మెగా మాస్‌….

మెగా మాస్‌

చిరంజీవి కథానాయకుడిగా వ శిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఇటీవలే చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ ప్రత్యేక గీతాన్ని…

చిరంజీవి కథానాయకుడిగా వ శిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఇటీవలే చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన మాస్‌ బీట్‌కు చిరుతో బాలీవుడ్‌ భామ మౌనీరాయ్‌ స్టెప్పులేశారు. ఈ గీతానికి గణేశ్‌ ఆచార్య నృత్యరీతులు సమకూర్చారు. ఈ సందర్భంగా సెట్స్‌లో చిరంజీవితో దిగిన ఫొటోలను మౌనీరాయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చిరంజీవి సర్‌తో కలసి డాన్స్‌ చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆమె తెలిపారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

సామ్‌ – రాజ్‌ మళ్లీ దొరికేశారు..

సామ్‌ – రాజ్‌ మళ్లీ దొరికేశారు.. ఈసారి ఎక్కడంటే..

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారని చాలాకాలంగా టాక్‌ నడుస్తోంది. ఇద్దరూ చెట్టాపటాలేసుకుని షికార్లు తిరగడం, తరచూ ఫొటోలు షేర్‌ చేయడంతో ఇద్దరిపై గాసిప్పులు రెట్టింపు అయ్యాయి.

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత(Samantha), దర్శకుడు రాజ్‌ నిడిమోరు (Raj nidimoru) డేటింగ్‌లో ఉన్నారని చాలాకాలంగా టాక్‌ నడుస్తోంది. ఇద్దరూ చెట్టాపటాలేసుకుని షికార్లు తిరగడం, తరచూ ఫొటోలు షేర్‌ చేయడంతో ఇద్దరిపై గాసిప్పులు రెట్టింపు అయ్యాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి కెమెరా కంటికి చిక్కారు. సామ్‌, రాజ్‌ ఒకే కారులో వెళ్తున్న (Dinner Date) వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.   ఆ ప్రాంగణం చూస్తే రెస్టారెంట్‌లా అనిపిస్తోంది. ఇద్దరూ కలిసి డిన్నర్‌ డేట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. కారులో ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియోతో మరోసారి ఇద్దరూ వార్తల్లో నిలిచారు. రాజ్‌-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’లో సమంత నటించారు. ఆ ప్రాజెక్ట్‌కు పని చేస్తున్న తరుణంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఎవరెన్ని కామెంట్లు చేసినా ఈ ఇద్దరూ మాత్రం ఎక్కడా స్పందించలేదు. డేటింగ్‌ వార్తలు వస్తూనే ఉన్నాయి, రాజ్‌ భార్య  శామలీ డే ఎన్నోసార్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కామెంట్స్‌ చేసినా రాజ్‌, సమంత సైలెంట్‌గా ఉన్నారు. (Samanatha and Raj

సమంత కీలక పాత్రలో రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన సిటాడెల్‌ సిరీస్‌ గతేడాది విడుదల కాగా, మిశ్రమ స్పందనకే పరిమితమైంది. తదుపరి సామ్‌ నిర్మాతగా మారి అంతా  కొత్తవారితో ‘శుభం’ సినిమా తీసింది. ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం సినిమా పనిలో ఉన్నారు. అలాగే సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌పై కొత్త కథలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా ఆమెతో జబర్దస్ట్‌, ఓ బేబీ చిత్రాలు తీసిన నందిని రెడ్డితో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు సమంత. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు…

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత మూడు, నాలుగు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన ధరలు ఊహించని విధంగా మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం ఎంతకు చేరాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం, వెండి ధరలు మళ్లీ సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గత మూడు నాలుగు రోజులుగా తగ్గిన ధరలకు బ్రేక్ (Gold and Silver Prices on July 31st 2025) పడింది. ఈ నేపథ్యంలో జూలై 31న ఉదయం 6:10 గంటల సమయంలో, గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు నిన్నటి రేట్లతో పోలిస్తే మళ్లీ పెరిగాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.680 పెరిగి రూ.1,00,490కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.92,110 స్థాయికి చేరింది. వెండి ధర కూడా కిలోగ్రాముకు రూ.1,200 పెరిగి రూ.1,17,100కి చేరుకుంది. ఈ ధరల పెరుగుదల భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా కనిపించింది.

ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు

  • ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,00,640, 22 క్యారెట్ల బంగారం రూ.92,260, వెండి కిలోగ్రాముకు రూ.1,17,100.
  • చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100.
  • ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100.
  • విజయవాడ: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,27,100.
  • విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,17,100.
  • బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ.1,00,490, 22 క్యారెట్ల బంగారం రూ.92,110, వెండి రూ.1,17,100.
  • ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే సమయంలో వీటి ధరల గురించి మళ్లీ తెలుసుకోవడం ఉత్తమం.

