#ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి.
#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తే లబ్ధిదారులకు పూర్తి మొత్తంలో బిల్లు వారి ఖాతాలో జమ కావడం జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా గ్రామానికి చెందిన బాధావత్ మౌనిక సుమన్ ఖాతాలో లక్ష రూపాయలు జమ కావడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ కూడలిలో మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు కార్యకర్తలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల 10 సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేసి అనుకున్న సమయానికి డబ్బు జమ చేయకపోగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసి నిర్దిష్ట సమయంలో వారి ఖాతాలో డబ్బులు జమ చేయడంతో గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు లబ్ధిదారులందరూ ఇండ్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చార్ల శివారెడ్డి, భూక్య బౌసింగ్, జిల్లా మునిందర్, బేతి భరత్, నల్లగొండ సుధాకర్, డ్యాగాల కృష్ణ, బత్తిని మహేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్య బాలాజీ, ప్రేమ్ సింగ్, సుమన్, బాదావత్ బాలాజీ, భూక్య రమేష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న దేశిని కోటి (జమ్మికుంట: నేటిధాత్రి) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ నిజయోకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఉడతల ప్రణవ్ బాబు కు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించిన దేశిని కోటి. దొంత రమేష్. సుంకర రమేష్.జిల్లాల తిరుపతిరెడ్డి.సతీష్ రెడ్డి.మేకల తిరుపతిరెడ్డి. నల్ల కొండల రెడ్డి.శ్రీనివాస్.తదితరులు సత్కరించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు మీరందరూ ఐక్యతగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన గెలిపించాలని విభేదాలు లేకుండా పనిచేయాలని ఎంపీటీసీలను జడ్పిటిసి లను ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది
ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ..ప్రజా సంపదను అడ్డగోలుగా దోపిడీ చేస్తుందని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సహజ వనరులను నిలువుగా దోపిడి చేస్తూ..లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నేడు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు ఇసుక మాఫియాను పెంచి పోషించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజ్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు చేసిన ఇసుక దందా వల్ల టేకుమట్ల మండలంలోని మానేరు వాగులో ఇసుక దిబ్బలు లేకుండా పోవడంతో భూగర్భ జలాలు అడుగంటుకు పోయాయని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆయన అనుచరులు సైతం ఇసుక దందా చేయడం వల్ల ఇసుక దిబ్బలు పూర్తిగా లేకుండా పోతున్నాయని, దీంతో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటుకుపోయి రైతాంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు అండగా నిలిచిన గత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..వారి అనుచరులు ఇసుక మాఫియాపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఏమిటని నిషిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఇసుక మాఫియాలో ఆరి తేరిన ఈ దొంగల ముఠా చీకటి కోణంలో ఇసుకను అక్రమంగా పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. జెసిబిల సహాయంతో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ఇసుకను తోడేళ్ల లాగా తోడుస్తూ..ఒక రహస్య ప్రదేశంలో డంప్ చేసి..రాత్రిపూట పట్టణ ప్రాంతాలకు తరలిస్తూ..ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో, దేవాలయాల నిర్మాణాల పేరుతో, అభివృద్ధి పనుల పేరుతో అధికారుల వద్ద అనుమతి పత్రాలు తీసుకొని అక్రమ ఇసుక దందాకు తెరలేపిన ఘనుడు అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇదే తరహాలో ఇసుక దందాకు తెర లేపితే..ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక దందాను ఆపకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. త్వరలో జరగబోయే స్థానిక స్థానిక సమరంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు గట్టిగా శ్రమించి..బార్డర్ లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల వలె కష్టపడి పనిచేసి టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తూ..నేడు ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ..స్థానిక సమరంలో గెలవాలని ఆయన కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను స్థానిక సమరంలో ఎండగట్టాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడు మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య బిజెపి సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి భూత అధ్యక్షులు అశోకు రామ్మోహన్ రావు మండల నాయకుడు దొమ్మటి రవీందర్ దేశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు
రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసనకు చేశారు. చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ) ఎస్సారెస్పీ కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్న జలాలను ఎగువకు మళ్ళించి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, తదితర జిల్లాలకు నీరందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే ఉండి అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సాగు, త్రాగు నీటికి ఇబ్బంది గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకు బిగ్ షాక్!
వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి కుమార్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై BNS లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
కొవ్వూరు, జులై 16: టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్యేపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ధర్మాసనం ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై BNS లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి అని స్పష్టం చేసింది.
ఏడు ఏళ్ల లోపు శిక్ష..!
పిటిషనర్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్ని ఏడు ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు అని నల్లపురెడ్డి తరపు న్యాయవాది మనోహర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సెక్షన్లు కూడా ఆయనకు వర్తించవు అని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి తొలిరోజు ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి మళ్ళీ రెండవ రోజు కూడా పునరుద్ఘాటించారు అని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. పోలీసులు పెట్టిన సెక్షన్లు అన్ని ఏడేళ్లు లోపు శిక్ష పడేవి కావడంతో ప్రసన్నకుమార్ రెడ్డి ను BNS లోని 35(3) ప్రకారం పిలిచి విచారించాలని ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టడంతో వెనుకబడ్డ కులస్థుల (బీసీ) జనాభాపై క్లారిటీ వచ్చింది. మొత్తం రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలపై ఆ కులాలకు చెందిన ఆశావహులు గురిపెడుతు న్నారు.
జనాభా దామాషా ప్రకారం పెరగనున్న కోటా
ఈసారి 42 శాతం పెంపునకు ప్రభుత్వం ఆర్డినెన్స్
గత ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీల పాగా
పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వారిదే పై చేయి
మంచిర్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం (Congress Government) కులగణన చేపట్టడంతో వెనుకబడ్డ కులస్థుల (బీసీ) జనాభాపై క్లారిటీ వచ్చింది. మొత్తం రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలపై ఆ కులాలకు చెందిన ఆశావహులు గురిపెడుతు న్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం బీసీలకు సముచి త స్థానాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అ సెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా బీసీ లకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలం టూ బీసీ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చే స్తున్నాయి. ఈ నేపథ్యంలో గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలు సత్తా చాటిన విషయమై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీసీలకు 22 శాతమే రిజర్వేషన్ కల్పించగా అప్పటి ఎన్నికల్లో బీసీ కులస్తులు తమ ప్రభావాన్ని చాటారు. ఈ సారి ఎన్ని కల్లో 42 శాతం రిజర్వేషన్‌లను ఆర్డినెన్స్ మార్గంలో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బీసీల ప్రాతినిథ్యం మరింతగా పెరుగుతుందన్న అభి ప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లో పెరిగిన బీసీల ప్రాతినిఽథ్యం…
2019 పంచాయతీ ఎన్నికల్లో బీసీలు తమ ప్రాతిని ఽథ్యాన్ని పెంచుకున్నారు. అప్పుడు జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రభుత్వం కేవలం 22శాతమే రిజర్వేన్లు క ల్పించినప్పటికీ జనరల్ స్థానాల్లోనూ పోటీచేసి బీసీలు సత్తాచారు. 2019లో జిల్లాలో 311గ్రామపంచాయ తీ లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వీటిలో బీసీ రిజర్వుడ్ పంచాయతీలు 49ఉన్నాయి. అవి పోను జన రల్ స్థానాల్లోనూ బీసీలు 83 స్థానాల్లో గెలిచారు. కాగా ఆ ఎన్నికల్లో మొత్తం 132 పంచాయతీలను బీసీలు గెలిచి సత్తా చాటారు.
