తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో కనిపించబోతున్నాడు. ఈ ట్యూన్ ను శింబు తండ్రి టి. రాజేందర్ మూవీ నుండి తీసుకున్నారట. అలానే అనిరుథ్‌… విజయ్ (Vijay) నటిస్తున్న పొలిటికల్ డ్రామా ‘జన నాయగన్’కూ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. విజయ్ పుట్టిన రోజు జూన్ 22ను పురస్కరించుకని ఈ సినిమా నుండి ఓ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు హెచ్. వినోద్… తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’ నుండి స్ఫూర్తి పొంది తీస్తున్నట్టు సమాచారం.
అలానే ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తో ‘మదరాసి’ మూవీని తీస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామాకూ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీని నుండి ఇదేవారం ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇక అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న మరో తెలుగు సినిమా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ‘కింగ్ డమ్’. ఈ మూవీ నిజానికి మే 30న విడుదల కావాల్సింది. అయితే అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆల్ రెడీ గత నెల విడుదలై సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఈ నెల చివరాఖరు లేదా ఆగస్ట్ మొదటి వారంలో ‘కింగ్ డమ్’ నుండి సెకండ్ సింగిల్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ రకంగా అనిరుధ్‌ స్వరాలు సమకూర్చిన ‘కూలీ, జన నాయగన్, మదరాసి, కింగ్ డమ్’ చిత్రాలకు సంబంధించిన సింగిల్స్ ఒకే నెల వ్యవధిలో రాబోతున్నాయి. మరి అనిరుథ్‌ తన మ్యాజికల్ మ్యూజిక్ తో ఈ సినిమాలను ఏ విధంగా విజయతీరాలకు చేర్చుతాడో చూడాలి.

తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్…

తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్…

 

అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా అని పాడుకుంటున్నారు ఆ అమ్మడిని చూసి నెటిజన్లు. అమ్మడికి పట్టిన అదృష్టాన్ని చూసి కొందరు మధ్యలో ట్రోల్ చేశారు కానీ రీసెంట్ గా వదిలిన శాంపిల్ ను చూసి నోరెళ్ల బెడుతున్నారు. అవమానించిన వాళ్లే ఔరా అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా… మోనాలిసా గురించి.

 

shine junior college
మహా కుంభమేళ 2025లో ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేసిన అమ్మాయి మోనాలిసా భోంస్లే (Monalisa). ఈ 16 ఏళ్ల మధ్యప్రదేశ్ బ్యూటీ, ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అమ్ముతూ ఉండగా, ఒక నెటిజన్ తీసిన వీడియోతో రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. ఆమె ఆకర్షణీయమైన తేనెకళ్లు, చిరునవ్వు, సింపుల్‌గా ఉండే స్వచ్ఛమైన అందంతో నెట్టింట్లో స్టార్ అయిపోయింది. జాతరలో పూసలు అమ్మే అమ్మాయి నుంచి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. బాలీవుడ్ లో  ఛాన్స్ కొట్టేసింది కానీ సినిమా తెరపైకి వచ్చేందుకు టైం పట్టేలా ఉంది. ఆ లోపు అమ్మడు మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ భామ ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. అది రీసెంట్ గా యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తోంది. ఉత్కర్ష్ సింగ్‌ (Utkarsh Singh)తో కలిసి మోనాలిసా ఆ సాంగ్‌లో ఎంబ్రాయిడరీ లెహంగా, క్లాసీ జ్యువెలరీతో ఫుల్ స్టన్నింగ్‌గా కనిపించింది. ఆమె డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫ్లాట్  అవుతున్నారు. ఈ అమ్మాయి… హీరోయిన్స్‌కి ఏం తక్కువ అంటూ  కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు.. ఈ సాంగ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు తెగ చూసేస్తున్నారు.

Monalisa

సనోజ్ మిశ్రా (Sanoj Mishra) డైరెక్ట్  చేస్తున్న హిందీ సినిమాలో ఈ భామ లీడ్ రోల్‌లో కనిపించబోతోంది. యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఫుల్ ట్రైనింగ్ తీసుకుంటూ, సినిమా ఎంట్రీ కోసం ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ‘సాద్గి’ సాంగ్ లింక్‌కి లైక్స్, కామెంట్స్ జోరు చూస్తే, ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. పూసల అమ్మాయి నుంచి కలల రాణిగా మారిన మోనాలిసా జర్నీ చూస్తే, ఎవరైనా సరే అవకాశం వస్తే ఆకాశం అందుకోవచ్చని నిరూపించేలా ఉంది. ఇక ఇప్పుడు ఈ భామ సినిమా రంగంలో ఎలా రాణిస్తుందో చూడాలి!

