Helicopter crash: ఉత్తరాఖండ్ ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్‌లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది.
ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
Uttarakhand: ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఆదివారం హెలికాఫ్టర్ (Helicopter) కుప్పకూలింది (Crash).
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గౌరికుండ్, త్రిజుగి నారాయణ్ మద్య ఆర్యన్ కంపెనీకి చెందిన హెలీకాఫ్టర్ ఈ ప్రమాదానికి గురైంది.
అయితే ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆదివారం తెల్లవారు జామున 5:20 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కేదార్నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి బయలుదేరింది.
గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది.
పైలెట్ సహా ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 6 గురు ప్రయాణికులు ఉన్నారు.
ప్రయాణీకులు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్‌కు చెందినవారుగా గుర్తించారు.
ప్రమాదఘటన తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.
సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్
కాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హెలికాఫ్టర్ల ప్రమాదాలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు.
హెలి సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
హెలికాప్టర్ల సాంకేతిక స్థితి పూర్తిగా తనిఖీ చేయడం తప్పనిసరి అని ప్రయాణానికి ముందు ఖచ్చితమైన వాతావరణ సమాచారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అన్ని సాంకేతిక భద్రతా అంశాల సమీక్ష కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
*”నీట్,జెఈఈ మెయిన్స్,లో అత్యుత్తమ శిక్షణలో ముందువరుసలో “షైన్”.*
*”షైన్” విద్యార్థులు జాతీయస్థాయిలో మార్పులు సాధించడం సంతోషంగా ఉంది.*
*”సైన్” విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్.”*
*నేటిధాత్రి”,హనుమకొండ* :
నీట్-2025 ఎంట్రన్స్ ఫలితాలలో షైన్ జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలు సాధించినట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం విడుదలైన నీట్ ఎంట్రెన్స్ ఫలితాలను పురస్కరించుకొని హనుమకొండలోని షైన్ కళాశాలలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగుల రమ, ముగుల రమేశ్ యాదవ్ లతో కలిసి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మూగుల కుమార్ యాదవ్ మాట్లాడుతూ, షైన్ విద్యాసంస్థలు మొదటి నుండి నీట్, జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్లలో అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నామన్నారు. జాతీయస్థాయిలో జి. కీర్తన – 498, కె. సహస్ర – 497 మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే డి. ఇందు- 437, టి. వెంకటశివాని-427, కె. శరణ్య -376, టి.హాసిని-328 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరితోపాటు 15 మంది విద్యార్థులు 300 మార్కులకు పైగా సాధించి విజయభేరి మోగించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కుమార్ యాదవ్ యాజమాన్యం అభినందించారు.
ఈ కార్యక్రమములో షైన్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గత ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఒక మాజీ సైనికుడు ఒకరు పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని కలిగించే ఇటువంటి వ్యూహాత్మక దాడులను పాకిస్తాన్ ఏవిధంగా నిర్వహిస్తున్నది వివరించారు.
Shine Junior Colleges
ఇదే సమయంలో అంతర్జాతీయ స మాజం ఇటువంటి దాడులను ఖండిస్తున్నప్పటికీ ఒక వ్యూహం ప్రకారం అమలు చేస్తున్న ఈ దాడులను పాకిస్తాన్ ఆపడంలేదు. అయితే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత మన ప్రభుత్వం జమ్ము`కశ్మీర్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది. వీటిని ఏదోవిధంగా అడ్డుకొని ప్రపంచానికి కశ్మీర్‌ను ఒక పెద్ద సమస్యగా చూపాలనుకుంటున్న పాకిస్తాన్ చర్యలను మనదేశం ఏవిధంగా కట్టడి చేస్తుందనేదే ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ప్రతి దేశపౌరుడిలో దీనిపై ఆందోళన వ్యక్తం కావడం సహజం. ఈనేపథ్యంలో జమ్ము`కశ్మీర్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిస్థితి ఎట్లా వుంటుందనేది ఇప్పుడు ప్ర ధానంగా చర్చించాల్సిన అంశం.
ప్రకృతి సౌందర్యం, ఎండ వెలుగుల్లో వెండిలా మెరిసే విస్తరించిన హిమాలయాలు, సమున్నత సాంస్కృతిక వైభవంతో పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లే జమ్ము`కశ్మీర్ గత మూడు దశా బ్దాలుగా ఉగ్రవాదం రూపంలో భౌగోళిక సంఘర్షణకు లోనవుతూనే వుంది. ఇంత జరుగుతున్నా పర్యాటకులను తనవైపు ఆకర్షించడంలో జమ్ము`కశ్మీర్ తన ప్రత్యేకతను అన్నివేళల్లో నిలుపుకుంటూనే వచ్చింది. 370 అధికరణం రద్దు తర్వాత పర్యాటకులకు స్వర్గధామంగా మరిన్ని సొబగులతో ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, తన సౌందర్యాన్ని మరింత ఆకర్షణీ యంగా తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఉగ్రవాదం శిథిలమయం చేస్తున్నా, తన ది వ్యమైన సౌందర్యం ఎక్కడా చెక్కుచెదరలేదు. నేటి మారిన పరిస్థితుల్లో ఇప్పటివరకు ప్రాకృతిక సౌందర్యంతో అలరారిన ఈ ప్రాంతంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, ఆభరణాలతో మెరిసిపోయే సౌందర్యవతిలా, మనదేశానికి అద్భుత మణికిరీటంగా మారగలదు.
370 అధికరణం రద్దుకు ముందు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా అన్నీ అడ్డంకులే. ఒకవైపు ఉగ్రవాదం మరోవైపు, జమ్ముాకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకు న్నాయి. మిగిలిన దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే, జమ్ముాకశ్మీర్ ఉగ్రవాద గాయాలతో నిరంతరం బాధపడాల్సి వచ్చేది. అన్నింటికి సైంధవుడిలా అడ్డుపడుతున్న ఈ 370 అధికరణాన్ని రద్దు చేయడంతో రాష్ట్రం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు సమానంగా మారిపో యింది. రాజ్యాంగం ఇక్కడ కూడా అమలు కావడంతో అన్ని రకాల అవకాశాలకు ద్వారాలు తెరచుకున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి జమ్ముాకశ్మీర్ రాష్ట్రాన్ని ఇప్పుడు జమ్ముాకశ్మీర్ మరియు లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విడగొట్టింది.
