జిల్లా పరిషత్,సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండలస్థాయి అవగాహన,శిక్షణ కార్యక్రమం
విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి
ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణ
Students
పరకాల నేటిధాత్రి మండల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తీర్ణత మరియు వ్యక్తిత్వ వికాసం పై ఏర్పాటు చేసిన అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ డాక్టర్ కన్నం.నారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువు పై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు.ప్రఖ్యాత మోటివేటర్ దిలీప్ కుమార్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు,తహసీల్దారు విజయలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ విధ్యార్థులకు చదువడం జ్ఞాపక శక్తి పెంచుకోవడం మరియు పరీక్షలు రాయడంలో మెలకువల గురించి వివరించారు,ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాన్ని చేరుకునే విధంగా కృషి చేయాలని,విద్యార్థులు అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే తల్లి తండ్రులు ఉపాధ్యాయులు సంతోషిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి,జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పరకాల బాలుర గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సి. హెచ్ మధు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
వనపర్తి లో శ్రీ సీతరామలక్ష్మణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి పూజలో మాజి ఎంపీ రావుల వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణంలో పాతబజార్ 3 వ వార్డులో శ్రీ వీరంజనేయ దేవాలయం ప్రతిష్ట సందర్భంగా పూజలో మాజి ఎంపీ రావుల చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్వామిని దర్శించుకుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఆలయ పున నిర్మాణం అద్భుతంగా జరిగిందని ఇందుకు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.రోడ్ల విస్తరణలో తర్వాత నూతనంగా రూపుదిద్దుకున్న ఆలయాలు,దర్గాలు,మసీదులు అద్భుతంగా ఉన్నాయని వీటికి కృషి చేసిన మాజి మంత్రి నిరంజన్ రెడ్డిని రావుల అభినందించారు ఆలయం నిర్మించడంతో పాటు రోజు ధూపదీప నైవేద్యాలతో నిత్యం స్వామి వారిని పూజించాలని ఇందుక నా సహకారం ఉంటుందని రావుల హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు సాదరంగా రావుల చంద్రశేఖరరెడ్డి ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన బొడ్రాయి శిలాకు పూజలు నిర్వహించారు. రావు ల వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,బండారు.కృష్ణ,డాక్టర్. దానియాల్,సూర్యవంశపు గిరి,సునీల్ వాల్మీకి,ఇమ్రాన్,మునికుమార్ ఆలయ కమిటీ సభ్యులు గోనూరు.వెంకటయ్య గుప్త ,వసంత శ్రీనివాసులు, నీల స్వామి,బాలస్వామి తదితరులు ఉన్నారు.
సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్స్ అందజేత.
సీఐ మల్లేష్.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్లో చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ తో కలిసి చిట్యాల సిఐ మల్లేష్ 2 మొబైల్స్ లని పోగొట్టుకున్న బాధితులకు సోమవారం రోజున అందించారు, చల్లగరిగ గ్రామానికి చెందిన శ్రీ బరన్ రెడ్డి తను 3 నెలల క్రితం తన వన్ ప్లస్ మొబైల్ ని పోగొట్టుకొని, మరియు చిట్యాల మండల కేంద్రానికి చెందిన గోల్కొండ సతీష్ నెల క్రితం తన రియల్ మీ ఫోన్ ని పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో తమ మొబైల్ ఫోన్లు పోయాయని దరఖాస్తు ఇవ్వగా, అట్టి మొబైల్ ఫోన్ సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి ఈరోజు శ్రీ భరణ్రెడ్డికి మరియు సతీష్ కి అందించడం జరిగింది, అట్టి మొబైల్ ఫోన్స్ నీ గుర్తించడంలో సహాయపడిన కానిస్టేబుల్ లాల్ సింగ్ నీ సిఐ అభినందించారు ప్రజలకి ఎవరికైనా మొబైల్స్ దొరికితే పోలీస్ స్టేషన్ ల లో అప్పచ్చెప్పలని, ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీ నీ ఉపయోగించి మొబైల్స్ నీ సులువుగా గుర్తించవచ్చు అని, దొరికిన మొబైల్స్ ను తమ వద్ద ఉంచుకోకుండా పోలీస్ స్టేషన్ లో అప్పగించి మంచి మనుసు చాటుకోవాలని తెలిపారు.
వర్కింగ్ జర్నలిస్టులు అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలి
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో యూనియన్ సభ్యత్వాలను ప్రారంభించారు.
కాకతీయ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్ లు కలిసి యూనియన్ సభ్యత్వ నమోదు చేసి రసీదు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల టి.ఎస్.జే.యూ యూనియన్ నిరంతరం పనిచేస్తుందాన్నారు.తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యునికి రూ.5 లక్షల ప్రమాద భీమా ను రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టు ఉపయోగించుకోవాలని,జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకొని దీనివల్ల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలని సూచించారు.
