kishanreddyki matruviyugam, కిషన్‌రెడ్డికి మాతవియోగం
కిషన్‌రెడ్డికి మాతవియోగం బీజేపీ నేత కిషన్‌రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ (80) కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత అండాలమ్మ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం ఆమె స్వస్థలం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. కిషన్‌రెడ్డి తల్లి మృతిచెందిన విషయం తెలిసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమె మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపి, కిషన్‌రెడ్డిని పరామర్శించారు.