అలాగే జిల్లాలోని 130 ఎంపీటీసీ స్థా నాలకు గాను 13 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. వాటికి అదనంగా జనరల్ స్థానాల్లోనూ 38సీట్లను బీసీ లు గెలుచుకున్నారు. మొత్తంగా ఎంపీటీసీ స్థానాల్లో 51 సీట్లు గెలిచిన బీసీలు తమ ఆధిపత్యం కొనసాగించా రు. అలాగే జిల్లాలో 16జడ్పీటీసీ స్థానాలకు గాను బీసీ రిజర్వేషన్ స్థానాలు రెండు ఉన్నాయి. ఇవి పోను జన రల్ స్థానాల్లో నాలుగింటిని బీసీలు గెలచుకోగా మొత్తం గా ఆరుగురు బీసీలు జడ్పీటీసీలుగా ఎంపికయ్యారు. కేవలం 22శాతం రిజర్వేషన్‌తోనే గత ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు, ఈసారి దాదాపు రెట్టింపు స్థానాలు రిజ ర్వ్ అయ్యే అవకాశం ఉండటంతో… చట్టసభల్లో తమ ప్రాతినిథ్యం మరింతగా పెంచుకోవాలనే కుతూహలంతో ఉన్నారు.
జనరల్ కోటాలో బీసీల పట్టు…
జిల్లా వ్యాప్తంగా బీసీలు తమ కోటాను మించి గత ఎన్నికల్లో విజయం సాధించగా, రాబోయే ఎన్నికల్లో కూ డా అదే ఒరవడి కొనసాగించేదుకు సన్నాహాల్లో ఉన్నా రు. జిల్లా వ్యాప్తంగా ఈ సారి 306 గ్రామ పంచాయ తీలు (మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 5 పంచా యతీలు విలీనం అయ్యాయి) ఉండగా జనరల్ కోటాలో నూ తమ పట్టు బిగించేందుకు బీసీలు ఇప్పటి నుంచే సాధ్యా సాధ్యాలపై కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని జనాభాలో 56 శాతానికిపైగా బీసీలు ఉండడంతో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా ప్ర యత్నాలు జరుగుతున్నాయి. బీసీల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఆర్డినెన్స్ మార్గంలో రాబోయే స్థా నిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు మంత్రి వర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మండలం, జిల్లా, రాష్ట్ర యూనిట్లుగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు పంచాయ తీరాజ్ చట్టం-2018కి సవరణలు కూడ చేపట్టబోతోంది.
ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ..
ఆర్డినెన్స్ విడుదలకాగానే పంచాయతీరాజ్‌శాఖ రిజ ర్వేషన్లను ఖారారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించనుంది. ఎన్నికల కమిషన్ ముం దుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేయనుంది. కాగా ఓ వైపు రిజర్వేషన్ల ఖరారుపై పంచాయ తీరాజ్‌శాఖ కసరత్తు చేస్తుండగా, మరోవైపు ఎన్నికల నిర్వహణకూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పంచాయతీరాజ్‌శాఖ చట్ట స వరణఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించిన వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తికా గానే గరిష్టంగా 30 రోజుల్లో పరిషత్, సర్పంచ్ ఎన్నికల ను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ కరసత్తు చేస్తోంది. ఈ లెక్కన ఆగస్టు చివరి వరకు స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఆశావహులు టికెట్ల కోసం తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు.
గుండాల కో ఆపరేటివ్ సోసైటి లో యూరియా రైతులు ఆందోళన కార్యక్రమం లో బహుజన సమాజ్ పార్టీ నాయకుడు బొమ్మెర రాంబాబు, తెలుగు దేశం పార్టీ నాయకులు తోలెం సాంబయ్య పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా డిస్ట్రిబ్యూషన్ కొరత తీవ్రంగా ఉందని సంబందిత జిల్లా అదికారి రైతులకు యూరియా కొరతలేదని చెప్పిన గుండాల మండలం లో యూరియా అందక రైతులు నాన కష్టాలు పడుతున్న గుండాల మండల వ్యవసాయ శాఖ అధికారులకు నీమ్ముకు నీరెత్తి నట్లుగ వ్వవకరిస్తున్నరని సంబందిత జిల్లా అధికారులు స్పందిస్తూ యూరియా రైతుల సమస్య పరిష్కారించాలని కోరారు. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాలకు చెందిన రైతులు తెలుగుదేశం నాయకులు ఇల్లెందుల నర్సిములు, అప్పారావు,సొలం చొక్కరావు బహుజన సమాజ్ పార్టీ నాయకుడు సల్లూరి రమేష్ పాల్గొన్నరు.
