mayor badyathala swekarana, మేయర్ బాధ్యతల స్వీకరణ
మేయర్ బాధ్యతల స్వీకరణ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ నూతన మేయర్గా గుండా ప్రకాష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికై బల్దియా ప్రధాన కార్యాలయంలో భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ గుండా ప్రకాష్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏకం చేస్తూ గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.