మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం
గాంధీనగర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన స్వర్గస్తులైన కీర్తిశేషులు కీర్తి శ్రీకాంత్ దిన కర్మ కు హాజరైన భూపాలపల్లి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి భువన సుందర్ మాజీ తాజా సర్పంచ్ మాధం మమత – సుధాకర్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోతరాజు సురేష్, కాంగ్రెస్ నాయకులు గుడ్డేటి సురేష్, కడారి సుమన్, వేంపటి సురేందర్, పల్లెవెని రాజయ్య,బోల్ల భిక్షపతి, తుముల కుమార్, బొళ్ళశంకర్,కీర్తి శంకర్,కీర్తి భద్రయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు ప్రమోద్,అందరు కలిసి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సాయం 2500 రూపాయలు అందించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఆదుకొని అండగా ఉంటానని ధైర్యం చెప్పారు

సిరిసిల్లలోని అంబేద్కర్ కి వినతి పత్రం..

సిరిసిల్లలోని అంబేద్కర్ కి వినతి పత్రం

బి.ఆర్.యస్.వి కంచర్లరవి గౌడ్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్వి కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం విద్యార్థుల సమక్షంలో అందజేయడం జరిగినది. విషయం రాష్ట్రంలోని గురుకుల రోజుకో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ హై విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుండి దాదాపు 95 మంది విద్యార్థులు చనిపోవడం జరిగినది.అలాగైనా ఈ ముఖ్యమంత్రి విద్యార్థుల సమస్యలపై మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమని తెలియజేస్తున్నాం తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నాయకత్వంలో గురుకుల వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైందని విద్యార్థి తల్లిదండ్రులు గురుకులాలకు పంపియాలంటేనే భయపడే పరిస్థితి తీసుకు వచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల గోస కనిపియ్యకపోవడం చాలా బాధాకరం తరగతి గదిలో చదువుకునే విద్యార్థులు నడిరోడ్డు మీదికి రావడం మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేదా అని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా గురుకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి పడుకున్నప్పుడు కలలోకి పోయి ఇటు బోధన చేయాలని అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి సాయికిరణ్, ముధం అనిల్ గౌడ్, ఎస్.కె అప్రోచ్, హరీష్,జోయల్, శివ రాకేష్, కృష్ణ, వంశీ,రోహిత్,విష్ణు తదితరులు పాల్గొన్నారు

మండల సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం కు వీడ్కోలు..

మండల సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం కు వీడ్కోలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న మెండి లతామంగేశ్వరి 8 సంవత్సరాలుగా ఓదెల ఏపిఎం గా బాధ్యతలు చేపట్టి ఈ రోజు బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఏపీఏంగా బదిలీపై వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సమైక్యల అధ్యక్షులు గ్రామ సంఘం అసిస్టెంట్లు మరియు సిబ్బంది అందరూ ఏపియం ని శాలువాలతో సన్మానించి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర, రాము, సీసీలు మారెళ్ళ శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయ రాజకుమారి, స్త్రీనిధి మేనేజర్ ప్రభాకర్ ,పవన్, భవాని, రమేష్, రాము మండల సమైక్య పాలకవర్గ సభ్యులు ఆలేటి స్వప్న రెడ్డి , పి.అనూష, జెఅనూష మరియు విఓ అధ్యక్షురాల్లు, వివోఏ లు పాల్గొనడం జరిగింది.