ఇప్పటివరకు అంతర్లీనంగా మరుగున పడిన ఆధునికత క్రమంగా జమ్ము`కశ్మీర్లోకి ప్రవేశించ నుంది. డేటా సెంటర్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్ పార్క్‌లు, రక్షణరంగ స్టార్టప్‌లు, తయారీ రంగ ప్రవేశం వంటివి ఒకప్పుడు కల! కానీ నేడవి వాస్తవరూపం దాల్చడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను కేంద్రం రూపొందించి అమలు చేసేదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డేటాసెంటర్లకు పెద్దఎత్తున డిమాండ్ వుంది. జమ్ము`కశ్మీర్‌లోని చల్లని వాతావరణం వీటికి ఎంతో అనుకూలం. మిగిలిన దేశంతో పోలిస్తే ఇక్కడి అనుకూల వాతావరణం కారణంగా డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్ ఖర్చు దాదాపు 40% వరకు తగ్గుతుంది! సరిగ్గా ఇటువంటి శీతల వాతావరణం ఉన్న పోలెండ్‌లో మైక్రోసాఫ్ట్ ఒక పెద్ద డేటాసెంటర్ కేంద్రాన్ని నెలకొల్పింది. మారిన పరిస్థితుల్లో ఇటువంటి డేటా సెంటర్లను శ్రీనగర్ మరియు జమ్ము`కశ్మీర్‌లోని ఇతర అనుకూల ప్రాంతాల్లో ఎందుకు నెలకొల్పకూడదన్న పశ్న్ర సహజంగానే ఉదయిస్తుంది. ఇక్కడి హైడ్రోఎలక్రిక్ ప్రాజెక్టులనుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ వల్ల చౌకధరలోనే ఇది లభ్యమవుతుంది.
జమ్ముాకశ్మీర్‌లో వ్యవసాయం కూడా ఆధునిక రూపాన్ని సంతరించుకుంటోంది. సంద్రాయంగా సాగుచేసే ఉద్యానవన పంటనలనుంచి ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం వైపునకు మారే అవకా శాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి అయ్యే పండ్లు, కుంకుమ పువ్వుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. సేంద్రీయ విధానంలో వీటి ఉత్పత్తులను చేపట్టవచ్చు. వీటికి తోడు కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ప్రత్యక్ష మార్కెట్ లింకేజ్, ఆ గ్రోాప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటివి రైతుల ఆదాయాన్ని బాగా పెంచడమే కాదు, అను బంధ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందడానికి దోహదం చేయగలవు.
ఇక రక్షణరంగానికి చెందిన స్టార్టప్‌లు, రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, సాంకేతికపరమైన ఎకోసిస్టమ్‌తో పాటు ప్రత్యేక డిఫెన్స్ కారిడార్లను అభివృద్ధి పరచినట్లయితే, అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో పనిచేసే మన సైనిక దళాలకు అవసరమైన వాటిని దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. ఎంతో సంక్లిష్టమయంగా వుండే భౌగోళిక పరిస్థితుల్లో జవాన్లు పనిచేయడానికి అనువైన సామ గ్రిని సమకూర్చవచ్చు. ఇక ప్రత్యేక ఆర్థిక మండళ్లు సహజంగానే ఐ.టి./ఐటీఈ మరియు ఎల క్ట్రానిక్ పరిశ్రమలను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువకు లకు ఆవసరమైన నైపుణ్య శిక్షణను వేర్వేరు కార్యక్రమాల ద్వారా అందిస్తే, అత్యంత విలువైన హ్యూమన్ కేపిటల్ తయారవుతుంది. విద్యుత్ వాహనాలకు బ్యాటరీలు తయారుచేసే యూనిట్లు, సెమికండక్టర్ తయారీ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా జమ్ము`కశ్మీర్లో పారిశ్రామిక దృశ్యమే సమూలంగా మారిపోతుంది. గత జనగణన ప్రకారం జమ్ము కశ్మీర్ జనాబా 12.3 మిలియన్లు. అద్భుతమైన మానవ వనరులు కలిగిన ప్రాంతం. దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానత వల్ల యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
అభివృద్ధి అవకాశాలు సరే. జమ్ముాకశ్మీర్‌లో భద్రత, సుస్థిరత అనేవి ఇప్పుడ ప్రధానాంశాలుగా వున్నాయి. ఇప్పటివరకు జమ్ముాకశ్మీర్ ‘‘సున్నితమైనాసైన్యం గుప్పిట్లో’’ వుండే ప్రాంతమన్న అభి ప్రాయం బలంగా నాటుకుపోయింది. అటువంటి అభిప్రాయం కలిగినవారు ఇప్పుడు తమ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్ముాకశ్మీర్ పోలీసులు ఇప్పుడు అనుక్షణం డేగకళ్లతో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. మరింత విస్తరించిన భద్రతా వ్యవస్థ కారణంగా నేడు జమ్ముాకశ్మీర్ ఒక స్థాయి భద్రత కలిగిన ప్రాంతంగా వుంది. 9/11 దాడుల తర్వాత దేశీయ విమానసర్వీసుల్లో భద్రతను మరింతగా పెంచారు. పలితంగా దేశీయ విమానయానం మ రింత భద్రంగా మారింది. ఉగ్రవాద సంఘటనలు రాష్ట్రంలో కనీసస్థాయికి తగ్గిపోయాయి. రాళ్లు విసరడం, మాటిమాటికి బంద్‌లు, హర్తాళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. అన్నింటికంటే ముఖ్య మైన అంశమేంటంటే స్థానికంగా ఉగ్రవాద నియామకాలు తగ్గిపోవడం. 2018లో ఇవి 119గా వుండగా, 2023 నాటికి కేవలం 12కు పడిపోవడం గమనార్హం. 2018 నుంచి భద్రతాసిబ్బంది, సాధారణ పౌరులు, సైనిక చర్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉదాహరణకు 2018లో 271 మంది ఉగ్రవాదులు హతం కాగా, 2023 నాటికి ఈ సంఖ్య 87కు పడిపోయింది. 2024లో ఈ సంఖ్య మరింతగా తగ్గిపోయింది. ఇక సాధారణ పౌరుల మరణాల విషయానికి వస్తే 2018లో వీరి సంఖ్య 86 కాగా, 2022 నాటికి 30కి, 2023లో 12కు పడిపోయింది. అదేవి ధంగా భద్రతా జవాన్ల మరణాలు 2018లో 95 వుండగా 2022 నాటికి 30కి, 2023 నాటికి 4కు పడిపోయింది. ముఖ్యంగా మరింత విస్తరించిన భద్రతా వలయం, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే మూలాలను ధ్వంసం చేయడం, కేంద్రపాలిత ప్రాంతంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రత్యక్ష పాలన కింద వుంచడంతో కేంద్ర ప్రభుత్వం తన పథకాలను నేరుగా అమలు చేయగలుగుతోంది.
అయితే జమ్ముాకశ్మీర్ ఆర్థికంగా మరింతగా నిలదొక్కుకోవడానికి మరింత సమన్వయ సహకారాలు అవసరం. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్యాకేజీలను చిత్తశుద్ధితో అమలుచేస్తున్నది. 370 అధికరణం రద్దు తర్వాత 106 కేంద్ర చట్టాలను అమల్లోకి తీసుకురాగా, అమల్లోవున్న చాలా రాష్ట్ర చట్టాలను రద్దుచేశారు. 2023 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు తన అతి కీలకమైన తీర్పులో 370 అధికరణం రద్దును సమర్థించింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆర్థిక పురోగతిలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల రా ష్ట్రంలో శాంతి సుస్థిరతలు దీర్ఘకాలం చెక్కుచెదరకుండా కొనసాగగలవు.