కన్నప్ప కు రజనీ అభినందనలు.

కన్నప్ప కు రజనీ అభినందనలు…

 

shine junior college

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన…

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి, వసూళ్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీకాంత్‌ ఇంట్లో ఆయన్ని కలిశారు మోహన్‌బాబు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రాన్ని రజనీకాంత్‌ చూశారు. విష్ణుని అక్కున చేర్చుకుని సినిమా బాగుందంటూ అభినందించారు. ఈ ఆనందాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు విష్ణు. ‘ఈ క్షణం కోసమే 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా నటనని రజనీ అంకుల్‌ మెచ్చుకోవాలని నా కల. అది ఇప్పుడు నెరవేరింది. ఈ రోజు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అందులో పేర్కొన్నారు. అలాగే మోహన్‌బాబు కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ‘ నేను నిర్మించిన ‘పెదరాయుడు’ చిత్రానికి 30 ఏళ్లు పూర్తైన రోజునే నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌ ‘కన్నప్ప’ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలసి చూశారు. సినిమా చూసిన అనంతరం ఆయన కురిపించిన ప్రేమ, అభిమానం, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరచిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని పేర్కొన్నారు. ‘కన్నప్ప’ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది.

అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.

అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.

 

 

shine junior college

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్‌’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు…

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్‌’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాఽధించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆమిర్‌ఖాన్‌ వెల్లడించారు. తాజాగా ఓ టెలివిజన్‌ షో పాల్గొన్న ఆయన ‘దంగల్‌’ను పాకిస్థాన్‌లో విడుదల చేయకపోవడం వెనుకున్న కారణాన్ని వివరించారు. ‘గీతా ఫొగట్‌ విజయం సాధించిన అనంతరం జాతీయ పతాకం నింగిలోకి ఎగురుతూ ఉండగా… జాతీయ గీతం వినిపించే దృశ్యాలు సినిమా నుంచి తొలగించండి లేదంటే చిత్ర ప్రదర్శనకు అంగీకరించం’ అని పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు షరతు విధించింది. ఇదే విషయమై చిత్ర సహ నిర్మాణ సంస్థ డిస్నీ నన్ను సంప్రదించగా నష్టం వచ్చినా సరే.. మనం సినిమాని పాకిస్థాన్‌లో విడుదల చేయడం లేదు అని ఖరాఖండిగా చెప్పేశాను’ అని ఆమిర్‌ఖాన్‌ వివరించారు. ‘మీ జాతీయ పతాకాన్ని తొలగించండి, మీ జాతీయ గీతాన్ని తీసివేయండి అనే వారితో నాకు పనేంటి. అలాంటి వ్యాపారం అక్కర్లేదని చెప్పేశాను’ అంటూ ఆయన ఆ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్‌.

నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్‌

 

 

 

 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు.

సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌…

 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు.

సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

డిసెంబరు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సోమవారం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌ చేసిన హంగామా, అదిరిపోయే విజువల్స్‌, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ముఖ్యంగా ప్రభాస్‌ సంభాషణలు, ఆయన చేసిన కామెడీ అభిమానులను ఖుషీ చేశాయి.

మారుతి టేకింగ్‌ ప్రధానాకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ ‘ఓ రోజు యువీ వంశీ నిన్ను ప్రభాస్‌ పిలుస్తున్నారు అని చెప్పారు.

ఆయన్ని కలిసేందుకు ముంబై వెళ్లా.

‘నువ్వు చేసిన ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలేభలే మగాడివోయ్‌’ లాంటి వినోదాత్మక కథ రెడీ చెయ్యి.

సినిమా చేద్దాం’ అని అన్నారు.

‘పక్కా కమర్షియల్‌’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో నాతో సినిమా చెయ్యాలనుకున్న నిర్మాత వెనక్కి వెళ్లారు.