ధరల పెరుగుదలకు కారణాలు

బంగారం, వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఈ సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. బంగారం ధరలు సాధారణంగా డాలర్ బలహీనపడినప్పుడు పెరుగుతాయి. బంగారం ఉత్పత్తి స్థిరంగా ఉండటం, కొత్త గనుల అన్వేషణ తగ్గడం వల్ల సరఫరా పరిమితమవుతోంది. ఇది కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది.

భవిష్యత్తులో ఎంతకు చేరుతుంది

నిపుణుల అంచనాల ప్రకారం, 2025 చివరి నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1.25 లక్షలకు చేరుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకు 4,500 డాలర్లకు చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. వెండి ధరలు కూడా దీపావళి నాటికి రూ.1,20,000కి చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కార్మికుల చెమట జుర్రుకుంటున్నారు?

`హీరోలను నెత్తిమీద.. కార్మికులను కాళ్ళ కింద

`నిర్మాతలు ఏళ్ల తరబడి కార్మికుల రక్తం తాగుతున్నారు.

`కనికరం లేకుండా కార్మికుల కష్టం దోచుకుంటున్నారు.

`అబద్దాల లెక్కలు చెబుతారు!

`సినిమాకు కోట్లు ఖర్చు పెడుతున్నామంటారు.

`కార్మికులకు వందలు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడతారు.

`రోజు వారీ కూలీ ఇచ్చేందుకు నెలల సమయం తీసుకుంటారు.

`కార్మికులను మర మషులకన్నా ఎక్కువ వాడుకుంటున్నారు.

`సమయపాలన లేకుండా గంటల తరబడి పని చేయించుకుంటారు.

`కార్మికుల సినిమా పిచ్చిని ఆసరా చేసుకుంటున్నారు.

`కార్మికుల బతుకులు బండలు చేస్తున్నారు.

`ఏడాదికి పది శాతం పెంచడానికి ఏడుస్తున్నారు?

`మూడేళ్లకు ముప్పై శాతానికి ముక్కుతున్నారు!

`కార్మికుల కష్టం దోచుకుంటున్నారు.

`వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు.

`కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్నారు.

`పని గంటలకు లెక్క లేకుండా పని చేయించుకుంటున్నారు.

`కార్మికులను వేధించుకు తింటున్నారు.

`మూడేళ్లు గడిచినా జీతాలు పెంచడానికి ముఖం చాటేస్తున్నారు.

`రాసుకున్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

`తుమ్మితే ఊడిపోయే ముక్కులుగా తీసిపడేస్తున్నారు.

`కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారు.

`కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు.

`కార్మికులపైనే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు.

`సమ్మె చేస్తే సస్పెండ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు.

`గుర్తింపు కార్డులు రద్దు చేస్తామంటున్నారు.

`బెదిరించి కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు.

`కార్మికులకు న్యాయం జరిగే వరకు ‘‘నేటిధాత్రి’’ అక్షర పోరాటం చేస్తుంది.

`కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతుంది.

`నిబంధనల ప్రకారం జీతాలు పెంచే దాక పోరు సాగిస్తుంది.

`హీరోలను నెత్తిమీద, కార్మికులను కాళ్ల కింద చూసే సంస్కృతి మారాలి.

`కార్మికులకు సినీ రంగంలో ఆత్మ గౌరవం పెరగాలి.