జమ్ముాకశ్మీర్‌లో కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టడంతో జమ్ము ప్రాంతంలో అసెంబ్లీ సీ ట్లు 37 నుంచి 42కు పెరగ్గా, కశ్మీర్ లోయలో 46 నుంచి 47కు పెరిగాయి. రాష్ట్రంలో మొట్ట మొదటిసారి 9 సీట్లను గిరిజన తెగలకు కేటాయించం విశేషం. డీడీసీ మరియు పంచాయతీ ఎన్నికల్లో కొత్త పార్టీలు పాల్గనడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోందనడానికి గొప్ప ఉదాహరణ. ప్రజలు వేర్పాటువాదం నుంచి, జాతీయ రాజకీయాలవైపు మరలడం శుభపరిణా మం. అన్ని వ్యవస్థలతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా అమల్లోకి తీసుకురావడం వల్ల జమ్ముాకశ్మీర్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా వుండబోతున్నదన్న విశ్వాసం కలుగుతోంది. ఈ పరిణా మాల నేపథ్యంలో ‘‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల ప్రపంచం’’ జమ్ముాకశ్మీర్‌నుంచి ఇక ఎంతోకాలం దూరంగా వుండలేదు. పెట్టుబడిదార్లు, ఎంటర్ప్రెన్యూర్లు, ఇతర భాగస్వాములు ఇక్కడ తమ పెట్టుబడులను విస్తరించడం ద్వారా భారత్ మణికిరీటంగా భావించే జమ్ముాకశ్మీర్ ఆర్థిక పునరభివృద్ధికి దోహదకారులు కావాలి.
జమ్ముాకశ్మీర్‌లో ఇప్పటివరకు తాండవమాడిన మతఛాందసవాదం, వేర్పాటువాదం స్థానాలను సెక్యులరిజం, నేషనలిజంలు ఆక్రమించాయి. హింస స్థానంలో శాంతి సుస్థిరమవుతోంది. అయితే ఇంకా ఉగ్రవాద మూలాలు సమూలంగా నాశనం కాలేదన్నది వాస్తవం. కానీ ఇప్పటి చర్యలే కొనసాగితే, త్వరలోనే ఈ మహమ్మారినుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడగలదనడంలో ఎంతమా త్రం సందేహం లేదు.
ఎలాంటి సమస్యలకైనా రాజీ మార్గమే రాజా మార్గమని నర్సంపేట తాలూకా లీగల్ సర్వీస్ అతారిటి ఛైర్మన్, కోర్టు సబ్ జడ్జి వరూధిని అన్నారు. నర్సంపేట కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ లోక్ అదాలత్ లో తాలూకా లీగల్ సర్వీస్ అతారిటి ఛైర్మన్,సబ్ జడ్జి వరూధిని మాట్లాడుతూ రాజి పడదగిన కేసులలో రాజి పడటం ద్వార కేసుల నుండి పరిష్కారం పొందవచ్చు అని లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కాగా లోక్ అదాలత్ లో నిర్వహించిన వాటిల్లో 42 క్రిమినల్ కేసులు రాజి పడ్డారు. 4 ఎక్సైజ్ కేసులలో 20 వేలు ఫైన్ కట్టారు.బ్యాంక్ పిఎల్సి కేసులు 15 కాగా 6,69,086 రూపాయలకు సెటిల్ మెంట్ అయ్యారు. ఎస్టిసిలు 3288 కేసుల్లో రూ.8,43,050 ఫైన్ కట్టారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి బోడివల్లి చేంద్ర ప్రసన్న,సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ లక్ష్మీ నారాయణ, ఏపీపీ,ఎసిపి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడిదెల సంజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి,లోక్ అదాలత్ మెంబర్ మోటురి రవి,లీగల్ సర్వీస్ అతారిటి న్యాయవాది దొంతి సాంబయ్య,న్యాయవాదులు తండ సారంగపాణి,రహీముద్దీన్,కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి,అంబటి రాజ్ కుమార్,పొనుగోటీ అజయ్,బొడ్డుపెళ్లి అజయ్,కందకట్ల వీరష్,పండుగ శ్రీనివాస్,అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు,బ్యాంక్ అధికారులు,కోర్టు సిబ్బంది, పోలీస్ లు , కక్షిదారులు పాల్గొన్నారు.
`ఆభివృద్ధిని వదలి, మతాన్ని పట్టుకు వేలాడుతున్న వైనం
Shine Junior Colleges
`పతన పథంలో పయనిస్తూ, అహంకారం వీడని పాక్ పాలకులు
`భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి ఇంకా యత్నాలు
`చావుదెబ్బతిన్నా బుద్ధి మార్చుకోని పాక్
హైదరాబాద్,నేటిధాత్రి:
గత ఏప్రిల్ నెలలో పహల్గామ్ దాడి సైద్ధాంతిక హింసకు నిదర్శనమని కొందరు నిపుణులు స్ప ష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి ఉగ్రదాడులను పరిశీలించినప్పుడు కొన్ని ప్రత్యేక వర్గాలకు చెందిన సామాన్య పౌరులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని హత్యాకాండ కు పాల్పడటం కనిపిస్తుంది. జమ్ము`కశ్మీర్‌లోని పహల్గామ్లో గత ఏప్రిల్ నెలలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులైన పర్యాలకుల్లో ప్రథానంగా హిందువులు ఒక క్రైస్తవుడు మరో ముస్లిం వ్యక్తి వున్న సంగతి తెలిసిందే. మాజీ యు.ఎస్. అధికారి, మరో భాషావేత్త, జర్నలిసు ్టఅవతాన్ కుమార్ల ప్రకారం పహల్గామ్ సంఘటన చూడటానికి ఒకచోట జరిగిన సంఘటనగా కనిపిస్తున్నప్పటికీ, దీని ప్రతిస్పందనలు ఆమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా వున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. పహల్గామ్ దాడి సంఘటన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తొయ్య బా సంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు సంబంధించిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేది స్పష్టమైంది. ముఖ్యంగా వీరు ముస్లిమేతరులు ప్రధానంగా హిందువుల ను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడి ఇది. దాడికి పాల్పడేముందు ఉగ్రవాదులు ప్రశ్నించడమే కాకుండా ఇస్లామిక్ కలీమాను చదవమని ఆదేశించి, ఆవిధంగా చదవలేనివారిపై కాల్పులు జరిపి మరీ హత్యచేసారనేది ప్రత్యక్ష సాక్షుల కథనం.
