లాజిక్‌ మిస్‌.. వీటికి జ‌వాబేది కుబేర‌?

Kuberaa: లాజిక్‌ మిస్‌.. వీటికి జ‌వాబేది కుబేర‌?

 

 

 

 

గత‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం కుబేరా. పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతూ అంచ‌నాల‌ను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.

నాగార్జున (nagarjuna), ధ‌నుష్ (Dhanush), ర‌ష్మిక (Rashmika mandanna) కాంబోలో జీనియ‌స్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల (Sekhar Kammula) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కి గ‌త‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం కుబేరా (Kuberaa). పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతూ అంచ‌నాల‌ను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అస‌లు ఇలాంటి సినిమాను ఎక్స్‌ప‌ర్ట్ చేయ‌లేదంటూ పలువురు ధ‌నుష్‌, నాగార్జున‌, శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఆకాశానికెత్తేశారు.

మరి కొంత‌మంది మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తూ సినిమాను సునిశితంగా విమర్శిస్తున్నారు. సినిమాలో మిస్స‌యిన లాజిక్స్ గురించి ప్రశ్నిస్తున్నారు. కొంద‌రు ఈ చిత్రం ప్ర‌స్తుత బీజేపీ పాల‌న‌ను టార్గెట్ చేసిన‌ట్లు ఉంద‌ని కూడా అనేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్ కుబేరాకి 13 ప్ర‌శ్న‌లు అంటూ త‌న సందేహాలను వ్యక్తం చేయగా… ఇప్పుడ‌వి సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వాటిని చూసిన వారు అధికులు నిజ‌మే క‌దా అని అంటుంటే.. మరికొంద‌రు సినిమాను సినిమాలానే చూడాలంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. మరి ఆ నెటిజ‌న్ ప్ర‌శ్న‌లు ఏమిటో మీరూ ఓ లుక్కేయండి..

కుబేరాకి 13 ప్ర‌శ్న‌లు

1.బంగాళాఖాతంలో ఆయిల్ ప‌డుతుంది. దాన్ని స్వాధీనం చేసుకోడానికి నీర‌జ్ అనే వ్యాపారి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కి ల‌క్ష కోట్లు లంచం ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. నీర‌జ్ ఎవ‌రు? దేశంలో ఆయ‌న్ని తెలియ‌ని వారు లేరు. ల‌క్ష మంది ఉద్యోగులున్న కంపెనీల‌కీ య‌జ‌మాని. ఆయ‌న కింద ఎంత మంది చార్టెర్డ్ అకౌంటెంట్‌లు వుంటారో , ఏ రేంజ్ ఫైనాన్స్‌ నిపుణులు వుంటారో ఊహించుకోవ‌చ్చు. ఆ రేంజ్‌కి చేరుకోవాలంటే గ‌వ‌ర్న‌మెంట్‌లో ఎంద‌రిని, ఎలా మేనేజ్ చేయాలో తెలియ‌ని అమాయ‌కుడు కాదు. అయినా కొత్త‌గా అప్పుడే ఏదో డీల్ వ‌చ్చిన‌ట్టు, తండ్రి చెప్పిన మాట‌లు విని, జైల్లో ఉన్న సీబీఐ అధికారిని , కేసు నుంచి విడిపించి మ‌రీ ల‌క్ష కోట్ల డీల్ అప్ప‌చెబుతాడు. డ‌బ్బులిస్తే అన్ని విలువ‌ల్ని వ‌దిలేసుకునే స‌మ‌స్త యంత్రాంగం చుట్టూ వుంటే, అంద‌ర్నీ వ‌దిలి, విలువ‌ల గురించి మాట్లాడే నాగార్జున‌ను తెచ్చుకుని, కొరివితో త‌ల గోక్కుంటాడా? సినిమాటిక్ లిబ‌ర్టీ అంటారా!

2.నాగార్జున విష‌యానికి వ‌ద్దాం. సీబీఐ అధికారి కావాలంటే చాలా చ‌దివి వుండాలి. అధికారం ఉన్న‌పుడు విలువ‌ల‌కి క‌ట్టుబ‌డి వుండాలంటే చాలా నైతిక శ‌క్తి కావాలి. నీర‌జ్ ఎంత శ‌క్తిమంతుడో తెలిసి కూడా , దాడి చేసి ఫైన్ క‌ట్టించాడంటే ఎంతో నిబ‌ద్ధ‌త కావాలి. ముక్కుసూటిగా ప‌నిచేస్తే ఎన్ని శ‌క్తులు త‌న‌మీద ప‌గ ప‌డ‌తాయో తెలియ‌ని అమాయకుడు కాదు. అయినా నిజాయితీగా చేసి జైలుకెళ్లాడు. కోర్టులో న్యాయం జ‌ర‌గ‌లేదు. భార్యాబిడ్డ‌ల వైపు మొగ్గి , నీర‌జ్‌కు లొంగిపోయాడు. మ‌నీల్యాండ‌రింగ్ , షెల్ కంపెనీలు, ఫైనాన్స్‌ ఎక్స్‌ఫ‌ర్ట్‌ల ప‌ని. కానీ నీర‌జ్ గొర్రెలా సీబీఐ మాజీ అధికారిని ఎంచుకున్నాడు. సినిమా లిబ‌ర్టీ ఓకే. నాగార్జున చేసిందేమంటే న‌లుగురు బిచ్చ‌గాళ్ల‌ని వెతికి ప‌ట్టుకోవ‌డం. దీనికి న‌లుగురు ఎందుకు? ఒక‌డితోనే లాగించొచ్చు. కానీ క్లైమాక్స్‌కి ఖుష్బు , ఆమె కొడుకు అవ‌స‌రం. ఇది ద‌ర్శ‌కుడి లిబ‌ర్టీ. బిచ్చ‌గాళ్ల‌ని తెచ్చి , క‌టింగ్ చేసి, గ‌డ్డాలు తీసి, కోటు వేసి, సీఈవోని చేసి రోబో అనే వాడి చేతిలో హ‌త్య చేయించ‌డం ఇదంతా ఓవ‌ర్‌గా లేదా? శేఖ‌ర్ క‌మ్ముల‌కి తెలియ‌నిది ఏమంటే డ‌బ్బున్న వాళ్లంద‌రూ డ్రైవ‌ర్ల‌ని, తోట‌మాలీలు, వాచ్‌మెన్ల‌ని బినామీలుగా పెట్టుకుంటారు. దోవ‌లో పోయే బిచ్చ‌గాళ్ల‌ని ట్రైనింగ్ చేయించ‌రు. నీ పేరు మీద క్ష‌ణాల్లో కోట్ల‌ రూపాయిలు బ్యాంక్ బ్యాలెన్స్ సృష్టించి, అమెరికా ప్ర‌యాణం చేయించ‌గ‌ల నిపుణులు అమీర్‌పేట‌లోనే ఉన్నారు. అబిడ్స్‌, కోఠిలో మామూలు వ్యాపారుల‌కి కూడా హ‌వాలా, మ‌నీ ల్యాండ‌రింగ్ తెలుసు. శేఖ‌ర్ సార్ ప‌ద్మారావున‌గ‌ర్‌లో వుండి, అదే ప్ర‌పంచం అనుకుంటున్నారు.

3.ధ‌నుష్ ఒక బిచ్చ‌గాడు. చ‌దువులేదు కానీ, తెలివి వుంది. జ్ఞాప‌క శ‌క్తి వుంది. మ‌నిషిగా విలువ‌లున్నాయి. బాల్యం ఒక గాయం. అలాంటి వాడు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసుకుంటాడు కానీ, బిచ్చ‌గాడిగా ఎందుకుంటాడు? మ‌రు జ‌న్మ‌లో బిచ్చ‌గాడిగా వుండ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని వాడు , ఇపుడు బిచ్చ‌గాడిగా ఎందుకున్నాడు? ఉన్నాడ‌నే అనుకుంటే ఎవ‌రో ముక్కూమొహం తెలియ‌ని వాళ్లు, డ‌బ్బులిస్తామ‌ని చెబితే వెళ్తాడా? సూటు బూటు వేసి, సంత‌కం చేయ‌మంటే తెలివైన వాడికి కొంచెమైనా అనుమానం రాదా? రాలేద‌నే అనుకుందాం. ఇంత‌కీ అత‌ని డ‌బ్బు ఎందుకు ట్రాన్స్‌ఫ‌ర్ కాలేదు?

4.ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే, ఓల్డ్‌మాంక్ పేరు చెప్పి ఎవ‌డైనా ప్లాట్‌లోకి వెళ్ల‌గ‌లిగే ఇంట్లో బోలెడు డ‌బ్బు, బంగారం దాచిన అధికారి ఎంత అమాయ‌కుడు? అస‌లు అత‌ని క‌థ ఏంటి?