`కార్మికు చట్టాల ప్రకారం జీతాలు పెరగాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సినిమా ఒక కళావ్యాపారం. ఆ సినిమా అనేది ఎంతో మంది కలిసి చేసే కృషి. కొన్ని వందల మంది కలిసి పనిచేస్తే పూర్తయ్యే యజ్ఞం. తెర మీద కనిపించే నటులే కాదు, ఆ తెరమీద బొమ్మలు ఆడడానికి అవవసరమయ్యే వారు ఎంతో మంది కష్టం కలిసి వుంటుంది. కాని అవేవీ పైకి కనిపించవు. వాళ్లెవరో ప్రపంచానికి తెలియదు. కాని వారి కష్టంకూడా సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా అనేది ఏ ఒక్కరో తయారు చేస్తే పూర్తయ్యే వంటకంకాదు. అందరూ కలిస్తేనే పూర్తవుతుంది. అలాంటి సినిమాకు 24 క్రాఫ్ట్స్‌ వర్స్‌ వుంటాయి. లైట్‌ బాయ్‌ దగ్గర నుంచి మొదలు పెడితే, దర్శకుడి వరకు అందరూ శ్రమించాల్సిందే. ఏ పని విభాగాన్ని బట్టి వారి కష్టం ఆధారపడి వుంటుంది. కాని ఏం లాభం. హీరోలకు ఇచ్చేంత రెమ్యునరేషన్‌, హీరోయిన్లకు ఇవ్వరు. దర్శకుడికి ఇచ్చేంత సొమ్ము, ఇతర విభాగాలకు ఇవ్వరు. ఎవరికి ఇచ్చినా అది కేవలం పారితోషికం మాత్రమే. నిర్ధిష్టమైన, నిర్ధారిత సొమ్ము కాదు. నిర్మాతలు సినిమా నిర్మాణాన్ని బట్టి నిర్ణయం చేసేది. సినిమా నటుల విషయంలో బేర సారాలుంటాయి. ఎందుకంటే ఆ విలువ వేలల్లో, లక్షల్లో వుంటుంది. హీరోల విషయంలో కోట్లలో వుంటుంది. కాని లైబ్‌ బాయ్‌కి మాత్రం పారితోషికం వందల్లోనే వుంటుంది. వేలు దాటింది ఇప్పటి వరకు లేదు. బైట అడ్డాకూలీలకంటే అద్వాహ్నంగా వుంటుంది. ఆ వందల రూపాయల పారితోషికమైనా నిత్యం వుంటుందా? అంటే అదీ లేదు. సినిమా వాళ్లు పిలిచినప్పుడు మాత్రమే వుంటుంది. ఆ సినిమా పూర్తయ్యే వరకు మాత్రమే వుంటుంది. ఇక వీరిలో జూనియర్‌ ఆర్టిస్టుల పరిస్ధితి మరీ అద్వాహన్నం. టెక్నికల్‌ కార్మికులకు సినిమా నడిచినంత కాలం వుండొచ్చు. కాని జూనియర్‌ ఆర్టిస్టులైన కార్మికులకు మాత్రం సినిమాలో జూనియర్‌ ఆర్టిస్టులు అవసరం వున్నంత కాలం మాత్రమే వుంటుంది. ఆ సినిమా అయిపోయిన తర్వాత మరో సినిమా వచ్చేదెప్పుడో తెలియదు. అంత వరకు ఖాళీగానే వుండాలి. ఇంత కష్టపడి సినిమాలోనే ఎందకు పనిచేయాలన్న ప్రశ్న కూడా ఉత్పన్నతమౌతుంది. సినిమా అనేది ఒక వ్యసనం. అదో రంగుల ప్రపంచం. కొందరు తమ టాటెంట్‌ను ప్రదర్శించే రోజు రాకపోతుందా? అప్పటి వరకు ఏదో పని చేసుకోవాలన్న ఆలోచనతో పనిచేస్తుంటారు. అలా ఆ రంగంలోకి చేరిన వారు మళ్లీ బైటకు రాలేరు. జీవిత కాలం ఎదురుచూస్తూ ఆ పరిశ్రమలోనే కాలం కరిగిపోయిన వారు ఎంతో మంది వున్నారు. ఆకలి దహిస్తున్నా, సమస్యలు పరిగెత్తిస్తున్నా సినిమాను విడిచి వెళ్లలేరు. సినిమాను కాదనుకొని బతకలేరు. అది వారి బలహీనత. ఇదే నిర్మాతల పాలిట వరమైపోతోంది. ఇప్పుడే కాదు కొన్ని దశాబ్ధాలుగా ఈ దోపిడీ జరుగుతూనే వుంది. ఆ సినిమా ప్రపంచంలో జరుగుతున్న దోపిడీ ఏ హీరోకు కనిపించదు. కాని సినిమా పాత్రలతో మాత్రం ఏ పరిశ్రమలో నైనా కార్మికులకు ఇబ్బందులు ఎదరైతే హీరో వెళ్తాడు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తాడు. యాజమన్యాన్ని భయపెట్టిస్తాడు. వారి చేత కార్మికులను న్యాయం చేస్తాడు. కార్మికుల చేత జేజేలు కొట్టించుకుంటాడు. సినిమా అయిపోతుంది. కాని అదే సినీ పరిశ్రమలో నిత్యం కార్మికులు పడే కష్టాన్ని దగ్గరుండి చూస్తూనే వుంటారు. వారి చేతనే హీరోలు సేవలు చేయించుకుంటారు. మీకున్న కష్టమేమిటి? అని ఏ హీరో ఏ ఒక్క కార్మికుడిని అడిగిన సందర్భం వుండదు. అది ఎంత పెద్ద హీరో అయినా సరే కార్మికుల కోసం మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలా ఎవరికి వారు ప్రతి సినిమాకు మరమనుషులను వాడినట్లు కార్మికుల కష్టం దోచుకుంటుంటారు. కోట్లరూపాయలు పెట్టి సినిమా తీస్తున్నామంటారు. లెక్కలు మాత్రం కోట్లలో చెబుతుంటారు. సినిమా నిర్మాణ విలువల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదంటారు. హీరో ఎంత రెమ్యునరేషన్‌ అడిగితే అంత ఇస్తుంటారు. కాని కార్మికుల విషయానికి వచ్చే సరికి రూపాయి, రూపాయి లెక్కలు వేసుకుంటారు. పనిగంటలకన్నా, ఎక్కువ పనిచేసినా రూపాయి ఎక్కువ ఇచ్చేందుకు ఏ నిర్మాతకు చేతులు రావు. ఏ నిర్మాత ఎంత ఇస్తే అంతతీసుకునే రోజుల నుంచి కొంత డిమాండ్‌ చేసే వరకు కార్మికులు వచ్చారు. కాని వారి డిమాండ్‌ పెద్ద విలువైందేమీ కాదు. అయ్యా…ఓ పది రూపాయలు పెంచాలంటూ చేసుకున్న విన్నపాలే. అంతకు మించి కార్మికులు డిమాండ్‌ చేసిందెప్పుడూ లేదు. ఎందుకంటే అవన్నీ తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి పనులు. మొత్తం 24 క్రాఫ్ట్‌లలో సుమారు 24వేల మందికిపైగా కార్మికులు వున్నారు. ఏ ఒక్కరు నోరు తెరిచినా, వారిని పనికి పిలువరు. అందుకే కార్మికులు నోరు తెరిచేందుకు కూడా ధైర్యం చేయరు. ఇంత మంది వుండడంతో నిర్మాతలు వద్దను కుంటే ఆ మాత్రం ఉపాధి కూడా పోతుందేమో? అన్న భయం వారిని వెంటాడుతుంది. సరే ఒక సినిమాకు పనిచేసినా అది రోజూ వారి కూలీ పని అయినా ఏ రోజుకారోజు పారితోషికం ఇవ్వరు. కొన్ని సార్లు సినిమా పూర్తయ్యే వరకు కూడా ఇవ్వరు. ఆ సినిమా పూర్తి కాకముందే మరోసినిమా మొదలు పెట్టే నిర్మాతలు, ఆ సినిమా ఆశచూపి పనిచేయించుకుంటారు. రెండో సినిమా పూర్తయ్యే నాటికి మొదటిసినిమా పారితోషికం చేతుల్లో పెడుతుంటారు. ఇలా కూడా కార్మికులను వాడుకుంటారు. వారి శ్రమను దోచుకుంటారు. ఇక కార్మికులు ఎంత సమయం పనిచేయాలన్నదానిపై కార్మిక చట్టాలు స్పష్టంగా వున్నాయి. రోజుకు ఒక కార్మికుడి చేత 8 గంటలకన్నా ఎక్కువ పనిచేయించుకోకూడదు. కాని ఆ చట్టాలను సినీ వర్గాలు ఎప్పుడో తుంగలో తొక్కేశాయి. ఒక కార్మికుడు సినిమా షూటింగ్‌ స్పాట్‌కు ఉదయం 6 గంటల వరకు చేరుకోవాలి. అంటే ఆ కార్మికుడు రాత్రి 3 గంటలకు నిద్రలేవాలి. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం6 గంటలకు పనిచేయించుకుంటారు. నిజానికి ఉదయం 6 గంటలకు వచ్చిన కార్మికుడి చేత మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేయించుకోవాలి. కాని ఆ వ్యక్తి చేత సాయంత్రం 6 గంటలకు వరకు పనిచేయించుకుంటారు. అవసరమైతే రాత్రి పది గంటల వరకు పని చేయించుకుంటుంటారు. కాని పారితోషికమేమైనా అదనంగా ఇస్తారా? అంటే అదీ లేదు. ఇలా కార్మికుల బతుకులు బండలు చేస్తున్నారు. ఇలా నిత్యం విసిగి, విసిగి వేసారిన కార్మికులు కొంత మంది 2022లో సమ్మె బాట పట్టారు. దాంతో అప్పుడున్న పిల్మ్‌ చాంబర్‌ చైర్మన్‌ దిల్‌ రాజు వారి వేతనాలను ఏటా పది శాతం పెంచాలన్న నిర్ణయం చేశారు. కాని అది మూడేళ్లకోసారి అమలు చేయాలి. మూడేళ్లకు 30శాతం చొప్పున పెంచుతూ పోవాలన్నారు. ఇప్పుడు మూడేళ్లు దాటి పోయింది. కార్మికుల రెమ్యునరేషన్‌లో 30శాతం పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కాని ఫిల్మ్‌ చాంబర్‌ స్పందించడం లేదు. కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. దాంతో కోపం వచ్చిన నిర్మాతలు, ఫిల్మ్‌ చాంబర్‌ పెద్దలు కార్మికుల మీద చర్యలు తీసుకోవాలంటూ కార్మిక శాఖకు పిర్యాధు చేసినట్లు సమాచారం. ఇది విచిత్రంగా వుంది. నిర్మాతలు తమ మాట తప్పితే, మూడేళ్ల వ్యవధి దాటినా రాసుకున్న బైలా ప్రకారం రేమ్యునరేషన్‌ చెల్లించడం లేదని కార్మికులు పిర్యాధు చేయాలి. కాని విచిత్రంగా నిర్మాతలే కార్మికుల మీద కేసులు నమోదు చేసే దాకా వెళ్లారని తెలుస్తోంది. ఇలా కార్మికులను అణిచి వేసి, భయపెట్టి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కార్మికులు కొంత మంది నేటిధాత్రిని ఆశ్రయించారు. కార్మికులకు ఇండ్ల విషయంలో నేటిధాత్రి పోరాటం వారికి తెలుసు. కార్మికుల పక్షాన నేటిదాత్రి పోరాటం, కార్మికుల విజయం చూస్తూనే వున్నారు. చిత్ర పురిపై నేటిధాత్రి కొన్ని సంవత్సరాలుగా పట్టువదలకుండా సాగిస్తున్న పోరాటంలో కార్మికులకు అనేక విజయాలు చేకూర్చిపెట్టింది. కార్మికులను నిలబెట్టింది. చిత్ర పురిలో ఎలాంటి సమస్యపైన అయినా సరే నేటిధాత్రి కార్మికుల అండగా సాగిస్తున్న పోరాటంతో 24 క్రాఫ్ట్‌ కార్మికులు కూడా ఆశ్రయించారు. తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. నిర్మాతలు చేస్తున్న అన్యాయాలను వివరించారు. తమ కష్టం నేటిదాత్రితో చెప్పుకున్నారు. తమకు న్యాయం జరగాలంటే నేటిధాత్రి వల్లనే సాద్యమౌతుందని గుర్తించారు. చిత్రపురి కార్మిక లోకమంతా నేటిధ్రాత్రికి ఎలా రుణపడి వుంటుందో, మాకు పారితోషకం విషయంలో అక్షర సాయం చేయాలని కోరుకున్నారు. దాంతో నేటిధాత్రి కార్మికుల పోరాటానికి అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నది. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నేటిధాత్రి యాజమాన్యం కార్మికులకు హమీ ఇచ్చింది.