ప్రతీ ఉద్యోగి ఉద్యోగ విరమణ తప్పనిసరి…

ప్రతీ ఉద్యోగి ఉద్యోగ విరమణ తప్పనిసరి…

డివైసీఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ప్రతి ఉద్యోగి తన జీవితంలో ఉద్యోగ విరమణ తప్పనిసరి అని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ అన్నారు. గురువారం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డివైసిఎంఓ గా విధులు నిర్వహించే డాక్టర్ జక్కుల ప్రభాకర్, స్వీపర్ గా విధులు నిర్వహించే గూడెపు పూలమ్మ లు ఉద్యోగ విరమణ పొందారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్మాన సభ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడారు. డాక్టర్ ప్రభాకర్ ఉద్యోగరీత్యా 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందుతున్నారని, వారు వారి కుటుంబంతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. స్వీపర్గా విధులు నిర్వహించే గూడెం పూలమ్మ 34 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారని ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీకాంత్, సంక్షేమ అధికారి ఎండి మాధార్ సాహెబ్, సూపరిండెంట్ కృష్ణమూర్తి , మ్యాట్రిన్ విజయలక్ష్మి, ఏఐటియుసి ఫిక్స్ సెక్రటరీ నాగేంద్ర భట్టు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఉద్యోగులు, డాక్టర్లు పాల్గొన్నారు.

వృద్ధురాలికి వీల్ చైర్ అందించిన ఎమ్మెల్యే రేవూరి.

వృద్ధురాలికి వీల్ చైర్ అందించిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
గురువారం పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మాచబోయిన ఓదెమ్మకి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వీల్ చైర్ ని అందించి వృద్ధిరాలితో కాసేపు ముచ్చటించి వారి ఆరోగ్య బాబోగుల గురించి తెలుసుకొని వృద్ధురాలికి ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమం లో నాగారం గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి బిక్షపతి,యూత్ అధ్యక్షులు మాచబోయిన అజయ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు,అల్లం రఘు నారాయణ,బొమ్మకంటి చంద్రమౌళి,చందుపట్ల రాఘవ రెడ్డి,పర్నెం మల్లారెడ్డి,కొత్తపల్లి రవి,బొచ్చు సంపత్,బొచ్చు మోహన్,కొక్కిరాల తిరుపతి రావు,మడికొండ చంగల్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్స్ దీకొండ రమేష్..

ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్స్ దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి ప్రైవేట్ స్కూల్ బస్సులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ దీకొండ రమేష్ ఈరోజు స్కూల్ బస్ లను తనిఖీ చేసి డ్రైవర్స్ కు అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ పిల్లలను తీసుకెళ్లే వెహికిల్స్ కు తప్పనిసరిగా కండిషన్ లో ఉంచుకోవాలని,ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని తప్పనిసరిగా ఉండాలని స్కూలు బస్సులను నడిపే డ్రైవర్ తప్పకుండా యూనిఫామ్​ వేసుకోవాలి. ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్‌ లేని బస్సులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా బస్సులను నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే బస్ లలో పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదని, మద్యం సేవించి వాహనం నడపవద్దు అని అటువంటి వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

గోదావరి లోయ ప్రతిఘటన వీర యోధుడు లింగన్న…

గోదావరి లోయ ప్రతిఘటన వీర యోధుడు లింగన్న…

విప్లవొద్యమంలో నిబద్దత కలిగిన విప్లవ కమ్యూనిస్ట్ కార్యకర్త లింగన్న…

వేములపల్లి వెంకట్రామయ్య,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…

నేటి ధాత్రి -బయ్యారం :-

విప్లవోద్యమంలో నిబద్ధత కలిగిన విప్లవ కమ్యూనిస్టు కార్యకర్తగా లింగన్న పని చేశాడని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు.మండల కేంద్రంలోని స్థానిక గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అధ్యక్షతన లింగన్న 6వ వర్ధంతి సభ నిర్వహించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,లింగన్న తన 20వ సంవత్సరంలోనే పార్టీలో చేరి,కొంత కాలం తరువాత పూర్తి కాలం కార్యకర్తగా పని చేసాడని,కొద్ది రోజుల్లోనే ప్రతిఘటనా దళాల్లో చేరాడని,తన క్రమశిక్షణ, దృఢదీక్షతో దళ కమాండర్ బాధ్యత నిర్వహించాడని కీర్తించారు.క్రమ క్రమంగా ఎదిగి రాష్ట్ర నాయకుడిగా అభివృద్ధి అయ్యి,పార్టీలో సిద్ధాంత పరంగా తన అధ్యయనాన్ని అభివృద్ధి చేసుకున్నాడని అన్నారు.రాజకీయాలలో నిలకడగా సుదీర్ఘ కాలం ప్రయాణించి, క్రమ శిక్షణకి మారు పేరుగా మారాడన్నారు. పార్టీ విధానాలను ఉక్క క్రమశిక్షణ గల సైనికునిగా అమలు చేశాడు.

