డ్రగ్స్ కు దూరంగా ఉండాలి యువత లక్ష్యం వైపు ప్రయాణించాలి..

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి యువత లక్ష్యం వైపు ప్రయాణించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై  సమీక్షించిన కలెక్టర్

సిరిసిల్ల టౌన్ :(నేటి దాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని.. లక్ష్యం వైపు పయనించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో  సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.జిల్లా నార్కోటిక్ కంట్రోల్
సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డీ.పీ.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్  సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని  సూచించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా సంస్థల వద్ద డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు.


అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు.
ఈ సందర్భంగా అడిషనల్  ఎస్పీ చంద్రయ్య అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మాట్లాడారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా  విద్యార్థులకు , యువతకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు చేపట్టి విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.సమావేశంలో డీ.ఎం.హెచ్.ఓ రజిత, డీఏఓ అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఐఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన..

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన జిల్లా కలెక్టర్

జిల్లాలో మొత్తం 14 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని లబ్ధిదారులకు చంద్రంపేట రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

Collector Sandeep Kumar Jha

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సిరిసిల్ల పట్టణంలోని అర్హులైన 2610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మొత్తం 4527 మందిని అదనంగా చేర్చామని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 21 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నాయని తెలిపారు.రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ అని, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
జిల్లాలో నూతనంగా 14 వేల లబ్దిదారులకు రేషన్  అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్డు రాని వారు ఉంటే సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Collector Sandeep Kumar Jha

కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లై రజిత, లబ్ధిదారులు, సంబంధిత  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన.

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
(జమ్మికుంట: నేటిధాత్రి)
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి సందర్శించారు ఆస్పత్రులోని రికార్డ్స్ పరిశీలించారు అన్ని వార్డులను సందర్శించి రోగులతో సమస్యలపై మాట్లాడారు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పనితీరును రోగులతో అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లకు భరోసా కల్పించే విధంగా వైద్యం అందించాలని జవాబుదారితనంగా పనిచేయాలని ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగించే విధంగా వైద్యులు అలాగే సిబ్బంది మెదులుకోవాలని ఆస్పటల్ సూపర్డెంట్ కు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్‌ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్‌ కనెక్షన్ల ఏర్పాటకు చర్యలు

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గాను గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టర్ సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంట చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రతి మండలానికి సుమారు 35 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నందున ఆయా మండల ఎల్పిజి ఏజెన్సీల నుండి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ఎల్పిజి ఏజెన్సీ ప్రతినిధులను కోరారు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కె ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,కేజిబివిలలో
విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయుటకు సంబంధిత విద్యాసంస్థల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,జిల్లా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు మండల విద్యాశాఖ అధికారులు,కెజిబివి స్పెషల్ ఆఫీసర్లు,గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో తదితరులు పాల్గొన్నారు.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

* నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్*

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Collector

నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం వరంగల్ లోని పాత ఆజంజాహి మీల్స్ గ్రౌండ్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సందర్శించి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలలో మూడు అంతస్తుల నిర్మాణాలను,కలెక్టర్ క్వార్టర్స్,అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ మొదటి, రెండవ అంతస్తులలో

Collector

డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫీనిషింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన సిబ్బందిని వనరులను వియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రోడ్లు,కాంపౌండ్ వాల్, పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జిల్లా రోడ్ల భవన అధికారి రాజేందర్,డి.ఈ శ్రీధర్,నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Dr. Satya Sarada.

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి, నర్సంపేట ఉమారాణి ,హౌసింగ్ పీడీ గణపతి పాల్గొని ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 150 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 58, పిడి హౌసింగ్ 25, జి డబ్ల్యూ ఎం సి 13 దరఖాస్తులు రాగా, మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 54 స్వీకరించామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరీంచిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,డిసిఓ నీరజ, డిబిసిడివో పుష్పలత, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గంజాయి డ్రగ్స్ కు బానిస అవ్వద్దు..

గంజాయి డ్రగ్స్ కు బానిస అవ్వద్దు..
• ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
• గ్రామాల్లో కళాజాత అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

యువత గంజాయి ,డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సాంస్కృతిక కళాసారథి బృందం గ్రామాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు పాటలు రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలతో పాటు, యువత చెడు మార్గం పెంచుకోవద్దని దానిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులలో ఒక పిల్లలను పంపించాలన్నారు. ప్రభుత్వ బడుల ఆవశ్యకతను ప్రజలకు పాటల రూపంలో వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీం కోఆర్డినేటర్ శివోల్లా కృష్ణ, రామారావు, ఎల్లయ్య నరసయ్య, సిద్ధులు ఎల్లయ్య, శేఖర్, విజయలక్ష్మి, మాధవి లు ఉన్నారు.

ప్రజావాణిలో వచ్చే ప్రజల ఫిర్యాదులు అధికారులు పరిష్కరించాలి.