లయన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబూరావు జన్మదినం..

లయన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబూరావు జన్మదినం పురస్కరించుకుని అన్న ప్రసాద పంపిణీ
శేరిలింగంపల్లి నేటి ధాత్రి :-

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబూరావు జన్మదినం పురస్కరించుకుని లయన్స్ క్లబ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 300 మంది స్థానికులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ హోప్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఘట్టమనేని బాబురావు జన్మదినం పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు , తమ క్లబ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, బర్క మల్లేష్ యాదవ్, సింగదాసరి రాజశేఖర్, మారం వెంకట్, శాంతి భూషణ్ రెడ్డి, విష్ణు మూర్తి, రవీందర్, డాక్టర్ శ్రీనివాస్, మారం ప్రసాద్ మురళి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు..

https://youtu.be/MeA4Sc-IO2k?si=TOtS
ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు

మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి అనిత దేవి.

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండలంలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు గువ్వాడి లక్ష్మయ్య అభినందన ఆత్మీయ వీడ్కోలు సభ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టీయూ మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని అనితా దేవి మాట్లాడుతు లక్ష్మయ్య మంచి సమయపాలన పాటించి నిబద్ధతతో,క్రమ శిక్షణతో పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగిందని అన్నారు.ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని అన్నారు.వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన లక్ష్మయ్య ను పాఠశాల పక్షాన ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు జయ, స్టేషన్ ఘన్పూర్ మండలం విద్యాశాఖ అధికారి జి కొమురయ్య, జనగాం జిల్లా సీఎమ్ఓ నాగరాజు,పిఆర్టీయూ మరిపెడ అధ్యక్షులు కేసరి రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు లింగాల మహేష్ గౌడ్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గండి కరుణాకర్ పాఠశాల ఉపాధ్యాయులు రాజేశ్వరి, గణేష్,శ్రీధర్,సంపత్,వెంకట్ రెడ్డి,సంతోషి,సిఆర్పి దోమల సత్య శ్రీనివాస్,లక్ష్మయ్య బంధుమిత్రులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ భరత్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*ఎంపీ భరత్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 29:

సినీ హీరో.., హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు.., విశాఖపట్టణం పార్లమెంటు సభ్యులు
భరత్ కి. చిత్తూరు పార్లమెంటు సభ్యులు, తెలుగు దేశం పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ ప్రసాదరావు సహచర ఎంపీలతో కలిసి బుధవారం ఢిల్లీలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని జరుపుకోవాలని.., ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నట్లు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిదాత్రి ,

పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన , శాంతమ్మ రాములు కు చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం లబ్దిదారుల తో కలిసి భూమిపూజ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయని మంజూరైన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు
కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకె దక్కుతుంది

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి- జ్యోతి నిన్న స్కూళ్లలో విస్తృత పర్యటనలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడం విడ్డూరంగా ఉంది
గడిచిన 10 సంవత్సరాలు బి ఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా అప్పుడు గుర్తుకు రాలేదా పాఠశాలల మీద వీరి ప్రేమ.
గడిచిన 10 సంవత్సరాలలో
మండల కేంద్రంలో ఒక ఎంఈఓ ను కూడా నియమించలేదు
పిల్లలకు ఎటువంటి కాస్మోటిక్ చార్జీలు, మెస్ చార్జీలు ఇవ్వలేదు.
పాఠ్య పుస్తకలు ఏక రూప దుస్తువులను ఇవ్వలేదు
వారు తినే భోజనాన్ని ఒక్కరోజు ఎలా ఉంది అని అడిగిన పాపాన పోయిన నాధుడే లేడు.
ఈరోజు మా నాయకుడు భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేక. ఏ అంశాల మీద మాట్లాడాలో తెలవక పాఠశాలల చుట్టూ తిరుగుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారు.
మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నిర్మించిన పాఠశాలను ఏ రోజైన తనిఖీ చేశారా. మీ నాయకులైన తనిఖీ చేశారా. కనీసం పాఠశాలలో ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను ఏ రోజైన భర్తీ చేశారా.
హాస్టల్లో స్కావేందర్స్ పోస్ట్ లను నియమించాలని జ్ఞానం కూడా లేకుండా మీరు మీ నాయకులు మాట్లాడుతున్నారా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను ప్రతిష్ట చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని విద్య వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయిలకు ఎదిగేలా చేయాలని దృఢ సంకల్పంతో, మా నాయకుడు కృషి చేస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్. కో ఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్. మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ. వైస్ ఎంపీపీ విడుదలైన అశోక్. మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్. గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ. మండల అధికార ప్రతినిధి మామిళ్ల మల్లికార్జున గౌడ్.వార్డ్ మెంబర్ గంధం ఓధాకర్. సీనియర్ నాయకులు బాల్య కుమార్. పూదరి రవి. ఎస్కే జానీ. దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

కంకర పరిచారు.. బీటీ మరిచారు

కంకర పరిచారు.. బీటీ మరిచారు

వెల్దండ/ నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామ బీఆర్ఎస్ నాయకుడు గండికోట రాజు ఆధ్వర్యంలో.. బుధవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.. కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు కోసం రోడ్డు తవ్వి కంకర పరిచారని నెలలు గడుస్తున్నా… బీటీ రోడ్డు నిర్మించకపోవడంతో కంకర రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు, ఎమ్మెల్యే స్పందించి బీటీ రోడ్డు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.

శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

*శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 29:

చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మాతృమూర్తి కీ!!శే!! లక్ష్మి భారతి ఇటీవల వైకుంఠ ప్రాప్తి పొందారు. బుధవారం పులివర్తి వారి పల్లిలోని వారి స్వగృహమునందు జరిగిన శుభ స్వీకరణ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాతృమూర్తి లక్ష్మి భారతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. లక్ష్మి భారతి అమ్మ
ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పల్ల రాజేశ్వర్ రెడ్డి సహకారం తో ఇందిరమ్మ ఇండ్లు..

పల్ల రాజేశ్వర్ రెడ్డి సహకారం తో ఇందిరమ్మ ఇండ్లు

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల మండలంలో కడవెరుగు గ్రామంలో జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు కొమ్ముల యాదమ్మ మంజూరు అయినా ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గదరాజు యాదగిరి ,గదరాజు నరసింహులు, లింగము మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

ఆర్థిక ఇబ్బందుల్లో అంబులెన్స్ డ్రైవర్లు..