ఉగ్రవాదులు ముందుగా హిందువులను, క్రైస్తవుడిని వేరుగా నిలబెట్టి సమీపంనుంచి కాల్పులు జరిపి హతమార్చారు. ఇదే సమయంలో మహిళలను వారినుంచి వేరుచేసి, తాము చేస్తున్న ఈ హింసాకండను అధికార్లకు చెప్పాల్సిందిగా కోరడం గమనార్హం. ఈవిధంగా ఇతర మతంవారిని వేరుచేసి, హతమార్చడం కేన్యాకు చెందిన అల్షబాబ్ ఉగ్రవాద సంస్థ గతంలో చేసింది. ము ఖ్యంగా క్రైస్తవులను వేరుచేసి వారిపై దాడిచేసి హత్యాకాండకు పాల్పడిరది. ఈరకమైన హత్యా కాండకు గ్లోబల్ ఉగ్రవాద భావజాలంలో మూలాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘‘రెసిస్టెన్స్’’ లేదా ‘‘ఇంతిఫదా’’ పేరుతో స్థానిక ప్రాంతాల్లో ఇటువంటి దారుణాలకు పాల్పడటం కనిపిస్తుందని వారుపేర్కొన్నారు. దీని ద్వారా ఇజ్రాయిల్`పాలస్తీనా వంటి ప్రాంతీయ సంఘర్షణలు నిరంతరాయం గా కొనసాగుతుండటం వర్తమాన చరిత్ర! ఇటువంటి హత్యాకాండకు బలైనవారిలో నైజీరియాకుచెందిన యూదులు, క్రైస్తవులున్నారు. వీరేకాదు యాజ్దిలు, ద్రుజ్, అల్వైట్, అహమ్మదీయ ము స్లింలు, కాప్ట్‌లు, సిక్కులు, బహాయీలు కూడా ఇటువంటి సైద్ధాంతిక హింసాకాండకు బలవుతు న్నారు. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడితో పహల్గామ్ సంఘటనను పోలుస్తున్నారు. ఇటువంటి దాడుల్లో బాధితులను దుర్మార్గులుగా చూపుతూ, తాముచేసే హత్యాకాండను సహేతుకంగా చూపడానికి యత్నించడం కనిపిస్తుంది. పహల్గామ్ దాడికి ది రెసిస్టెన్స్ ఫోర్స్ తాను బాధ్యురాలిగా ప్రకటించింది. 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత జమ్ము`కశ్మీర్లో జనాభాపరమైన మార్పుకోసం చేపడుతున్న చర్యలను నిరసిస్తూ ఈ దాడులకు పాల్పడినట్టు పేర్కొంది. ఇది కేవలం తన హంతకకృత్యాన్ని సమర్థించుకోవడానికి చేసిన ఒక అసంబద్ధ వాదనగా ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 2008 ముంబయి దాడుల తర్వాత సామా న్యులపై జరిపిన అతి తీవ్రమైన దాడి ఇది. ఈ దాడి భారత్`పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను రగల్చమే కాదు, ఈ ప్రాంతంలో భద్రతాపరమైన వైఫల్యాలను కూడా ఎత్తిచూపింది. ఊహించని రీతిలో అకస్మాత్తుగా జరిగిన ఈ ఘాతుకం ప్రజలను ఒక్కసారి భయభ్రాంతులకు గురిచేసింది. ఎక్కడివారక్కడ పారిపోవడమే కాదు, తక్షణం కశ్మీర్‌కు పర్యాటకుల రాక నిలిచిపోవడంతో, టూరిస్టులతో కళకళలాడిన ప్రదేశాలు వెలవెలపోయాయి. ఈ పర్యాటకంపై ఆధారపడి జీవించే కొ న్ని వేలమంది కశ్మీరీలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఈ సైద్ధాంతిక హింసాకాండకు స్థానికుల మద్దతు లభించలేదన్నది సత్యం. స్థానిక కశ్మీరీలు బాధితుల పక్షమే వహించారు. ఉగ్రవాదుల దమనకాండను ఖండిరచడమే కాదు, తమ జీవనోపాధిని పూర్తిగా దెబ్బతినడంతో తీవ్రవాదుల పై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవిధంగా సైద్ధాంతిక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాధిత వర్గాలన్నీ ఏకం కావాలల్సి అవసరం వున్నదని ఆయా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీరు జరిపే పోరాటం ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా కాకుండా, సామాన్య పౌరులపై హింసను చట్టబద్ధం చేస్తున్న సిద్ధాంతాన్ని నిరసిస్తూ కొనసాగాలన్నది వీరి అభిమతం. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ హింసాత్మక భావజాలాన్ని నిరోధించడానికి బహుళజాతి సమాజాలు ఏకంకాకపోతే, మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతున్నదని వీరు హెచ్చరిస్తున్నా రు. అందువల్లనే ఇటువంటి ఉగ్రవాదంపై వ్యూహాత్మక వ్యతిరేకత అవసరమని వారు స్పష్టం చే స్తున్నారు.
మనదేశం కూడా కచ్చితంగా ఇటువంటి విధానాన్నే అనుసరిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై దాడులు జరపడం ఇటువంటి వ్యూహాత్మక వ్యతిరేకతలో భాగమే. ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన రీతిలో భారత్ జరిపిన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముందచెత్తడమే కాదు, హింసను ప్రేరేపించే ఏభావజాలాన్ని సహించబోమన్న బలమైన హెచ్చరికను జారీచేసినట్లయింది. ప్రపంచంలోని అత్యధిక దేశాలు నేడు ఈ హింసాత్మక ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, భారత్ జరిపిన దాడులకు అన్ని వైపులనుంచి మద్దతు లభించడం గమనార్హం. కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్‌ను మట్టికరిపించి ప్రపం చంలో అప్పటివరకు తనపై వున్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చుకునేలా చేసింది. అయితే ఉగ్రవాదమే ఊపిరిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఈనెల 9వ తేదీన పాక్‌లోని ఫార్వర్డ్ పోస్టులను సందర్శించి అక్కడి జవాన్లను పొగడిన తీరును పరిశీలిస్తే, భారత్ చేపట్టిన సైని కచర్య వారిలో మార్పును తీసుకొస్తుందని భావించడం ఒక భ్రమేనన్న సత్యాన్ని వెల్లడిచేసింది. మనదేశం చేతిలో చావుదెబ్బలు తిని, తానే గెలిచానని చెప్పుకోవడం పాకిస్తాన్‌కే చెల్లింది. ఇప్పు డు తాజాగా ఆసిం మునీర్ ఫార్వర్డ్ పోస్లును సందర్శించడం ద్వారా పరోక్షంగా భారత్‌ను సవా లు చేస్తున్నట్టే భావించాలి.