ముఖ్యమంత్రి ప్రజావాణిలో వచ్చే ప్రజల ఫిర్యాదులు అధికారులు పరిష్కరించాలి

కలెక్టర్ ఆదర్శ్ సురబి అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి .

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-4.wav?_=1

ముఖ్యమంత్రి ప్రజా భవన్ లో ప్రజల నుండి వచ్చే వనపర్తి జిల్లా ప్రజల ఫిర్యాదులను వనపర్తి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజావావాణి లో స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు వెంటనే సమాచారం అందించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, ప్రతి సోమవారం జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు.

మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. చేతుల మీదుగా జిల్లెల్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 26 మందికి పత్రాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. మండలంలో గృహ అవసరాల నిమిత్తం ఇసుక కొరత లేదని అలాగే గృహ నిర్మాణాల కొరకు తమకు సంబంధించి పంట పొలాల నుంచి ఊరి చెరువుల నుంచి గాని. సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల. ఎమ్మార్వో.ద్వారా గాని పర్మిషన్ తీసుకొని ఇంటి నిర్మాణానికి వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ప్రజలు మట్టి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే జిల్లెల్ల గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు చెప్పిన మా పేరు ఉన్నది అని తీరా సమయానికి వచ్చేసరికి మా పేరు లేకపోవడంతో జిల్లెల్ల.గ్రామ క్రాసింగ్ లో చౌరస్తాలో.నడిరోడ్డుపై నివసిస్తున్న మా ఇల్లు 70 శాతానికి . పైగా రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో. ప్రభుత్వ అధికారులు తీసుకున్నారని దానికి అనుగుణంగా మీకు డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయడం జరుగుతుందని మాట ఇచ్చి ఇప్పుడు మా పేరు లేదని చెప్పడం ఎంతవరకు న్యాయమని అటువంటి వారం చాలామంది ఉన్నామని మా పిల్లల ఆరోగ్యలు బాలేకున్న కొన్ని సంవత్సరాల నుండి కిరాయిల. ఇండ్లలోబతుకుతూ జీవనం గడుపుతున్నామని దయచేసి సరైన లబ్ధిదారులు గుర్తించి మాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేవిధంగా. మాపై దయవుంచి మాకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా జిల్లెల్ల గ్రామస్తులు తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా.రాళ్ల పేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్. తుది దశలో ఉన్నందున పిడి హౌసింగ్ ఎంపీడీవోను అభినందిస్తూ లబ్ధిదారులు పారదర్శకంగా ఎంపిక చేసి వారికి తగిన న్యాయం చేకూరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. ఎంపీడీవో. ఎమ్మార్వో. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బంది. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ. మార్కెట్ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నర్సింగ్ పిడి ఎంపీడీవో లక్ష్మీనారాయణ.తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. పూర్మాని లింగారెడ్డి. మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు

ఈనెల 11న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

ఈనెల 11న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలకు వ్యాపారస్థులకు, ఉద్యోగులకు విద్యార్థులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా ఈనెల 11న ఉ.11.00 గం. ల నుండి 12.00 గం. ల వరకు “డయల్ యువర్ డిపో మేనేజర్” కార్యక్రమము నిర్వహించబడును జరుగుతుంది
కావున ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు విద్యార్థులు సెల్: 9959226707 కు డయల్ చేసి ఆర్టీసీ అభివృద్ధికి అమూల్యమైన సలహాలు, సూచనలు చేయగలరు అని డిపో మేనేజర్ ఇందు తెలిపారు

రేపటి ప్రజావాణి రద్దు హనుమకొండ జిల్లా కలెక్టర్.

రేపటి ప్రజావాణి రద్దు: హనుమకొండ జిల్లా కలెక్టర్

హనుమకొండ, నేటిధాత్రి.

హనుమకొండ కలెక్టరేట్లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజలు గమనించి ప్రజావాణికి రాకూడదని తెలిపారు.

వినతులను సకాలంలో పరిష్కరించాలి.

#వినతులను సకాలంలో పరిష్కరించాలి*

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఆర్టిఐ యాక్ట్,ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వివిధ సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో
ఆర్టిఐ యాక్ట్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతి,శాఖల వారిగా కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,చట్టం అమలు..ఎదురయ్యే సవాళ్లు చట్టాన్ని సమర్ధవంతంగా ఉపయోగించడం వంటి అంశాలపై కలెక్టర్ అధికారులకు కూలంకషంగా వివరించారు.పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో సరైన రూపంలో అందించాలని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత జవాబుదారీతనం పెంచడానికి ఆర్టీ ఐ చట్టం అమలు చేయడం జరుగుతున్నదని అన్నారు.ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షిస్తూ ప్రతివారం స్వీకరించిన సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఆ వారంలోనే ఖచ్చితంగా పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారి శాఖల ద్వారా అమలు చేసే కార్యాచరణ ప్రణాళిక వెంటనే సమర్పించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాములను పరిశీలించిన..