ఉచిత వైద్య శిభిరం కార్యక్రమాన్నీ” ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్ మరియు ఝరాసంగం మండల పెద్దల చేతుల మీధుగా ప్రముఖ “హోలీస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఝరసంగం మండల కేంద్రంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థోమలాజీ, ఇంటర్నల్ మెడిసిన్ తో పాటు ఈసిజీ, ఆర్థో, కంటి, బిపి, డయాభైటిక్ షుగర్ తదితర పరీక్షలు అంధుబాటులో ఉన్నయి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని వారి నివాసంలో గన్నేరువరం లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు పటేల్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు బాలయ్య ఆధ్వర్యంలో కలిసి అసంపూర్తిగా ఉన్న సంఘ భవనం మరియు కాంపౌండ్ నిర్మాణానికి ఎంపీ ఫండ్స్ నుండి పది లక్షల రూపాయలను మంజూరు చేసి గన్నేరువరంలో ఉన్న రెండు వందల మున్నూరు కాపు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే నిధులు మంజూరు అయ్యేవిధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈకార్యక్రమంలో గన్నేరువరం మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు పుల్లెల రాము, నాయకులు పుల్లెల జగన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే మండలాల వారిగా పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ కార్యాచరణను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామని స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపిదేయంగా ఎన్నికల బరిలో నిలుస్తామని హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు పోటీ చేస్తామని ఇందుకు అనుగుణంగా క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేటికీ అర్హులకు పంపిణీ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్లు నిర్మించి పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దేనమిది నెలలు గడుస్తుందని అటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయకపోవడం పేదల పట్ల ఆపార్టీలకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుందన్నారు. తక్షణమే జమ్మికుంట మండలంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ఇండ్లను పంపిణీ చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకొని అర్హులైన వారందరికీ సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈవిలేకరుల సమావేశంలో జమ్మికుంట, ఇల్లందకుంట సిపిఐ మండల కార్యదర్శిలు గజ్జి ఐలయ్య, మాదారపు రత్నాకర్ నాయకులు బొజ్జం రామ్ రెడ్డి, సారయ్య, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం పి.ఎం సడక్ యోజన కింద పూర్తయిన ఐలోని కొండపర్తి రోడ్డు
నేటి ధాత్రి అయినవోలు
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరైన అయినవోలు నుంచి కొండపర్తి మీదుగా వెళ్లే డబుల్ బీటీ రోడ్డు పూర్తయిన సందర్భంగా బిజెపి అయినవోలు మండల అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాదాసు ప్రణయ్ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారానే కొండపర్తి వయా ములకలగూడెం & ఒంటిమామిడిపల్లి గ్రామాల రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కింద పూర్తయినది. అందుకు కృతజ్ఞతగా కొండపర్తి గ్రామ పంచాయితీ దగ్గర మోదీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేశారు. మాదాసు ప్రణయ్ మాట్లాడుతూ రోడ్డు పొడవు 5.682 కి.మీ. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా పూర్తిగా మంజూరై నిర్మించడం జరిగింది కావున గ్రామాల అభివృద్ధి మోదీ వలనే జరుగుతుంది కాబట్టి స్థానిక ఎన్నికలలో భాజాపా అభ్యర్థుల గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం ప్రతి గ్రామంలో హరితహారం ఉందా పల్లె ప్రకృతి వనం, వీధిలైట్లు, స్మశాన వాటికలు, రేషన్ బియ్యం, పీఎం కిసాన్ నిధి, ముద్ర లోన్స్ ద్వారా వ్యక్తిగత వ్యాపారాలకు అభివృద్ధి, ప్రతి ఇంటికి ఉచిత మరుగుదొడ్లు, రైతు వేదిక, గ్రామాల అభివృద్ధి జరుగుతున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం తోటే అని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవితేజ గౌడ్, శక్తి కేంద్రం ఇంచార్జ్ కోట కిరణ్, మడ్డి రాజేష్,సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, కట్ట విజయ్, పోషలా రమేష్, కట్ట సాంబరాజు,చుక్కారావు, మహేష్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్, భూపతి, రాకేష్, హరీష్, వినయ్ ,రాజేందర్, శంకర్, జక్కోజు సాయిరాం తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గీతే, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలతో కలిసి సైకిళ్ళు పంపిణీ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం రూపంలో రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోడీ గిఫ్ట్ పేరిట 10వ తరగతి చదివే బాల బాలికలకు ఉచితంగా సైకిల్ అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు మొదటి ఆస్తి సైకిల్ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సైకిల్స్ అందించామని అన్నారు.నాణ్యమైన సైకిల్ అందిస్తున్నామని, వీటిని వినియోగించి విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కావాలని పేర్కొన్నారు.
