ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ.

సిరిసిల్ల జిల్లాలో ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ

*ప్రజావాణికి 157 ఆర్జీలు రాక *

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 45, హౌసింగ్ శాఖకు 33, డీఆర్డీఓకు 15, జిల్లా విద్యాధికారి 11, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 10, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 8, జిల్లా వ్యవసాయ అధికారి,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారికి మూడు చొప్పున, ఫిషరీస్, జిల్లా సంక్షేమ అధికారి, ఈఈ నీటి పారుదల శాఖ, ఈఓ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున, ఎల్ డీ ఎం, ఈఈ పీఆర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ హ్యాండ్ లూమ్స్, మైనార్టీ, ఆర్ టీ సీ, జడ్పీ సీఈవో, ,సెస్, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్పీ ఆఫీస్ కు ఒకటి చొప్పున వచ్చాయి.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదను నమ్మించి పట్టా పొలం కాజేశారు.

“నిరుపేదను నమ్మించి పట్టా పొలం కాజేశారు”

“మోసం చేశారని అడిగితే.. చంపుతామని బెదిరింపు”

“పొలం ఇప్పించి.. న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు”

 

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన చిన్న యాదమ్మకు అదే గ్రామంలో సర్వేనెంబర్ 677లో, 38 గుంటల పట్టా పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు యాదమ్మకు మాయ మాటలు చెప్పి పట్టా పొలాన్ని ప్రజా ప్రతినిధుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఆమెకు 966 సర్వే నెంబర్ లో.. ఆమెకు ఒక ఎకరా గైరాన్ పొలం ఆమె పేరా చేశారు. తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశారని నిలదీస్తే.. తమకు రూ.5 లక్షలు ఇస్తే తిరిగి పొలం ఇస్తామని.. చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రతినిధుల ఆధీనంలో ఉన్న తన పట్టా పొలాన్ని తనకు ఇప్పించాలని కలెక్టర్ కు వినతిపత్రంలో బాధితురాలు కోరింది.

ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు.

ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి…

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన సిపిఎం,బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి నాయకులు…

నేటి ధాత్రి –

 

 

 

మహబూబాబాద్,గార్ల :-ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు సర్వే చేపట్టి, హద్దులు ఏర్పాటు చేయాలనీ సిపిఎం, బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి లకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు.మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి,కందునూరి శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి‌.సక్రు, గంగావత్ లక్ష్మణ్ నాయక్, కత్తి సత్యం గౌడ్, సంగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ కమిషనర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, మున్సిపాలిటీ కమిషనర్ గా సుభాష్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు.సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు.

భద్రాచలం రాముల వారి వస్త్రములు తలంబ్రాలు ఇచ్చిన.

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ కి భద్రాచలం రాముల వారి వస్త్రములు తలంబ్రాలు ఇచ్చిన పూరి

వనపర్తి నెటిదాత్రి :

 

 

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి భద్రాచలం రాముల వారి తలంబ్రాలు వస్త్రాలను
వాసవి సేవాసమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ అందజేశారు

తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా ఫోరమ్.

తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా ఫోరమ్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా కో-ఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు.సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాస పథకంలో 20% శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించి నెలకు 25 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారులకు ప్రమాద బీమా ఐదు లక్షలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారుల విభాగం నాయకులు ఎల్ల పోశెట్టి, ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొజ్జ కనకయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెంగళ వెంకటేశం,బొడ్డు రాములు,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

నూతన కలెక్టర్ ప్రావిణ్యను కలిసిన.

నూతన కలెక్టర్ ప్రావిణ్యను కలిసిన దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లాకు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నూతన జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ను గురువారం నాడు దివ్యాంగుల అసోసియేషన్ ముఖ్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసీ పూల మొక్క ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లాలో ఎన్ని దివ్యాంగుల సంఘాలు అసోసియేషన్ లు ఉన్నాయి అని అసోసియేషన్ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల అభ్యున్నతికి అవసరమైన సదుపాయాల ఏర్పాటుపై, ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు మరియు శిక్షణా కార్యక్రమాలపై స్పందనను కలెక్టర్ కు తెలియజేశారు. కలెక్టర్ సా నుభూతితో సమస్యలు విని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సోలార్ సొసైటీ అధ్యక్షురాలు జుబేదా బేగం, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు,దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు రామ్ శెట్టి, ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె నర్సిములు, ఇస్మాయిల్, నాయకురాలు విజయలక్ష్మి,,దివ్యాంగుల సంఘం నాయకులు లక్ష్మణ్ సుశీల వయోవృద్దుల దివ్యంగుల రెస్పాన్స్ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అయ్యా మా గోడు పట్టించుకోండి.