మట్టిలో మాణిక్యం లింగన్న.ఆదివాసీల సమస్యలపై ముఖ్యంగా పోడు భూములు ప్రజలకే దక్కాలని అవిరామరంగా పోరాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అడవి చట్టాల అపహరణకి వ్యతిరేకంగా పోడు రైతులను ఏకం చేసి,వాటి రక్షణ కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి అహర్నిశలు కృషి సల్పాడని,అందుకే లింగన్న భూమిలో విత్తనంలా ప్రజల గుండెల్లో హత్తుకుపోయాడని తెలిపారు. రోళ్లగడ్డ లోని పండగట్టలో లింగన్న దళంపై కాల్పులు చేయగా లింగన్న కాలికి తూటా తగిలి తప్పించుకోలేక పోయాడని, క్షతగాత్రుడయిన లింగన్న ను పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అని బూటకపు మాటలు చెప్పారని విమర్శించారు.అధికారం మార్పిడి జరిగి 70 సంవత్సరాలు గడిచినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో పాలకవర్గాల తీరువుంది. నేటి బీజేపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు, భూస్వాములకి, కోటీశ్వరులకి ఊడిగం చేస్తుందని వారు దుయ్యబట్టారు.ప్రజల హక్కులను కాలరాస్తున్న క్రమంలో, ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తు, ప్రజల ప్రాథమిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా హరిస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాడడమే ప్రతిఘటనా పోరాట యోధుడు లింగన్న కి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.ఈ సంతాప సభ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జెవి చలపతిరావు,కే గోవర్ధన్,గౌని ఐలయ్య లు ప్రసంగించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల వెంకన్న,మోకాళ్ళ మురళీ కృష్ణ,బండారి ఐలయ్య, నందగిరి వెంకటేశ్వర్లు,జడ సత్యనారాయణ,ఊకే పద్మ,పుల్లన్న,జి. సక్రు,హెచ్. లింగ్యా, ఇ.శ్రీశైలం,గుజ్జు దేవేందర్, శివ్వారపు శ్రీధర్, తుడుం వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన..

ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
ఈసందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోజుల సంఖ్యతో పాటు, ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రి లో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. జ్వరం ప్రబలిన ప్రాంతాలల్లో వైద్య క్యాంపు లు నిర్వహిస్తూ వ్యాధుల ను అరికట్టాలని తెలిపారు. ప్రబలిన వ్యాధులపై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
ముఖ్యంగా వివిధ గ్రామాలలోని పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణ మొత్తం పరిశీలించారు. పాఠశాలలో బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణలోనే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని వారు తెలుపగా వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారి కి ఫోన్ చేసి అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇల్లు ను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డా. ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎం.పి.ఓ నాగరాజు
ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు,
పంచాయతీ సెక్రెటరీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థాన అధికారులు, పండితులు, ఇతర సిబ్బంది వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మ‌ల్లికార్జున స్వామి, భ్ర‌మ‌రాంభ అమ్మ‌వారిని ఎన్నిసార్లు చూసినా త‌నివి తీర‌దని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. అనంతరం శ్రీశైలం డ్యాంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బోటు ప్రయాణం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. పర్యాటక అవకాశాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, భద్రత, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి తదితర విషయాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు శ్రీశైలం లో ఆల్ ఇండియా వెలమ సంక్షేమ భవన్ ను మంత్రితో కలిసి ప్రారంభించి, అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసులు…

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసులు…

సమిష్టి జీవన, పద్ధతులు, సహజీవనం,పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు ఆదివాసులు…

బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసులే…

ఆదివాసులు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి…

ఆదివాసి ప్రాంతాల్లో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి…

ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…

సనాతన ప్రజల తెగలు నేడు అంతరించిపోతున్నాయి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసి ప్రజలు. సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు వారు. పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకుని తరతరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసులు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడను సాగిస్తున్నారు. వారికి అడవి అంటే ప్రాణం. ప్రకృతితో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధానాలపై ఆధారపడి ఆదివాసులు అడవి బిడ్డలుగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయంతో బ్రతుకుతున్నారు. విద్య వైద్యం అందని ఆదివాసీల జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. అతి పురాతన సనాతన ప్రజల తెగలు అంతరించిపోతున్నాయి.సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. దేశంలో ఆదివాసీ జనాభా 12 కోట్ల మంది ఉన్నారు. ఆదివాసి ప్రజలు ఐదు మరియు ఆరవ షెడ్యూల్ ఏజెన్సీ ఏరియాలో నివాసం ఉంటున్నారు. 20% పైగా భూభాగంలో విస్తరించి ఉన్నారు. ఆదివాసి ప్రజల పాదాల కింద 80% ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నది. ఆదివాసుల జ్ఞానం,సంస్కృతి పాలన వ్యవస్థలపై ఆధారపడి అభివృద్ధి పథకాలు ఉండాలి. ఆదివాసీలు వారి పేరు ప్రతిబింబించే విధంగా ఉపఖండంలోని తొలి నివాసులు మరియు ఒకప్పుడు వారు ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా పెద్ద ప్రాంతాల్లో నివసించారు. చుట్టూ దట్టమైన అరణ్యం. కొండకోనల మధ్య ఆవాసం. సంప్రదాయాలు,కట్టుబాట్లతో జీవనం. విలక్షణమైన అహార్యం. గొప్ప ఐక్యత. అడవి తల్లి ఒడిలో నిత్యం ఒదిగి సాగే పయనం. ఇలా ప్రత్యేక జీవనశైలి ఆదివాసుల సొంతం. వాళ్లే దేశానికి మూలవాసులు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న గిరి మాణిక్యాలు. ఆదివాసి ప్రజలు అనేక రకాలుగా అన్యాయాలకు గురయ్యారు. కానీ వారు తమ సంస్కృతిని మరియు హక్కులను కాపాడుకోవడానికి నిరంతరం ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసి ప్రజలకు వారి సాంప్రదాయ భూములు, అడవులు మరియు సహజ వనరులపై యాజమాన్యం మరియు యాక్సెస్ హక్కులు ఉంటాయి. ఆదివాసులు బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు. అడవులతో సన్నిహిత సంబంధం కలిగి, ప్రకృతి వనరులపై ఆధారపడి జీవిస్తారు. తరతరాలుగా ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల వారు బ్రతుకు పోరాటంలో నైపుణ్యం సాధించారు.

ఆదివాసి ప్రజలు అడవి ఆధారిత జీవనం సాగిస్తారు. మరియు వారి మనుగడ కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారు. ఆదివాసి ప్రజలు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో నిండి ఉంటాయి. వీటిని వారు తరతరాలుగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆదివాసీలు వనరుల దోపిడీ, గుర్తింపు లేకపోవడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆదివాసి చట్టాలు అక్కరకు రాని చుట్టాలుగా మారాయి. ఆదివాసి తెగల వాయిద్య పరికరాలు వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీలు తమ హక్కులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూమి హక్కు, అటవీ సంరక్షణ, విద్య, ఆరోగ్యం మరియు ఇతర సామాజిక సమస్యలు ఆదివాసీల హక్కులను కాపాడటం మరియు వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఇది సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ఒక ముఖ్యమైన అడుగు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడను సాగిస్తూ అడవిని ప్రాణంగా ప్రేమిస్తూ వీరు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొగాకు తదితర పంటలు ఎక్కువగా పండిస్తారు. అయినప్పటికీ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. పాలకుల తీరుతో ఆదివాసీలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. చాలా గ్రామాలకు నేటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. వైద్య సదుపాయాలు మృగ్యం. ఏదైనా రోగం వస్తే డోలిమోతలే దిక్కవుతున్నాయి. ఆదివాసీలు విలక్షణమైన భాష, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉన్నారు. వాటిని పరిరక్షించడం, గౌరవించడం, మరింత ముందుకు తీసుకుపోవడం మనందరి కర్తవ్యం.