జర్నలిస్ట్ ల హక్కుల సాధనే లక్ష్యంగా అందరం కలిసి ఐకమత్యంగా పోరాడాలనేదే యూనియన్ లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.ఎస్.జె.యూ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు రవీందర్ సంయుక్త కార్యదర్శి కడపాక రవి, పల్నాటి రాజు కోశాధికారి శేఖర్ నాని,జిల్లా సంయుక్త కార్యదర్శి,బొచ్చు భూపాల్,ఈసి మెంబెర్ కె.దేవేందర్, బొల్లపెల్లి జగన్,మారపెల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు
మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణ ప్రజల ఇలవేల్పు వేములవాడ రాజన్న ఆలయం ఈ నెల 25,26,27 తేదీలలో జరిగే మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను పూర్తి అయ్యాయని తెలిపారు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకొని మహాశివరాత్రి జాతర వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కాకుండా మెరుగైన వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు…. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.. పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించు స్వామి వారి సేవలో తరించాలని కోరారు…
ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అడ్డు పడ వద్దని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కి సవాల్ విసిరారు ఆదివారం సాయంత్రం చిన్నారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించానని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఒకసారి0 మంత్రిగా పనిచేశానని చెప్పారు .గోపాల్ పెట్ మండలం లో పోలికేపాడు గ్రామం గుట్టల మధ్యన మార్కెట్ యార్డ్ శంకుస్థాపన ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్కెట్ యార్డ్ నిర్మాణానికిమంత్రి తుమ్మల నాగేశ్వర్ రెడ్డితో శంకుస్థాపన చేయించారని ఆయన పేర్కొన్నారు గోపా ల్ పే ట్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం 76 ఎకరాలు ఉన్నదని మండలానికి అనుకూలంగా తన సొంత గ్రామం తిరుమలాపుర o ఉన్నదని వివిధ గ్రామాలు ఉన్నాయని గోపాల్ పెట్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే మెగా రెడ్డి గెలుపుకు పెద్దమందడి మండలంలో అనేక గ్రామాల్లో ప్రచారం చేశా నని గెలుపు కు కృషి చేశానని చిన్నారి రెడ్డి చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ బీ ఎ సి కమిటీకి కే సీ వేణుగోపాల్ ఇన్చార్జిగా ఉన్నారని ఆ కమిటీలోనేను కూడా ఉన్నానని చిన్నారెడ్డి చెప్పారు . సీఎం రేవంత్ రెడ్డి తన.పై నమ్మకంతో బేగంపేట్ ప్రజాపాలన కార్యాలయం ప్రజల వినతి పత్రాలు స్వక రి o చు ట అప్ప గించారని చెప్పారు ప్రతి శుక్రవారం 8 వేల నుండి 12 వేల వరకు ప్రజలు. వస్తుంటారని వారితో. ఫిర్యాదులు స్వీకరించి అప్పటికప్పుడు సంబంధిత కలెక్టర్లతో అధికారులతో ఫోన్లో సంప్రదించి ప్రజల సమస్యలకు పరిష్కారం కావడానికి కృషి చేస్తున్నానని చిన్నారెడ్డి చెప్పారు. ఓపి క తో ప్రజల వినతి పత్రాల స్వీక రి స్తు.న్న నని ఆయన పేర్కొన్నారు .పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలవడానికి వనపర్తి నియోజకవర్గ మొత్తం పర్యటించానని గెలుపుకు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్ ముఖ్యమంత్రి ఆయాతారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారంలో చేశానని ప్రజలను కోరానని చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ పాదాభివందనం అసెంబ్లీ ఎన్నికలలో నాకు టికెట్ ఇవ్వడానికి నా యొక్క పేరును టికెట్ రావడానికి లిస్టులో టిక్ చేశారని చెప్పారు .ప్రస్తుత ఎమ్మెల్యే మెగా రెడ్డి సర్వే చేసిన బృందానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు డబ్బులు ఇచ్చి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు 46 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కి సేవలందించానని ఇప్పుడు కూడా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవద్దని నాకు అన్ని తెలుసునని అన్నారు ఎమ్మెల్యే కు ఒకటి చెబుతున్న నీ వెంబడి ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఇతర నాయకుల అభివృద్ధికి అడ్డుపడితే సహించనని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ న్యాయవాది కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేసిన వ్యక్తిపై కేసు,రిమాండ్ కి తరలింపు..
సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
వేములవాడ నేటిధాత్రి
వేములవాడ దేవస్థానంకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు చేస్తున్న షామీర్ పెట్, మేడ్చెల్ ,మల్కాజిగిరి కి చెందిన నూనెముంతల రవీందర్ గౌడ్, s/o అంజనేయులు,age 43y అనే వ్యక్తి పై వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని,జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాలు అయిన ఫెస్ బుక్ , ట్విట్టర్,ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూప్స్ etc.. లలో ఒక వర్గాన్ని కానీ ఒక మతాన్ని కానీ కించపరిచేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం,విద్వేషాన్ని దుష్ప్రచారం చేయడం ,ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టిన,వ్యాప్తి చేసిన ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన మైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాల యంలో మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాలను సోమవారం దేవాలయ ఆవరణలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ప్రధమ రుద్రాభిషేకం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అర్చనలు అభిషేక పూజలు రాత్రి 9:30 కు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామని రాత్రి 12 గంటలకు లింగోద్భావ పూజ అష్టోత్తర శత బిల్వార్చన నీరాజనం మంత్రపుష్పం జరుగుతాయని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి మార్త సుమన్ కొలగాని శ్రీనివాస్ కోమటి గణేష్ నీల కోమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
— కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు • యువత కాంగ్రేస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి
నిజాంపేట: నేటి ధాత్రి
కులం, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని పట్టభద్రులు నమ్మవద్దనీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల సమావేశానికి హయారై మాట్లాడారు.. బీజేపీ పార్టీ నీ నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గెలిచిన వెంటనే నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంజయ్య, సరాఫ్ యాదగిరి, చెప్పేట ముత్యం రెడ్డి, బెజవాడ నాగరాజు, బక్కన్న గారి లింగంగౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ, గుమ్ముల అజయ్, బాజా రమేష్, రాంచందర్ నాయక్, అందె స్వామి, మ్యాదరి నర్సిములు, కుమార్ లు ఉన్నారు.
ప్రయాగ్ రాజ్ లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, మామిడిగి, గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి (46) (ఇరిగేషన్ డి ఈ), భార్య విలాసిని (40), మల్గి గ్రామానికి చెందిన మల్ రెడ్డి (40)తో పాటు కారు డ్రైవర్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి ప్రయాగ్ రాజ్, త్రివేణి సంగమంలో స్నానాలు చేపట్టిన అనంతరం శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించు కునేందుకు బయలు దేరుతుండగా మార్గమధ్యలో రాత్రి 10:40 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఫిబ్రవరి 26న వచ్చే మహా శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాలు మరియు పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుండి 3,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ఫిబ్రవరి 24 నుండి 28 వరకు అందుబాటులో ఉండే ప్రత్యేక బస్సు సర్వీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలోని 43 శైవ క్షేత్రాలకు నడపబడతాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 800 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ.
ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
వేములవాడ నేటిధాత్రి
ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండలని,ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని,పోలింగ్ ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి గారు ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ,పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 41 పోలింగ్ కేంద్రలో 23,347 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత..
ఈ నెల 25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీస్ శాఖ తరుపున సుమారు 1500 పోలీస్ అధికారులు, సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వివిధ ప్రాంతాల్లో బందోబస్తు లో ఉంటే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వివిధ శాఖల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శన అయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉండే అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
2025: ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డేట్, టైమ్, ఇతర వివరాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
2025 సంవత్సరానికి గానూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. వివిధ దేశాల్లో ఈ సమయం వేర్వేరుగా ఉంటుంది. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ మాస ఉపవాసాలను ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కానీ, మార్చి 1 వ తేదీన కానీ నెలవంక కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
2025: చంద్రవంక దర్శనం ప్రకారం.. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నెలవంక వేర్వేరు దేశాల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడం వల్ల, ఆయా దేశాల్లో రంజాన్ మాసం ప్రారంభ సమయం మారుతూ ఉంటుంది. ఈ వ్యత్యాసం కొత్తదేమీ కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ లోని ప్రతి నెల ప్రారంభ తేదీని ప్రభావితం చేసే నెలవంక దర్శనంపై ఆధారపడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ ఫితర్ వేడుక తేదీలలో కూడా వైవిధ్యాలకు దారితీస్తుంది.