బుద్ధి మార్చుకోని పాక్
ఉగ్రవాద ఫ్యాక్టరీగా పేరు సుస్థిరం చేసుకున్న పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో తన మొండి వైఖరి, అహేతుక డిమాండ్లతో ఇతర దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. భద్రతా మండలిలో ఆంక్షల కమిటీ, తాలిబన్ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీలకు అధ్యక్షపదవి కావాలని డిమాండ్ చే స్తోంది. గత జనవరిలోనే ఐక్యరాజ్య సమితి కమిటీల నియామక ప్రక్రియ పూర్తికావాల్సి వుండగా, పాకిస్తాన్ మొండి వైఖరివల్ల ఇప్పటివరకు వాటి ఏర్పాటు ఆలస్యమైంది. మండలిలోని ఇతర సభ్యదేశాలు పాక్ వ్యవహారశైలితో విసిగిపోయారనే చెప్పాలి. చివరకు భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టి మమ అనిపించారు. ఈ పదవి నామమాత్రమే అయినప్పటికీ, సాటి సభ్యదేశాలు ఇందుకు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నాయి. ఏదోవిధంగా ఈ పదవులు చేపట్టి, ఉగ్రవాదంపై భారత్‌ను లక్ష్యం చేసుకునేందుకు అది తీవ్రంగా యత్నిస్తోంది. గతంలో కూడా కొందరు హిందువులను ఉగ్రవాదులుగా ప్రకటించాలని తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఏదోవిధంగా ఉగ్రవాద సంబంధిత కమిటీలకు అధ్యక్ష పదవి సాధిస్తే ఒకవైపు భారత్‌ను వేధించడమే కాకుండా మరోవైపు తాలిబన్లను బెదిరించి తమ దారికి తెచ్చుకోవాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే ఉగ్రవాదంపై భారత్‌ను లక్ష్యంగా చేసే యత్నాలకు మద్దతిచ్చేందుకు ఏ ఇతర దేశమూ సిద్ధంగా లేదు. తాను పెంచి పోషించిన తాలిబన్లు తనకు వ్యతిరే కంగా, భారత్‌కు అనుకూలంగా మారడాన్ని పాకిస్తాన్ ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నది. అందుకనే తాలిబన్లను ఏదోవిధంగా భయపెట్టి, ఆఫ్ఘనిస్తాన్‌ను తన నియంత్రణలో వుంచుకోవాలన్నది పాక్ ఆకాంక్ష. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే పాక్, ఆఫ్ఘనిస్తాన్ రెం డూ మతవాదానికే కట్టుబడి వున్నప్పటికీ, తాలిబన్ ప్రభుత్వం మతం తిండిపెట్టదన్న సత్యాన్ని గుర్తించింది. ఫలితంగా ప్రజలకు తిండి, నిత్యావసరాలు, దేశాభివృద్ధికోసం భారత్‌సహకారం అవసరమన్న వాస్తవ ధోరణితో ముందుకెళుతోంది. పాకిస్తాన్‌ను నమ్ముకుంటే మతచాందసం తప్ప ఒరిగేదేమీ వుండదన్న సత్యం దానికి బాగా తెలిసొచ్చి దూరంపెడుతోంది. దీనికితోడు పాకిస్తాన్ తీసుకున్న ఆఫ్ఘన్ వ్యతిరేక చర్యలు కూడా తాలిబన్ల వ్యతిరేకతకు ప్రధాన కారణం. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం హింసాత్మక భావజాలంతో, మతఛాందసవాదంలో మునిగిన దేశాలేవీ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. వాటి ప్రస్థానం పాతాళంవైపునకే కొనసాగింది. పాకిస్తాన్ ఇప్పు డు ఇదే బాటలో నడుస్తోంది.
ఎర్రబెల్లి స్వర్ణను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఎనుమాముల నేటిధాత్రి:
నగరంలోని 14 డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణను వారి నివాసంలో మర్యాదపూర్వం కలిశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజలల్లో తీసుకువెళ్లాలని సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ హనుమకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిచేరి రాధాకృష్ణ. ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు. త్రికోవెల శీను. బాలాజీ నగర్ గ్రామ అధ్యక్షుడు కడెం కుమార్ ఎస్సార్ నగర్ యూత్ అధ్యక్షుడు పల్లకొండ చందు. సౌరం ప్రభాకర్ సౌరం అభిలాష్. కోగిల సుధాకర్. కాశెట్టి కమలాకర్. దస్రు నాయక్ తోట శీను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకాబ్రాచారి. తిరుపతి. ఎండి సంధాని. ఎండి యూసుఫ్ సంగారబోయిన రాజు. ఎండి ఖాజా రేహాన్ తోట శ్రీను ఖాన్. వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.
పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం:-
హాజరైన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్:-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, (లీగల్):-
శనివారం హనుమకొండ లోని నేత హాస్టల్ లో పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ల ఎన్నికలలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా వలుస సుదీర్, కోశాధికారి గా సిరిమల్ల అరుణ, కార్యవర్గ సభ్యులుగా యం.
మేఘనాథ్, పరకాల బార్ అసోసియేషన్ మహిళ కార్యదర్శిగా గజ్జెల సధారణి, జనగామ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి రామకృష్ణ గెలుపొందిన తదితర న్యాయవాదులను ఆయన ఘనంగా సన్మానించారు.
ఇట్టి సందబంగా దుస్సా జనార్ధన్ మాట్లాడుతూ ప్రతీ యువ న్యాయవాది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు.
Advocates
ఈ కార్యక్రమం లో పావ అధ్యక్షులు గంజి గణేష్, సీనియర్ న్యాయవాదులు మార్గం వీరస్వామి, దాసరి ప్రేంసాగర్, కొండబత్తుల రమేష్ బాబు, పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్, బిల్లా ప్రభాకర్, మేరుగు సుభాష్, రవీందర్, పాము రమేష్, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా పద్మశాలి అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నూతన గృహ నిర్మాణ ముగ్గు పోయి కార్యక్రమాన్ని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ మరియు ఎన్టీఆర్ నగర్ లోని నిరుపేద లబ్ధిదారులకు ముగ్గులు పోయూ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే నా ఇందిరమ్మ ఇండ్లు గుర్తుకు వస్తాయని, పేదల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుండు గోపాల్,సుభాష్ రెడ్డి, చిట్ట సులోచన, కీర్తి శ్రీలత, హౌసింగ్ ఎయ్యి అభినయ్ గౌడ్, మున్సిపల్ ఆఫీసర్లు ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసముద్రం విలేజ్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాడి శ్రీనివాస్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్, మండల ఓ బి సి అధ్యక్షులు చిట్ల సంపత్, మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్, విలేజ్ గ్రామ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల లక్ష్మణ్,గుబరాజు,గుండు లక్ష్మీనారాయణ,జీలకర్ర బాబు, బట్టి గులాబీ, ఎండి సోనీ,ఎస్ కే యాకుబ్బి, తదితరులు పాల్గొన్నారు.
కాకా వారసత్వాన్ని కొనసాగిస్తా… ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా
కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
నియోజకవర్గంలో దందాలకు తావు లేదని, కాకా వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా రామకృష్ణాపూర్ పట్టణానికి విచ్చేసిన వివేక్ వెంకట స్వామికి పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ఏరియా ఆసుపత్రి సమీపంలో ఘన స్వాగతం పలికి, భారీ గజమాలతో సత్కరించారు.
ఏరియా ఆసుపత్రి సమీపంలో సింగరేణి కార్మికుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఏరియా ఆసుపత్రి నుండి రాజీవ్ చౌక్, భగత్ సింగ్ నగర్ ,సూపర్ బజార్ చౌరస్తా,రామాలయం చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.రామకృష్ణాపూర్ నాయకులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేసానని, అందుకే ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించారని గుర్తుచేశారు.
ఇకముందు కూడా అవకతవకలు లేకుండా, అక్రమాలు లేకుండా అభివృధి చేస్తానని అన్నారు.
ఇసుక దందా బంద్ కు కట్టుబడి ఉన్నానని, మైనింగ్ మంత్రిగా అది నా బాధ్యత అని అన్నారు.
రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని తెలిపారని చెప్పారు.