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ సభ్యులు రఘునాథరెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17 వ వార్డ్ విద్యానగర్ ఏరియాలో 4.75 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో 92 మీటర్ల సిసి రోడ్డు పనులకు గురువారం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి లు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. 17వ వార్డు అభివృద్ధి కోసం 25 లక్షల నిధులతో డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను చేయించడం జరుగుతుందని తెలిపారు.బడ్జెట్ లేని కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. ఇకనుండి అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయించారని త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, రవీందర్, వెంకటేష్ కిష్టయ్య, రాజయ్య, కళ్యాణ్, కనకరాజు, వేణు, రమేష్, విజయ, పుష్ప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

చిన్నారి బాలునిపై గుర్తు తెలియని అగంతకుడు కత్తితో దాడి..

చిన్నారి బాలునిపై గుర్తు తెలియని అగంతకుడు కత్తితో దాడి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి నిద్ర పోతున్న చిన్నారి బాలుడు పై కత్తితో దాడి చేసిన సంఘటన జరిగింది,
స్థానికులు గాయపడిన బాలుడి నానమ్మ మంగమ్మ తెలిపిన కథనం ప్రకారం.. పందుల మునీష్ కుమార్ (6) నారాయణపురం యుపిఎస్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. తండ్రి పేరు ఉపేందర్, తల్లి శిరీష ముగ్గురు సంతానం, రోజువారి వృత్తిరీత్యా డ్రైవర్ పని నిమిత్తం వెళ్లి రావడం జరిగిందని, గాయపడిన బాలుడు పెద్ద కుమారుడు పందుల మనీష్ కుమార్ తల్లిదండ్రులు ఉపేందర్ శిరీష మరో బాలుడు ఒకే దగ్గర పడుకోవడం జరిగిందని, ఇంటికి రెండు డోర్లు ఉంటాయి ఒకదానికి లోపల బేడమ్ (గొళ్లెం) ఉందని, గొల్లం లేని మెయిన్ డోర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో బాలుడు మునిష్ కుమార్ రోదిస్తుండగా గుర్తించిన నానమ్మ మంగమ్మ తండ్రి ఉపేందర్ చూడడంతో బాలుడు స్కూల్ యూనిఫామ్ పై రక్తస్రావంతో ఉండడంతో వెంటనే గ్రామంలోని ఓ వైద్యుని దగ్గరికి తీసుకెళ్లామని, ఆ వైద్యుడు మహబూబాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లమనడంతో వెనుతిరిగామని, ఈ క్రమంలో వైద్యుని ఇల్లు బొడ్రాయి దగ్గర ఉండడంతో కారులో బొడ్రాయి వద్దకు వచ్చి వెనుతిరిగి వెళ్ళారని ఓ వ్యక్తి తెలిపాడు. అనంతరం మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లడం జరిగిందనీ, గతంలో చిన్న కుమారుడు ఎనిమిది నెలల క్రితం వాటర్ సబ్బులో పడి మృతి చెందాడని , నాకు గ్రామంలో ఎలాంటి వారితో శత్రుత్వం లేదని గుర్తుతెలియని అగంతకుడు నా బాలుడిని గాయపరిచినట్లు తెలిపారు. అని తెలుసుకున్న కేసముద్రం పోలీసులు ట్రైనింగ్ ఎస్సై నరేష్ పోలీస్ సిబ్బంది విచారణ చేపడుతున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యా ప్రదాత కాటిపెల్లి నారాయణ రెడ్డి..

ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యా ప్రదాత కాటిపెల్లి నారాయణ రెడ్డి కి అంతర్జాతీయ యోగా శిక్షణకులు మాధవరెడ్డి కి ఘన సన్మానం భగవద్గీత ల ప్రదానం…

ప్రపంచానికి యోగా, జ్ఞానాన్ని అందించింది. మన భారతదేశమే…

రాయికల్ , జూలై 31, నేటి ధాత్రి:

రాయికల్.మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇటిక్యాలలో సుమారుగా 5 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఒక రూం నిర్మించి గ్రంథాలయం ఏర్పాటు చేసి, నిత్యం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఇదే గ్రామానికి చెంది హైదరాబాద్ స్థిరపడిన కాటిపెల్లి నారాయణ రెడ్డి ని, అంతర్జాతీయ యోగా శిక్షణకులు మాధవరెడ్డి లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, మాజీ ఎంపిపి కాటిపెల్లి గంగారెడ్డి, తపస్ జిల్లా బాధ్యులు చెరుకు మహేశ్వర శర్మ, ఉపాధ్యాయ బృందంలు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో లు బహూకరించారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ భగవద్గీత లను ప్రదానం చేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ అధ్యక్షతన జరిగిన యోగాతో సంపూర్ణ ఆరోగ్యంపై జరిగిన సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్ముందు పాఠశాలకు ఎటువంటి సహాయమైన చేస్తానని, విద్యతోనే జ్ఞానం లభిస్తుందని అందరు బాగా చదివి ఉన్నత శిఖరాలలు అధిరోహించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా శిక్షకులు శనివారపు మాధవరెడ్డి విద్యార్థులకు యోగా, ధ్యానం నిత్య జీవితంలో వీటి ఆవశ్యకతలపై అవగాహన కల్పించి, ఆసనాలు, యోగా, ధ్యానం నేర్పించారు. ప్రపంచానికి యోగా, ధ్యానం జ్ఞానం అందించినది మన భారత దేశమేనని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని‌ ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమంలో జీయావుద్దీన్, ముజాహిద్, స్వర్ణలత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత..

వివాహ వేడుకలలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో లో పాత మార్కెట్ యార్డ్ శ్రీ గణపతి దేవాలయం అధ్యక్షులు మారం బాలకృష్ణ కూతురు వివాహ వివాహ వేడుకలకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత నాగబంది యాదగిరి దంతులు పాల్గొన్నారు ఈ మేరకు మారం బాలకృష్ణను శాలువతో ఘనంగా సన్మానం చేశారు నూతన వదువరులను నాగబంది యాదగిరి దంపతులు ఆశీర్వదించారు

ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపిన..

ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపిన సీతంపేట వాసులు

ముత్తారం :- నేటి ధాత్రి

ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సీతంపేట గ్రామం లోని హనుమాన్ టెంపుల్ వద్ద బోర్ వేయడం జరిగింది గత కొద్ది సంవత్సరముల నుండి హనుమాన్ టెంపుల్ వద్ద సుమారు 100 మంది హనుమాన్ భక్తులు మరియు బ్రహ్మం భక్తులు దీక్ష తీసుకుంటున్నారూ వారికి హనుమాన్ దేవాలయం దగ్గర నీరు లేక స్నానాలకు త్రాగడానికి ఇబ్బంది పడుతున్నారు ఇట్టి విషయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లగా వెంటనే స్పందించి బోర్ వేయించారు హనుమాన్ భక్తులు బ్రహ్మం భక్తులు సీతంపేట గ్రామ ప్రజలు ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబుకి కృతజ్ఞతలు తెలిపారు సహకరించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ కి గ్రామ కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య మాజీ సర్పంచ్ పులిపాక నగేష్ మాజీ సర్పంచులు లింగం రామయ్య గంగుల రాజలింగు ఇరుగురాల రాజమల్లు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు కూరాకుల పర్వతాలు కాంగ్రెస్ నాయకులు ఇండ్ల సది మామిడి సంపత్ గంగుల కుమార్ ఇందారపు నవీన్ లింగం చంద్రయ్య రావుల రాజ్ కుమార్ రావుల కుమారస్వామి గంగుల రాజయ్య బండి శంకర్ మామిడి రామయ్య బియ్యాల కిరణ్ కూరాకుల ఓదెలు జక్కుల ఓదెలు ఇండ్ల ఓదెలు లింగం రాజయ్య లింగం మల్లయ్య నూనేటి ఓదెలు పాల్గొన్నారు

సిఐఎస్ఎఫ్ కి ప్రాజెక్ట్ మాన్ ఆత్మబంధువు..