5.బ్యాంకింగ్ అవ‌గాహ‌నే లేని ధ‌నుష్ ఒక ట్ర‌క్కు నిండా నోట్ల క‌ట్ట‌ల‌ని విల‌న్ ఇంటి ముందు ఎలా వేసాడు?

6.నంబ‌ర్ వ‌న్ బిజినెస్ టైకూన్, ఒక బిచ్చ‌గాడిని హ్యాండిల్ చేయ‌లేక బిచ్చ‌గాడిగా మారిపోతాడా?

7.ఎవ‌రో తెలియ‌ని ఖుష్బూని ర‌క్షించిన నాగార్జున ఒక సిన్సియ‌ర్ పోలీస్ అధికారి షాయాజీ షిండేని ఎందుకు కాల్చి చంపుతాడు?

8.సినిమాలో ర‌ష్మిక‌నే కొంచెం స‌హ‌జంగా వుంది. కానీ బిచ్చ‌గాడిని న‌మ్మి అన్ని రిస్క్‌లు తీసుకోవ‌డం కొంచెం అస‌హ‌జం.

9.శేఖ‌ర్ క‌మ్ముల ఒక కంగాళీ సినిమాని తీస్తే, కార‌ణాలు ఏమైతేనేం అంద‌రూ భుజాల‌కెత్తుకుంటున్నారు. నా లాంటి అజ్ఞానుల‌కే స‌మ‌స్య‌.

10.చివ‌రిగా .. శేఖ‌ర్ సార్ మీ అభిమానిగా చెబుతున్నా. మీరొక మంచి సినిమా తీయాల‌నుకుని తీయ‌లేక‌పోయారు. ఆహా, ఓహో భుజ‌కీర్తుల్ని న‌మ్మ‌కండి. అవి దేవ‌తా వ‌స్త్రాలు.

11.ధనుష్ నోట్ల క‌ట్టలు ఇచ్చి అంతిమ యాత్ర చేసినా , బండెడు నోట్ల క‌ట్ట‌లు రోడ్డు మీద కుమ్మ‌రించినా, మీడియా , సోష‌ల్ మీడియా ఏమై పోయాయి? అస‌లు ఈ సినిమా ఏ కాలం నాటిది?

12.డ‌బ్బున్న వాళ్ల‌దే న్యాయం. వాళ్లు పేద‌వాళ్ల‌తో ఆడుకుంటారు, వాడుకుంటారు. నిజ‌మే. టికెట్ రేట్ల‌ని పెంచి మీరు చేస్తున్న‌దేంటి? దోపిడీ కాకుండా వేరే ప‌దం ఏమైనా వుందా?

13.శేఖ‌ర్ క‌మ్ముల రూ.150 కోట్ల‌తో జూదం ఆడారు. మీరు మంచి అట‌గాడే కానీ ముక్క‌లు ప‌డ‌లేదు.

డ్రగ్స్‌ కేసులో నటుడు రశ్రీరామ్‌ అరెస్టు.

డ్రగ్స్‌ కేసులో నటుడు రశ్రీరామ్‌ అరెస్టు

 

 

 

 

 

డ్రగ్స్‌ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్‌ (శ్రీకాంత్‌)ను చెన్నై నార్కోటిక్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో…

డ్రగ్స్‌ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్‌ (శ్రీకాంత్‌)ను చెన్నై నార్కోటిక్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో ‘సైకోట్రాఫిక్‌’ రకం డ్రగ్‌ను తీసుకున్నట్టు తేలింది. ‘తీంగిరై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో డ్రగ్స్‌ కావాలని నటుడు శ్రీరామ్‌ కోరగా, కెనడా దేశానికి చెందిన డ్రగ్‌ ఫెడ్లర్‌ జాన్‌ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఇచ్చినట్లు ప్రదీప్‌కుమార్‌ అనే వ్యక్తి పోలీసుల వద్ద అంగీకరించాడు. దీంతో జాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి 11 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం ఉదయం నుంగంబాక్కంలోని శ్రీరాం నివాసానికి వెళ్ళి విచారించగా, డ్రగ్స్‌ తీసుకున్నట్టు అంగీకరించడంతో స్టేషన్‌కు తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ జరిపారు. ఆ తర్వాత కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళి రక్తం శాంపిల్స్‌ సేకరించి వైద్య పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసులు శ్రీరాంను అరెస్టు చేశారు. డ్రగ్స్‌ కొనుగోలు కోసం శ్రీరామ్‌ రూ.72 వేల వరకు డ్రగ్‌ ఫెడ్లర్‌కు చెల్లించినట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న కోర్టు రూం డ్రామా.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న.. కోర్టు రూం డ్రామా

 

స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

 

 

 

 

ఇటీవ‌ల ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 (Yuddhakaanda Chapter 2).

చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

అజ‌య్ రావు (Ajay Rao) హీరోగా న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమాకు ప‌వ‌న్ భ‌ట్ (Pavan Bhat) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌కాశ్ బెల‌వాడి (Prakash Belawadi), K.G.F ఫేమ్‌ అర్చ‌న జోయిస్ (Archana Jois), టీఎస్ నాగాభ‌ర‌ణ (T. S. Nagabharana) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

రెండు నెల‌ల క్రితం ఏప్రిల్18న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం క‌న్న‌డ నాట మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

సుమారు రెంఉ గంట‌ల నిడివితో గ‌త వారం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌న్న‌డ‌తో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే..

త‌న ఏడేండ్ల కూతురు రాధన్యను ఓ ఎమ్మెల్యే త‌మ్ముడు పాడు చేశాడ‌ని త‌ల్లి నివేదిత‌ కోర్టుకెళుతుంది.
అయితే అక్క‌డ నెల‌లు, సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా న్యాయం దొర‌క‌డం లేద‌ని ఆవేద‌న చెందుతూ ఓ రోజు కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే నిందితుడిని అంద‌రి ముందే గ‌న్‌తో కాల్చి చంపుతుంది.
దాంతో ఆమె జైలే పాల‌వుతుంది.
ఆమె ఒంట‌రి కావ‌డంతో కేసును వాదించ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు.
అదే స‌మ‌యంలో భ‌ర‌త్ అనే కుర్రాడు లా పూర్తి చేసి ఓ సీనియ‌ర్ అడ్వ‌కేట్ ద‌గ్గ‌ర ప్రాక్టీస్ స్టార్ట్ చేసి త‌క్కువ స‌మ‌యంలోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు.
ఈ నేప‌థ్యంలో నివేదిత దుస్తితి చూసి చ‌లించిన భ‌ర‌త్ ఆ కేసు టేక‌ప్ చేస్తాడు.
మ‌రోవైపు త‌న త‌మ్ముడిని చంపిన నివేదిత‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠిన శిక్ష వేయించాల‌ని దేశంలోనే పేరున్న ఓ పెద్ద క్రిమిన‌ల్ లాయ‌ర్ రాబ‌ర్ట్ డిసౌజాకు ఎమ్మెల్యే భారీగా డ‌బ్బు ఇచ్చి రంగంలోకి దింపుతాడు.
దీంతో పెద్ద లాయ‌ర్ కావ‌డంతో ఓట‌మి ఖాయ‌మ‌ని భ‌ర‌త్‌కు హెల్ప్ చేయ‌డానికి చాలా మంది ముందుకు రారు.

ఈ క్ర‌మంలో భ‌ర‌త్ అంత పెద్ద లాయ‌ర్‌ను ఎదుర్కొంటూ ఆ కేసును ఎలా వాదించాడు, ఇద్ద‌రి మ‌ధ్య‌ ఎలాంటి వాద‌న‌లు, ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి, ఎవ‌రు పై చేయి సాధించారు చివ‌ర‌కు ఓ యువ‌కుడిని చంపి నేరం చేసిన‌ నివేదిత‌ను బ‌య‌ట‌కు ఎలా తీసుకు వ‌చ్చాడ‌నే ఈ సినిమా క‌థ‌.

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన చిత్రాల లాగే ఈ చిత్రం ఉంటుంద‌ని ముందే తెలిసిన్న‌ప్ప‌టికీ క‌థ‌ను న‌డిపించిన విధానం భిన్నంగా ఉంటుంది.

అన్ని సినిమాల్లో జైలులో ఉన్న నిర‌ప‌రాధులను హీరో విడిపిస్తే..

ఈ చిత్రంలో మాత్రం కోర్టులో అంద‌రి ముందే నేరం చేసిన ఓ మ‌హిళ‌ను హీరో ఏ విధంగా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చాడ‌నే పాయింట్ కొత్త‌గా ఉంటుంది.