ఇసుక రాయల్ ట్యాక్స్ తో అధిక నిధులతో అభివ్రుద్ది చేస్తానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్, 500 లకే గ్యాస్ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
Labor and Mines Minister Vivek Venkataswamy
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని,ప్రభుత్వం అర్హులైన వారికి సన్న బియ్యం కూడా ఇస్తుందని గుర్తు చేశారు.ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని,మీకోసమే పని చేస్తానని భరోసా ఇస్తున్నానని అన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ సీనియర్ నేతలు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,మాజీ చైర్ పర్సన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మహంకాళి శ్రీనివాస్, శ్యామ్ గౌడ్,గోపతి బానేష్,యువ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి 100 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయం
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాతల చిత్రపటాలకు పాలాభిషేకం
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురం లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా కేసముద్రం మునిసిపాలిటీని ఏర్పాటు చేయడమే కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలలో అంతర్గత రోడ్లు డ్రైనేజీలు వివిధ అభివృద్ధి పనుల క్రింద 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినందుకు అభివృద్ధి ప్రధాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, మహబూబాబాద్.
శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ కు పాలాభిషేకం చేసి కేసముద్రం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా గతంలో పాలిటెక్నిక్ కాలేజీని, డిగ్రీ కాలేజీని, అగ్నిమాపక కేంద్రాన్ని, బైపాస్ రోడ్డును, అంబేద్కర్ నుండి కోరుకొండ పెళ్లి క్రాస్ వరకు ఆర్ అండ్ బి రోడ్డును , 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గానికి అదనంగా 1000 ఇండ్లుమంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
కే సముద్రం మున్సిపాలిటీని అభివృద్ధి పదములో నడిపించే అభివృద్ధి ప్రదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, జన్ను కట్టయ్య, సామ సుధాకర్ రెడ్డి, మందుల కృష్ణమూర్తి, వేల్పుగొండ ఏలియా, కుడారి నాగేంద్రబాబు, లాకావత్ బాలు నాయక్, భోగం రమాదేవి, కుక్క ముడి యాకయ్య పాల్గొన్నారు.
చెన్నూర్ నియోజకవర్గానికి తొలిసారిగా పర్యటన చేసిన మైనింగ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాలమాకుల రాజబాబు రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గోదావరి బ్రిడ్జి పై స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కావాలని మొక్కుబడులు కోరిన నాయకులు గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేయించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు డీజే,డ్యాన్స్‌లతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాను.
ఇసుక దందా పూర్తిగా నిలిపేలా చర్యలు తీసుకుంటాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు రాజబాబు రెడ్డి, గంగపుత్ర సంఘం నాయకులు తగర శ్రీనివాస్,శ్రీనివాస్, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శనివారం రోజున మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కోర్టు ఆవరణలో నిర్వహించారు.పరకాల పట్టణంలోని కోర్టు ఇంచార్జి న్యాయమూర్తి సిహెచ్ శ్రావణ స్వాతి వివిధ కేసులను రాజీ మార్గము ద్వార పరిష్కరించారు.ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ లోకదాలత్ ద్వారా అందరికీ న్యాయం అందుబాటులోకి వచ్చిందని రాజీ మార్గం ద్వారా సమయాన్ని డబ్బును ఆద చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల బార్ సోసియేషన్ అధ్యక్షులు పెండల భద్రయ్య,లోక్ అదాలత్ సభ్యులు రవికుమార్,సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కొప్పుల శంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుమార్,రుధిర,ఏసీపీ సతీష్ బాబు,సీఐ క్రాంతికుమార్,ఏజిపి లక్కం శంకర్,లోక్ ఆదాలత్ సభ్యులు ఒంటేరు రాజమౌళి,పోలీస్ సిబ్బంది,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోళ్ల పాము నిప్పు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవాలి
జహీరాబాద్ నేతి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవారం గ్రామం లో కోళ్ల పామ్ షెడ్డు కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు అని ఆ గ్రామానికి చెందిన గొల్ల శ్రీశైలం తెలిపారు. శుక్రవారం అయన మాట్లాడుతూ ఈ నెల 11 న రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా కోళ్ల పామ్ కు నిప్పు పెట్టారు అని అట్టి వ్యక్తుల ను గుర్తించి వారి పై చర్యలు తీసుకువాలి అని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిపారు. షెడ్డు లో సుమారు 2 లక్షల వరకు సమగ్రీ ఉన్నట్లు తెలిపారు. అవి మొత్తం పాడై పోయినవి అని తెలిపారు.
`ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో మాజీ ‘‘మున్సిపల్ చైర్మన్’’ నిర్వాకం.
`ఆక్రమించుడు…అమ్ముకునుడు!
`నాయకుడు రియల్ వ్యాపారి అవతారమెత్తాడు.
`అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు.
`కనిపించిన భూములన్ని మింగేశాడు.
`ప్రభుత్వ భూములపై కన్నేయాలే..వెంచర్లు చేసి అమ్మేయాలే!
`వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ ఆదాయం.
`ఆ మున్సిపాలిటీలో ఆ లీడర్ ఆడిరది ఆట..పాడిరది పాట.
`గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదు.
`ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మార్చి, వెంచర్ వేసిన ఘనుడు.
పేద దళితులకు 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కోట్ల రూపాయల మొరం కొల్లగొట్టిన నాయకుడు.
దళితులకిచ్చిన భూమిని బొందల గడ్డ చేసిండు
దళితులకిచ్చిన భూమిలోకి వెల్లాల్సిన రోడ్డును మాయం చేసి వెంచర్ లో కలిపేసిండు.
`ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా భూములను చుట్టేసిండు.