Bandi Sanjay
రాబోయే సంవత్సరాలలో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ కింద సైకిల్స్ అందిస్తామని అన్నారు. ఎల్.కే.జి నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోడి కిట్స్ పేరిట బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు వివిధ పనులపై వచ్చినప్పుడు వారితో చర్చించి సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. చిన్నతనంలో గంటకు 15 పైసలు, 40 పైసలు కిరాయి తెచ్చుకొని సైకిల్ నడిపేవారిమని కేంద్రమంత్రి గుర్తు చేసుకున్నారు. సైకిల్స్ వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. చిన్నతనం నుంచి అనేక ఇబ్బందులు గురైనప్పటికీ బాబా సాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకొని దేశానికి రాజ్యాంగం రచ్చించే స్థాయికి ఎదగారని అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు. యూ.పి. రాష్ట్రానికి చెందిన కలెక్టర్, మహా రాష్ట్ర కు చెందిన ఎస్పీ క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో కృషి చేయడం వల్ల గొప్ప స్థాయికి ఎదిగామని అన్నారు. విద్యార్థులు ఉదయం సమయంలో చదువుకోవాలని, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.
Bandi Sanjay
విద్యార్థులు పట్టదలతో పని చేస్తుందని, 2014 కంటే ముందు విద్య కోసం 68 వేలకోట్లు కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం ప్రస్తుతం 1,25,000 కోట్లు ఖర్చు చేస్తుందని, ఏకలవ్య పాఠశాలలు నవోదయ పాఠశాలలు సైనిక్ స్కూల్స్ క్రమశిక్షణకు మారుపేరుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. రోడ్డుపై సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని , ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, 20 రోజుల తర్వాత సర్వీసింగ్ చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు సైకిల్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. చిన్నతనంలో సర్వ శిక్షా అభియాన్ లో చదువుకునే రోజుల్లో తాను పడిన ఇబ్బందులు విద్యార్దులకు ఉండవద్దని బహుమతిగా సైకిల్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థులు బాగా చదువుకోవాలని, మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్సీ తెలిపారు. మోడీ గిఫ్ట్ పేరిట అందిన సైకిల్స్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, రోడ్డు పై జాగ్రత్తగా నడపాలని అన్నారు. ఎస్.ఆర్. ట్రస్ట్ తరపున విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకునేందుకు వీలుగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు.
Bandi Sanjay
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సిరిసిల్ల జిల్లాలో 4 వేల సైకిళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. రక్త విద్యా సంవత్సరం సిరిసిల్ల జిల్లాలో 10 వేల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ,విద్యార్థులకు ఎంపీ మంచి సైకిల్స్ అందించారని, వర్షా కాలంలో రోడ్లు స్కిడ్ అధికంగా అవుతాయని, విద్యార్థులు జాగ్రత్తగా నడపాలని అన్నారు. అనంతరం కాలేజీ గ్రౌండ్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంబించి కొంత దూరం సైకిల్ సవారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఇన్చార్జి డిఈఓ వినోద్ కుమార్, స్థానిక నాయకులు, విద్యార్థులు, ప్రజలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ యువజన అధ్యక్షుని జన్మదిన వేడుకలు
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల యువజ న కాంగ్రెస్ అధ్యక్షుడు సాధు నాగరాజు జన్మదినం సంద ర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నాగరాజుకు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాగరాజు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరె న్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యా లతో ఉండాలని కోరారు.
