వివాదాల మధ్య భారీ కలెక్షన్లతో దూసుకెళుతున్న ‘ఛావా’

ట్రైలర్‌ రిలీజ్‌ నుంచీ వివాదాలే

తాజాగా వందకోట్ల పరువు నష్టం వేస్తామంటూ హెచ్చరికలు

అయితే కలెక్షన్లలో తగ్గేదే లే అంటున్న చిత్రం

వివాదాలే చిత్రాలకు ప్రచారంగా మారుతున్న వైనం

మార్కెటింగ్‌కి ట్రెండ్‌గా మారిన వివాదాలు

వివాదాల్లో చిక్కినా నష్టపోయిన సినిమాలు అసలు లేవనే చెప్పాలి

నిర్మాతకు శుభసూచికంగా మారుతున్న వివాదం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక చిత్రం విడుదలకు ముందే వివాదల్లో ఇరుక్కుంటే దానికొచ్చే కలెక్షన్లే వేరు. ఇది ప్రస్తుతం మనదేశంలోని అన్ని భాషా చిత్రాలకు వర్తిస్తుంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీని దేశవ్యా ప్తంగా హిందువులు ఎంతగానో ఆరాధిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణకోసం నాటి మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ విస్తరణ కాంక్షను గణనీయంగా దెబ్బతీసిన మరాఠావీరుడు ఆయన. ఆయన తదనంతరం శివాజీ కుమారుడు శంభాజీ కూడా తండ్రిబాటలోనే పయనించి చివరకు ఔరంగజేబ్‌చేతికి చిక్కి చిత్రహింసలకు గురై మరణించాడన్నది చారిత్రక కథనం. ఈ కథనంపై ఆధారపడి తీసిన చిత్రమే ‘ఛావా’. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాకముందే గత నెలలో నిర్వాహకు లు విడుదల చేసిన ట్రైలర్‌ చూపిన ఒక నృత్యంపై వివాదం రేగింది. ఎట్టకేలకు ఆ వివాదం ముగిసిందనుకుంటే ఇప్పుడు నిర్మాతలకు పరువునష్టం దావా కేసు రూపంలో మరో కష్టం వచ్చిపడిరది. చిత్రంలో గనోజీ, చెన్హోజీ షిర్కేలను నెగెటివ్‌గా చూపించారంటూ వారి వారసులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఏకంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌పై వందకోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించడం తాజా పరిణామం. ఇంత వివాదంలోనూ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.450కోట్లు వసూళ్లు రాబట్టడం విశేషం. 

ఈ రెండు పాత్రలను మరాఠీ నటులు సువ్రత్‌ జోషి, సారంగ్‌ సతాయేలు పోషించారు. మొఘల్స్‌కు శంభాజీ ఎక్కడ వున్నదీ వీరు తెలియజేసినట్టు చిత్రంలో చూపించారు. గనోజీ, చెన్హోజీ షిర్కే లు, శంభాజీ అనుపానులు చెప్పడంవల్లనే మొఘల్‌ సైన్యాలు ఆయన్ను పట్టుకోవడం తర్వాత ఔరం గజేబ్‌ చిత్రహింసలకు గురిచేసి చంపేసినట్టు చిత్రంలో చూపించారు. ఈ నేపథ్యంలో షిర్కే కుటుంబ వారసులు చిత్ర నిర్వాహకులకు ఫిబ్రవరి 20న ఒక లీగల్‌ నోటీసు పంపారు. చిత్రం లో చరిత్రను తప్పుగా చూపించడంవల్ల తమ కుటుంబం ప్రతిష్ట బాగా దెబ్బతిన్నదని, వారు తమ లీగల్‌ నోటీసులో పేర్కొన్నారు. 

దీంతో డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌, గనోజీ, చెన్హోజీ షిర్కే వారసులైన భూషన్‌ షిర్కే ఇంటికి వెళ్లి మరీక్షమాపణలు చెప్పారు. ‘‘షిర్కే కుటుంబం భావోద్వేగాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు బాధపడివుంటే అందుకు క్షమాపణలు కోరుతున్నాను. అదీకాకుండా చిత్రంలో వారి ఇంటిపేరు లేదా గ్రామం పేరు ప్రస్తావించలేదు. కేవలం వారిపేర్లు గనోజీ, చెన్హోజీ షిర్కేలుగా మాత్రమే పేర్కొన్నాం’’ అని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ భూషన్‌ షిర్కే అందుకు సంతృప్తి చెందలేదు. చిత్రంలోని అభ్యంతరకర భాగాలను తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