ఆర్థిక ఇబ్బందుల్లో అంబులెన్స్ డ్రైవర్లు

* 9 నెలలుగా పత్తాలేని జీతాలు
* బోరున విలపిస్తున్న అంబులెన్స్ డ్రైవర్లు

మహాదేవపూర్ జూలై 30 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆంబులెన్స్ డ్రైవర్లకు 9 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నామని ఒక ప్రకటనలో బుధవారం రోజున తెలిపారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత సంవత్సరం నవంబర్ నుండి ఈరోజు వరకు జీతాలు ఇవ్వలేదని తెలుపుతూ అప్పట్లో కలెక్టర్ కి మొర పెట్టుకోగా డిఏంటి నిధుల నుంచి జీతాలు వచ్చాయని ప్రస్తుతం సిపిఓ జీతాలను ఆపేసిండ్రని తెలుపుతూ 9 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆర్థిక పరిస్థితి ధయనియంగా ఉందని మా గోడు మన్నించి మాకు జీతాలు వచ్చేలా చేయాలని బోరున విలపిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన బి ఆర్ ఎస్ పట్టణ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు గారి , ఆదేశాల మేరకు జహీరాబాద్ పట్టణానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు గాను ₹3,39,500 విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది.
లబ్ధిదారుల వివరాలు:-అల్లిపూర్ కి చెందిన పళ్ళ్లి లలిత ₹.55,500/-,గిరి శంకర్ ₹.33,000/-,మొహమ్మద్ ఇస్మాయిల్ ₹.60,000/- రాం నగర్ కి చెందిన మొహమ్మద్ సాధక్ గారికి ₹.29,500/- రాచన్నపేట్ కి చెందిన మర్వెళ్ళ్లి వెంకట్టయ్య ₹.19,000/- ఏపీ హెచ్ బి కాలనీ కి చెందిన సోమ్ శేఖర్ ₹.11,500/- రంజోల్ కి చెందిన కొత్త కళావతి ₹.11,500/-, మంగలి అంబిక ₹.9,000/- ఆర్య నగర్ కి చెందిన నిశ్రత్ ఫాతిమా ₹.13,500/-, హోతి కె కి చెందిన బుష్ర బేగం ₹.60,000/- పాండు రంగా స్ట్రీట్ కి చెందిన అమీనా సుల్తానా ₹.16,000/-మాణిక్ ప్రభు స్ట్రీట్ కి చెందిన కంది రాం రెడ్డి ₹.21,000/- ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి హజ్ కమిటీ మెంబర్ మొహమ్మద్ యూసఫ్ ,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల ,
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,సత్య ముదిరాజ్,గణేష్ ,ప్రభు ,శంకర్ పటేల్ ,దీపక్,ప్రవీణ్ మెస్సీ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

ఈ రోడ్డు తీరు మారేదెప్పుడు…

ఈ రోడ్డు తీరు మారేదెప్పుడు

పరకాల నేటిధాత్రి
అనునిత్యం వాహనాల రాకపోకలతో రద్దిగా ఉండే పట్టణంలోని జయ థియేటర్ రోడ్డు పరిస్థితి వాహనదారుల,షాపు నిర్వాహకుల తీరు మారడం లేదు,వాహనదారులు షాపుల ముందు మోటారు సైకిల్లను ఇస్టమచ్చినట్టుగా ఇస్టాను సారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుతున్నారు,ఇష్టానుసార పార్కింగ్ ల వల్ల ఇతర పనుల నిమిత్తం వెళ్లే పాద చారులకు,వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారు.రాజధాని టీ ప్యాలెస్ దగ్గరనుండి మొదలుకొని జయ థియేటర్ వరకు అసలు షాపులకు ఎలాంటి పార్కింగ్ స్థలాలు లేవని,పరిమితిని దాటి రోడ్లమీదనే తమకు నచ్చినట్టుగా,వాహనాలను నిలిపి వస్తువులను పెట్టి వ్యాపారాలను కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.సివిల్ ఆసుపత్రి వెళ్లే ప్రధాన దారి ఇదే అవ్వడం అత్యవసర నిమిత్తం ఆసుపత్రికి వెళ్లే తరుణంలో అంబులెన్సులకు కూడా దారి లేకుండా పోయిన పరిస్థితులెన్నో ఉన్నాయని ఈ విషయంలో స్థానిక అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వ్యాపారస్థులకు,వాహనదారులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని వినతి…

జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో అంతోనీకి బుధవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ కళాశాలలో తరగతి గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అదనపు గదులతో పాటు ప్రహరి గోడ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అర్జున్, నాయకులు పాల్గొన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో బుధవారము జరిగిన మేదపల్లి గ్రామం కీ.శే.సంఘమేశ్వర్ పట్లోల సువర్ణ ల కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ లు శంకర్, సంఘమేశ్వర్,పరమేశ్వర్,నాయకులు జి.నర్సింలు,సుభాష్ రావు,నర్సింలు,చెంగల్ జైపాల్,బసంత్ పాటిల్, అభిలాష్ రెడ్డి,ప్రవీణ్ కుమార్, బి.దిలీప్,తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ  లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ  లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ:-

పాల్గొన్న వరంగల్ మరియు హన్మకొండ లీగల్ సెల్ సభ్యులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

బుధవారం రోజున  తెలంగాణ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ పిలుపు మేరకు హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఒక గర్వకారణమైన మరియు ప్రాముఖ్యతగల ఘట్టంగా, “సాంవిధానిక సవాళ్లు: దృక్కోణాలు & దారులు” అనే శీర్షికతో జరగనున్న జాతీయ సదస్సు పోస్టర్‌ను హన్మకొండ ఉమ్మడి జిల్లా కోర్ట్ లోనీ డాక్టర్ బి . ఆర్ అంబేద్కర్ హాల్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సామంతుల శ్రీనివాస ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆగస్టు 2న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ ఏ ఐ సి సి లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ సింఘ్వి ఆధ్వర్యంలో జరగనున్న రాజ్యాంగ సవాళ్లు పై జాతీయ సదస్సు ను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గ,తో పాటు అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ కోకొండ రమేష్, రాష్ట్ర కన్వీనర్లు ముదసిర్ అహ్మద్ కయ్యుమ్,పోషిని రవీందర్, రాజోజు వేణుగోపాల్,కునూరు రంజిత్ గౌడ్, రాష్ట్ర వైస్ చైర్మన్లు నల్ల మహాత్మా, , నిమ్మని శేఖర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల రమేష్,తో పాటు సీనియర్ నాయకులు తోట రాజ్ కుమార్, పసుల యాక స్వామి,, గునిగంటి శ్రీనివాస్, రఘుపతి, హరి హర కుమార్, అరుణ్ ప్రసాద్, సూరం నరసింహ స్వామి, దయాన్ శ్రీనివాసన్, శ్రీనాథ్, గంప వినోద్ కుమార్, మహేందర్, రాజు, శ్రీరామ్ నాయక్, బిక్షపతి, సదానందం,  రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం.

అట్టడుగు వర్గాల అభివృద్దే ఎమ్మెల్యే దొంతి లక్ష్యం

దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్

ఎమ్మార్వో,ఎంపిడిఓ కలిసిన కాంగ్రెస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా దొంతి మాధవరెడ్డి పనిచేస్తున్నారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో తహశీల్దార్ రాజేశ్వర్ రావు,ఎంపిడిఓ అరుంధతి,ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులకు బుదవారం మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.

Congress ranks meet MRO, MPDO

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చుక్క రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు తీసుకెళ్తూన్నా ప్రజా నాయకుడు దొంతి మాధవ రెడ్డి అని అన్నారు. పేదోళ్ళ సొంతింటి కల నెరవేర్చేందుకుగాను ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నియోజకవర్గంలో రేషన్ కార్డ్ ఇవ్వలేదని,నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇంచ్చిందన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా ఉచిత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూన్నా ఘనత రాష్ట్ర ప్రభుత్వందే అని పేర్కొన్నారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజ్మీరా రవీందర్, ఉపాధ్యక్షులు నల్ల వెంకటయ్య, కామ శోభన్ బాబు,కోశాధికారి జంగిలీ రవి,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మ లక్ష్మయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఎంపిటిసి సభ్యులు బొల్లపెల్లి రాము,నియోజకవర్గ యూత్ నాయకులు డ్యాగం శివాజీ,గిన్నె స్వామి, విరాట్, రాజేశ్వర్ రావు,తదితర మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా కురుమిళ్ళ శ్రీనివాస్..

నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా కురుమిళ్ళ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

నాయి బ్రాహ్మణ సేవా సంఘం భూపాలపల్లి జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా భూపాలపల్లికి చెందిన కురుమిళ్ళ శ్రీనివాస్,మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శిగా నడిగోటి రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నడిగోటి రాము మాట్లాడుతూ జిల్లాలోని నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దిశగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్, రాము, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు భూపాలపల్లి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి నూతన కమిటీ ఎన్నుకున్నట్లు వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అధ్యక్ష కార్యదర్శులు శాలువాలతో సన్మానించి స్వీట్ తినిపించి అభినందించారు. అలాగే మండలాల అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version