బిఆర్ఎస్ బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని.. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇందిరమ్మ పాలన నడుస్తుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామం నుంచి బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన 9 కుటుంబాలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తనను నమ్మివచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని,ప్రజా ప్రభుత్వ ప్రతి సంక్షేమ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.పార్టీలో చేరిన వారిలో ఏడ్డే బాపూరావు, పేరం రాజు,వేల్పుల అశోక్, వేల్పుల నాగరాజు, వేల్పుల సిద్దు,తౌట్ రెడ్డి రాజిరెడ్డి, కొమాండ్ల రాజేందర్, నల్ల సంజీవ, మంద కుమారస్వామి ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరు కిరణ్ రెడ్డి,మండల కోశాధికారి జంగిలి రవి,గుడ్డెలుగులపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు జంగిలి నగేష్,తొర్రూరు నర్సయ్య, జంగిలి రాజు, జంగిలి రమేష్,తొర్రూర్ రవి, తొర్రుర్ రామన్న, గుండెకారి సునీల్, , పిఎసిఎస్ దుగ్గొండి మాజీ డైరెక్టర్ పొగాకు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తిలో ఎమ్మెల్యే కృషితో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం
వనపర్తి నేటిదాత్రి ,
వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు పాన్ గల్ కొత్తకోట రోడ్డులో నిలిచి పోయిన రోడ్ల విస్తరణ పనులు స్థానిక ఎమ్మెల్యే ప్రజల కోరిక మేరకు రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంతో కాలం గా కర్నూల్ రోడ్ పా న్ గల్ కొత్తకోటరోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో రోడ్డు కటింగ్ పెండింగ్ లో ఉంచినట్లు ప్రచారంలో ఉంది . వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి కర్నూల్ రోడ్ పానగల్ రోడ్డు విస్తరణలో నష్టపోయే బాధితులను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు . కర్నూల్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ తన భవనాన్ని స్వచ్ఛందంగా కూలగొట్టుటకు ముందుకు వచ్చినందుకు ఎమ్మెల్యే మెగా రెడ్డి అభినందించారు . భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వివేకానంద రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు నుండి మరి కుంట వరకు పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు వెడల్పు పనులు చేయిస్తున్నందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతునారు వనపర్తి లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వనపర్తి లో రోడ్ల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయించాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఫాదర్ పాషా ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆర్ అండ్ బి అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి జిల్లా అధికారులకుఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో పర్యటించారు. రూ.52 లక్షలతో వివిధ గ్రామాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ధర్మారావుపేట గ్రామంలో ఎమ్మెల్యే యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలోని శివాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బసవరాజుపల్లి గ్రామంలో యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, రూ.12 లక్షలతో నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. గొల్లపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో పంచాయతీరాజ్ రోడ్డు నుండి పోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్దే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి, రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, ఎంపీడీవో ఎల్ భాస్కర్ మండల అధ్యక్షుడు జిల్లా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఎంపీటీసీ భవిత సుధాకర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్ల మల్లయ్య భాస్కరరావు చింతకుంట్ల శ్రీను పైసా మొగిలి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
దుండగుడిని శిక్షించాలి ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్
నిజాంపేట: నేటి ధాత్రి
