వైద్యుల నిర్లక్ష్యం..ఏడేళ్ల పాప మృతి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన జన్నే ఉమారాణి-రాజు దంపతుల కుమార్తె జన్నే సాయి శ్రీ అనే ఏడేళ్ల పాపకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో..తల్లిదండ్రులు హన్మకొండలోని డాల్ఫిన్ పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గురువారం పాప మృతి చెందింది. దీంతో బంధువులంతా డాల్ఫిన్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…

Read More

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ ఫొండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రటరీ మారపల్లి మల్లేష్ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ శీలపాక నరేష్ పాల్గొని పేషెంట్లకు బంధువులకు వారి చేతుల మీదుగా అన్నం వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాట్లాడుతూ జిల్లా…

Read More

సీతారాం ఏచూరి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకం

అంబేద్కర్ యువజన సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు కల్లేపల్లి విక్రమ్ ఏచూరి చిత్రపటానికి నివాళులు లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు కల్లేపల్లి విక్రమ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏచూరి చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఏచూరి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. భూమి, భుక్తి, పీడిత జన విముక్తి కోసం పోరాడిన…

Read More

సాగు నీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది

* : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: మునుగోడు,దేవరకొండనియోజకవర్గాలకుసాగునీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం చండూరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో సుమారు3.41…

Read More

ప్రతిఒక్కరు విద్యుత్ మీటర్లు అమర్చుకోవాలి

మల్లక్కపేట గ్రామంలో పర్యటించిన విద్యుత్ అధికారులు ఏడీఈ,ఏఈ పరకాల నేటిధాత్రి మండలంలోని మల్లక్కపేట గ్రామంలో శుక్రవారం రోజున విద్యుత్ అధికారులు పర్యటించారు.గ్రామంలో విద్యుత్ మీటర్లు లేని వారికి అవగాహన కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మీటర్లు పెట్టుకోవాలని విద్యుత్ ఏడిఈ దేవేందర్,ఏఇ సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి ఒక్కరూ విద్యుత్ అధికారులకు సహకరించి మీటర్లను పెట్టుకోవాలని విద్యుత్ మీటర్ల లేని…

Read More

కామ్రేడ్ సీతారాం ఏచూరి కి లాల్ సలాం

భూపాలపల్లి నేటిధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పార్టీ శ్రేణులకు తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీడిత ప్రజల పెన్నిధి, కార్మిక, కర్షక, విద్యార్థి యువజన, మహిళా, రైతు, కూలి సమస్యలపై స్పష్టమైనటువంటి…

Read More

కార్మికుల అభ్యున్నతి కోసం ఏఐటియుసి పనిచేస్తుంది

రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే ప్రమోషన్లు లాభాల వాటా దీపావళి బోనస్ గతం కంటే పెరిగే విధంగా కృషి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి రాజకీయంగా మిత్రపక్షంగా ఉన్నప్పటికైనా కార్మిక అభ్యున్నతే లక్ష్యంగా ఏఐటీయూసీ పనిచేస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని…

Read More

చర్ల మండలం వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది

భద్రాచలం నేటిదాత్రి మలిదశ పోరాటానికి వరద బాధితులు సిద్ధం కావాలి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ఈనెల 20వ తారీకు ఎమ్మార్వో కార్యాలయం ముందు జరిగే ధర్నాని జయప్రదం చేయండి రెవెన్యూ వారు గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి వరద బాధితులు కుటుంబాలను గుర్తించాలి గతంలో రెవెన్యూ వారు వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి మండలంలో రెవెన్యూ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రెవిన్యూ వారు సర్వే చేసి బహిర్గత పరచాలి వరద…

Read More

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన శ్రీప్రగతి విద్యార్థి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన శ్రీప్రగతి పాఠశాల పదవ తరగతి విద్యార్థి దండవేణి రామ్ తేజ్ హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈనెల 14 తేదీ హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుందని పాఠశాల కరస్పాండెంట్ అన్నదానం రాధాకృష్ణ తెలియజేశారు. ఈసందర్భంగా విద్యార్థి దండవేణి రామ్ తేజ్ ను ప్రిన్సిపాల్ మునిందర్ రెడ్డి, పిఈటిలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు అభినందించారు

Read More

ప్రజాపాలన పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పై దాడుల

భద్రాచలం నేటి ధాత్రి మీ పాలన మీద నమ్మకం ఉంటె రాజీనామా చేపించండి.. అభివృద్ధి కోసం తెల్లం పార్టీ మారితే తెచ్చిన అభివృద్ధి నిధులు ఏమిటో చెప్పాలి… రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యే. జిల్లా పార్టీ అధ్యక్షులు భద్రాచలం కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ గూoడాలు చేసిన దాడిని తీవ్రంగా కండిస్తున్నాను …. ఇది అప్రజాస్వామ్యం ఇది పిరికిపందల చర్య దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాలేదని దేవుని కండువా అని…

Read More

నస్పూర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వినాయకుని వద్ద కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు

నస్పూర్ మంచిర్యాల నేటి రాత్రి ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వినాయకుని వద్ద కాలనీకి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ కార్యక్రమాన్ని నియమ నిష్ఠలతో భక్తిశ్రద్ధలతో గౌరీ దేవిని ప్రార్థిస్తూ ఇంటి యజమాని మరియు కుటుంబ సభ్యులు అంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కాలనీ అంతా ఆనందాగా ఆరోగ్యాలతో వెలుగొందాలని గౌరీదేవిని కాలనీ మహిళలందరూ భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలోపాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ మహిళలందరూ పాల్గొని…