మార్చి 1వ తేదీననా? లేక మార్చి 2 నా?
ఇస్లామిక్, పాశ్చాత్య దేశాలలో ఎనిమిదవ ఇస్లామిక్ నెల షబాన్ జనవరి 31, 2025 శుక్రవారం ప్రారంభమైంది. అందువల్ల, ఈ సంవత్సరం సాంప్రదాయకంగా, రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఫిబ్రవరి 28, శుక్రవారం, అంటే షబాన్ 29 వ రోజున కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ నెలవంక కనిపిస్తే ఈ దేశాల్లో 2025 మార్చి 1 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. అయితే చాలా చోట్ల చంద్రుడు ఆ రోజు కనిపించకపోవచ్చని, అందువల్ల షబాన్ నెల మరో రోజు పొడిగించబడుతుందని భావిస్తున్నారు. అంటే, మార్చి 1వ తేదీన నెలవంక కనిపిస్తే, రంజాన్ మాసం ప్రారంభం 2025 మార్చి 2కి మారే అవకాశం ఉందని కొందరు పండితులు వాదిస్తున్నారు.
రంజాన్ విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు
సౌదీ అరేబియా ఖగోళ అంచనాలకు అనుగుణంగా మార్చి 1న రంజాన్ ప్రారంభమవుతుందని పాశ్చాత్య దేశాలలోని అనేక నగరాలు ఇప్పటికే తమ రంజాన్ 2025 టైమ్ టేబుల్ ను ప్రచురించాయి.
అయితే, మొరాకో వంటి దేశాలు కఠినమైన విధానాన్ని అనుసరిస్తాయి. అక్కడ నెలవంక స్పష్టంగా కంటికి కనిపించిన మరుసటి రోజు రంజాన్ ను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 న మొరాకోలో చంద్రుడు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే మొరాకోలో మార్చి 2 నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
జర్మనీలో రంజాన్ 2025 ఫిబ్రవరి 28 న ప్రారంభమవుతుందని అంచనా వేశారు. అలాగే, అక్కడ ఈ పవిత్ర మాసం మార్చి 30 నాటికి ముగుస్తుంది.
అమెరికాలో కూడా మార్చి 1వ తేదీన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈద్ అల్-ఫితర్ వేడుకలతో పవిత్ర మాసం మార్చి 30న ముగుస్తుందని భావిస్తున్నారు.
2025 మార్చి 1న రంజాన్ ప్రారంభమైతే, 2025 మార్చి 30న సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో ఈద్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే మార్చి 2న రంజాన్ ప్రారంభమయ్యే వారికి ఈద్ 2025 మార్చి 31న వచ్చే అవకాశం ఉంది.
ప్రయాగ్రాజ్ అయోధ్యను దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల్ మల్గి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి తమ పార్టీ బిఆర్ఎస్ నాయకులు – సభ్యులతో మరియు గ్రామ మిత్రులు కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళను సందర్శించిపుణ్య స్నానాల ఆచరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభమేళా జరుగుతుందన్నారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందాని దీన్ని ఆదిశంకరాచార్యు లు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్స రసలు, జంతువులు, విషయం, అమృతం వంటివి బయటికొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణా ల్లో ఉన్నాయన్నారు. కోట్లాది సత్పురు షుల మధ్య స్నానం ఆచరించడం తన జీవితం ధన్యమైందని అన్నారు. అంతే కాకుండా వారణాసి అయోధ్య ఉజ్జయిని మహంకాళేశ్వరం ఓంకారేశ్వర్ ను వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు మాణిక్ యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు
ఆదివాసి వ్యక్తి పైన ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడి..
వ్యక్తికి ప్రక్కటెముకలు విరిగిన వైనం.
దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను విధులు నుంచి తొలగించాలి.
ఫారెస్ట్ అధికారుల పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలి..
మానవ హక్కుల కమిషన్ Save ఫిర్యాదు చేస్తాం.
ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి..
నూగూర్ వెంకటాపురం, (నేటి ధాత్రి ):-
అటవీ శాఖా అధికారులు ఆదివాసీల పైన వరస దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి,ఉయిక శంకర్, పూనెం సాయి ఆరోపించారు. ఆదివారం అటవీ శాఖా అధికారుల చేత దాడికి గురై గాయాల పాలైన ఏకన్న గూడెం గ్రామానికి చెందిన కోరం సమ్మయ్య ను పరామర్శించారు. సమ్మయ్య ను, కుటుంబ సభ్యులను పూర్తి వివరాలు అడికి తెలుసుకున్నామని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. అడవికి వెళ్లిన ఆదివాసీ పైన అటవీ శాఖా అధికారులు మూడు ప్రక్కఎముకలు విరిగేలా అత్యంత పాశవికంగా దాడి చేయడం హేయమైన దుశ్చర్య అని మండిపడ్డారు. ఒకవేళ సమ్మయ్య తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయని, కొట్టడానికి అధికారులకు అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. తనని వదిలేయమని ఎంత ప్రాదేయ పడిన కనికరం చూపకుండా దాడి చేయడం అమానవీయ చర్య అన్నారు. బాధితుడి లుంగీ విప్పి తన మెడకు, మొఖానికి ముసుకు వేసి, చేతులు వెనక్కి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసినట్టు బాధితుడు సమ్మయ్య చెప్పినట్టు తెలియజేసారు. ఆదివాసీలు శతా బ్దాలు గా అడవిని కాపాడితే అటవీ శాఖా ఉద్యోగులు కంచే చేను మేసినట్టు అడవిని అమ్ముకుంటున్నారు అని విమర్శించారు. ఈ అమానవీయ ఘటన పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ని, ఎస్సి ఎస్టీ కమిష్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు నర్సింహా మూర్తి, శంకర్, సాయి తెలిపారు. సమ్మయ్య కుటుంబం రోడ్డు పడిందని, నష్టపరిహారం గా 10 లక్షలు ఇవ్వాలని ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు… కోరం సమ్మయ్య కు న్యాయం జరగక పోతే చర్ల రేంజ్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు..జి ఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, ఏ ఎన్ ఎస్ మండల అధ్యక్షులు కుంజ మహేష్, వాసం నారాయణ తదితరులు పాల్గొన్నారు..