అయ్యా మా గోడు పట్టించుకోండి

మందమర్రి నేటి ధాత్రి

 

shine junior college

 

శ్రీయుత గౌరవనీయులైన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికీ నమస్కరించి వ్రాయునది*

*గ్రామాలలో గుడుంబా నియంత్రించాలని కోరుతూ

విషయం మందమర్రి పట్టణ,మరియు మండలంలో ఉన్న గ్రామాలలో గుడుంబా మద్యం విచ్చలవిడిగా సరఫరా జరుగుతుంది గుడుంబా నిలుపుదల కొరకు

అయ్యా మా గ్రామం మందమర్రి మండలంలోని వెంకటాపుర్ గ్రామ పంచాయతీలో గుడుంబా క్రయవిక్రయాలు అతిగా జరుగుతున్నాయి దానితో రోడ్డున పడుతున్న కుటుంబాలు

గుడుంబా తాగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు

అంతేకాకుండా యువకులు ఈ గుడుంబాకీ బానిసలు అవుతున్నారు

గుడుంబా తాగి చిన్న వయసులో ప్రాణాలు పోతున్నాయి దానితో కుటుంబ పెద్దదిక్కు భర్తను కోల్పోపోవడం తో ఆ తల్లీ,పిల్లలు రోడ్డున పడుతున్నారు, అంతేకాకుండా ఆ పిల్లల పోషణ తల్లికి భారం అవుతుంది

గుడుంబా తయారీలో అనేక క్రిమిసంహారక,మత్తు పదార్థాలు యూరియా ,అత్యంత ప్రమాదకరమైనటువంటి మందులు వాడి ఈ గుడుంబా తయారు చేస్తున్నారు దానితో గుడుంబా తాగి శరీరంలోని కిడ్నీలు మరియు అవయవాలు పూర్తిస్థాయిలో పాడైపోయి ప్రాణాలు కోల్పోతున్నారు

గత ప్రభుత్వం గుడుంబా తయారీ దారుల మీద పిడియాక్ట్ కేసులు పెట్టడం జరిగింది ఆయన కూడా కొంతమంది ఇప్పుడు ఒక ముఠాగా ఏర్పడి గుడుంబాన్నీ గ్రామాలకి విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు దానితో గ్రామాలలో ప్రజలు యువకులు గుడుంబాకి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు

కావున వెంటనే ఈ గుడుంబా తయారు చేసి గ్రామాలకు సరఫరా చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో ఉచిత విద్యను అందించాలి

టి ఎస్ జి యు ఎన్యుజే ఇండియా.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

shine junior college

మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించి ఉచిత విద్యను అందించాలి అని,మహబూబాబాద్
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా నేతలతో కలసి వినతి పత్రం అందించిన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ ధీర్, వారు మాట్లాడుతూ రాత్రానకా పగలనక నిరంతరం వార్తల కోసం తిరుగుతూ,ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరి శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు తప్పకుండా కల్పించాలని,మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యా భోధన అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు,జిల్లా విద్యా శాఖా అధికారి రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందించామని తెలిపారు.ఇటీవల టి ఎస్ జే యు ఎన్యుజే ఇండియా పోరాటంతో ములుగు జిల్లా కమిటీ అక్కడి జర్నలిస్టుల పిల్లలకు వందశాతం ఫీజు రాయితీ కల్పించిన సంగతి గుర్తు చేస్తూ కాపీ వినతిపత్రానికి జత చేసినట్లు కలెక్టర్ ,విద్యా శాఖాధికారి సత్వరం ఈ వినతి పై సానుకూల స్పందన ప్రకటించాలని కోరారు.

Private Schools.