అయినా నాపై నమ్మకంతో ప్రభాస్‌ ఈ సినిమాను చేశారు.

ఆయనకు నాపై ఉన్న నమ్మకమే ఈ సినిమా. 

 

షూటింగ్‌ మొదలయ్యాక కూడా ‘ఈ టైమ్‌లో ప్రభా్‌సకు మారుతితో సినిమా అవసరమా’..
‘అయినా ప్రభాస్‌ కామెడీ చేయడమేంటి’ వంటి సందేహాలు వినిపించాయి.
అన్ని సవాళ్లనూ స్వీకరిస్తూ ఈ సినిమాను మరింత పట్టుదలతో కొనసాగించా.
అభిమానులు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే.
అంతకు వెయ్యిరెట్లు ఆయన వారిని ప్రేమిస్తారు’’ అని అన్నారు.
టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా మీ అందర్నీ ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోనివ్వకుండా ఎంటర్టైన్‌ చేస్తుంది.
40 నిమిషాల క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు.
నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం మొదలైనప్పుడు ఓ నిర్మాత దీనిపై నెగెటివ్‌గా మాట్లాడారు.
సినిమా విడుదలయ్యాక ఆయనే పొగుడుతారు’’ అని తెలిపారు.

ప్ర‌భాస్‌.. ది రాజా సాబ్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

ప్ర‌భాస్‌.. ది రాజా సాబ్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

 

 

 

ఎడాదిగా ప్ర‌భాస్ రాజా సాబ్ మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ కోరిక‌కు ఎట్ట‌కేల‌కు ఎండ్ కార్డ్ ప‌డింది.

 

దాదాపు ఓ ఎడాదిగా ప్ర‌భాస్ (Prabhas) రాజా సాబ్ (The Raja Saab) మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ కోరిక‌కు ఎట్ట‌కేల‌కు ఎండ్ కార్డ్ ప‌డింది.
హైద‌రాబాద్ ప్ర‌సాద్ ఐ మాక్స్ లో ఉద‌యం 10.51 నిమిషాల‌కు ది రాజా సాబ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.
ప్ర‌భాస్ మొట్ట మొద‌టి సారి హ‌ర్ర‌ర్ జాన‌ర్, డ‌బుల్ రోల్‌ చేయ‌డం, ఇప్పటికే
ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి.

ఇప్ప‌టికే.. ముంద‌స్తుగా రిలీజ్ చేసిన‌ ప్రీ టీజర్ సెన్షేష‌న్ అవ‌గా తాజాగా సోమ‌వారం విడుద‌ల కానున్న టీజ‌ర్పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఆ ప్రీ టీజర్ లో క‌థానాయిక‌లు మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) స‌హా చాలా మంది ఆకాశాన్ని చూస్తూ షాక్ కు గురి అవుతున్న‌ట్లు చూయించారు.
ఆ షాట్ సోష‌ల్ మీడియాలోహైలైట్ అయింది.
అయితే టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్బంగా ఐమాక్స వ‌ద్ద జాత‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.
వేల‌ల్ఓ ప్ర‌భాస్‌ఫ్యాన్స్ త‌ర‌లి వ‌చ్చి అక్క‌డ ప్ర‌భాస్ చిత్ర ప‌టాల‌కు పాలాభిషేకం చేయ‌డంతో పాటు పెద్దెత్తున బాణా సంచా పేల్చి హంగామా చేశారు.

ఇదిలాఉంటే..

సినిమా టీజ‌ర్‌ను చూస్తే అభిమానుల‌కు ఓ పండ‌గే అనేలా ఉంది.

హ‌ర్ర‌ర్ సీక్వెన్సులు, కామెడీ బాగా వ‌ర్కౌట్ అయిన‌ట్లు తెలుస్తుంది.

విజువ‌ల్స్, త‌మ‌న్ సంగీత కూడా సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేలా ఉన్నాయి.

ప్రభాస్ ఈ సినిమాలో తాతమనవడిగా డబుల్ రోల్ చేస్తుండ‌గా ఆయ‌న స‌ర‌స‌న నిధి ఆగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌, రిద్ధి కుమార్ న‌టిస్తున్నారు.

కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మారుతి (Director Maruthi) డైరెక్ట్ చేయ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై విశ్వ ప్ర‌సాద్ నిర్మించారు.