ఎలాంటి సినిమాటిక్ లిబ‌రిటీస్ తీసుకున్నార‌నే మాట రాకుండా చ‌ట్టంలో ఉన్న పాయింట్ల‌ను బేస్ చేసుకుని ఈ స్టోరినీ అద్భుతంగా తీర్చిదిద్దారు.

సినిమా మొద‌ట్లో హీరో అన‌వ‌స‌ర‌ ప్రేమ వ్య‌వ‌హారం త‌ప్పితే సినిమా అంతా కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

ముఖ్యంగా సెకండాఫ్ ఫైన‌ల్ హియ‌రింగ్ స‌మ‌యంలో హీరో చెప్పే డైలాగ్స్ గూస్‌బ‌మ్స్ తీసుకు వ‌చ్చేలా ఉంటాయి.

అందుకు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాల‌ను వాడుకున్న విధానం, ఏళ్ల‌కు ఏళ్లు కేసులు పెండింగ్, స‌రైన స‌మ‌యానికి న్యాయం ల‌భించ‌క‌పోవ‌డం అనే పాయింట్లు చ‌ర్చించిన విధానం ఆక‌ట్టుకుంటుంది.

కుటుంబంతో క‌లిసి మంచి సినిమా చూడాల‌నుకునే వారు ఈ చిత్రాన్ని ఎలాంటి జంకుబొంకు లేకుండా హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసేయ‌వ‌చ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో అందుబాటులో ఉంది.

మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3.

మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3

 

దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే మాతృక (మలయాళ వెర్షన్‌) ఆధారంగా తెలుగు హిందీలో రీమేక్‌ అయిన రెండు భాగాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇటీవలె…

 

 

 

 

‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. ఇప్పటికే మాతృక (మలయాళ వెర్షన్‌) ఆధారంగా తెలుగు, హిందీలో రీమేక్‌ అయిన రెండు భాగాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇటీవలె ‘దృశ్యం 3’ సిద్ధమవుతోందని ప్రకటించారు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌. అప్పటినుంచి ఈ సినిమా గురించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. మలయాళంలో తెరకెక్కనున్న పార్ట్‌ 3 కథ వేరు.. హిందీలో రూపొందే చిత్ర కథాంశం వేరు.. అని. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 3’ గురించి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. ‘‘దృశ్యం 3’ని ఒకే కథతో తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తాం. మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరపడం కుదరకపోవచ్చు.. కానీ, మూడు భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేస్తాం. ప్రస్తుతం స్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. పూర్తయ్యాక హిందీ టీమ్‌కు అందిస్తాం.. అక్కడ పరిస్థితులకు తగినట్లుగా మేకర్స్‌ మార్పులు చేస్తారు’’ అని చెప్పారు. తెలుగులో పార్ట్‌ 3లో వెంకటేశ్‌ నటిస్తున్నారా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా, తొలి రెండు భాగాల్లో మలయాళ వెర్షన్‌లో కథానాయకుడిగా మోహన్‌లాల్‌, తెలుగులో వెంకటేశ్‌, హిందీలో అజయ్‌ దేవగణ్‌ నటించారు. మలయాళంలో రెండు భాగాలకూ జీతూ జోసెఫ్‌ దర్శకుడు. తెలుగులో, హిందీలో దర్శకులు మారారు.

ఓటీటీలో ప్రియాంక మూవీ… ఎప్పుడంటే…

ఓటీటీలో ప్రియాంక మూవీ… ఎప్పుడంటే…

సినిమా థియేటర్‌లు

 

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న అమెరికన్ యాక్షన్ కామెడీ మూవీ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

 

 

 

 

 

 

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు గోబ్లల్ స్టార్. తెలుగులో మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నా… ఆమె తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన యాక్షన్ సినిమాలకూ దూరం కాలేదు. అయితే అవకాశం చిక్కితే తన చిత్రాలు, వెబ్ సీరిస్ ద్వారా వినోదాన్ని పంచడానికీ రెడీ అంటోంది. అలాంటి ఓ వినోదాత్మక చిత్రమే ‘హెడ్స్ ఆఫ్‌ స్టేట్’ (Heads of State).

సినిమా థియేటర్‌లు

గతంలో ‘బేవాచ్, క్వాంటికో, సిటాడెల్’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసిన ప్రియాంక ఇప్పుడు యాక్షన్ కామెడీ మూవీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’లో సీనియర్ ఎం.ఐ.6 ఏజెంట్ గా నటించింది. ఆమెతో పాటు జాన్ సీనా, ఇద్రిస్ ఎల్బా ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు. అలానే జాక్ స్వాయిడ్, స్టీఫెన్ రూట్, కార్లా గుగినో, సారనైల్స్ కీలక పాత్రలు పోషించారు. జూలై 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రియాంక పాల్గొంటోంది. అమెరికన్ ప్రెసిడెంట్ (జానా సీనా), బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ (ఇంద్రిస్) ఒకసారి విమానంలో ప్రయాణిస్తుంటారు. వీళ్ళిద్దరిపై శత్రువులు దాడి చేయడంతో వీరి విమానం ఓ ప్రదేశంలో లాండ్ అవుతుంది. అక్కడకూ చేరుకుని శత్రువులు వీరిని హతమార్చడానికి ప్రయత్నిస్తే సీనియర్ ఏజెంట్ నోయెల్ బిస్సిట్ (ప్రియాంక చోప్రా) వీరిని ఎలా కాపాడిందనేదే ఈ మూవీ మెయిన్ థీమ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వీక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి జూలై 2న స్ట్రీమింగ్ అయ్యే ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఏ తీరిన ఆకట్టుకుంటుందో చూడాలి.

నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌.

నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ భారీ అంచనాల మ‌ధ్య ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్‌ కుమార్‌ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషించగా, మోహన్‌ బాబు, ప్రభాస్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచారు.

ఇప్ప‌టికే అమెరికా, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లోప్ర‌త్యేక ఈవెంట్లు సైతం నిర్వ‌హించి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.

ఇదిలాఉంటే.. ఈ సినిమా ప్రారంభంలోనే అప్ప‌టివ‌ర‌కు క‌థానాయిక‌గా ఉన్న‌ నుపుర్ స‌న‌న్ సినిమా నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.

ఆ త‌ర్వాత త‌మిళ బ్యూటీ ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan)ను ఆ స్థానంలోకి వ‌చ్చి చేర‌డం సినిమా పూర్తి చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.
ఆపై ఈ ముద్దుగుమ్మ‌పై చిత్రీక‌రించిన పాట‌లు, స‌న్నివేశాల‌ను కాల‌క్ర‌మంలో మేక‌ర్స్ రిలీజ్ చేస్తూ సినిమా జ‌నాల నోళ్ల‌ల్లో నానేలా చేశారు.
అయితే ఈ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో సినిమా టీం అంతా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల్లో బిజీగా గ‌డుపుతుండ‌గా వాటిళ్లో ఎక్క‌డా ఈ ముద్దుగుమ్మ క‌నిపించ‌క పోవ‌డంపై తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
కేర‌ళ‌లో జ‌రిగిన ప్రొగ్రాంలో మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ నాట శివ రాజ్‌కుమార్ వంటి మ‌హా న‌టులు ఈ మూవీ ఈవెంట్‌ల‌లో పాల్గొనగా హీరోయిన్ అక్క‌డా కూడా ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు.
అప్పుడెప్పుడో ఏడాది క్రితం సినిమా టీజ‌ర్ ఈవెంట్‌లో క‌నిపించిన ఈ చిన్న‌ది మ‌ళ్లీ ఈ చిత్రం విష‌య‌మై ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించింది లేదు.

అఖ‌రుకు.. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన మెయిన్ ఈవెంట్‌లోనూ ప్రీతి క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాశం అవుతుంది.

క‌న్న‌ప్ప సినిమాలో తిన్న‌డు ప్రేయ‌సిగా, భార్య‌గా కీల‌క పాత్ర పోషించిన న‌టి ఈవెంట్ల‌లో ఎందుకు క‌నిపించ‌డం లేద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతుంది.

అంతేకాదు ఇప్ప‌టికే సినిమాలో విష్ణు, ప్రీతి ముకుంద‌న్‌ల‌పై చిత్రీక‌రించిన పాట బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు అందులో హీరోయిన్‌కు వేసిన బ‌ట్ట‌లు, పాట చిత్రీక‌రించిన విధానం తీవ్ర విమ‌ర్శ‌లకు దారి తీసింది.

ఈ సినిమాలో ఇంత రొమాంటిక్ సాంగ్ ఏంటనే కామెంట్లు వ‌చ్చాయి.

ఇది అస‌లు భ‌క్తి చిత్ర‌మా లేక ర‌క్తి మూవీనా అనే వ‌ర‌కు వెళ్లింది.

కాగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన మేకింగ్ వీడియోలోనూ ప్ర‌ధానంగా హీరోయిన్ ప్రీతి న‌టించిన యుద్దం, ఎమోష‌న‌ల్, రొమాంటిక్ స‌న్నివేశాలే అధికంగా చూపించ‌డం విశేషం.

అలాంటిది పాన్ ఇండియాగా విడుద‌ల‌వుతున్న ఇంత‌ పెద్ద సినిమాలో కీ రోల్ చేసిన న‌టి ఇ్ప‌పుడు ఎక్క‌డా క‌నిపించ‌క పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఈవెంట్‌కు చిన్న క్యారెక్ట‌ర్ చేసిన సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల రాగా హీరోయిన్ ఎందుకు రాలేద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

మూవీ యూనిట్ ప్రీతి (Preity Mukhundhan)ని లెక్క‌లోకి తీసుకోలేదా, ఈవెంట్ల‌కు పిల‌వ‌డం మ‌రిచారా, కావాల‌నే దూరం పెట్టారా లేక త‌నే రానందా అనే ప్ర‌శ్న‌లు చిత్ర బృందానికి ఎదురౌతున్నాయి.

ఈవెంట్‌లో సైతం ప్రీతి గ‌రించి, ఆమె పాత్ర‌, న‌ట‌న‌ గురించి మాట్లాడిన‌ట్లుగా కూడా లేదు.

అఖ‌ర‌కు బాలీవుడ్ స్టార్‌ అక్ష‌య్ కుమార్ సైతం క‌న్న‌ప్ప టీంతో క‌లిసి ఇంట‌ర్వ్యులు ఇచ్చి సినిమా ప్ర‌చారంలో పాల్గొంటు త‌న వంతు సాయం అందించారు.

అలాంటిది క‌న్న‌ప్ప సినిమాలో మెయిన్ పిల్ల‌ర్ల‌లో ఒక‌రైన‌ హీరోయిన్ ఎందుకు ఈవెంట్లు, ఇంట‌ర్వ్యూల‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.

సినిమా విడుద‌ల‌కు మ‌రొ నాలుగు రోజులే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా ప్రీతి ముకుంద‌న్ మీడియా ముందుకు వ‌స్తుందేమోన‌ని బావిస్తున్నారు.

8 వసంతాలు’ ఎలా ఉందంటే.

8 Vasantalu Review: ‘8 వసంతాలు’ ఎలా ఉందంటే

 

 

 

 

 

 

 

‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.

 

 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది?

ఫణీంద్ర నర్సెట్టి హిట్‌ అందుకున్నాడా?

రివ్యూలో చూద్దాం.

సినిమా రివ్యూ: 8 వసంతాలు (8 Vasantalu Movie Review)
విడుదల తేది: 20–6–2025

‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.

 

అనంతిక సనీల్‌కుమార్‌(ananthika sanilkumar), రవి దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి కీలక పాత్రధారులు.

చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలకు పట్టం కడుతున్న మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రమిది.

 

ఫస్ట్‌ లుక్‌ నుంచి ప్రచార చిత్రాలు  ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా వైపు తిప్పుకొన్నాయి.

 

నిర్మాణ సంస్థకు ఉన్న క్రేజ్‌తో సినిమాకు బజ్‌ పెరిగింది.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది?

ఫణీంద్ర నర్సెట్టి హిట్‌ అందుకున్నాడా?

రివ్యూలో చూద్దాం.

కథ : (8 Vasantalu Story)
శుద్థి అయోధ్య (అనంతిక సనీల్‌ కుమార్‌) స్ట్రాంగ్‌ లేడీ.

 

చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తన అనుభవాల సమాహారంగా పదిహేడేళ్లకే భావోద్వేగభరితను ఓ పుస్తకంగా రాస్తుంది.

అది చదివి ఎంతోమంది ఆమెకు అభిమానులుగా మారతారు. ఆమెలో చక్కని రచయిత్రే కాదు..

 

తల్లి ప్రేమ, బాధ్యత, మార్షల్‌ ఆర్ట్స్‌ గురువు అంటే గౌరవం, స్నేహితుల పట్ల కరుణ ఉంచే స్వభావం కలది.

 

మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉన్న అమ్మాయి శుద్ధి.

ఓ రోజు మార్షల్‌ డోజోలో వరుణ్‌ (హను రెడ్డి) పరిచయం అవుతాడు.

చూసిందే తడవు..

ఆమె ప్రేమకోసం తపిస్తూ వెంటపడతాడు.

కొంత సమయంలో తర్వాత ఆమె తనపై ప్రేమను పెంచుకుని చెప్పేలోపు వరుణ్‌ బర్క్‌లీలో తన గోల్‌ సాధించడం కోసం ఆమెను వదిలించుకుని విదేశాలకు వెళ్లిపోతాడు.

 

పగిలిన గుండెతో ఆమె మరో పుస్తకం రాస్తుంది.

తదుపరి ఊటీలో తెలుగు రచయిత సంజయ్‌ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు.

అతనిని శుద్ధి ప్రేమిస్తుంది.

తల్లికి చెబుదామనుకునేలోపు తల్లి ఆరోగ్యం బాగోకపోవడం, ఎస్టేట్స్‌ చూసుకునే బాధ్యత మీద పడటంతో తన ప్రేమ సంగతి తల్లికి చెప్పలేకపోతుంది.

 

తల్లి ఉన్న పరిస్థితిని బట్టి తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది.

సంజయ్‌ ఆమె ప్రేమను గెలిచాడా?

8 వసంతాలకు, సంజయ్‌కు సంబంధం ఏంటి?

అన్నది కథ.

  

‘మను’, మధురం వంటి చిత్రాల దర్శకుడి నుంచి వచ్చిన ప్రేమకథ ఇది.

గతంలో ఆయన తీసిన సినిమాల రిజల్ట్‌ బాధ పెట్టి ఉండొచ్చు.

ఆ కసితోనే 8 వసంతాలు చిత్రాన్ని తీసినట్లు సినిమా ప్రారంభంలో అనిపిస్తుంది.

2013 నుంచి 2020 మధ్యలో జరిగే ఓ సున్నిత ప్రేమకథ ఇది.

 

స్ట్రాంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ లేడీకి జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల నేపథ్యంలో ఓ ప్రేమకథగా మలిచారు దర్శకుడు.

 

సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకూ ఫ్లో బావుంది.

అయితే అక్కడక్కడా కాస్త సాగదీతగా ఉన్నా..

శుద్ధి పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ సాగదీత అనేది గుర్తుకు రాదు.

దర్శకుడు పూర్తిగా కవితాత్మక కథ తెరపై చూపించాలనుకున్నాడు.

ఆ తరుణంలో అతనిలోని రచయిత దర్శకుడిని డామినేట్‌ చేసిన భావన కలుగుతుంది.

మాటలు బాగా రాసుకున్నాడు అయితే తన రాతతో కథను మించి కవిత్వం పెరిగింది.

ప్రాసల కోసం తపన కనిపించింది.

కొన్ని సందర్భాల్లో డైలాగ్‌ నలిగిపోయింది.

దాని వల్ల క్యారెక్టర్స్‌ మీద ఉన్న ఎఫెక్ట్‌ తగ్గిందనిపిస్తుంది.

తండ్రి మరణం, ఆ తర్వాతి సంఘటనలు శుద్ధికు రైటర్‌గా జన్మ ఇచ్చింది.

వరుణ్‌తో లవ్‌ ట్రాక్‌ బావుంది.

ఆమె ప్రేమను చెప్పాలనుకునే లోపు అతను విడిచివెళ్లిపోయాడు.

వరుణ్‌ క్యారెక్టర్‌ ఎంట్రీ, అతని రన్‌ చూస్తే నెగటివ్‌ అని గెస్‌ చేసేలా ఉంది.

ఇంటర్వెల్‌ వరకూ సినిమా ఒకలా ఉంటే..

అక్కడి మరోలా ఉంది.

తనని వదిలించుకుని వెళ్లున్న వరుణ్‌కి వర్షంలో నిలబడి చెప్పే డైలాగ్‌లో ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తాయి.

‘మనిషికి మనిషి దూరంగా ఉన్నా..

దగ్గరగా ఉన్నా డిగ్నిటీ మాత్రం మారకూడదు’ అంటూ తల్లి గురించి చెప్పే డైలాగ్‌లు,


‘నేను వద్దు అనుకున్నానంటే నేను వేసుకున్న దుస్తులు  పొరపాటున గాలి వల్ల కూడా నీ వైపు రావు. అంత స్ట్రాంగ్‌ నేను’

 

అంటూ మహిళల్ని మహారాణిలా పోలుస్తూ రాసిన డైలాగులు పేలాయి. ఆ డైలాగ్‌లు చప్పట్లు కొట్టించాయి.