హైదరాబాద్,నేటిధాత్రి:
భూ మాయ అంటే ఇది. ఓ మున్సిపల్ మాజీ చైర్మన్ నిర్వాకమది. కనిపించిన భూములపై కన్నేయడం, వాటిని కమ్మేయడం కొంత మంది అక్రమ రియల్ వ్యాపారులకు భూ దందాతో నేర్చుకున్న విద్య. అదే రియల్ వ్యాపారులు రాజకీయ నాయకులైతే, అధికార పార్టీ అండదండలు పుష్కలంగా వుంటే, అదే వ్యాపారి ఏకంగా ప్రజా ప్రతినిధి అయితే ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడా అదే జరిగింది. ఆ ప్రజా ప్రతినిధి తన పరిధిలో వున్న ప్రభుత్వ భూములను గుర్తించడం, ఆ పక్కనే వున్న ప్రైవేటు భూములను అడ్డికి పావుసేరుకు కొనేయడం, రెండూ కలిపి వెంచర్లు చేయడం మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ రియల్ దందా దండిగా చేశాడు. కనిపించిన భూములపై కన్నేశాడు. కొనేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆక్రమించుడు…అమ్ముకునుడు! మొదలుపెట్టిండు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రజా ప్రతినిధికి అండగా పార్టీ పెద్దలు అండగా నిలిచారు. సహకరించారు. పైగా గత పాలకుల కులం కూడా కలివచ్చింది. వేలు విడిచిన చుట్టరికం తోడైంది. ఇక అడ్డే ముంది. ఆగేదే ముంది. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నాడు. పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల విలువైన భూములకు సున్నం పెట్టేశాడు. ఆ మున్సిపల్ పరిధిలో కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ పక్కనే గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో దళితులకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలానికి వెళ్లడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొవ్వ వుంది. ఆ తొవ్వను ఆక్రమించుకున్నాడు. సదరు చైర్మన్ కొనుగోలు చేసిన స్థలానికి సమీపంలో ప్రభుత్వ పార్కు స్థలం వుంది. ఏ రియల్ వ్యాపారి అయిన వెంచర్ చేసే సమయంలో కచ్చితంగా కాలనీకి అవసరమైన పార్క్ ఏర్పాటు చేయడం తప్పని సరి. ఆ మున్సిపల్ పరిధిలో చైర్మన్ ఏర్పాటు చేసిన వెంచర్ కు ప్రభుత్వ పార్కు స్థలం కూడా కలిసి వచ్చింది. ఆ మున్సిపల్ మాజీ చైర్మన్ చేసిన వెంచర్ లో పార్కును ఏర్పాటు చేయలేదు. పైగా ప్రభుత్వ పార్కును తన వెంచర్ కు కలిపేసుకొని అదే పార్కుగా వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మేసుకున్నాడు. అలా కూడా ప్రభుత్వాన్ని నిండా ముంచేశాడు. నాయకుడు రియల్ వ్యాపారి అవతారమెత్తడంతో అడిగే వారు లేకుండా పోయారు. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చినా ఆ చైర్మన్ కే ఇవ్వాలి. ఒకవేళ అధికారులకు పిర్యాదు చేసినా అది చైర్మన్ టేబుల్ పైకి చేరాలి. ఇంకేముంది ఆ చైర్మన్‌ది ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ మరో ఘనకార్యం కూడా వుంది. దళితులకు గతంలో ఇచ్చిన ప్రభుత్వ భూమి వుండడం కూడా వెంచర్‌కు కలిసొచ్చింది. ఆ వెంచర్‌కు అవసరమైన మొరం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ ఖర్చు కూడా మిగిలిపోయింది. వెంచర్ కోసం అవసరమైన మొరం మొత్తం పక్కనే వున్న దళితుల భూమి నుంచి తరిలించాడు. అలా సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన మొరం తవ్వుకుపోయాడు. దళితుల భూమిని బొందల గడ్డ చేశాడు. పెద్ద ఎత్తున తీసిన గుంతలు వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయి. అంటే ఎంత పెద్ద గుంతలు తీశాడో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క గుంత చిన్నపాటి చెరువులా తాడి చెట్టు లోతున మొరం తవ్వించాడు. వర్షాకాలంలో అటు వైపు ఈత రాని వాళ్లు పడితే ప్రాణాలతో బతికే అవకాశం కూడా వుండదు. ఇక ఆ భూమిలో దళితులు సాగు చేసుకోలేరు. ఇండ్లు కట్టుకోలేరు. ఆ గుంతలను పూడ్చుకోవాలంటే ఆ దళితులకు కోట్ల రూపాయలు కావాలి. సదరు చైర్మన్ ఆ దళితులు తమ భూమి వద్దకు వెళ్లడానికి ఓ దారి వుండేది. ఆ దారిని చైర్మన్ మాయం చేసి వెంచర్ లో కలిపేసుకున్నాడు. దళితులకు దారి లేకుండా చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసి, బిల్డింగ్లు కట్టుకున్న వాళ్లంతా అగ్ర కులాలకు చెందిన వాళ్లు. అగ్ర కులాల కుటుంబాలున్న ఇండ్ల ముందు నుంచి దళితులు వెళ్తారా? అని వారిని బెదిరించినట్లు కూడా సమాచారం. అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు. కనిపించిన భూములన్ని మింగేశాడు. వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ వ్యాపారంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకున్నాడు. గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదనే మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. దళితులకిచ్చిన భూమిని బొందల గడ్డ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం లేకుండా దళితులకు అన్యాయం చేసిండు. ఏకంగా రోడ్డును మాయం చేసి వెంచర్ లో కలిపడమంటే తనకు ఎదురులేదు తిరుగులేదనుకున్నాడు. మళ్ళీ వాళ్ల పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఆశలతో ఈ ఒక్క చోటే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వెంచర్లు అనేకం చేశాడు. వాటిపై త్వరలో వరుస కధనాలు నేటిధాత్రి లో వస్తాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంతటా భూములను చుట్టేసిండని ఈ చైర్మన్ పేరు మారుమ్రోగిపోయింది. చైర్మన్ అక్రమాలను చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేసినా అధికారులు సహకరించలేదు. ప్రజల మాట వినిపించుకోలేదు. పైగా అన్ని రకాలుగా చైర్మన్ ను సహకరించారు.
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (ఎంఎల్టి ) గ్రూపులో తాత్కాలిక పధతిలో విద్యా బోధన చేయడానికి మహిళా విద్యాపకుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మంజుల మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాలలో టిజిసిఆర్టి ఇంగ్లీష్ ఫస్ట్ ఒకటి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఒకటి లకు గాను దరఖాస్తు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ పీజీసిఆర్టి పోస్ట్ కు గాను అభ్యర్థి విద్య అర్హత ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ అర్హత ఉండాలి, ఎంఎల్టి పోస్ట్ కు గాను ఎండి పాతాలోజి, బీఫార్మసీ, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంబిబిఎస్, బిహెచ్ఎంఎస్, పిజిడి క్లినికల్ బయో కెమిస్ట్రీ అర్హతలు గల అభ్యర్థులు వారి వారి దరఖాస్తులను పాఠశాలకు నేరుగా వచ్చి ఈనెల 14 నుండి 18 తారీకు లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలియజేశారు.
మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాధి మార్గాలు ఏర్పరుస్తాయని నర్సంపేట టౌన్ ఎస్సై అరుణ్ కుమార్ అన్నారు.శనివారం ఎఫ్ఎంఎం,వరంగల్ సాంఘిక సేవా సంస్థ వారి సహకారంతో నర్సంపేట ప్రతిభా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ, టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం సంస్థ సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యంగా గృహింస, బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణా నిర్మూలించడానికి వారికి ఉపాధి మార్గాలు అనేవి చాలా ముఖ్యమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.మరో అతిథి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రమేష్ కోరే మాట్లాడుతూ సమాజంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రగతి ఎంత ముఖ్యమో వ్యక్తిగత భద్రత అంతే ముఖ్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి బ్యాంకుల ద్వారా అమలుపరుస్తున్న స్కీములను సద్వినియోగం చేసుకొని ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్, సహాయ సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ,ఎర్ర శ్రీకాంత్ ,ఫైనాన్స్ మేనేజర్ అజయ్ కుమార్,సంస్థ యూత్ అంబాసిడర్స్ దోమ మధుమతి, భౌగోచి దేవిక బొడ్డు అమర్నాథ్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సేవా సంస్థ కార్యదర్శి బెజ్జంకి ప్రభాకర్, ట్రేైనర్లు శ్వేతా, సంధ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లాలోని ఈరోజున జిల్లా కోర్టు ప్రాంగణంలో నేడు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ను నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్, డీఎల్ఎస్ఏ రాజన్న సిరిసిల్ల .P. నీరజ మాట్లాడుతూ రాజీమార్గమే రాజా మార్గమని కోర్టులలో పెండింగ్ లో ఉన్న అన్ని సివిల్ కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోగలరని సూచించారు.