డిసెంబ‌ర్‌5న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌

 

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి, అమె ముద్దుల త‌న‌య సుప్రీత మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు.

 

 

 

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి (Surekha Vani), అమె ముద్దుల త‌న‌య సుప్రీత (Supritha) మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు. రీసెంట్‌గా.. ఇద్ద‌రు క‌లిసి వెకేష‌న్ వెళ్లిన వారు అక్క‌డ స‌ర‌దాగా గ‌డుపుతూ, ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు.

 

ఈ క్ర‌మంలో త‌మ డ్రెస్సింగ్ స్టైల్‌లో హాట్ నెస్ పెంచి వీక్ష‌కుల‌కు అదిరే ట్రీట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు త‌మ ఇన్ స్టాలో షేర్ చేయ‌డంతో చూసిన వారంతా వారి గ్లామ‌ర్‌కు ఫిదా అవుతున్నారు.

 

ఈ దృశ్యాలు తిల‌కించిన‌ ఫాలోవ‌ర్లంతా స‌రిపోయారు ఇద్ద‌రు.. సాగుతుంది మీక‌లాగా అంటూ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలోని బామ డైలాగును వీరిద్ద‌రికి అన్వ‌యిస్తూ కామెంట్లు చేస్తునే ఒక‌టికి రెండు మార్లు ఆ చిత్రాలు చూసేస్తున్నారు.

 

ప్ర‌స్తుతం వీరి వీడియో, ఫొటోలు సామ‌జిక మాధ్య‌మాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వ‌య‌స్సుకు సంధం లేకుండా చాలా మంది వారి ఫొటోల‌కు లైక్‌లు కొడుతూ మీరిలాగే క‌ల‌కాలం హ్యాపీగా ఉండాల‌ని కోరుకుంటున్నారు.

 

ఆడ‌దాని ప్రేమ‌ను.చెప్ప‌డానికి ఏమున్నాయ్‌..

ఆడ‌దాని ప్రేమ‌ను.. చెప్ప‌డానికి ఏమున్నాయ్‌.. ‘8 వసంతాలు’ ట్రైల‌ర్‌ అదిరింది

 

 

 

 

 

‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’

రెండేండ్ల క్రితం ‘మ్యాడ్’ (MAD) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ (Ananthika Saneel Kumar) లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌, న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రవితేజ దుగ్గిరాల (Raviteja Duggirala), హ‌ను రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని (Naveen Yarneni), వై. రవిశంకర్ నిర్మించిన ఈఅ మూవీ జూన్‌20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ ఏప‌థ్యంలో ఇప్ప‌టికే మేక‌ర్స్‌ ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు ఒక దానిని మించి మ‌రోటి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుని టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సినిమా విడుద‌ల‌కు మ‌రో వారం మాత్ర‌మే ఉండ‌డంతో తాజాగా ఆదివారం ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. 

ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ప్రేమ చిత్రాల‌కు భిన్నంగా అమ్మాయి త‌రుపు ప్రేమ‌ను తెలిపే చిత్రంగా తెర‌కెక్కించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈకోవ‌లోనే హీరోయన్‌తో చెప్పించిన డైలాగులు మెస్మ‌రైజింగ్‌గా ఉన్నాయి. మాములుగా మ‌గాడి ప్రేమ‌కు సాక్ష్యాలుగా పాల‌రాతి సౌధాలు, భాగ్య‌ న‌గ‌రాలు ఉన్నాయి గానీ ఆడ‌దాని ప్రేమ‌కు ఏముంది మ‌న‌సులోనే స‌మాధి చేసుకున్న జ్ఞాప‌కాలు త‌ప్పా అనే హృద్య‌మైన ప‌దాల‌తో సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత.

నాన్న అంటే నమ్మకం నాన్న ప్రేమలో బాధ్యత..

అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే.నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే… నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా.