తర్వాత ఇంటర్వెల్‌..

మార్షల్‌ ఆర్ట్స్‌ గురువు మరణం, అస్తికలు కలపడానికి కాశీకి వెళ్తే అక్కడ చేదు అనుభవం, సంజయ్‌ ఎంట్రీ, తల్లి అనారోగ్యం ఇవన్నీ పార్టుపార్టులుగా కథను, రన్నింగ్‌ ఫ్లోన్‌ డల్‌ చేసేశాయి. కాశీలో శుద్ధి తీసిన యాక్షన్‌ సీన్‌ బావుంది.

కానీ అంత యాక్షన్‌ పార్ట్‌ అవసరం లేదేమో అనిపిస్తుంది.

అమ్మాయి ఎంత స్ట్రాంగ్‌ అయినా లోపల సున్నితత్వం అనేది ఒకటి ఉంటుంది.

అలాంటి అమ్మాయి గుండెకు ప్రేమ పేరుతో బలమైన గాయమైనప్పుడు మళ్ళీ ప్రేమలో పడాలంటే ఎంత ఆలోచించాలి?

ఎంత బలమైన సిచ్చువేషన్‌ క్రియేట్‌ చేయాలి.

కానీ ఇక్కడ దర్శకుడు దానిని మిస్‌ చేశాడు.

 ఓ వేశ్య కథకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు పాఠకులలో ఆశ నింపాలని చూసిన ఓ రచయితను చూడగానే మనసిచ్చేస్తుంది శుద్ధి.

రెండో విజిట్‌కే ప్రేమమైకంలో పడుతుంది. అది సహజంగా లేదు.

నమ్మసఖ్యంగా లేదు.

రచయిత రాసిన మాటలు ప్రేక్షకుడి మదిలో రిజిస్టర్‌ అయ్యేలా రాయాలి, కానీ రిజిస్టర్‌ అవ్వడం కోసమే మాటలు రాయకూడదు.

కానీ దర్శకుడు ఇక్కడ అదే చేశాడు.

ఓ బుక్‌ స్టోర్‌లో మా రోజుల్లో చలంకు అమ్మాయిల్లో ఇంత క్రేజ్‌ ఉండేది..

ఇప్పుడు ఈ అబ్బాయికి’ అని ఇద్దరు మహిళలు మాట్లాడుకోవడం, ఓ సందర్భంలో  ప్రేమికుడిని చెరకు తోటలో పడిన ఏనుగుతో పోల్చారు’ అని జనాలు యాక్సెప్ట్‌ చేసేలా లేవు.

 

కొన్ని సందర్భాల్లో పాత్రలు తమ వయసుకు మించి మాట్లాడుతున్న భావన కలుగుతుంది.

 

నటీనటులు పనితీరు..

 శుద్థి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్‌ కుమార్‌ అద్భుతంగా నటించింది.

హవభావాలు అద్భుతం. ప్రేక్షకుడి కన్ను తిప్పుకోనివ్వకుండా ఆమె నటన ఉంది.

ప్రతి సీన్‌లోను మెప్పించింది. ఒకటి రెండు సన్నివేశాల్లో ఎమోషన్‌ క్యారీ చేయలేకపోయిందనిపించింది.

పాత్ర పరంగా ఆమె ఈ సినిమాకు బిగ్‌ ఎసెట్‌. హను రెడ్డి వరుణ్‌ పాత్రకు న్యాయం చేశాడు.

అనంతిక, హనురెడ్డి పెయిర్‌ తెరపై బావుంది.

ఇద్దరి మధ్య యాక్టింగ్‌ కెమిస్ట్రీ బావుంది.

సెకెండాఫ్‌లో వచ్చిన రవి దుగ్గిరాల నటనలో ఇంకా బాలుడే.

ఇంప్రూవ్‌ కావాలి.

శుద్ధి స్నేహితుడి కన్నా పసునూరి కార్తిక్‌ పాత్రకు న్యాయం చేశాడు.

మిగతా నటీనటుల్లో గుర్తు పెట్టుకునేవారు ఎవరూ లేదు.

తమ పరిధి మేరకు యాక్ట్‌ చేశారు.  

దర్శకుడికి మంచి టీమ్‌ కుదిరింది.

సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాధ్‌రెడ్డి విజువల్‌ పరంగా ఎక్కడా పేరు పెట్టకుండా ప్రతీ సీన్‌ను అందంగా క్యాప్చర్‌ చేశారు.

అలాగే సినిమాకు మ్యూజిక్‌ ఎసెట్‌.

హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ చక్కని పాటలు, ఆర్‌ఆర్‌ అందించారు.

సాహిత్యం బావుంది.

ఎడిటర్‌ శశాంక్ మాలి సెకెండాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది.

దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమాను బాగానే గ్రాండ్‌గా తీశారు.

నిర్మాతలు ఖర్చు తెరపై కనిపించింది.

రచనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమా మధ్యలో డ్రాప్‌ అయింది.

ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ అద్భుతం అనేలా తీశారు.

ఆ రెండు సీన్స్‌ చాలు సినిమాకు హిట్టుకు అనుకున్నారో ఏమో?

ఎక్కువ దృష్టి అక్కడే పెట్టి మిగిలినది సోసోగా కానిచ్చారు.

కానీ ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేవు.

పొయిటిక్‌ లవ్‌స్టోరీగా తీసే ప్రయత్నం చేశారు కాబట్టి కామెడీకి ఎక్కడా చోటు ఇవ్వలేదు.

8 ఏళ్ల ప్రేమకథను దర్శకుడు సున్నితంగా చూపించారు కానీ..

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు.

సింపుల్‌, కూల్‌ లవ్‌స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

కమర్షియల్‌ యాక్షన్‌ హంగామా కోరుకునే ప్రేక్షకుల నుంచి ఆదరణ తక్కువే ఉంటుంది.

లేటెస్ట్‌ ఇంటెన్స్ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌.

స‌డ‌న్‌గా ఓటీటీకి.. లేటెస్ట్‌ ఇంటెన్స్ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌

 

 

 

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఓ హ‌ర్ర‌ర్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రం ప‌క్షం రోజుల‌కే ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి షాకిచ్చింది

నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) హీరోగా వాస్త‌వ‌ ‘హ‌ర్ర‌ర్’ ఘ‌ట‌న‌ల‌తో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన‌ చిత్రం ‘ఘటికాచలం’ (Ghatikachalam).

అమర్ కామెపల్లి (Amar Kamepalli) దర్శకత్వం వహించగా ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి  కీలక పాత్రల్లో న‌టించారు.

 

ఎం.సి రాజు నిర్మాత.

 మే31న‌ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప‌ట్ప‌టికీ ప్ర‌చార లోపం వ‌ళ్ల జ‌నాల‌కు చేర‌లేక పోయింది.

 

బేబీ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను నిర్మించిన ఎస్ కేఎన్ మారుతితో క‌లిసి

ఈ సినిమాను రిలీజ్ చేయ‌డం విశేషం.

అయితే ఇప్పుడీ చిత్రం ప‌క్షం రోజుల‌కే ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు వ‌చ్చి షాకిచ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే..

త‌న తండ్రి కోరిక మేర‌కు మెడిస‌న్ చేస్తున్న కౌశిక్ ఇంట్రొవ‌ర్ట్‌.
బాగా పిరికిత‌నం, అంత‌కుమించి భ‌య‌స్తుడు కావ‌డంతో ఎవ‌రు స్నేహం చేయ‌రు. పైగా హేళ‌న చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు.
అయితే కౌశిక్ త‌న క్లాస్‌మేట్‌ను ల‌వ్ చేస్తుంటాడు గానీ త‌ను వేరే అత‌నితో ప్రేమ‌లో ఉంటుంది.
అయితే త‌న ప‌రిస్థితిని, త‌న పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ మాన‌సిక సంఘ‌ర్ష‌ణ ప‌డుతుంటాడు.
ఏ శ‌క్తులు వెంటాడుతున్నాయ‌ని ఫీల్ అవుతుంటాడు.
అదే స‌మ‌యంలో అప్ప‌టికే చ‌నిపోయిన ఘ‌టికాచ‌లం అనే వ్య‌క్తి వాయిస్ వినిపిస్తూ కౌశిక్‌ను కంట్రోల్ చేస్తుంటుంది.
ఈ నేప‌థ్యంలో హీరో ఆ స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ్డాడు, ఇంత‌కు త‌న‌ను వెంబ‌డించేవి, ఆత్మ‌ల‌, ఇంఏమైనా ఉన్నాయి, ఘటికాచ‌లం ఎవ‌రు అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

 

నిర్మాత రాజు నిజ జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల అధారంగా రెడీ చేసుకున్న‌క‌థ‌తో సైక‌లాజిక‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన

 

ఈ సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు ఓ ఢిప‌రెంట్ చిత్రం చూస్తున్నామ‌నే ఫీల్‌ ఇస్తుంది.