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ మీద బిసి. సంఘాలు మండిపడుతున్నాయి. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం బిసిలను ముందు ఎగదోసి, తర్వాత పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా ఆయనపై పట్టభద్రులలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాగిస్తూ, తన విద్యార్దుల కోసం చేసిందేమీ లేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఆయన తన విద్యార్దులను ఉన్నత లక్ష్యాలతో తీర్చిదిద్దాల్సిన సమయంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్ల మేలు కోసమే పని చేశారన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ, కోచింగ్ సెంటర్ల మేలు కోసం పనిచేశారు. తన విద్యార్ధులకు ఆ మెటీరియల్ అందించలేదు. కేవలం వ్యాపార లాభాపేక్షతోనే తన పుస్తక రచనను కొనసాగించారు. వాటిని కోచింగ్ సెంటర్లకు అమ్ముకోవడం కోసమే ప్రయత్నం చేశాడు. అలా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. విద్యార్దులకు తీరని అన్యాయంచేశారు. తన వల్ల కోచింగ్ సెంటర్ల ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉపయోగపడ్డానని చెబుతున్నారే, గాని జీతం తీసుకుంటూ తన కాలేజీ విద్యార్దుల భవిష్యత్తు తీర్చిదిద్దానని చెప్పుకునే పరిస్ధితి లేదు. నిజంగా ఆయన సమాజం కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే తాను పనిచేసే కాలేజీ విద్యార్దులే కొన్ని వేల మంది వుంటారు. వారిని తీర్చిదిద్దితే ఎంతోమంది జీవితాలు బాగుపడేవి. కాని అలా చేయలేదు. కేవలం పుస్తకాలు రాసి, ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు అందజేయడం వల్ల వ్యక్తిగతంగా ఆయన లాభపడ్డాడు. ఆ మెటీరియల్‌తో కోచింగ్ సెంటర్లు బాగుపడ్డాయి. అందుకే పట్టభద్రులు ఇప్పుడు ఆయన వ్యవహారశైలిపై గళమెత్తుతున్నారు. హరికృష్ణ విద్యార్ధుల జీవితాలను గాలికి వదిలేసి, కోచింగ్ సెంటర్లకు అమ్ముడుపోయిన వ్యక్తి అంటున్నారు. అసలు కాలేజీకి హజరు కాకుండా, విద్యార్దులకు పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీకి ఎగనామం పెట్టి, యూనివర్సీటీ పెద్దలను ప్రసన్నం చేసుకొని, కోచింగ్ సెంటర్లకు మెటీరియ్ అందించి, తన కాలేజీ విద్యార్దులకు తీరని అన్యాయం చేశాడంటున్నారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ బిసిల మధ్య చీలికకు ప్రయత్నం చేస్తున్నాడన్న బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కావాలన్న ఆశలతో ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ అసలు స్వరూపం తెలిసిన తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దాంతో బిజేపి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. బిజేపి పెద్దలను కలిసి వేడుకున్నాడు. కాని అక్కడా అవకాశం దొరకలేదు. తర్వాత బిఆర్‌ఎస్ పెద్దలను కలిశారు. అయితే హరికృష్ణ తన జీవితంలో ఏనాడు తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తికాదని తెలిసింది. ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆయన కోచింగ్ సెంటర్లకు మెటీరియల్ తయారు చేస్తూన సంపాదనలో మునిగితేలారంటున్నారు. ఏనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నది లేదు. తెలంగాణకు జైకొట్టింది లేదని బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక బిసిగా అంతటి స్ధాయికి ఎదిగినా ఏనాడు ఏ బిసి విద్యార్ధికి ఆయన సాయం చేసింది లేదు. కాని తనకు పదవి కావాల్సి రాగానే మాత్రం బిసిల జపం చేస్తున్నాడని అంటున్నారు. బిఆర్‌ఎస్ కూడా టికెట్ ఇవ్వమని తేల్చి చెప్పడంతో ఇక గత్యంతరం లేక , ఇండిపెండెంటుగా పోటీకి నిలబడ్డాడు. అక్కడ కూడా ఆయనకు సరైన ఆదరణ లభించలేదు. బిసి సంఘాలు ఆయనకు మద్దతు పలకలేదు. దాంతో ఏదొ ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు. బిఎస్పీ పెద్దలను ప్రసన్నం చేసుకొని బిఫామ్ తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా అటు బిఎస్పీని, ఇటు బిసిలను మభ్యపెడుతూనే వున్నాడు. ప్రచారంలో మోసంచేస్తూనే వున్నాడు. బిసి నాయకులను కలిసే సమయంలో బిసి కండువా కప్పుకుంటున్నాడు. బిఎస్పీ నేతలను కలిసే సమయంలో ఆ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేయడాన్ని అందరూ గమనిస్తూనే వున్నారు. ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల్లో పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఆయనకు సహకరిస్తామని ఎవరూ చెప్పడం లేదు. ఆయన ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది. పట్టుమని ఆయన వెంట పది మంది తిరిగే పరిస్ధితి కనిపించడం లేదు. తనకు తానుగా గొప్పగా ఊహించుకొని హరికృష్ణ రంగంలోకి దిగారు. అయితే ఆయన వెనక కోచింగ్ సెంటర్లు వున్నాయంటున్నారు. హరికృష్ణకు ఎన్నికల పెట్టుబడి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు రావడం, కోచింగ్ సెంటర్లు ఆ నిరుద్యోగుల చేత వాయిదాలు కోరడం, ప్రభుత్వ ం వినకపోతే వారి చేత కోర్టులను ఆశ్రయించడం వంటివి చేస్తుంటారు. అలా ఏళ్ల తరబడి పరీక్షలను వాయిదా వేయిస్తూపోవడం వల్ల నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లను వదిలివెళ్లిపోరు. కొత్త కొత్త బ్యాచులు ఏర్పాటు చేసుకునేందుకు వీలౌతుంది. అలా కోచింగ్ సెంటర్ల వ్యాపారం మూడు పరీక్షలు, ఆరు వాయిదాలుగా నడిచేది. ఆయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్లు చేసే ఈ జిమ్మిక్కులు సాగడం లేదు. కోచింగ్ సెంటర్లు కొంత మంది విద్యార్దులను రెచ్చగొట్టి అశోక్‌నగర్‌లో, దిల్‌సుఖ్ నగర్‌లో పెద్దఎత్తున ఉద్యమాలు చేసేందుకు కుట్రులు పన్నారు. అయినా ప్రభుత్వం