నా గురువు

నేను నాన్న కూచీని. నా జీవితంలోని ప్రతి అడుగులోనూ ఆయన ముద్ర ఉంది. దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు నాకుంది. మగవాళ్లు తమ మనసులోని భావాలను బయటకు వ్యక్తపరచలేరు అంటారు కదా! కానీ మా నాన్న మాత్రం అలా కాదు. మాపై తనకి ఎంత ప్రేముందో ఎప్పటికప్పుడు లేఖల ద్వారా తెలియజేస్తారు. అవి చదువుతున్నప్పుడు భలే ముచ్చటేస్తుంది. నాకు ఏ సమస్య వచ్చినా ముందు నాన్నకే ఫోన్‌ వెళ్తుంది. నా గదిలో వై-ఫై పనిచేయకపోయినా తనకే ఫోన్‌ చేస్తా. ఆయనే నా గురువు.

– కృతి సనన్‌

 

తన పేరు వాడొద్దన్నారు

నాన్న మహేశ్‌ భట్‌ నా చిన్నతనంలో ఇంట్లో కన్నా సెట్‌లోనే ఎక్కువ ఉండేవారు. ఒకరకంగా నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాకే మా మధ్య మరింత అనుబంధం పెరిగిందని చెప్పొచ్చు. మొదట నేను సినిమాల్లోకి వస్తానంటే ఆయన ప్రోత్సహించలేదు. ‘ప్రతిభ ముఖ్యం. నా కూతురిగా సినిమాల్లోకి రావడం, నా పేరు వాడుకుని అవకాశాలు సంపాదించడం నాకు ఇష్టముండదు’ అన్నారు. నాన్న పేరు వాడుకోకుండా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ప్రస్తుతం నా విజయాలు చూసి ఆయన చాలా గర్వంగా ఫీలవుతుంటారు.

సినిమా టికెట్‌లు

– అలియా భట్‌

నా మార్గ నిర్దేశకుడు…

సరిగ్గా నేను పుట్టడానికి రెండు రోజుల ముందు… పెద్ద కళ్లు, పొడవాటి జుట్టు, అందమైన ముక్కు, పట్టీలేసుకుని.. తన పొట్టపై నేను ఆడుకుంటున్నట్లుగా నాన్నకు ఓ కల వచ్చిందట. ఆ కలకు తగ్గట్టే నేను పుట్టేసరికి… ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని తెగ సంబరపడిపోయారట. ఆ మధుర క్షణాల గురించి నాన్న ఇప్పటికీ నాకు చెప్తూ మురిసిపోతుంటారు. చిన్నతనంలో నాన్నతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. కాస్త పెద్దయ్యాక పైచదువుల దృష్ట్యా హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది. ఆతర్వాత సినిమాలతో బిజీ అయ్యాను. చాలా సందర్భాల్లో నాన్నను మిస్సయిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. నాన్న కూడా నా ఆరోగ్యం, కెరీర్‌ గురించి అనుక్షణం ఆలోచిస్తూ, మార్గనిర్దేశనం చేస్తుంటారు.

– రష్మిక మందన్నా

 

దేవుడిచ్చిన బహుమతి

ఏ అమ్మాయికైనా తండ్రిలో ఓ స్నేహితుడు కనబడితే… ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్‌. మా నాన్న అలాంటివారే. ఎదుటివారితో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం…. ఇలా అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు.Father means trust, father means responsibility in love.

 

ఆయనిచ్చిన ధైర్యమే…

నా జీవితంలో నాన్న స్థానం చాలా గొప్పది. నేను ఇంత చలాకీగా ఉంటున్నానంటే దానికి కారణం నాన్నే. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సినిమాల్లో నాదైన శైలిలో రాణించగలుగుతున్నా. షూటింగ్‌ తర్వాత ఇంటికెళ్తే.. నాతో బోలెడు కబుర్లు చెబుతుంటారు. మా మాతృభాష బడగా అయినా… నేను ఇంట్లో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతుంటా. ‘తెలుగు బాగా మాట్లాడుతున్నావ్‌గా.. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకో’ అంటూ ఆటపట్టిస్తుంటారు నాన్న.