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా,ఆదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలసి శనివారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి,ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు,సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో తహసీల్దార్ ఇక్బాల్,నాయబ్ తహసీల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీరదానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు.కొన్ని మత ఆచారాలు అవయవ దానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం కాదన్నా అపోహ ఉందని, కానీ మనిషి ప్రాణం నిలబడితే ఆ దైవం కూడా అనుగ్రహిస్తాడని తెలిపారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.మనిషి చనిపోతే ఇక తిరిగి రారు,ఇక లేరు అనుకుంటారని,కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు.వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అయితే దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం కలెక్టర్ చేయాలని కోరారు.
దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులకు అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, వక్తలు మాట్లాడుతూ
అవయవ దానం యొక్క
ప్రాముఖ్యతను వివరించారు
చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు మట్టిలో పాతడం ద్వారా మట్టి పాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు
కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి,డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు, తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల.నిర్మాణానికి సంబంధించి రెండవ దశలో ప్రభుత్వ పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వేగంగా గ్రౌండింగ్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కు సంబంధించి అదనపు కలెక్టర్ యాదయ్య తో కలిసి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు.
ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు రావడం జరుగుతుందని లబ్ధిదారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణం కొరకు మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక పొందడానికి అవగాహన కల్పించాలన్నారు. మన ఇసుక వాహనం ద్వారా ఇసుక అందించే విషయంపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని మైనింగ్ శాఖ సూచించారు.
సమావేశంలో హౌసింగ్ అధికారులు విఠోబా, ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు..

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అలాగే జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్.ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి,డిబిసిడిఓ పుష్పలత, అధికారులు,సంఘ నాయకులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో..

 

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో వ్యాధులను నిర్మూలించాలి

రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాలను అధిగమించాలి.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి,తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తుందని,టీబీ రహిత జిల్లాగా మార్చుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలుపుతూ భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదనపు కార్యదర్శి – అరుంధతి పట్నాయక్ ఎం.డీ (ఎన్ హెచ్ ఎం) ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టి.బి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ పై సమీక్షించారు.వరంగల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి.సంధ్యరాణితో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు.జిల్లాలో 8 రకాల వ్యాధి కారకాల బారిన పడే వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,04,979 మంది ఉన్నారని వారికి 3,794 మందికి జూన్ 3 నుండి రెండో విడత టిబి,మరియు 8 రకాల వ్యాధి గ్రాస్తులకి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Warangal District Collector Dr. Satya Sarada

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి, తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తున్న నేపథ్యంలో టీబీ రహిత జిల్లాగా మార్చుటకు మరింత తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సంబంధిత వైద్య అధికారులు ,సిబ్బంది  పాల్గొన్నారు.

విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ.

విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ

ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్

కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలసి జిల్లా విపత్తును ఎదుర్కొనే చర్యలపై అధికారులతో సమీక్షించిన ఎన్డీఎంఏ అధికారుల బృందం

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:*

 

 

 

 

విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సీనియర్ అధికారుల బృందం పేర్కొంది. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ , అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్లు వసీం ఇక్బాల్, డాక్టర్ గౌతమ్ కృష్ణా, సంద్రా, అనుపమా, గురువారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తు ముప్పు తగ్గింపుతో పాటు భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్టత తదితర అంశాలపై సమీక్షించి, సమన్వయ శాఖల అధికారులతో చర్చించారు.మాక్ డ్రిల్స్ నిర్వహణ సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో జిల్లాలో చర్యలపై కూడా చర్చించారు. వరదల సమయంలో బాధితులకు చేయూతనివ్వడం, పునర్మిర్మాణ చర్యల్లో అధికార యంత్రాంగం చూపిన చొరవను కూడా బృందం సభ్యులు ప్రశంసించారు.ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖా తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం కీలకమని చెప్పారు. చట్ట ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్టైమ్ హెచ్చరికల వ్యవస్థలో సచేత్ కీలక మైలురాయి అని, ఈ యాప్ పై అధికారులతో పాటు ప్రజలకు ముఖ్యంగా గ్రామస్తులలో అవగాహన కల్పించాలని సూచించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆపద మిత్ర, ఇతర వలంటీర్ సేవలకు ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఎన్డీఎంఏ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ ప్రణాళికలతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి మరియు జాతీయ విపత్తు తగ్గించే నిధిని కూడా అందిస్తుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ

జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు,
జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని,
విపత్తుల సమయంలో చేపట్టే .
చర్యలు, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలపై వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. గత సంవత్సరం వరదల వల్ల ఆకేరు వాగు నీటి వరద వల్ల 40 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు నీటిలో దిగ్బంధం కాగా స్థానికుల సహకారంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా బయటికి రావడం జరిగిందన్నారు. గోదావరి కృష్ణ నదుల మధ్యలో వరంగల్ జిల్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున వరద ముప్పులేదని, అధిక వర్షాలు కురవడం వల్ల వరద సంభవించే అవకాశం ఉందని, అందుకు నగరంలోని ప్రధాన నాలాలను డీసిల్టేషన్ చేయడం జరిగిందన్నారు. గతంలో రాజులు నిర్మించిన గొలుసు చెట్టు చెరువులలో వర్షపు నీరు చేరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నగరం ముంపు గురి కాకుండా స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తొలగించడం జరుగుతున్నదని అన్నారు. వర్షపు నీరు చేరుకొనుటకు గాను చెరువులలో పూడికలు తీయడం జరిగిందన్నారు. ఇటీవల భూకంపం సంభవించినప్పుడు జిల్లాలో రిచేట్ స్కేల్ పై 3.5 నమోదైందని, ప్రభుత్వం ద్వారా జిల్లాలో నిర్మిస్తున్న 10 వేల ఇందిరమ్మ గృహాలకు భూకంపం వల్ల నష్టం వాటిల్లకుండా సాంకేతికత అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి 24 గంటలు సహాయం చేయడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా ఆపద మిత్ర కింద 179 వాలంటీర్లను శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈసారి జిల్లాలో ముందస్తుగా జూన్‌ నుంచి వర్షాలు కురుస్తున్నందున అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని, విపత్తులు రాకముందే ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాస్థాయిలో అన్ని మండలాలు, గ్రామస్థాయిలో కమిటీలను తహసీల్దార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశామని, అదనపు కలెక్టర్‌ను విపత్తుల జిల్లా నోడల్‌ అధికారిగా నియమించినట్లు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని గ్రా మాలపై ప్రత్యేక దృష్టి సారించామని. శిథిలావస్థలో ఉన్న గృహాలను, పాఠశాలలను ముందస్తుగానే గుర్తించి అవరమైతే వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని కలెక్టర్ అన్నారు.
భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామాల్లో టామ్ టామ్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. పీహెచ్సీలలో తగినంత ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్ల భవనాల శాఖ ద్వారా బ్రిడ్జిలు, కల్వర్ట్ లు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

Collector Dr. Satya

 

 

జిడబ్ల్యుఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ

బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా నగరంలో విపత్తును తక్షణమే ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 27 మంది, సిబ్బంది వాహనాలు బోట్లు రోప్స్ తదితర అన్ని ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రేటర్ వరంగల్లో 170 చెరువులు ఉన్నాయని, 5 ప్రధాన నాలాలను డిసిల్టేషన్ చేయడం జరిగిందని, ప్రభుత్వ నిధులచే నాలాలను అభివృద్ధి, బలోపేతం చేయడం వల్ల నగరంలో ముంపు తగ్గిందన్నారు. తక్షణ సహాయార్ధం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో రెస్పాన్స్ టీమ్లను చేయడం జరిగిందన్నారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి, నోటీసులు అందించి, గృహాలను తొలగించడం జరుగుతుందన్నారు. 2023లో వరదలు సంభవించినప్పుడు 2200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఉచితంగా భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.అగ్నిమాపక, పంచాయతీ, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక శాఖ, పోలీస్, వ్యవసాయ శాఖల ద్వారా వరదలు సంభవించినప్పుడు చేపట్టే చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

బుధవారం భూపాలపల్లి రూరల్ మండలంలోని ఎస్‌.ఎన్‌.కొత్తపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు జంగా రాణి, నాలుక రామ్మూర్తి, తరగంప కరుణలత ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు, ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తి చేశారు, ఏవైనా సాంకేతిక లేదా సామగ్రి సంబంధిత సమస్యలున్నాయా?, ఇసుక ఎక్కడి నుండి తీసుకుంటున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు. మండలంలోని కాల్వపల్లి వద్ద ఉన్న ఇసుక స్టాక్‌పాయింట్ నుండి ఇసుక అందుబాటులో ఉందని, లబ్ధిదారులు అక్కడినుండే తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇంటి నిర్మాణం పనులను దశలవారీగా పూర్తి చేస్తూ సంబంధిత ఫోటోలు, వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణం నాణ్యతకు ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలించారు. వర్షాలు వల్ల మురుగు నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్యం కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేయాలని సూచించారు. ప్రతి కుటుంబం తప్పని సరిగా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమలు వ్యాప్తి జరుగకుండా నియంత్రణ చర్యలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, ఎంపిడిఓ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి.

అనారోగ్యంతో డిప్యూటీ తహసిల్దార్ మృతి

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నా అనారోగ్యంతో ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి సోమవారం ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ తో పాటు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, నల్లబెల్లి తహశీల్దార్ కృష్ణ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version