నిజానికి గత నెలలో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసినప్పుడు అందులో షంభాజీ మహరాజ్‌, రాణియశూబాయ్‌తో కలిసి నృత్యం చేస్తున్నట్టు చూపడం దుమారం రేపింది. రాజ్యసభ సభ్యుడు శం భాజీ రాజే ఛత్రపతి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒక చరిత్రను చిత్రంగా మలచే సమయంలో నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ముందు నిర్వాహకులు చరిత్రకారులకు చూపించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు. ఈయనశంభాజీ మహరాజ్‌ కుటుంబ వారసుడు కావడం గమనార్హం. చిత్రంలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశన్‌, రాణి యశూబాయ్‌గా రష్మికా మండన్న నటించారు. ఒక మహారాజు చరిత్రను చూపుతున్నప్పుడు, వారిపై ఇటువంటి నృత్యాల సీన్లు చిత్రీకరించడం సముచితం కాదని తీవ్రంగా విమర్శలు వచ్చాయి.  

చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ‘నృత్యం’పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమర్థించుకున్నారు. శంభాజీ మహరాజ్‌ జీవితం పోరాటాలతోనే గడిచిపోయింది. అటువంటప్పుడు రాజు, రాణి కి మధ్య రొమాన్స్‌ జరిగే అవకాశం ఎక్కడుంటుందనేది ప్రతి ఒక్కరికీ సహజంగా వచ్చే సందే హం. కానీ కథను చెబుతున్నప్పుడు సృజనాత్మక కళను జోడిరచడం కొన్ని సందర్భాల్లో తప్పదు. వీక్షకులు ఎంతో తెలివైనవారు. వారెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఒక పోరాట యోధుడి జీవితాన్ని వాస్తవిక రీతిలో ఆవిష్కరిస్తున్నప్పుడు వీక్షకులు ఈ నృత్యాన్ని తప్పక ఆమోదిస్తారు. ఛావా విషయంలో మా అంచనా ఇదేనన్నారు. 

ఈ నృత్యం అంశం చినికి చినికి గాలివానగా మారడంతో దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌, ఎం.ఎన్‌.ఎస్‌.పార్టీ అధినేత రాజ్‌థాకరేను కలిసి, తాము ప్రవేశపెట్టిన లెంజీ నృత్యం మహారాష్ట్ర సంప్రదా యిక నృత్యం. అయిప్పుటికీ దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నృత్యాన్ని తొలగిస్తామని చెప్పారు. తర్వాత మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మరియు శివసేన నాయకుడు ఉదయ్‌ సామంత్‌ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చివరకు నృత్యాన్ని తొలగించి వివాదానికి శు భం పలికారు. విచిత్రమేమంటే లెంజీ తమ సంప్రదాయిక నృత్యమన్న సంగతిని శంభాజీ మహరాజ్‌ వంశానికి చెందిన వారసులు అంగీకరిస్తున్నారు. కాకపోతే ఈ చిత్రంలో నృత్యం పెట్టిన సందర్భాన్ని వారు ప్రశ్నించడం గమనార్హం.

ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్‌ ఈ చిత్రంపై ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌ మరో వివాదానికి కారణమైంది. ‘‘కుంభమేళా సందర్భంగా ఎంతో మంది మరణిస్తే, వారి శవాలను బుల్డోజర్లతో తొల గించే సన్నివేశాలకు ఎంతమాత్రం స్పందించని ఈ సమాజం ఐదువందల ఏళ్ల క్రితం హిందువులను హింసించారంటూ ఎక్కువచేసిన చూపిన మరియు పాక్షిక కల్పనతో కూడిన ఈ చిత్రాన్ని చూసిన సమాజం ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా వుంది. ఇదొక మెదడు, ఆత్మ చనిపోయినసమాజం’’ అనేది ఈ పోస్ట్‌ సారంశం. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదేసమయంలో ఆమె సమర్థకులూ రంగంలోకి దిగారు. ‘‘శంభాజీ మహరాజ్‌ హిందువులకో సం చేసిన నిరుపమాన త్యాగాన్ని కేవలం కల్పన అని చెప్పడానికి నీకెంత ధైర్యం.’’ అంటూ ఆ మెపై నెటిజెన్లు ఎదురుదాడికి దిగారు. ‘చరిత్రతో నాటకాలాడొద్దు’ అని మరొకరు ఆమెను హెచ్చరించారు. విచిత్రమేమంటే ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తి ఫహద్‌ అహ్మద్‌! అయితే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు కొత్తేం కాదు. వివాదం సృష్టించడం, చీవాట్లు తినడం ఆమెకు బాగా అలవాటైపోయింది. 