సిఐఎస్ఎఫ్ కి ప్రాజెక్ట్ మాన్ ఆత్మబంధువు

హైదరాబాద్,నేటి ధాత్రి:

ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (ఏబిఈటి) చైర్‌పర్సన్ నీర్జా బిర్లా సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఎస్.భట్టి,ఐపీఎస్ సంయుక్తంగా ప్రాజెక్ట్ మాన్ అనే మానసిక ఆరోగ్య కార్యక్రమం పురోగతిని గురువారం సమీక్షించారు.దీని కోసం సిఐఎస్ఎఫ్,ఏబీఈటి నవంబర్ 2024లో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసే అన్నారు. సిఐఎస్ఎఫ్ సిబ్బందికి అవగాహన కల్పించడం,కౌన్సెలింగ్, క్లినికల్ జోక్యాలు,శిక్షణ ద్వారా మానసిక ఆరోగ్య అవగాహన కల్పించడంలో ఏబీఈటి నిపుణుల పాత్రను సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రశంసించారు.ప్రాజెక్ట్ మాన్ ఇప్పటివరకు 75,181 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందికి,వారి కుటుంబాలకు సహాయం చేసినట్లు తెలిపారు.తక్కువ-ప్రమాదకర మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి నిర్వహించడానికి తీవ్రమైన కేసులను నిపుణులకు తెలియజేయడానికి ఏబిఈటి 1,726 మంది సిఐఎస్ఎఫ్ అధికారులు,సబ్-ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చింది.ఈ రెండు అంచెల నిర్మాణం అట్టడుగు స్థాయిలో మానసిక మద్దతును మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది.ఐజిఐ విమానాశ్రయం,పార్లమెంట్, ఢిల్లీ మెట్రో వంటి హైపర్ సెన్సిటివ్ యూనిట్లలో 31,000 మందికి పైగా సిబ్బందికి సైకోమెట్రిక్ అసెస్‌మెంట్‌లు నిర్వహించబడ్డాయి.తద్వారా సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని అన్నారు.ఈ చొరవ వల్ల నిరాశ,వైవాహిక విభేదాలు,ఆర్థిక ఒత్తిడి వంటి సమస్యల విషయంలో కౌన్సెలింగ్,జోక్యాలు లభించాయి.2024,2025 సంవత్సరాల్లో సిఐఎస్ఎఫ్ ఆత్మహత్య రేటు జాతీయ సగటు కంటే తగ్గడం గమనార్హం.ఇది ఈ చొరవ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.
ప్రాజెక్ట్ మాన్ విజయం,ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని,డీజీ సీఐఎస్ఎఫ్,నీర్జా బిర్లా సంయుక్తంగా రాబోయే సంవత్సరాల్లో మద్దతును కొనసాగించాలని నిర్ణయించారు.ఈ చొరవ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ డీజీ సీఐఎస్ఎఫ్ మానసిక ఆరోగ్యం మా సిబ్బందికి శారీరక దృఢత్వం అంతే కీలకం.ఈ చొరవ మా అంతర్గత మద్దతు వ్యవస్థలను బలోపేతం చేస్తుంది.మా సిబ్బంది భావోద్వేగపరంగా స్థితిస్థాపకంగా,దృష్టి కేంద్రీకరించి,కార్యాచరణకు సిద్ధంగా ఉండేలా చేస్తుంది అని అన్నారు.ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు,చైర్‌పర్సన్ – ఎంపవర్,నీర్జా బిర్లా ఇలా అన్నారు.మానసిక ఆరోగ్యాన్ని సంస్థాగతీకరించినప్పుడు ఏమి సాధించవచ్చో సిఐఎస్ఎఫ్ తో మా దీర్ఘకాలిక భాగస్వామ్యం ఒక నిదర్శనం.గత మూడు సంవత్సరాలుగా,ప్రాజెక్ట్ మాన్ దేశవ్యాప్తంగా సిఐఎస్ఎఫ్ యూనిట్లలో పిఎస్ సైకోమెట్రిక్ స్క్రీనింగ్,కౌన్సెలింగ్,పీర్ ఎంగేజ్‌మెంట్ 24×7 హెల్ప్‌లైన్‌తో 75,000 కంటే ఎక్కువ మంది సిబ్బందికి మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు.వెల్‌నెస్ ప్రోటోకాల్‌లు,సంరక్షణను రోజువారీ వ్యవస్థలో సమగ్రపరచడం ద్వారా సమగ్ర శ్రేయస్సు కోసం సిఐఎస్ఎఫ్ యొక్క నిబద్ధతను మేము అభినందిస్తున్నాము.వీటి ఫలితంగా ఆత్మహత్య సంఘటనలో 40% తగ్గాయని అజయ్ దహియా సిఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు.

నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం…

నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం

నెట్ బాల్ క్రీడలో అత్యున్నతమైన క్రీడను ప్రదర్శించిన సెయింట్ జోన్స్ హై స్కూల్ విద్యార్థి

కంకాల దిలీప్ ను అభినందించిన కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

ఈనెల 13వ తారీకు రోజున మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ నెట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ ఎంపిక క్రీడలలో పాల్గొని తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ నెట్ బాల్ క్రీడాలలో పాల్గొనడం జరిగింది దిలీప్ తన అత్యున్నతమైన క్రీడాను ప్రదర్శించి తెలంగాణ జట్టు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది,దిలీప్ యొక్క విజయాన్ని సెయింట్ జాన్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ ఫాదర్ అల్లం శ్రావణ్ కుమార్ రెడ్డి, దిలీపును సన్మానించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఏం వెంకటేశ్వర్లు ఎన్ మహేష్ లు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇచ్చిన..

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిరసన వ్యక్తం చేసిన ఆటో యూనియన్ సభ్యులు.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రం లో ఆటో కార్మికులు గురువారం బస్టాండ్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో ఆర్థికంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని చందుర్తి మండల ఆదర్శ ఆటో యూనియన్ కార్మికులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. దీంతో రాష్ర్టంలోని ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులకి సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం కాకుండా రూ.15వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమానికి ఆటో సంక్షేమ బోర్డుగాని, ఆటో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లాంటి సంక్షేమ పథకంలో ఆటో కార్మికులకు 10 శాతం ఇళ్లు కేటాయించాలని శేషు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్…

బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో విద్యార్థులలో ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు మాక్ ఓటింగ్ నిర్వహించారు.ఓటింగ్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి అని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య దేశాలలో రహస్య బాలెట్ ద్వారా తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బలమైన నాయకుడిని ఎన్నుకోవాలని అప్పుడే సుస్థిరపాలన అందుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. బిట్స్ సెక్రటరీ డాక్టర్ జి .రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా చాగంటి క్రాంతి కుమార్ పోలింగ్ ఆఫీసర్ గా ఎం.డి రియాజుద్దీన్ పోలింగ్ సిబ్బంది గా ఉపాధ్యాయులు ఆర్లయ్య , అనిల్ , శంకర్ బాబు , సంగీత, సతీష్, కవిత పాల్గొన్నారు. ఎన్.సి.సి క్యాడేట్లు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వహించారు.అనంతరం తెలంగాణ వన మహోత్సవం 2025 కార్యక్రమం లో భాగంగా బాలాజీ టెక్నో స్కూల్ లో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి మొక్కలు నాటారు.

రైతాంగ పోరాటం సామాజిక ఉద్యమాలు…

రైతాంగ పోరాటం సామాజిక ఉద్యమాలు

ప్రస్తుత ప్రభుత్వ విధానా లపై వైఖరి

పంటకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అఖిల భారత రైతు సమైక్య వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శత జయంతి ఉత్సవాల భాగంగా రైతుల యొక్క బాధలు వారి అభిప్రాయాలు సేకరణ అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై వైఖరి మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. పంటల అవసరమైన ఎరువు లు సరఫరా పైన, రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఉద్యమం చేపట్టాలి.

Government Policies.

ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సమైక్య సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగా ర్జున, రాష్ట్ర కమిటీ సభ్యు రాలు మాస్ సావిత్రి, హంస రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కర్ర రాజి రెడ్డి ,వక్కల కిషన్, ఉస్మాన్ మహమ్మద్ ,సంఘ సభ్యులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version