కుల్చారం మండలంలో సబ్ స్టేషన్ సమీపంలో పైతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత అనిల్ ను దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చైతన్య కార్యకర్తగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. హత్య చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఠా వసూళ్ల దోపిడీ చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ,ఎమ్మెల్యేలు,నాయకులు ప్రాముఖ్యతను తగ్గించారని పేర్కొన్నారు.నర్సంపేటలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వందల కోట్ల నిధులతో పనులను చేపట్టగా ఆ పాత పనులను మాధవరెడ్డి సొంత కాంట్రాక్ట్ మార్చుకుంటున్నాడని ఆరోపించారు.అలాగే తండాలలో కొన్ని కోట్ల బిటి రోడ్ల పనులు చేపట్టగా వంద శాతం పనులను రద్దుచేసారని ధ్వజమెత్తారు.అలాగే రైతులకు రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లనే ఆ రుణ మాఫీ పూర్తికాలేదన్నారు.రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో రద్దుచేస్తుందని ఎద్దేవా చేశారు. జిల్లా వ్యాప్తంగా వాటాల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య కొట్లాట కుక్కల కొట్లాటగా మారిందని, సొంత కాంట్రాక్ట్ పనుల కోసం పాత పనులను రద్దు చేసి, సొంత కాంట్రాక్ట్ కంపెనీకి అగ్రిమెంట్ అయ్యేలా వాటినే కొత్తగా మంజూరు అయ్యాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై పరోక్షంగా ఆరోపించారు. రైతుల కోసం యూరియాపై సంబంధిత అధికారులతో ఎప్పుడైన సమీక్షించారా.?అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కాగా మళ్ళీ పాతరోజులు తెస్తామంటూ చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు రైతులు యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టిదందా చేస్తుంటే రెవిన్యూ అధికారులు దందాలో వాటా దారులుగా ఉన్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హాయంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడ్డుకున్న వివరాలు,ఆయన అనుచరుల అరాచకాలను రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు వివరించి ప్రజల తీర్పుతో అధికారపార్టీ నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి ,మాజీ జెడ్పీటీసీ జయ గోపాల్ రెడ్డి , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహరాములు, మోటూరి రవి,వల్లాల కర్నాకర్,అల్లి రవి,క్లస్టర్ బాధ్యులు,మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మాదాసి రవి మాట్లాడుతూ పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాబోయే మున్సిపల్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో సీట్లు గెలిపించేందుకు భాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు అవకాశం కల్పించిన నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి, టిపీసీసీ సభ్యులు, పట్టణ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
వర్షాలు సకాలంలో కురవాలని సంకల్ప పూజ చేసిన బిజెపి నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
సకాలంలో వర్షాలు పడి రాష్ట్రము దేశములోని ప్రజలు పశుపక్షాధులు సమస్త జీవకోటి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని దొంగల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి సుభాష్ కాలనీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వర్షాలు సకాలంలో కురవాలని బిజెపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సంకల్ప పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో వరుణ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం వర్షాలు కురవాలని సీతారాములకు వాసు అయ్యగారుచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంకల్పం నెరవేరాలని సీతారాములను ప్రార్థించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా వర్షాల కోసం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని అన్నారు సమృద్ధిగా వర్షాలు పడితే రైతులు మనకోసం పండించే పంట చేతికి వస్తుందని రైతుల ఆనందంగా ఉంటేనే సమస్త జీవకోటి ఆనందంగా ఉంటుందని కావున కనీసం మనం ప్రత్యక్షంగా రైతుల కోసం ఏమి చేయలేము కనీసం వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తే రైతులకు అండగా ఉన్న వాళ్ళం అవుతామని అన్నారు ప్రకృతి సస్య శ్యామలంగా ఉండడంకోసం ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనకూలంగా జీవించాలని అన్నారు ప్రకృతి ఆగ్రహిస్తే ప్రజలు సంతోషంగా జీవించలేరని అన్నారు వర్షాల కోసం ప్రతి ఒక్కరు భగవంతుని ప్రార్థించి భాగస్వాములు కావాలని ప్రజలను రాజేందర్ కోరారు ఈ కార్యక్రమంలో బట్టు రవి కంబాల రాజయ్య సామల మధుసూదన్ రెడ్డి తుమ్మేటి రామ్ రెడ్డి అజ్మీర రాజు నాయక్ కరివేద మనోహర్ రెడ్డి ఊరటి మునేందర్ కoచెం నరసింహమూర్తి గుండె శీను పొన్నాల కొమురయ్య తాండ్ర హరీష్ చెక్క శంకర్ శ్రీధర్ దొంగల కుమార్ తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.