కార్యక్రమంలో డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్,జిల్లా టీయస్ జేయూ నేతలు పోతుగంటి సతీష్,గాండ్ల కిరణ్,జెల్లీ శ్రవణ్, మల్లారపు నగేష్ శెట్టి వెంకన్న,మిట్టగడుపుల మహేందర్,తాడూరి ఉమేష్ శర్మ,
కేసముద్రం మండల అధ్యక్షులు మంద విక్రం ప్రధాన కార్యదర్శి గంధసిరి యాకాంబరం, ఉపాధ్యక్షులు కందుకూరి రాజేందర్,సతీష్,జన్ను శ్రీనివాస్

యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.

యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమకృత కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.రాబోయే అంతర్జాతీయ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ని చేపడుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులు, యువకులు,వృద్ధులు,జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, సహాయ నోడల్ అధికారులు డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత,రాజన్న సిరిసిల్ల జిల్లా డి.పి.ఎం తిరుపతి యోగ శిక్షకులు బొల్లాజీ శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా కార్యక్రమం మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది

మంచిర్యాల నేటి దాత్రి

 

 

 

 

మంచిర్యాల భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్లు

1.) ఈ పి ఎఫ్- 95 యొక్క కనీస పెన్షన్ 1000/- రూపాయల నుండి 5000/- రూపాయలకు వెంటనె పెంచాలి. మరియు చివరకు జీతంలో 50% + డి ఏ రిలీఫ్ పెన్షన్ ను చెల్లించాలి.

2.) ఈ పి ఎఫ్ జీత పరిమితిని 15,000/- నుండి 30,000/- పెంచాలి.
ఈ ఎస్ ఐ జీతం పరిమితిని 21,000/- నుంచి 42,000/- పెంచాలి.

3.) ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలి.

4.) బీమా ఆర్థిక రంగంలో 100% విదేశీ పెట్టుబడులను నిషేధించాలి.

5.) స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం మరియు సామాజిక భద్రత కల్పించాలి.

6.) అసంఘటిత కార్మిక రంగానికి బోర్డ్ లను ఏర్పాటు చేసి వాటికి తగినన నిధులను కేటాయించాలి.
7) మినిమం వేజెస్ 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్2016 నుండి పెండింగ్లో ఉన్న సమస్య 2012లో డిమాండ్ చేసిన విధంగా బిఎంఎస్ మినిమం వేజెస్ 25 వేల రూపాయలు ప్రకటించాలి
8) కార్మిక బోర్డులో ఉన్న వెయ్యి నాలుగు కోట్లు ఇతర శాఖలకు మళ్లించిన డబ్బులను తిరిగి బోర్డులో జమపరిచి కార్మికుల డెత్ క్లేములు మిగతా సౌకర్యల కొరకు వినియోగించాలి

సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజ్ధూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించడం జరిగింది

కార్మికుల తీవ్ర సమస్యల పరిష్కారం కోసం తక్షణమే రాష్ట్రంలోని జిల్లాస్థాయిలో నిరసన కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్ సంబదిత అధికారుల ద్వారా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి కి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది.

భారతీయ మజ్దూర్ సాంగ్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

వీరిలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లగిసెట్టి కమలాకర్ మరియు సింగరేణి ఏ బి కె ఎం ఎస్ నాయకులు కె శ్రీనివాస్ మరియు మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ పెయింటర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సంగెం లక్ష్మణ్ ,వేల్పుల స్వామి పెయింటర్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కార్యదర్శి , ఆఫీస్ సెక్రటరీ మహానంద్ ప్రభాకర్, మరియు ఎస్ సి సి ఎల్ కన్వీనర్ ,మిట్టపెల్లి మొగిలి బిఎంఎస్ నాయకులు మంచిర్యాల జిల్లాలో బిఎంఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగినది

ప్రజావాణి అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి.

సిరిసిల్ల జిల్లా లో ప్రజావాణి

అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రెవెన్యూ శాఖకు 51, హౌసింగ్ 32, ఏడీ ఎస్ఎల్ ఏ, డీఈఓ కు 7 చొప్పున, డిఆర్డీఓకు 6, జిల్లా సంక్షేమ అధికారి 5, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎస్సీ కార్పొరేషన్, ఉపాధి కల్పన శాఖకు మూడు చొప్పున, సిరిసిల్ల మున్సిపల్, ఎంపీడీఓ బోయినపల్లి కి రెండు చొప్పున ఎస్పీ, ఎస్డీసీ, నీటి పారుదల శాఖ, సెస్, ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, ఎల్డీఎం, ఏడీ హ్యాండ్ లూమ్స్, సీపీఓ కి ఒకటి చొప్పున దరఖాస్తులు మొత్తం 134 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

 

Collector Sandeep Kumar.