చెప్పిన సమయానికి పరీక్షలు నిర్వహిస్తూ, ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇలా జరిగితే కోచింగ్ సెంటర్ల అవసరం ఎవరికీ రాదు. దాంతో కోచింగ్ సెంటర్లు దివాళా తీసే పరిస్ధితి వస్తుంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు ఊగలుతోలుకునే పరిస్ధితి వచ్చింది. ఈ పరిస్ధితి మారాలంటే మళ్లీ కోచింగ్ సెంటర్లు కళకళలాడాలంటే తమకు అనుకూలమైన వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలని పెద్దఎత్తున ఖర్చుపెడుతున్నారు. ప్రసన్న హరికృష్ణనుముందు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ కోచింగ్ సెంటర్ల మూలంగానే కోట్లు సంపాదిస్తున్నారు. వారికి మేలు చేయడానికి తప్ప రాష్ట్రంలోని పట్టభద్రులకు న్యాయం చేసేందుకు కాదని హరికృష్ణ వ్యవహారం తేలిపోయింది. అందుకే ఆయన వెంట పట్టభద్రులు ఎవరూ కనిపించడం లేదు. కేవలం కోచింగ్ సెంటర్లకు చెందిన వ్యక్తులు మాత్రమే ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. అది కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ప్రసన్న హరికృష్ణఎంత సాగిలపడినా వృధానే అనే టాక్ వినిపిస్తోంది. ఎంత సాగిలపడినా గెలుపు దారిలో ముందుకొచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన నిరుద్యోగుల విషయంలో గళం విప్పిందిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. కనీసం ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసింది లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్ష వాయిదా కోసం ప్రయత్నం చేశాడే తప్ప, ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం ఏనాడు కృషి చేయలేదు. నిరుద్యోగుల పక్షాన పోరాటంచేసింది లేదు. ఎన్నికలకు ముందే ఇన్ని జెండాలుమార్చిన హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన నిలుస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలను కలిసి టికెట్ కోసం ప్రయత్నం చేసిన హరికృష్ణ ఒక వేళ గెలిచినా, తనవ్యక్తిగత రాజకీయ ప్రతిష్ట కోసం పాకులాడుతాడే తప్ప నిరుద్యోగుల గళంకాలేడని అంటున్నారు. ఇంత కాలం కోచింగ్ సెంటర్లకోసం తపన పడ్డాడు. కోచింగ్ సెంటర్ల యజమానుల డబ్బులతో ఎన్నికల్లో నిలబడ్డాడు. కోచింగ్ సెంటర్లలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికడతాడా? నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటాడు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ప్రతి సందర్భంలోనూ వాటి వాయిదాల కోసమే హరికృష్ణ ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగుల నుంచి కోచింగ్ సెంటర్లు సొమ్ముచేసుకునేందుకే ఉపయోగపడతాడు. అని సాక్ష్యాత్తు బిసి సంఘాలు, పట్టభద్రులే అంటున్నారు. ఇంత మంది చెబుతున్న మాటలు వింటున్న జనం హరికృష్ణను ఆదరిస్తారని మాత్రం ఎవరూ అనుకోరు.
చరిత్రలో మొదటి సారి యూనియన్ లీడర్‌కు టీచర్లు ఎదురు తిరుగుతున్నారు. ప్రతిసారి యూనియన్ పేరు చెప్పుకోవడం ఎమ్మెల్సీలుగా గెలవడం, రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం అలవాటైందని నిలదీస్తున్నారు. యూనియన్ లీడర్ ముదిరి రాజకీయ నాయకుడౌతాడంటే ఇదే నిదర్శనమంటున్నారు. దేశంలో ఏ ఉద్యోగులకు, ఏ యూనియన్లకు లేని అవకాశం ఒక్క టీచర్లకే రాజ్యాంగం ఈ అవకాశం కల్పించింది. దానిని ఉపాద్యాయుల హక్కులు, విద్యా వ్యవస్ధలో నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడాల్సిన ఎమ్మెల్సీలు రాజకీయాలను ఎంచుకుంటున్నారు. ఉపాద్యాయుల సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. అందుకే ఈసారి యూనియన్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నవారికి ఎన్నుకోమని టీచర్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న యూనియన్ లీడర్ వంగ మహేందర్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. నిన్నటి వరకు మహేందర్ రెడ్డికి ఎదురు చెప్పడానికి కూడా ఆలోచించే ఎంతో మంది టీచర్లు ముఖం మీదే టీచర్ల కోసం ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మొదటిసారి టీచర్లు తమ గొంతువిప్పడం వారిలో వచ్చిన చైతన్యానికి నిదర్శనం. ఏకంగా సోషల్ మీడియా వేదికగా వంగా మహేందర్‌రెడ్డికి ఎందుకు ఓటేయ్యాలని అంటున్నారు. యూనియన్ పేరు చెప్పుకొని వారు బాగు పడడం తప్ప టీచర్లకు జరిగిన న్యాయం ఏదీ లేదంటున్నారు. అనాదిగా ఏం జరుగుతుందో మహేందర్‌రెడ్డిని ఎన్నుకుంటే అదే జరుగుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆనవాయితీని కొనసాగించమంటున్నారు. సమాజానికి చైతన్యం నింపే ఉపాద్యాయులే ప్రశ్నించకపోతే, సమాజ చైతన్యం ఎలా వెల్లివిరుస్తుందంటున్నారు. యూనియన్ ముసుగేసుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నవారికి ఈ ఎన్నికలు ఒక చెంప పెట్టు కావాలని కోరుకుంటున్నట్లు కూడా టీచర్లు చెబుతున్నారు. ఏ సోషల్ మీడియా చూసినా ఇవే వార్తలు వుంటున్నాయి. ఎక్కడికక్కడ టీచర్లు తమ గొంతు సవరించుకుంటున్నారు. యూనియన్ అనేది సమస్యల పరిష్కారం కోసం, ఉపాద్యాయుల మద్దత కోసం, వారి ప్రయోజనాల కోసం…కాని యూనియన్ల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. ముఖ్యంగా వంగా మహేందర్ మూలంగా ఇప్పటి వరకు జరిగిన మేలు కూడా ఏదీ లేదంటున్నారు. ఇలా ఒక్కసారిగా టీచర్లు ఎదురు తిరుగుతారని కూడా మహేందర్ రెడ్డి ఊహించలేదు. గత రెండేళ్లుగా ఉద్యోగాన్ని వదులకొని ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. కాని ఆఖరుకు ఈ పరిస్టితి వస్తుందని అనుకోలేదు. ఆయన ఉద్యోగం పూర్తిగా మానేయలేదు. కేవలం వాలెంటరీ రిటైర్ మెంటు తీసుకున్నారు. అంతే…ఈ ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్సీ అవుతాడు. లేకుంటే మళ్లీ తన ఉద్యోగాన్ని ఎలాగో తెచ్చుకొని కొలువు చేసుకుంటాడు. మళ్లీ యూనియన్ లీడర్‌గా తన పెత్తనం ఎలాగూ సాగిస్తాడు. అలాంటప్పుడు ఆయన వల్ల ఒనగూరేదేమీ వుండడు. ఈ మధ్య మహేందర్ రెడ్డి ఎక్కడికెళ్లినా ఇలాంటి ప్రశ్నలు ముఖం మీదే అడుగుతున్నారట. దాంతో ఆయన ఖంగు తింటున్నారు. ప్రచారానికి వెళ్లాలంటే కూడా భయపడుతున్నాడట. టీచర్లను ఒక చోటకు పిలవాలంటే కూడా ముందు వెనుక ఆలోచిస్తున్నాడట. టీచర్లు ఒక్కసారిగా ఇలాఎందుకు ఎదురు తిరిగే పరిస్టితి వచ్చిందని ఆలోచించుకుంటూ తల పట్టుకుంటున్నాట. మహేందర్ రెడ్డి నీ మాటలు మేం నమ్మం అంటూ ముఖం మీదే చెబుతుంటే సమాదానం చెప్పలేక దండం పెడుతూ వెనుతిరుగుతున్నారట. ఒక్కసారిగా టీచర్లలో ఇలాంటి చైతన్యం చూసి ఆయన విస్తుపోతున్నాడు. ఎమ్మెల్సీ పదవి దేవుడెరుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం తనను యూనియన్ లీడర్‌గానైనా అంగీకరిస్తారా? లేదా? అన్న డైలమాలో పడుతున్నారట. ఎందుకంటే ఎప్పుడో రెండేళ్ల క్రితమే రాజీనామా చేసిన ఉపాద్యాయుడు యూనియన్‌లో సభ్యుడుగా వుండడమే సరైంది కాదు. అలాంటిది యూనియన్ లీడర్‌గా ఎలా చెలామణి అవుతాడంటూ కూడా నిలదీస్తున్నారట. అయినా మహేందర్ రెడ్డి టీచర్ల సమస్యల కోసం పోరాటం సాగించి, ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. టీచర్ల సమస్యలు పరిష్కరింకపోవడంతో నిరసనగా మహేందర్ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేయడంలేదు. టీచర్ల హక్కుల పోరాటం కోసం ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లడం లేదంటూ టీచర్లు సెటైర్లు వేస్తున్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనం తప్ప ఇందులో టీచర్ల కోసం ఏముందంటూ చెబుతున్నారు. తమ అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోకుండా ఏక పక్షంగా వారికి వారే నిర్ణయాలు తీసుకుంటే యూనియన్‌లో ప్రజాస్వామ్యమెక్కడుంది. మా మాటలకు విలువేముందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. హక్కుల గురించి రేపటి తరానికి పాఠాలు చెప్పే టీచర్ల అభిప్రాయానికే విలువలేకుండా చేస్తున్న యూనియన్ల మూలంగా మా గొంతులు నొక్కబడుతున్నాయంటున్నారు. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను తెచ్చి, టీచర్ల జీవితాలు ఆగం చేసింది. జీవో.నెం.317 తెచ్చి టీచర్లను చెట్టుకొకరు, పుట్టకొకరును చేసింది. అప్పుడు యూనియన్ ఏం చేసింది? ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు. జీవో తప్పని ఎందుకు నినదించలేదు. తూతూ మంత్రంగా చెప్పడం కాదు..గతంలో టీచర్ల మాటంటే ప్రభుత్వాలు గౌరవించేవి. టీచర్లు ఉద్యమ బాట పడుతున్నారంటే భయపడేవి. కాని యూనియన్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారిపోయిన తర్వాత అసలు ప్రశ్నించడమే మర్చిపోయారు. హక్కుల సాధనకు కొట్లాటే మానుకున్నారు. అందుకే 317 జీవో అమలైంది. ఆ సమయంలో యూనియన్ నిక్కచ్చిగా వ్యతిరేకిస్తే అమలుజరిగేదా? అంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ జీవోపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎన్నికల ముందు జీవోను సవరిస్తామని చెప్పి,దానిపై ప్రభుత్వం స్పందించడం లేదు. అయినా యూనియన్ ఏం చేస్తోంది? నిజం చెప్పాలంటే 317 జీవో రద్దు కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా బిజేపి అధ్యక్షుడుగా ఆ సమయంలో వున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పోరాటం చేశారు. ఈ జీవో విషయంలో అరెస్టుయ్యారు. కాని యూనియన్ మాత్రం నోరు మెదపలేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం అటు విధులు నిర్వర్తిస్తూనే ఉద్యమాలు చేసిన చరిత్ర టీచర్లది. విద్యార్థుల జీవితాలు ఆగం కాకుండా వారికి పాఠాలు బోదిస్తూనే, మరో వైపు ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో టీచర్లున్నారు. అలాంటి టీచర్లు జీతమెప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే రోజులు వస్తే కూడా యూనియన్ ప్రశ్నించింది లేదు. టీచర్లు అడుక్కుతినే పరిస్ధితి వస్తుంటే గుడ్లప్పగించి చూసిన యూనియన్ వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. జీతాలు సకాలంలో రాకున్నా నోరు మూసుకున్నారు. టీచర్లకు రావాల్సిన జిపిఎఫ్ నిధుల ఆగిపోయినా, అడిగే నాధుడు లేదు. అయినా ఒకటీచర్‌దాచుకున్న సొమ్ముకూడా తీసుకోలేని స్దితిలో వున్నారంటే పరిస్దితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. పిఆర్‌సీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదంటూ టీచర్లు వంగాన నిలదీస్తున్నారు. కొన్ని వేల మంది రిటైర్డ్ టీచర్స్ బెన్‌ఫిట్స్ అగిపోతే యూనియన్ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలతో మహేందర్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నాలుగు డిఏలు పెండిరగ్‌లో వున్నా ఇప్పటి వరకు యూనియన్ నోరు మెదపడం లేదంటున్నారు. యూనియన్ లీడర్‌గా వున్నప్పుడే నోరు మెదపని మహేందర్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత సమస్యలపై మాట్లాడతాడంటే నమ్మలేమని తేల్చి చెబుతున్నారు. ఇంత కాలం గొప్పగా నాయకుడిని అని చెప్పుకుంటున్న మహేందర్‌రెడ్డి చేసిన ఉద్యమాలు ఏమీ లేవంటున్నారు. పెద్దగా పోరాటాలు చేసి సాదించిన హక్కులేమీ లేదు. గుంపులో గోవిందయ్యే తప్ప ఉపాద్యాయ సమస్యల మీద సదస్సులు పెట్టిన నాయకుడు కాదు. టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి కొట్లాడిన సందార్భాలేమీ లేవు. అందుకే ఈ ఎన్నికల్లో ఈసారి యూనియన్ నాయకులకు కాకుండా ప్రశ్నించే గొంతులు ఎవరుంటే వారిని ఎంచుకుంటామంటున్నారు.
శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన టి.టి.డి జేఈవో వి.వీరబ్రహ్మం..
తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 22:
శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డా. ఆకెళ్ల విభీషణ శర్మ రచించిన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే పుస్తకాన్ని శనివారం టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో బ్రహ్మోత్సవాలలోని వాహన సేవల విశిష్టతను వివరించారు. వాహన సేవలతోపాటు ఆలయంలో జరిగే వివిధ బ్రహ్మోత్సవ విశేష పూజలను అందులో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ, డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు..
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు హాజరు
ఆకట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగం
ప్రపంచ వ్యాప్తంగా హిందూ, బౌద్ధ, సిక్కు, జైన ప్రార్థనా స్థలాల అనుసంధానతే లక్ష్యం
ప్రపచంలో దేవాలయాల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.6లక్షల కోట్లు
భారత్‌లో పెరుగుతున్న దేవాలయ పర్యాటకం
కోవిడ్ తర్వాత పెరుగుతున్న తీర్థయాత్రికులు
ఈ నేపథ్యంలోనే హిందూ దేవాలయాల అనుసంధానతకు ప్రాధాన్యం
దేవాలయాలకు గుదిబండగా మారిన ప్రభుత్వ నియంత్రణ
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రపంచ వ్యాప్తంగా దేవాలయాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ‘ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ Ê ఎక్స్‌పో`2025’ను (ఐ.టి.సి.ఎక్స్`2025) ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీవరకు ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, గోవా మంత్రులు, పార్లమెంట్ సభ్యుల వంటి ప్రముఖులు హజరై ప్రసంగించడం విశేషం. 2023లో తొలి సదస్సు వారణాసిలో జరగ్గా రెండవ సదస్సును తిరుపతిలో నిర్వహించారు. ఇందులో 17 దేశాలకు చెందిన 1581 దేవాలయాల ప్రతినిధులు, మరో 58 దేశాలనుంచి 685దేవాలయాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో 111మంది వక్తలు తమ విలువైన సందేశాలనివ్వగా, 15 వర్క్‌షాప్‌లు, 60కంటే ఎ క్కువ ప్రదర్శన శాలలను నిర్వహించారు. దేవాలయాల వారసత్వాన్ని పరిరక్షించడం, వాటి పరి పాలన, ఆలయాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ ఎక్స్‌పోను ‘టెంపుల్ కనెక్ట్’, అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో నిర్వహించారు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాలను ఒకేతాటి కిందికి తీసుకొనిరావడం దీని ప్రధాన లక్ష్యం.
ఆలయాల సమాచారం డిజిటలీకరణ
‘టెంపుల్స్ కనెక్ట్’ వ్యవస్థాపకులు గిరీష్ కులకర్ణి మరియు ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో ఛైర్మన్, మహారాష్ట్ర శాసన మండలి ఛీఫ్ విప్ ప్రసాద్ లాడ్‌లు ‘మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్’గా వ్యవహరించే ఐ.టి.సి.ఎక్స్‌ను ఏర్పాటు చేశారు. భారతీయ మూలాలున్న దేవాలయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరచడం ప్రధాన ల క్ష్యంగా టెంపుల్ కనెక్ట్ సంస్థ పనిచేస్తుంది. దేవాలయాల ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడం కూడా ఐ.టి.సి.ఎక్స్. ప్రధాన ఉద్దేశం. దేవాలయ పర్యాటకాన్ని, నిర్వహణను ప్రోత్సహించడానికి కూడా ఇది కృషిచేస్తుంది.
మతపరమైన లేదా ధార్మిక అవస్థల పరిధికి ఆవల దేవాలయాల నిర్వహణలో మరింత పురోగతి సాధించేందుకు విధానకర్తలు, దేవాలయాల నాయకులు, పారిశ్రామిక నిపుణుల సమన్వయం కోసం ఐ.టి.సి.ఎక్స్`2025 ప్రధానంగా కృషిచేసింది. నిధుల నిర్వహణ, రద్దీ నియంత్రణ, భద్రత వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ ఎక్స్‌పో దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర పర్యాటకమంత్రిత్వశాఖ ఐ.టి.సి.ఎక్స్`2025 ఎక్స్‌పోకు మద్దతునిచ్చింది. మహారాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కూడా దీనికి సహాయ సహకారాలను అందజేసింది. అంతేకాదు భారత పురావస్తు పరిశో ధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకకు చెందిన టూరిజం అండ్ ఎండోమెంట్స్ బోర్డులు కూడా ఈ సదస్సుకు సంపూర్ణ మద్దతును అందజేశాయి. కానీ టెంపుల్ స్టేట్‌గా పేరుపొందిన తమిళనాడునుంచి సహకారం అందలేదు. కాగా ఈ సదస్సు సందర్భంగా ‘స్మార్ట్ టెంపుల్స్ మిషన్’ను ప్రారంభించడమే కాకుండా, ‘స్మార్ట్ టెంపుల్స్ అవార్డు’లను కూడా ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలతో అలరారుతున్న 12 దేవాలయాలకు ఈ అవా ర్డులను ప్రదానం చేశారు.
యు.కె.లోని జైన ధర్మశాలలు, ప్రముఖ డివోషనల్ చారిటీస్, హిందూ దేవాలయాల సంఘాల ప్రతినిధులు, అన్నక్షేత్ర మేనేజ్‌మెంట్లు, వివిధ పుణ్యక్షేత్రాలకు చెందిన పురోహిత్ మహాసంఘా లు, తీర్థయాత్రలను ప్రోత్సహించే బోర్డులకు చెందిన సభ్యులు కూడా ఈ సదస్సుల్లో పాల్గన్నారు. ఇస్కాన్, శ్రీమందిర్, దుర్లభ్ దర్శన్, సరస్వత్ ఛాంబర్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఒ.ఎన్.డి.సి, హల్దీరామ్ వంటి సంస్థలు ఐ.టి.సి.ఎక్స్`2025కు స్పాన్సరర్లుగా వ్యవహ రించాయి.