Read More

కోతులతో అడలెత్తిపోతున్న విద్యార్థులు

భూపాలపల్లి కేజీబీవీ పాఠశాలలో ఘటన భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జంగేడు లో కేజీబీపీ బాలికల పాఠశాల అండ్ హాస్టల్స్ లో కోతులు విపరీతంగా వచ్చి విద్యార్థులను కరవడానికి వస్తున్నాయి దీనితో విద్యార్థులు హాస్టల్ లోపలికి వెళ్లాలంటే అడలెత్తిపోతున్నారు కనీసం ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ కమిషనర్ స్థానిక అధికారులు స్పందించి కోతులను పట్టాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై హాస్టల్ వర్కర్ ను వివరణ అడగగా కోతులు హాస్టల్లోకి సాయంత్రం కానీ మధ్యాహ్నం…

Read More

బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

పరకాల నేటిధాత్రి గురువారం రోజున బిఆర్ఎస్ ఎంమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి ప్రయత్నన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పిలుపు మేరకు ఛలో హైదారాబాద్ కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్దమైన పరకాల పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ విజయపాల్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్బండి సారంగపాణి,మాజీ కుంకుమశ్వరా దేవస్థాన చైర్మన్ గందే వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు దుంపేటి నాగరాజు,కౌన్సిలర్ అడప రాము,వీరేష్ రావు,హమీద్ మరియు బిఆర్ఎస్ నాయకులను ఉదయాన్నే అరెస్టు చేసి పరకాల…

Read More

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక వినాయక చవితి

మంచిర్యాల, నేటి ధాత్రి: అదనపుకలెక్టర్ మోతీలాల్ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక గణపతి పూజా అని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ పేర్కొన్నారు.గురువార జిల్లా కేంద్రంలో చున్నం బట్టి వాడలోని అంజని పుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూవినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు గణపతి పూజా వేడుకలా జరుపుకోవడం మన సంప్రదాయానికి ప్రతీక అన్నారు. అంజనీ పుత్ర సంస్థ సేవలుఅభినందనీయమన్నారు.అంజనీపుత్ర…

Read More

ఇంటర్నేషనల్ పోటీలలో బంగారు పధకం సాధించిన వంశీని, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులను అభినందించిన ఎంపీ పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్. భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశీ అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 3 వరకు జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకం సాధించడం జరిగింది.వచ్చే నెల నాలుగవ తేదీ నుండి 13వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ పవర్…

Read More

నూతన ఏఎంసి చైర్మన్ గా చందుపట్ల రాజిరెడ్డి

రైతుల పక్షాన ఉంటూ మార్కెట్ బలోపితం చేస్తా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరికి,పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన రాజిరెడ్డి పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్ గా చందుపట్ల రాజిరెడ్డి ని నియమించడం జరిగింది.ఈ సందర్బంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.అనంతరం చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో నాపై ఎంతో నమ్మకంతో…

Read More

క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్తేజాలు మెరుగుపడతాయి

జైపూర్, నేటి ధాత్రి: యువతకు క్రీడల వలన శారీరక,మానసిక శ్రేయస్సు మెరుగుపడి లక్ష్యాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెన్నూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మహామ్మద్ ఇలియాజ్ ఉద్దీన్ పేర్కొన్నారు.అదే క్రమంలో చెన్నూర్ కాంగ్రెస్ వివిధ మండలాల యువజన నాయకులతో కలిసి గురువారం కోటపల్లి మండలంలో జాతీయస్థాయి,రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను బహుమతిగా అందజేశారు.ఈ సందర్భంగా మహమ్మద్ ఇలియాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా…

Read More

భద్రకాళి “ఈవో” ను బదిలీ చేయండి

భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కు పిర్యాదు వరంగల్ నేటిధాత్రి వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఈవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న శేషు భారతి అధికార దుర్వినియోగం పట్ల విచారణ చేయాలని, ఈవో ను భద్రకాళి దేవాలయం నుండి బదిలీ చేయాలని వరంగల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. పిర్యాదులో పేర్కొన్న విషయం ప్రకారం, భద్రకాళి దేవస్థానం నందు భక్తులకు సరైన…

Read More

దేవాలయ నూతన ఉత్సవ కమిటీ ఎన్నిక

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో దేవాలయ ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈసమావేశానికి గ్రామ ప్రజలు, పెద్దలు హాజరై ఉత్సవ కమిటీ చైర్మన్ గా మడ్డి అంజయ్య, వైస్ చైర్మన్ లుగా మ్యాకల నాగరాజు, పొన్నం శ్రీనివాస్, మిగతా కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బాధ్యతగా ఉత్సవాలను నిర్వహించడానికి తమ వంతు కృషి…

Read More

నూతన విద్యార్థుల కోసం కాకతీయ యూనివర్సిటీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్

నేటిదాత్రి హసన్ పర్తి: సిపిజిఇటి మొదటి దశ కౌన్సెలింగ్ ముగియడంతో విద్యార్థులు వివిధ యూనివర్సిటీలలో రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్మీషన్ ల కోసం నూతనంగా వచ్చే విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి కాకతీయ యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుండి కాకతీయ యూనివర్సిటీలో అడ్మీషన్ పొందిన విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్దకి వచ్చి వారి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ ఏఐఎస్ఎఫ్ నాయకులు అడ్మీషన్…

Read More
error: Content is protected !!