 

 

అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున.

పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున కలెక్టర్ వినతి పత్రం అందజేత

మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో కెసీఆర్ హయాంలో ప్రతిష్టా త్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని నరికి వేసి అక్కడ గ్రామపంచాయతీ భవనం నిర్మించుటకు అధికా రులు సిద్ధమై గ్రామస్తులు వద్ద ని మొరపెట్టుకున్నా కొందరి కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్ల శంకుస్థాపన కూడా పూర్తి చేశారు.గతంలో గ్రామపంచా యతీ భవన నిర్మాణానికి ఎమ్మార్వో పరిశీలించి నిర్ధారణ చేసిన 0.06 గుంటల కాళీ స్థలం పల్లె ప్రకృతి వనానికి పక్కనే ఉన్నందున గ్రామస్తుల కోరిక మేరకు ఆ స్థలంలోనే నిర్మించాలేతప్ప పల్లె ప్రకృతి వనాన్ని నాశనం చేయకూడ దని గ్రామస్తుల సహకారంతో కలెక్టర్ వినతి పత్రం అందజే సిన మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి.ఈ కార్యక్రమంలో జాలిగాపు అశోక్, ఎండి మగ్దున్ పాషా, పోతు రమేష్, పెరుమాండ్ల కుమారస్వామి, సప్పిడి పోషాలు తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు.

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు.

సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు వస్తాయని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండలం అమీన్‌బాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ రైతులు ఒక నెల వరి పంటను ఆలస్యంగా వేస్తున్నారని ఇకనుండి ముందుగా వేయాలని సూచించారు.

ముఖ్యంగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వరిని తొందరగా విత్తడం వలన అధిక దిగుబడి సాధించవచ్చని, తెగుళ్లు మరియు చీడ పీడలప్రభావం తగ్గించవచ్చని అలాగే ముందుగా వరి కోయవచ్చని వివరించారు.

అలాగే, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలని అలాగే రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలన్న సూచనలు చేశారు.

రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ,చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను కూడా చేయాలని, సమగ్ర వ్యవసాయ విధానం ను అనుసరించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ వివరించారు.

 

 

Collector

 

రైతుల ఆదాయాన్ని పెంచడమే కాక, వ్యవసాయాన్ని స్థిరీకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో 1.8 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించబడినదని విషయాన్ని వారు మరోసారి గుర్తు చేశారు.

అదేవిధంగా, చిన్న తరహా వ్యవసాయ యంత్రాల వాడకం ద్వారా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వివరించారు.

రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమం లో మరియు వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని రైతులకు సూచించారు.

వికాషిత్ కృషి సంకల్ప్ జిల్లా నోడల్ ఆఫీసర్ డా. రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్, కేవికే మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు, కార్యాచరణ అంశాలు గురించి రైతులకు వివరించారు.

కార్యక్రమం ద్వారా రైతులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించి, మెరుగైన వ్యవసాయ పద్ధతులు అమలు చేయడం లక్ష్యమని చెప్పారు.

అలాగే డా. తమ్మీ రాజు గారు పశు పోషణ, టీకాలు మరియు పరి శుభ్రమైన పాల ఉత్పత్తి గురించి వివరించారు.

జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం నేలలో భూసారం పెరుగుతుందని మరియు అధిక దిగుబడి రకాల గురించి వివరించారు.

పశుసంవర్ధక శాఖజాయింట్ డైరెక్టర్, డా. బాలకృష్ణ మాట్లాడుతూ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద ఎవరైనా లోన్ తీసుకొని పశువుల పెంపకం చేపట్టాలని తెలిపారు.

నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్తలు డా. రాజు మరియు శతీష్ చంద్ర , స్థానిక మండల రెవిన్యూ అధికారి ఫణికుమార్ , మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి గార్లతో పాటు రైతులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

 

భూభారతి రెవెన్యూ సదస్సుల పరిశీలించిన కలెక్టర్

అనంతరం చెన్నారావుపేట మండలం అమినాబాద్ లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించి రైతులు అందించిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
రైతులకు సులభతరమైన విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు.