 

అక్క‌డ‌క్క‌డ లాగ్ ఉన్న‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులు పిల్ల‌లతో స‌రిగ్గా లేక‌పోతే ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌నే అంశంతో మంచి సోష‌ల్ మెసేజ్ అందించారు.

హ‌ర్ర‌ర్‌, సైక‌లాజిక‌ల్ సినిన‌మాల‌ను ఇష్ట‌ప‌డేవారు ఒక‌సారి ఈ మూవీని చూడ‌వ‌చ్చు.

 

ఇప్పుడీ ఘటికాచలం’ (Ghatikachalam).

 

సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో క‌లిసి చూడ‌వ‌చ్చు.

మ‌రో సినిమా.. లైన్లో పెట్టిన సూప‌ర్‌స్టార్‌!

మ‌రో సినిమా.. లైన్లో పెట్టిన సూప‌ర్‌స్టార్‌!

 

 

 

కుర్ర హీరోలను మించి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.

కుర్ర హీరోలను మించి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ఇప్ప‌టికే లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన కూలీ ఆగ‌ష్టులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా నెల్స్ డైరెక్ష‌న్‌లో జైల‌ర్2 షూటింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండ‌గానే తాజాగా మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు. త‌మిళ ఆగ్ర హీరోలు అజిత్‌తో తునీవు, వాలిమై, పింక్ రిమేక్ సినిమాల‌తో పాటు ప్ర‌స్తుతం విజ‌య్‌తో జ‌న నాయ‌గ‌న్ సినిమ రూపొందిస్తున్న హెచ్ వినోద్ (H. Vinoth) ద‌ర్శ‌క‌త్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తన తదుపరి చిత్రం చేయనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌.. యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలకానుంది. అలాగే, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లో ‘జైలర్‌’ వంటి మెగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీకి సీక్వెల్‌గా రూపొందే ‘జైలర్‌-2’లో రజనీకాంత్‌ నటిస్తున్నారు.

అదేవిధంగా హెచ్‌.వినోద్‌ కూడా అగ్రహీరో విజయ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రజనీ – హెచ్‌.వినోద్‌ కలిసి పనిచేయనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ విషయంపై రజనీతో హెచ్‌.వినోద్‌ రెండుసార్లు కలిసి చర్చించడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలాఉంటే స‌రిపోదా శ‌నివారం వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అందించిన వివేక్ అత్రేయ సైతం ర‌జ‌నీతో సినిమా కోసం చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

ముప్పై ఐదేళ్ళ నాటి కథతో…

ముప్పై ఐదేళ్ళ నాటి కథతో…

 

 

 

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’.

 

సుహాస్ ప్రాధాన్యమున్న పాత్ర పోషించిన ఈ సినిమా జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh), సుహాస్ (Suhas) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). బాబు మోహన్, శ్రతు, తాళ్ళూరి రామేశ్వరి ఇందులో కీలక పాత్రలు పోసించారు.

అని ఐ.వి.శశి దర్శకత్వంలో ఈ సినిమా రాధికా లావు (Radhika Lavu) నిర్మించారు.

వసంత్ మరింగంటి ఈ మూవీకి రచన చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పుకప్పురంబు’ మూవీని వివిధ భాషల్లో ప్రైమ్ వీడియో (Prime Video) జూలై 4న స్ట్రీమింగ్ చేయబోతోంది.

తాజాగా ‘ఉప్పుకప్పురంబు’ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు సుహాస్, కీర్తి సురేశ్‌ కూడా పాల్గొన్నారు.
చిట్టి జయపురం అనే చిన్న పల్లెటూరిలో జరిగే కథ ఇది.
ఆవూరికి గ్రామాధికారిగా అపూర్వ (కీర్తి సురేశ్‌) ఎంపిక అవుతోంది.
అయితే ఓ మహిళ ఆ పదవిని చేపట్టడాన్ని ఊరిలో కొందరు సహించలేకుండా ఉంటారు.
ఆమెను ఎలాగైనా ఇరకాటాన పెట్టాలనుకుంటారు.
ఊరి శ్మశానంలో మనుషులను పూడ్చడానికి చోటు లేని పరిస్థితి ఏర్పడుతుంది.
అలాంటి సమయంలో ఏం చేయాలో పాలు పోక ఆమె కాటికాపరి అయిన చిన్న (సుహాస్) సహాయం కోరుతుంది.
శ్మశానంలో స్లాట్ బుక్ చేసుకోవడానికి లక్కీ డ్రా తీయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
ఈ నేపథ్యంలో వ్యంగాత్మకంగా ఈ మూవీ సాగుతుంది.

‘ఉప్పుకప్పురంబు’లో తాను పోషించిన పాత్ర గత చిత్రాలకు ఎంతో భిన్నంగా ఉంటుందని, అవగాహనలేని మహిళ పాత్రే అయినా ఆమె ఆదర్శాన్ని పాటించే విషయంలో దృఢంగా ఉంటుందని కీర్తి సురేశ్‌ తెలిపింది.

గ్రామీణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన

ఈ సినిమాలో చక్కని హాస్యానికి చోటు దక్కిందని ఆమె అన్నారు.

ఇది సందేశం ఇచ్చే చిత్రం కాదని, గ్రామీణ జీవితానికి అద్దం పట్టే సినిమా అని సుహాస్ అన్నారు.

అక్కడ మున్నా భయ్యా.. ఇక్కడ రాంబుజ్జి.

అక్కడ మున్నా భయ్యా.. ఇక్కడ రాంబుజ్జి

 

 

 

 

 

‘పెద్ది’ సినిమాలో ఓ కీలక పాత్రలో ఓటిటి సెన్సేషన్‌ మీర్జాపూర్‌ సిరీస్‌ ఫేమ్‌ దివ్యేందు శర్మ (మున్నా భయ్యా క్యారెక్టర్‌ ఫేం – divyenndu) నటిస్తున్నారు. గురువారం మున్నా భయ్యా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

గ్లోబర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan), జాన్వీ కపూర్‌ 9janhvi kapoor) జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi) బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో ఓటిటి సెన్సేషన్‌ మీర్జాపూర్‌ సిరీస్‌ ఫేమ్‌ మున్నా భయ్యా క్యారెక్టర్‌ ఫేం దివ్యేందు శర్మ (divyenndu) నటిస్తున్నారు. గురువారం మున్నా భయ్యా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇందులో తాను క్రికెట్‌ బాల్‌ పట్టుకొని మంచి మాస్‌ రగ్‌డ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇందులో ఆయన రాంబుజ్జి అనే పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. వృద్థి సినిమాస్‌ సంస్థ నిరిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.  

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్.

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్

 

 

 

 

మోహన్ బాబు, విష్ణు, అతని పిల్లలు కలిసి నటించిన సినిమా ‘కన్నప్ప’.

 

ఆ రకంగా మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటీనటులను డైరెక్ట్ చేసే ఛాన్స్ ముఖేష్ కుమార్ సింగ్ కు లభించింది.

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రాబోతోంది.

 

అందులో మోహన్ బాబు (Mohan babu) తో పాటు మోహన్ లాల్ (Mohan Lal), శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ కీలక పాత్రలను పోషించారు.

 

ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన

 

ఈ సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాతో పాటు కొడుకు అవ్రామ్ సైతం చిన్నప్పటి తిన్నడుగా తెర మీద మెరిశాడు.

‘కన్నప్ప’ సినిమాలో విష్ణు తిన్నడు పాత్రను పోషించాడు. గూడెంలోని మూఢాచారాల కారణంగా దేవుడంటే ఇష్టం లేని తిన్నడు…

 

చివరకు శివయ్యకు ఎలా దాసోహమయ్యాడు…

తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి ఎలా సిద్థమయ్యాడు అనేదే ‘కన్నప్ప’ చిత్రం.

ఇందులో చిన్నప్పటి తిన్నడుగా అవ్రామ్ నటించాడు.

అతని మీద కూడా కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ చిత్రీకరించాడు.

మోహన్ బాబు, విష్ణు, అతని కుమార్తెలు, కుమారుడు ఇందులో యాక్ట్ చేయడంతో మొత్తం మూడు తరాలను కవర్ చేసినట్టు అయ్యింది.

ఇదో రేర్ ఫీట్.

ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూనే విష్ణు…

తాజాగా అవ్రామ్ షూటింగ్ సమయంలో చేసిన చిలిపి పనులను, అతని పై చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను ఓ మేకింగ్ వీడియోగా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు.