రానా నాయుడు సీజ‌న్‌2 రివ్యూ ఎలా ఉందంటే

రానా నాయుడు సీజ‌న్‌2 రివ్యూ ఎలా ఉందంటే…

 

రెండేండ్ల క్రితం వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించ‌డంతో పాటు తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తాజాగా ఈ సిరీస్ సీక్వెల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. విక్ట‌రీ వెంక‌టేశ్ (Venkatesh Daggubati), రానా (Rana Daggubati), అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) , సుర్వీన్ చావ్లా (Surveen Chawla), కృతి క‌ర్భంద (Kriti Kharbanda), అభిషేక్ బెన‌ర్జీ (Abhishek Banerjee), సుశాంత్ సింగ్, ర‌జ‌త్ క‌పూర్ (Rajat Kapoor) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ర‌ణ్ అన్షుమ‌న్ (Karan Anshuman) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీకి వ‌చ్చిన ఈ సిరీస్ గ‌త సీజ‌న్‌ను మ‌రిపించిందా లేక నిరాశ‌ ప‌ర్చిందా అనేది ఇక్క‌డ చూద్దాం.

 

అయితే మ‌రోవైపు రానాకు ద‌గ్గ‌రైన ఓ పొలిటీషియ‌న్ రానాకు వ్య‌తిరేఖంగా ర‌వూఫ్‌కు సాయం చేసి జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి అత‌ని సాయంతో రాజ‌కీయంగా ఎద‌గాల‌ని చూస్తుంటాడు. కానీ ర‌వూఫ్ ఆ పొలిటీషియ‌న్‌ను కాద‌ని తానే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఫ్లాన్లు చేస్తుంటాడు. ఇక నాగా నాయుడు సైతం ఓ గ్యాంగ్ లేడీకి డ‌బ్బులు బాకీ ప‌డడం, రానా అన్న‌, త‌మ్ముళ్లు ప్రేమ‌లో ప‌డ‌డం వారు డ‌బ్బు సంపాదించి ఈ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి ఇబ్బందుల్లో ప‌డ‌తారు. మ‌రోవైపు విరాజ్ ఒబెరాయ్ ఓ త‌ప్పు చేసి ఓ పోలీస్ సాయంతో రానాను అందులో ఇరికిస్తాడు. వెర‌సి మూడు, నాలుగు గ్రూపులు, అందులో వారి సొంత వ్య‌వ‌హారాలు, వారు ప‌న్నే కుట్ర‌ల నేప‌థ్యంలో రానా అడ్ ఫ్యామిలీ ఎలా చిక్కుకుంది, అందులో నుంచి ఏవిధంగా బ‌య‌ట ప‌డ్డార‌నే ఈ రానా నాయుడు సిరీస్‌ సీజ‌న్‌2 కథ‌. క‌థ‌గా చెప్పుకోవ‌డానికి ఇది రెగ్యుల‌ర్ రివేంజ్‌, యాక్ష‌న్ డ్రామానే అయినా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ త‌ర‌హా గ్రూపులు, ఒక‌రిని మించి మ‌రొక‌రు, ఒక‌రిపై ఒక‌రు కుట్ర‌ల నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌ను తెర‌కెక్కించిన‌ట‌లు అర్థ‌మ‌వుతుంది.

 

అయితే మొద‌టి భాగంలో ఉన్న‌ట్లు హింస‌, అశ్లీల స‌న్నివేశాలు, అస‌భ్య ప‌దాల వాడ‌కం 80 శాతం త‌గ్గించి పూర్తిగా రానా అయ‌న ప్యామిలీ, వారి సొంత వ్యవ‌హారాల‌ చుట్టూనే న‌డిపించారు. కాగా వెంక‌టేశ్ పాత్ర మాత్రం తీసిక‌ట్టుగా ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ క్యారెక్ట‌ర్‌కు వెంక‌టేశ్ అవ‌స‌రమే లేదు వేరే ఎవ‌రితోనైనా చేయించొచ్చు అనే అంతగా ఆయ‌న‌ పాత్ర చిత్ర‌ణ ఉంది. ఓ క‌మెడియ‌న్ త‌ర‌హాలో, అప్పుడ‌ప్పుడు రావ‌డం, ర‌స్టిక్‌గా డైలాగులు చెప్ప‌డం ఆపై మాయం కావ‌డం, చివ‌ర‌లో రానాకు చివ‌రి నిమిషంలో హైల్ప్ చేసే క్యారెక్ట‌ర్‌కే ఆయ‌న పాత్ర ప‌రిమిత‌మైంది. పూర్తిగా రానా నేప‌థ్యంలో ఉండడం కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం. మొత్తంగా గ‌త సీజ‌న్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డంతో ఈ సీజ‌న్ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అన్ని వెబ్ సీరిస్‌ల లాగానే ఇందులోనూ అక్ర‌మ సంబంధ సీన్లు న‌డిపించారు. గ‌త సీజ‌న్ ఇష్ట‌ప‌డిన వాళ్ల‌కు ఈ సీజ‌న్ అంత‌గా న‌చ్చ‌క పోయిన ఒక‌మారు చూసేయ‌వ‌చ్చు. ఫ్యామిలీస్ అక్క‌డ‌క్క‌డ అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

30 ఏళ్ళ పెదరాయుడు.