జీవితం చాలా చిన్నదని మీరందరూ ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు, జాతీయ లోక్ అదాలత్ విజయానికి సహకరించడంలో పోలీసులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మీడియా పనితీరును ప్రశంసించారు.
National Lok Adalat program.
ఈ కార్యక్రమం లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ బి.పుష్పలత, అదనపు ఎస్.పి.శ్రీ.డి.చంద్రయ్య, డిఎల్ఎస్ఎ కార్యదర్శి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ.పి.లక్ష్మణాచారి, మేజిస్ట్రేట్లు శ్రీ.ఎ.ప్రవీణ్, శ్రీమతి కె.సృజన, మిస్.జి.మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ.జె.శ్రీనివాస్ రావు, లోక్ అదాలత్ సభ్యులు శ్రీ.సిహెచ్.భాస్కర్, శ్రీ.ఎ.వేణు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ.పి.శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, ఇతర న్యాయవాదులు, పోలీసులు, న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు.
గర్భిణులకు, పసిపిల్లలకు అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం లభిస్తుందని అంగన్వాడి టీచర్ జ్యోతి పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నందగోకుల్ గ్రామంలో శనివారం టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వంటగది, అంగన్వాడి చుట్టూ పరిసరాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. “అమ్మ మాట అంగన్వాడి బాట” అనే కార్యక్రమంలో భాగంగా జూన్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు 5 రోజులపాటు రోజుకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతిపత్రం ఇచ్చిన పేదలు
అర్హులైన పేదలందరికీ పట్టాలిస్తాం… హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
నర్సంపేట నేటిధాత్రి:
ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టాలచ్చి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించి, కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ తెలిపారు.ఈ మేరకు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పేదలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని 601/1 ప్రభుత్వ భూమిలో నిలువ నీడలేని పేదలు గత 5 సంవత్సరాలకు పైగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వీరికి నీళ్ల సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే సహకారంతో గెలిచిన వెంటనే పేదలు నివాసం ఉండే ప్రాతంలో బోరువేయడం జరిగిందని అన్నారు.కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాము. వర్షాకాలం వచ్చిందంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పాములు,కిటకాలుతో పేదలు సావాసం చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులకు పట్టాల కోసం అనేక సార్లు దరఖాస్తలు చేసుకోవడం జరిగిందని,ఎమ్మెల్యే స్పందించి పేదలు వేసుకున్న ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించి,ఇండ్ల పట్టాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించగలరని కోరినట్లు తెలిపారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నర్సంపేట స్థానికులైనా అర్హత గల పేదలందరికి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్, కలకోట అనిల్,ఎండి ఫరిదా, వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, జగన్నాధం కార్తీక్, దాసరి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మానేరు రివర్ ఫ్రంట్,కేబుల్ బ్రిడ్జి పనుల అభివృద్ధి పై అధికారులతో సమీక్ష చేయాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం సృష్టించడానికి పర్యాటక రంగ అభివృద్ధి కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన నిర్మాణ పనుల్లో పూర్తిగా అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నాయని,తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విజిలెన్స్ ద్వారా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున సిపిఐ కరీంనగర్ నగర సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మానేరు ఫ్రంట్,తీగల వంతెన ను సిపిఐ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేయగా అందులో వంద కోట్లు టూరిజం శాఖ, వంద కోట్లు నీటి పారుదల శాఖ నిధులు మంజూరు చేసిందని, పర్యాటక రంగ అభివృద్ధి కోసం చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్ కు చెందిన శాసనసభ్యులు ఆనాటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో జరిగిన ఈ పనులు పూర్తిగా అవినీతి మయమై లోపభూయిష్టంగా జరిగాయని, తన అనుచరులైన వారిని, వారి కుటుంబానికి చెందిన వారిని కాంట్రాక్టర్లుగా, బినామీలుగా ఉపయోగించుకొని పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులను అసంపూర్తిగా చేశారన్నారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆగమేఘాల మీద కరీంనగర్ కు వచ్చి మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించారని, కానీ నేటికీ పనులకు అతిగతి లేదన్నారు. రివర్ ఫ్రంట్ ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాములు పూర్తిగా నాణ్యత లోపం తో నిర్మించడం వల్ల వర్షాలకు ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కొట్టుకుపోయాయని, నిర్మాణ లోపాలు ఉన్నటువంటి మానే రివర్ ఫ్రంట్ కు రెండు వందల కోట్లు రూపాయల నిధులను ఏప్రాతిపదికన విడుదల చేశారో నేటి ప్రభుత్వం స్పష్టం చేయాలని, నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెంకటరెడ్డి తెలిపారు. తీగల వంతెనను ఆనాటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హడావుడిగా ప్రారంభించారని, రెండు వందల ఎనిమిది కోట్ల నిధులు వెచ్చించి కనీసం విద్యుత్ దీపాలు, రోడ్లు సరిగా వేయకపోవడం, వేసిన వీధి దీపాలు వెలగకపోవడం దారుణమని, నాడు ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ఇంచార్జీ మంత్రిగా నియామకమైనందున తక్షణమే జిల్లా అధికారులతో కేబుల్ బ్రిడ్జి మానేరు ఫ్రంట్ పై సమీక్ష సమావేశం జరిపి అవినీతి అక్రమాలకు పాల్పడి నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ సిపిఐ ప్రత్యక్షమవుతుందని అవినీతి అంతమే సిపిఐ పంతమని, ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టకుంటే సిపిఐ చూస్తూ ఊరుకోదని ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈప్రాజెక్టులో రెండు వందల కోట్ల ప్రజాధనాన్ని మొక్కుబడిగా ఖర్చు చేసి నీటిపాలు చేసిందని, ప్రజాధనాన్ని సంక్షేమం కోసం కాకుండా కాంట్రాక్టర్ లబ్ధికోసం అప్పగించిన నాటి ప్రభుత్వంలో మంత్రి గంగుల కమలాకర్ కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని విమర్శించారు. ఏమేరకు అభివృద్ధి పనులు జరిగాయని,ఎంత అవినీతి జరిగిందని,ఎందుకు పనులు నిలిచిపోయాయి అనే విషయాలపై నిష్పక్షపాతంగా కాంగ్రెస్ ప్రభుత్వం తగిన విచారణ చేపట్టి బాధ్యులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని అవినీతిపై సిపిఐ పోరాటం చేస్తుందని మర్రి వెంకటస్వామి తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కిన్నెర మల్లవ్వ, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజు,కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,కసిరెడ్డి మణికంఠ రెడ్డి,బండ రాజిరెడ్డి,కంది రవీందర్ రెడ్డి,మచ్చ రమేష్, బ్రామండ్లపల్లి యుగేందర్, నాయకులు గామినేని సత్తయ్య, నగునూరి రమేష్, కూన రవి, చెంచల మురళి, మామిడిపల్లి హేమంత్ కుమార్,సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.