అవ్రామ్ సెట్‌లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం…

ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు.

ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.

ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు..

నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం.

నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను.

 

అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైల‌ర్.

విరాటపాలెం.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైల‌ర్

 

 

 

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్ద‌మ‌వుతోంది.

చాలా రోజుల త‌ర్వాత స్ట్రెయిట్ తెలుగులో ఓ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. అదీ కూడా అరుదుగా వ‌చ్చే సూపర్ నేచురల్ థ్రిల్లర్ జాన‌ర్‌లో వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ను అందించిన మేక‌ర్స్ ఈ సిరీస్‌ను రూపొందించ‌గా తాజాగా దీని ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

గ‌తంలో డిస్నీలో వ‌చ్చిన మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru), చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వ‌హించారు. జూన్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది.

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా.

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా

 

 

 

తమిళ అనువాద చిత్రం ‘పాపా’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు.

 

తమిళంలో చక్కని విజయాన్ని సాధించిన ‘దా దా’ (Dada) చిత్రాన్ని తెలుగులో ‘పా పా’ (Paapa) పేరుతో డబ్ చేసి గత శుక్రవారం విడుదల చేశారు నిర్మాత నీరజ కోట (Neeraja Kota). జె. కె. ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ‘పా పా’ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలలో 236 థియేటర్లలో విడుదల చేశారు. విడుదలైన అన్ని కేంద్రాల నుండి మూవీకి పాజిటివ్ టాక్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తో మూవీ ప్రదర్శితమౌతున్న సంధ్య థియేటర్లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

‘పా… పా’ గురించి నీరజ కోన మాట్లాడుతూ, ‘మేం చిత్ర సీమలోకి ఈ సినిమాతోనే అడుగుపెట్టాం. కవిన్ (Kavin), అపర్ణాదాస్ (Aparna Das) జంటగా నటించిన ఈ సినిమాలో భాగ్యరాజా, వీటీవీ గణేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ ఫీల్ గుడ్ మూవీ తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు వారూ ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో డబ్ చేశాం. మా నమ్మకం వమ్ము కాలేదు. ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. గణేశ్‌ కె బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో చూసిన వారు స్ట్రయిట్ మూవీ చూసిన అనుభూతి కలుగుతోందని చెప్పడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

కెవిన్, అపర్ణా దాస్ పాత్రల మధ్య కెమిస్ట్రీ, కాన్ ఫ్లిక్ట్ బాగా వర్కౌట్ అయ్యిందని ప్రేక్షకులు చెబుతున్నారు’ అని అన్నారు. ‘పా… పా…’ మూవీ విజయం అందించిన స్ఫూర్తితో త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించాలనుకుంటున్నామని ఆమె అన్నారు. జెన్ మార్టిన్ సంగీతానికి, ఎలిల్ అరసు సినిమాటోగ్రఫీకి కూడా మంచి పేరు వచ్చిందని ఆమె చెప్పారు. ఈ సక్సెస్ మీట్ లో ఎన్నారై శశికాంత్, ఈ చిత్రాన్ని ఎం.జి.ఎం. మూవీస్ ద్వారా విడుదల చేసిన ఎమ్. అచ్చిరెడ్డి, బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 

 

 


వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చకున్న మాధవన్ చాలా కాలం తర్వాత మరోసారి రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.

 

ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

 

ప్రముఖ నటుడు మాధవన్ (Madhava) కు గతంలో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది.

కానీ కొంతకాలంగా అందుకు భిన్నమైన పాత్రలను చేస్తున్నాడు.

కొన్ని హిందీ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి కూడా మాధవన్ వెనుకాడలేదు.

 

తెలుగులో ఆ మధ్య వచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’ (Nishabdham) లో అలాంటి భిన్నమైన పాత్రనే మాధవన్ చేశాడు.

సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ’ (Rocketry) తో మాధవన్ దర్శకుడిగానూ మారిపోయాడు.

ఆ బయోపిక్ అతనికి నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అలానే గత యేడాది మాధవన్ నటించిన ‘సైతాన్’ (Saitaan) కూడా కమర్షియల్ హిట్ అయ్యి, మాధవన్ లోని నటుడిని వెలికి తీసింది.

ఈ యేడాది ఇప్పటికే మాధవన్ నటించిన ‘హిసాబ్ బరాబర్,’ ‘టెస్ట్’ చిత్రాలు వచ్చాయి.

అయితే ఈ రెండు కూడా ఓటీటీలోనే విడుదల కావడం విశేషం.

ఇక అక్షయ్ కుమార్ తో కలిసి మాధవన్ నటించిన కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ థియేటర్లలో సందడి చేసింది.

తాజాగా మాధవన్ నటించి మరో చిత్రం ‘ఆప్ జైసా కోయి’ మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాలో మాధవన్ సరసన ఫాతిమా సనా షేక్ నటిస్తోంది.

మాధవన్ ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో సంస్కృతం లెక్చరర్ గా నటిస్తుంటే, సనా ఫ్రెంచ్ టీచర్ పాత్రను పోషిస్తోంది.

రెండు భిన్న ధృవాలకు చెందిన వీరిద్దరూ కలిసి జీవితం సాగించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ‘ఆప్ జైసా కోయీ’ సినిమా.

 

ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను వివేక్ సోని డైరెక్ట్ చేశారు.

 

ఇది జూలై 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది

 

 

 

 

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న…

 

అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ సందర్భంగా రవిశంకర్‌ మాట్లాడుతూ ‘సినిమా విజువల్‌గా చాలా బాగుంది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. ఒక అమ్మాయి జీవిత ప్రయాణమే ‘8 వసంతాలు’ సినిమాగా మీ ముందుకొస్తోంది. తప్పకుండా మీకు నచ్చుతుంది’ అన్నారు. ‘ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. కథ బాగా నచ్చి మేము చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని నవీన్‌ యెర్నేని అన్నారు. ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ ‘మా నిర్మాతలు ఒక మంచి కథతో వస్తే సినిమా తీస్తారు అనే దానికి మా ‘8 వసంతాలు’ చిత్రం ఓ నిదర్శనం. ఈ సినిమాతో ఒక మంచి చిత్రాన్ని నిర్మించారనే పేరు వారికి వస్తుంది. అనంతిక నటన ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అని అన్నారు. అనంతిక మాట్లాడుతూ ‘మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఫణీంద్ర గారి వల్ల ఈ సినిమాలో ఒక బలమైన పాత్రను చేశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం’ అన్నారు.

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

మహేశ్‌ సినిమా… ఎంతైనా తగ్గేదేలే..

 

 

 

 

గుణశేఖర్‌ తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు

 

బాలీవుడ్‌లో భారీ కాన్వాస్‌ కథలు, సెట్లు, కళాత్మక పంథాలో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తొచ్చే పేరు సంజయ్‌ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali).

దేవదాస్‌ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో భారీ సెట్‌ నిర్మించారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

అది తెరపై కనిపించింది.

ఆయన తీసే సినిమా బడ్జెట్‌లో 15 నుంచి 35 కోట్లు సెట్స్‌ కోసం ఖర్చవుతుంది.

బాజీరావు మస్తానీ, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ సాయో, రామ్‌ లీలా, హీరామండి ఇవన్నీ ఆ కోవకు చెందినవే.

అలాగే టాలీవుడ్‌ అలా భారీ సెట్స్‌ వేసే అలవాటు దర్శకుడు గుణశేఖర్‌కు (Guna sekhar) ఉంది.

ఎందుకంటే ఆయన ఎంచుకునే కథల స్పాన్‌ అలా ఉంటుంది.

ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్‌ భారీతనంతో నిండిన సెట్స్‌కు కోట్లు ఖర్చు చేశారు.

రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్‌ లభించకపోవడంతో ఆ సినిమా అవుట్‌పుట్‌ కాస్త డల్‌గా వచ్చింది.

ఆయన తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి.

అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు.

బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు.

ఇప్పుడు మహేశ్‌ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం ఆయన మహేష్‌ కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వారణాసిలో కీలక షెడ్యూల్‌ చేయాలట.

నిజానికి గంగానది ఒడ్డున రియల్‌ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే సవాల్‌తో కూడిన విషయమే!  

పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు.

దాంతోపాటు ప్రజలు,  ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

అది కష్టంతో కూడిన పని కావడంతో రాజమౌళి వారణాసిని తలపించే భారీ సెట్‌ని నిర్మించాలని ప్లాన్‌ చేసినట్టు తెలిసింది.

వారణాసిలో దేవాలయాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మికత నిండిన ప్రాంతంగా ఉంటుంది.

అలాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నదే! తెరపై ఒరిజినాలిటీ చూపించాలి.

దాని కోసం రాజమౌళి టీమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌తో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.

  పర్వతాలలో సంజీవని వనమూలికలు వెతకడానికి వెళ్ళిన హనుమంతుడు స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని తెలుస్తోంది.

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మాత కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రియాంక చోప్రా కథానాయిక.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్.

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

 

 

 

 

 

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా గురించి వార్తలు విశేషంగా వినిపిస్తున్నాయి- కానీ, ఆ మూవీ రిలీజ్ డేట్ మాత్రం తెలియడం లేదు.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కు భీమ్స్ ట్యూన్స్ అందిస్తూ ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది.

 

మొదటి నుంచీ ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తూ సాగుతున్నారు చిరంజీవి…

ఆయన రీ ఎంట్రీ తరువాత ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు అంతగా అలరించలేకపోయాయి…

‘భోళాశంకర్’ పరాజయం చిరంజీవి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది…

దాంతో ‘విశ్వంభర’ ద్వారా అభిమానులకు ఆనందం పంచే దిశగా సాగుతున్నారు చిరంజీవి.

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే చిరంజీవి ఈ సినిమాలో డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు…

అతను కూడా శక్తివంచన లేకుండా ‘విశ్వంభర’ను రూపొందించారు…

ఓ పాట మినహా ‘విశ్వంభర’ పూర్తయింది…

ఈ సాంగ్ ఐటమ్ నంబర్ గా రూపొందనుంది… .

ఇందులో చిరంజీవితో చిందేసే ముద్దుగుమ్మ కోసం అన్వేషణ సాగుతోంది…

ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు…

ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా రీ-రికార్డింగ్ లో బిజీగా ఉన్నారు…

అందువల్ల ఈ ఐటమ్ నంబర్ కు మాత్రం భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ ఎంచుకున్నారట…

ఈ యేడాది బంపర్ హిట్ గా నిలచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ భలేగా పనిచేశాయి…

ఈ చిత్రంలోని పాటలు మాస్, క్లాస్ అన్న తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి…

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రానికి కూడా భీమ్స్ స్వరకల్పన చేస్తున్నారు…

ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ చిత్రంలోని ఐటమ్ నంబర్ కు భీమ్స్ బాణీలు ఉపయోగించుకోవాలని చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ నిర్ణయించారు…

చిరంజీవి సినిమాలో ఐటమ్ నంబర్ అంటే ఇరగదీసేలా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు…

మరి వారి అంచనాలకు తగ్గట్టుగానే భీమ్స్ బాణీలు ఉంటాయని టాక్!

అప్పుడలా… ఇప్పుడిలా…

దాదాపు 21 సంవత్సరాల క్రితం చిరంజీవి ‘అంజి’ సినిమా అప్పట్లో జనాల్లో విశేషమైన క్రేజ్ క్రియేట్ చేసింది…

ఆ సినిమాకు ముందు శ్రీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు…

ఓ పాటను కూడా చిత్రీకరించారు…

తరువాత పలు మార్పులు జరిగి, మణిశర్మ బాణీలతోనే ‘అంజి’ రిలీజయింది…

అప్పట్లో గ్రాఫిక్స్ తో ‘అంజి’ అలరించే ప్రయత్నం చేసింది…

ఇప్పుడు ‘విశ్వంభర’లోనూ జీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది…

అంతేకాదు, ‘విశ్వంభర’ విడుదలలోనూ జాప్యం జరుగుతోంది…

అయితే అప్పుడు శ్రీ స్థానంలో మణిశర్మ వచ్చి ఒక పాట మినహా అన్నీ పూర్తి చేశారు…

ఇప్పుడు కీరవాణి బిజీ వల్ల భీమ్స్ వచ్చి ఓ పాటకు ట్యూన్స్ కడుతున్నారు…

ఏది ఏమైనా చివరగా మిగిలిన పాట పూర్తయితే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

మరి కీరవాణికి బదులుగా ఓ పాటకు బాణీలు కడుతున్న భీమ్స్ ఈ ఐటమ్ నంబర్ ను ఎలా రూపొందిస్తారో చూడాలి.

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

 

 

 

 

పవన్‌ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన  దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని  తెల్సింది  

 

పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా  కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్‌ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్‌ శంకర్‌ కూడా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ షురూ చేశారు. ఈసినిమా సెట్‌లోనూ పవన్‌ పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో ‘బ్రో’ చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్‌తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల సముద్రఖని పవన్‌కు ఓ కథ చెప్పారట.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చింది. పవన్‌ ఫ్యాన్స్‌ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్‌ సముద్రఖనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పవన్‌కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్‌ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తక్కువ సమయంలో, లిమిటెడ్‌ బడ్జెట్‌ లో ఈ సినిమా ప్లాన్‌ చేశారట. ఇటీవల సముద్రఖని పవన్‌ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.

 

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు

Dhanush: ‘కుబేర’.. టచ్ చేసే పాట

 

Vishwambhara: చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

సేవాకార్యక్రమాలకే వినియోగం…

సేవాకార్యక్రమాలకే వినియోగం…

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు సందర్భంగా తనకు లభించిన నగదు పారితోషికంలోని అధిక భాగాన్ని వివిధ సేవా సంస్థలకు విరాళంగా అందించారు.

 

 

 

 

 

 

గద్దర్ అవార్డులు (Gaddar Awards) పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతులనూ ఇచ్చింది. ఓ పక్క ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాదాపు 17 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తెలంగాణ గద్దర్ అవార్డులను నిర్వహించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నించారు కూడా! అలానే అవార్డులు అందుకున్న వారి అర్హతల మీద కొన్ని విమర్శలు వచ్చాయి.

 

 

 

 

 

 

ప్రముఖ నటుడు స్వర్గీయ కాంతారావు స్మారక అవార్డును విజయ్ దేవరకొండకు ఇవ్వడం పట్ల కొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. నటీనటులకు ఆ అవార్డు ఇవ్వాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్స్ కు ఆ అవార్డును ఇస్తే బాగుండేదని, ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండకు ఆ స్థాయి అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అన్నారు. అదే సమయంలో ఈ వేడుకకు కాంతారావు కుటుంబ సభ్యులను సరైన రీతిలో ఆహ్వానించలేదనే విమర్శలూ వచ్చాయి. కాంతారావు పేరుతో అవార్డు ఇస్తూ వారి కుటుంబ సభ్యులను గౌరవించకపోవడం సరైన పద్దతి కాదని కొందరు అన్నారు. అయితే అధికారులు కాంతారావు కుమారుడు రాజాను ఈ వేడుకకు పిలిచామని ఆయన కార్యక్రమానికి హాజరు కావడం కోసం వెయ్యి రూపాయలు టాక్సీ ఖర్చుగా ఇచ్చామని వివరణ ఇచ్చారట. ఆ చర్యను సైతం కొందరు తప్పుపట్టారు. టి.ఎల్. కాంతారావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కారు పంపి, వారిని గౌరవంగా వేదికకు తీసుకు రావాల్సింది పోయి రానూ పోనూ ఖర్చులకు డబ్బులు ఇచ్చామని చెప్పడం ఏమిటని కొందరు వాపోయారు.

 

 

 

 

 

 

 

ఇదిలా ఉంటే టి.ఎల్. కాంతారావు పేరుతో విజయ్ దేవరకొండకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల రూపాయలను అందించింది. ఆయన దానిని ఎలా, ఎందుకోసం ఖర్చు పెడతారనేది పక్కన పెడితే… ఇదే వేడుకలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మాత్రం తన పెద్ద మనసును చాటుకున్నారు. రచయితగా ఆయన తనకు వస్తున్న రాయల్టీలో చాలా భాగాన్ని కొన్నేళ్ళుగా వివిధ సామాజిక, సేవా సంస్థలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. అలానే ఇప్పుడు కూడా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘ఇందులో అధిక మొత్తాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తాన’ని యండమూరి చెప్పారట.

 

 

 

 

 

 

ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆయన కడపలోని ఆర్తి ఫౌండేషన్ కు మూడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం పక్కనే ఉన్న అభయం ఫౌండేషన్ కు లక్ష రూపాయల చెక్కునూ పంపారు. నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉందనే విషయం యండమూరి దృష్టికి రావడంతో అతన్ని ఇంటికి పిలిచి లక్ష రూపాయలను యండమూరి అందించడం విశేషం.

 

 

 

 

 

ఇక్కడో చిన్న ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… యండమూరి వీరేంద్రనాధ్‌ రాసిన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అందులోని కథానాయకుడి పేరు… ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఒక్కటే… రేవంత్‌!!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version