ప్రపంచ వ్యాప్తంగా 32 లక్షల దేవాలయాలు
ప్రపంచ వ్యాప్తంగా 32లక్షల దేవాలయాలు, ప్రధానంగా భారత్‌కు చెందిన ఆలయాలను ఒకే వేదిక కిందికి తీసుకొని రావడం ఐ.టి.సి.ఎక్స్`2025 ప్రధాన లక్ష్యం. ఈ దేవాలయాల మొత్తం ఆర్థిక వ్యవస్థ రూ.6లక్షల కోట్లు! ఇప్పుడు వీటన్నింటినీ ఒకే నెట్‌వర్క్ కిందికి తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఆవిధంగా వీటన్నింటినీ ప్రజలకు పారదర్శకమైన రీతిలో అందుబాటులోకి తేవడం కూడా దీని ప్రధాన ఉద్దేశం. ఐ.టి.సి.ఎక్స్ ఇప్పటికే ప్రపంచంలోని 12వేల దేవాలయాలతో అనుసంధానత ఏర్పరచుకోగలిగింది. కోవిడ్ మహమ్మారి తర్వాత దేవాలయాల సందర్భన బా గా పెరిగింది. ఉదాహరణకు కోవిడ్‌కు ముందు వైష్ణోదేవి ఆలయానికి రోజుకు 10 నుంచి 15వే లమంది భక్తులు సందర్శించేవారు. కానీ కోవిడ్ తర్వాత వీరి సంఖ్య 32వేలు`40వేల మధ్య వుంటోంది. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని ఇప్పుడు రోజుకు లక్షమంది సందర్శిస్తున్నారు. ఇది కూడా కోవిడ్‌కు పూర్వం కంటే చాలా ఎక్కువ. కేరళలో ప్రఖ్యాత గురువాయూర్ దేవాలయన్ని కోవిడ్‌కు ముందు రోజుకు 4వేలమంది దర్శిస్తే ఇప్పుడు వారి సంఖ్య 6 నుంచి 7వేలకు పెరి గింది. ప్రస్తుతం భారత్‌లో పర్యాటక పరిశ్రమ ద్వారా 80 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఎందుకంటే ఏటా పర్యాటకుల సంఖ్య 19శాతం చొప్పున పెరుగుతోంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన పర్యాటక మార్కెట్ 2032 నాటికి ఏకంగా 2.22బిలియన్ యు.ఎస్. డాలర్లకు చేరుతుందని కేపీఎంజీ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పర్యాటకం ఏటా సగటున 6.25% వృద్ధిని నమోదు చేస్తోంది.
చంద్రబాబు ప్రసంగం
ఈ ఎక్స్‌పోలో పాల్గన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత్రిమ మేధ, బ్లాక్ ఛైన్, సుస్థిర ఇంధన పరిష్కారాల ద్వారా దేవాలయాల నిర్వహణను మరింత ఆధునీకరించాల్సిన అవసరం వుందన్నారు. ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాలుగా వున్న దేవాలయాలను సృజనాత్మక రీతి లో నిర్వహించాలన్నారు. ఫలితంగా వీటి సాంస్కృతిక ప్రభావశీలత బలీయంగా వుండగలదన్నా రు. ఇదే సమయంలో తిరుపతి ఆధ్యాత్మిక వారసత్వ ప్రాశస్త్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రపంచ ప్రతినిధులను కోరారు.
హెచ్‌ఆర్ Ê సి.ఇ. చట్టం వల్ల అనర్థాలు
రెండో రోజు ఐ.టి.సి.ఎక్స్‌ా2025లో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగిస్తూ త మిళనాడులో ప్రస్తుతం అమల్లో వున్న ‘హిందూ రిలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ (హెచ్‌ఆర్Ê సి.ఇ.)’ వల్ల కలుగుతున్న అనర్థాలను ఆకట్టుకునే రీతిలో వివరించారు. ఈ చట్టాన్ని ఎత్తేయాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ వుండకూడదని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెట్ విలువ రూ.2.5లక్షలకోట్లని పేర్కొంటూ, ప్రపంచంలోని చాలా ప్రముఖ సంస్థలకంటే ఇదెంతో విలువైందన్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో అమల్లో ఉన్న హెచ్‌ఆర్Ê సి.ఇ. చట్టం హిందూ దేవాలయాల ఆర్థిక పురోభివృద్ధికి గుదిబండలా మారిందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ఎత్తేస్తామని స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి దయవల్ల తాము తమిళనాడు పగ్గాలు చేపడితే రాష్ట్రంలోని 44121 దేవాల యాలకు స్వేచ్ఛను ప్రసాదిస్తామన్నారు. దేవాలయాల ఆర్థిక వ్యవస్థ, తమ చుట్టుపక్కల ప్రదేశా ల్లోని స్కూళ్ల నిర్వహణ, పౌర మౌలిక సదుపాయాల కల్పన, సెంటర్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైన్స్ వంటి కేంద్రాల నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతున్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో ఆలయాల ఆర్థిక వ్యవస్థ నిర్వహణను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నా ఇంతటి సామాజిక సేవను చేస్తున్న దేవాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం వుందన్నారు. చోళ రాజులు ఎంత చక్కగా దేవాలయాలను నిర్వహించిందీ ఆయన వివరించారు. ఈ దేవాలయాలు కేవలం ధార్మిక కేంద్రాలు మాత్రమే కాదు, ధనిక, పేద వర్గాలను ఒక్కచోటుకు చేర్చే ప్రదేశాల న్న సంగతిని ఆయన గుర్తుచేశారు. భారత్‌ను ఒకే తాటిపై నిలుపుతున్నది దేవాలయాలు మాత్ర మే. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక సుగంధాన్ని పునరుద్ధరించడం సనాతనధర్మంలో భాగమేనన్నారు.తొలి సదస్సు వారణాసిలో
ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో (ఐ.టి.సి.ఎక్స్‌ా2023) 2023 జులై 22 నుంచి 24వ తేదీ వరకు వారణాసిలో జరిగింది. ఆర్.ఎస్.ఎస్. సర్‌సంఫ్‌ుచాలక్ మోహన్ భాగవత్ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అప్పటి టీటీడీ ఇ.ఒ. ధర్మారెడ్డి కూడా పాల్గన్నారు. మొత్తం 25 దేశాలనుంచి 450కి పైగా దేవాలయాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గన్నారు. వీరిలో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాకు చెందిన వారుండటం విశేషం. వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఉత్తమ ప్రార్థనా రీతులను ప్రవేశపెట్టడం ప్రధానలక్ష్యమని టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకులు గిరీష్ కుల కర్ణి, ఐటీసీఎక్స్ ఛైర్మన్ ప్రసాద్ లాడ్‌లు ఈ సదస్సులో స్పష్టం చేశారు. టెంపుల్ కనెక్ట్‌ను గిరీష్ కులకర్ణి 2016లో స్థాపించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.