30 ఏళ్ళ పెదరాయుడు…

నటప్రపూర్ణ మోహన్ బాబు నటజీవితంలో మరపురాని మరచిపోలేని చిత్రం ‘పెదరాయుడు’… ఈ చిత్రం జూన్ 15తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

నటప్రపూర్ణ మోహన్ బాబు నటజీవితంలో మరపురాని మరచిపోలేని చిత్రం ‘పెదరాయుడు'(Pedarayudu)… ఈ చిత్రం జూన్ 15తో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది…
మోహన్ బాబు (mohanbabu)నటజీవితాన్ని ‘పెదరాయుడు’కు ముందు – ‘పెదరాయుడు’ తరువాత అన్న రీతిలో విడదీయవలసి ఉంటుంది… అంతకు ముందు మోహన్ బాబు వందల చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి అలరించారు… ‘ప్రతిజ్ఞ’తో నటనిర్మాతగా మారి ప్రయాణం సాగించారు… సొంత చిత్రాల నిర్మాణంలో మోహన్ బాబు ఎన్నెన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నారు… ఆయన నటించి నిర్మించిన చిత్రాల్లో కొన్ని అఖండ విజయాలను నమోదు చేశాయి… మరికొన్ని అపజయాల బాట పట్టాయి… ఈ నేపథ్యంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో మోహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ బంపర్ హిట్ గా నిలచింది… ఆ సినిమా తరువాత మళ్ళీ కొంత నిరాశ! ఆ సమయంలో మోహన్ బాబు నిర్మించి నటించిన ‘పెదరాయుడు’ అనూహ్య విజయం సాధించింది… 1995 జూన్ 15న విడుదలైన ‘పెదరాయుడు’ ముందు పోటీ చిత్రాలు నిలవలేకపోయాయి… ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ రేసు గెలవడమే కాదు ఆల్ టైమ్ హిట్ గానూ ‘పెదరాయుడు’ నిలచింది…
సినిమా థియేటర్‌లు

తమిళంలో శరత్ కుమార్ హీరోగా రూపొందిన ‘నాటామై’ మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని చూసిన రజనీకాంత్ , దానిని తెలుగులో రీమేక్ చేయమని మోహన్ బాబుకు సూచించారు. అలాగే అందులో పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ నటిస్తానని మాటిచ్చారు… అదే తీరున నటించి అలరించారు… యన్టీఆర్, ఏయన్నార్, దాసరి వంటి ప్రముఖుల సమక్షంలో ఆరంభమైన ‘పెదరాయుడు’ సాధించిన ఘనవిజయంతో మోహన్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళింది… భానుప్రియ, సౌందర్య నాయికలుగా నటించిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు… కోటి సంగీతం సమకూర్చారు… సీతారామశాస్త్రి, భువనచంద్ర, శ్రీహర్ష రాసిన పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి… ఈ నాటికీ మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలలో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగా ‘పెదరాయుడు’ నిలచే ఉంది… ఇప్పటికీ ‘పెదరాయుడు’ బుల్లితెరపై కనిపిస్తే జనం ఆసక్తిగా చూస్తూనే ఉండడం విశేషం!

ఏషియన్‌ సురేశ్‌ ద్వారా మార్గన్‌.

ఏషియన్‌ సురేశ్‌ ద్వారా మార్గన్‌.

 

నేటిధాత్రి:

 

 

 

 

 

విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్‌’. లియో జాన్‌పాల్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ నిర్మించారు. విజయ్‌ ఆంటోనీ మేనల్లుడు అజయ్‌ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నాడు.

విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మార్గన్‌’. లియో జాన్‌పాల్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ నిర్మించారు. విజయ్‌ ఆంటోనీ మేనల్లుడు అజయ్‌ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. మర్డర్‌ మిస్టరీ- క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో ‘మార్గన్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సురేశ్‌బాబును విజయ్‌ ఆంటోని కలిశారు. థ్రిల్లింగ్‌ అంశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇదని విజయ్‌ ఆంటోని తెలిపారు.

ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు.

ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు

 

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.

 

 

 

 

 

 

  • ప్రత్యేక అవార్డుకు రూ. 10 లక్షల నగదు బహుమతి
  • ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు రూ. 7, 5 లక్షలు
  • ఉత్తమ నటుడికి, ఉత్తమ నటికి చెరో రూ. 5 లక్షలు
  • నేడు గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుక

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుల విజేతలకు అందజేసే నగదు బహుమతిని భారీగా పెంచింది.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు సహా పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు.
కాగా, గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల జాబితాను ఇటీవలె ప్రకటించారు.
2014 నుంచి 2023 వరకు ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలకు కలిపి నాలుగు అవార్డులను ప్రదానం చేస్తారు.
ఇలా ప్రతి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అందజేస్తారు. 2024వ సంవత్సరానికి ప్రకటించిన అన్ని అవార్డులను కూడా బహూకరిస్తారు.
వీటితోపాటు 2024వ సంవత్సరం నుంచి రఘుపతి వెంకయ్య, బీఎన్‌ రెడ్డి, ఎన్టీఆర్‌, పైడి జైరాజ్‌, కాంతారావు, చక్రపాణి పేర్లతో ప్రత్యేక అవార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
ఈ ఆరు ప్రత్యేక అవార్డుల్లో ఒక్కో అవార్డుకు రూ.పది లక్షల చొప్పున, మూడు ఉత్తమ చిత్రాలకు వరుసగా రూ. 10, 7, 5 లక్షల చొప్పున అందజేయనుంది.
అదేవిధంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటికి రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నారు. 14 సంవత్సరాల విరామం తర్వాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సహించే సంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టడం పట్ల అవార్డుల గ్రహీతలు, సినిమా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విజేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటి గద్దర్‌ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ.

 థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ…

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.

థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో.

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
కమల్‌ క్షమాపణ చెప్పకపోతే థగ్‌లైఫ్‌ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం విచారించింది.
సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

ప్రియాంకను అనుకున్నారు రకుల్‌ను తీసుకున్నారు.

ప్రియాంకను అనుకున్నారు.. రకుల్‌ను తీసుకున్నారు

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు.

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా, విజువల్‌ వండర్‌గా ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ చాలా కాలం క్రితమే మొదలైనా గత ఏడాది నవంబర్‌ నెలలో అధికారికంగా వివరాలు వెల్లడించారు. సాయిపల్లవి సీతగా, రావణుడిగా కన్నడ హీరో యశ్‌, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణునిగా, కాజల్‌ అగర్వాల్‌ మండోదరిగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర శూర్పణఖ. రామ, రావణ యుద్ధం జరగడానికి కారణమైన ఈ పాత్రను రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పోషించనున్నారు. ఆమె కంటే ముందు ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించారో తెలుసా? పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాను. ఆమె శూర్పణఖ పాత్ర పోషిస్తే అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ’ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే తనకున్న ఇతర కమిట్‌మెంట్స్‌ వల్ల ఆ పాత్ర చేయలేనని ప్రియాంక చెప్పడంతో అప్పుడు రకుల్‌ను ఈ అవకాశం వరించింది. ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేశ్‌, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా రామాయణగాథ స్ఫూర్తితో రూపొందుతుండడం విశేషంగా పేర్కొనాలి.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే…

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా (Air india Plain) విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ (manchu lakshmi Prasanna) ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు. దీంతో ఆమె ఎలా ఉన్నారో ఆరా తీశారు అభిమానులు. మెసేజ్‌లు చేశారు.  అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ మంచు లక్ష్మి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.  ‘‘ఫ్లైట్‌ దిగిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెేసజ్‌లు వస్తూనే ఉన్నాయి. నేను, మా అమ్మాయి అదేరోజు ముంబయి నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాము. దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను.
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా ఆస్పత్రి, నివాస సముదాయం లోని ప్రజలు కొంత మంది మరణించినట్లు చెప్పారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version