స్వీకరించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధి కారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ నెల 20 వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

ధరఖాస్తు కోసం వచ్చే వారికి కేంద్రంలో ఏర్పాట్లు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాలని ఆన్నారు.

రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఫణి కుమార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగు బిల్లులకై,వినతి పత్రం అందజేత.ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన రంగం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సంబంధించి దాదాపు 5 నుంచి 6 నెలల మే స్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, అలాగే గౌరవ వేతనం దాదాపు నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నవి. దీనివల్ల కార్మికుల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొద్ది రోజుల్లో స్కూలు తిరిగి ప్రారంభం అవుతున్న సందర్భంగా వంట చేయడానికి చేతులు డబ్బులు లేనందున విద్యార్థులకు భోజనాలు పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వం గౌరవ వేతనం 10000, రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 15 నెలలు పూర్తికావస్తున్న కూడా ఎక్కడ కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గౌరవ వేతనం 2000, కూడా దాదాపు నాలుగు నెలల నుంచి కార్మికులకు ఇవ్వడం లేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సి.ఐ.టి.యు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.కావున కార్మికులకు రావాల్సిన 5 నెలల పెండింగ్ మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే అందించి, గౌరవ వేతనం 10000 ,రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సి.ఐ.టి.యు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్, మరియు కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్, నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండల్ నర్సింగాపూర్, మిట్టపల్లి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు ప్రజల వద్దకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు చేపట్టి వారి సమస్యలు పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,తహసిల్దార్ వనజా రెడ్డి, వివిధ శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్.

భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో సిబ్బంది పని తీరును, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 3వ తేది నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలను సమయానికి పరిశీలించి, సంబంధిత తహసీల్దార్ కు సిఫారసు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు లు నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో నమోదు అయిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేసి వచ్చిన దరఖాస్తును రిజిస్టర్ లో నమోదులు చేయాలని స్పష్టం చేశారు. కార్యాలయ పని వేళల్లో ప్రజలు సహాయక కేంద్రాన్ని సందర్శించి సలహాలు, సూచనలు పొందాలని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు హరిహర, శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలో జూన్ 2న నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల డయాస్, సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అన్నారు.

Collector

 

వేడుకల వద్ద వైద్య బృందాలచే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు కలెక్టరేట్ ఏ ఓ రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లుకు సంబంధించి శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సమాచార, డిఆర్డీఏ, సంక్షేమ, అటవీ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అమరవీరుల స్తూపం, డా బిఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను పూలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ అతిధులు కూర్చోడానికి షామియానాలు, కుర్చీలు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యాన, ఆర్ అండ్ బి శాఖల అధికారులు స్టేజ్ ఏర్పాట్లు చేయాలన్నారు, జిల్లా ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని డిపిఆర్వోను ఆదేశించారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని డిపిఆర్వో ను, డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. వేడుకల సందర్భంగా అంబులెన్సులు, అత్యవసర వైద్య కేంద్రం, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అన్నారు. మైదానంలో పారిశుద్ధ్య.కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. వేడుకలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్డిఓ కార్యక్రమాలు ఆసాంతం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్

జిల్లా కలెక్టర్ కు మంత్రుల అభినందనలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా అధికారులను మంత్రులు అభినందించారు.
జిల్లాకు మంజూరు అయిన 7862 ఇండ్లకు గాను 7808 అలాట్మెంట్ ఆర్డర్లు లబ్దిదారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 2575 ఇండ్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 3608 ఇండ్లు, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ఫేజ్-1,2 లో కలిపి 820 ఇండ్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలిసి, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఫేజ్-1లో 42 ఇండ్ల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. ఫేజ్- 2లో 763 మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. ఫేజ్ 1 కింద జిల్లాలో మొత్తం 439 ఇండ్లు మంజూరు చేయగా, 135 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో మొదలు పెట్టిన మోడల్ హౌస్ లలో బేస్మెంట్ లెవెల్ లో మూడు, రూఫ్ లెవెల్లో రెండు, స్లాబ్ లెవెల్ లో ఆరు ఇండ్లు ఉన్నాయి.ఈ సందర్బంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశాన్ని కరీంనగర్ లో గురువారం నిర్వహించగా, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరై ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను, జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version