వివాదాల్లో చిక్కుకున్న కొన్ని బాలీవుడ్‌ చిత్రాలు

మద్రాస్‌ కేఫ్‌:

 ఇది శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన చిత్రం. భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యోదంతాన్ని కూడా ఇందులో చూపారు. అయితే ఎల్‌టీటీఈని దోషిగా చూపారం టూ తమిళనాడులో ఆ సంస్థ అనుకూలురు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంతో తమిళనాడులో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. 

విశ్వరూప్‌:

 తమిళనాడులోని ముస్లిం గ్రూపులు ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చినా, ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయలేదు. తమిళనా డులో కంటే అధిక ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రం బాగా ఆడిరది.

ఓ మై గాడ్‌ (ఓ.ఎం.జి):

 తరతరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయాలను, హిందూ దేవుళ్లను అపహాస్యం చేసారంటూ ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని విశ్వహిందూ పరిషద్‌, హిందూ జన జాగృతి సమితి వంటి సంస్థలు ఆందోళన చేశాయి. అయినప్పటికీ ఎటువంటి కోతలు లేకుండా ఈ చిత్రాన్ని 2012లో విడుదల చేశారు. కలెక్షన్లలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది.

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌:

 ఇందులో చిత్రీకరించిన ఒక నృత్యంలో రాధను సెక్సీగా చూపారన్న కారణంగా ఇండోర్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ సినీ నిర్వాహకులపై కేసు పెట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంలో ఆ పాటను తొలగించలేదు. 

రాక్‌స్టార్‌: ఈ చిత్రంలో ‘సాదా హక్‌’ అనే పాటలో వెనుక ‘స్వతంత్ర టిబెట్‌ పతాకాన్ని’ చూపడంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, ఇంతియాజ్‌ అలీ మధ్య వివాదం రేగింది. ఆ పతాకా న్ని బ్లర్‌ చేయమని ఆయన్ను కోరింది. కానీ దర్శకుడు అందుకు అంగీకరించలేదు. అయితే వీడియో నుంచి ఈ సీక్వెన్స్‌ను తొలగించక తప్పలేదు.

అరక్షణ్‌: 

ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ ఒక దళిత యువకుడిగా నటించారు. రాచకుటుంబానికి చెందిన సైఫ్‌ అలీఖాన్‌ ఆవిధంగా నటించడాన్ని వ్యతిరేకిస్తూ కాన్పూర్‌లో కొన్ని దళిత అనుకూల గ్రూపులు ఆందోళన జరిపాయి. దీంతో ఈ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో ని షేధించారు. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్‌లు పంజాబ్‌లోని కొన్ని వర్గాలకు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయని అక్కడి ప్రభుత్వం బ్యాన్‌ చేస్తే, యు.పి.లో అధికారంలో ఉన్న అప్పటి మాయావతి ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని రెండు నెలలపాటు నిషేధించింది.

మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌:

 పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ సభ్యులను ఇక్కడి ఐపీఎల్‌కు పోటీపడుతున్న క్లబ్‌లు పిలవడంలేదని బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ విమర్శించారు. అయితే దీన్ని శివసేన ఖండిరచింది. ఈ సినిమాను విడుదల చేయరాదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే షారూక్‌ ఖాన్‌ క్షమాపణలు చెప్పడానికి అంగీకరించలేదు. అవసరమైతే బాల్‌ థాకరేతో ఈవిష యంపై మాట్లాడతానన్నారు. 

బిల్లు: 

ఈ సినిమా అసలు పేరు ‘బిల్లు బార్బర్‌’. అయితే ‘బార్బర్‌’ పేరు తమను కించపరచేదిగా వున్నదంటూ సెలూన్‌, బ్యూటీపార్లర్ల యజమానులు ఆందోళనకు దిగడంతో షారూక్‌ ఖాన్‌ ‘బా ర్బర్‌’ పేరు తొలగించి ‘బిల్లు’ పేరుతో విడుదల చేశారు.

4 సీట్లకు 40 మంది!

-ఎమ్మెల్సీ ఎన్ని’’కల’’ నెరవేరేది ఎవరికి.

-నాలుగు సీట్లలో సామాజిక న్యాయం సాధ్యమేనా!

-ఎమ్మెల్సీలెవరికి దక్కేనో!

-అద్దంకికి అడ్డంకులు తొలిగేనా?

-మరో వాయిదా పడదన్న గ్యారెంటీ వచ్చేనా?

-సీనియర్లు అడ్డుపడితే మొదటికే మోసం వచ్చేనా?

-ఆశావహులు చాలా మంది వున్నారు.

-చాలా మంది నేతలు కాచుకొని కూర్చున్నారు.

-పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు వున్నారు

-పార్టీ అధికారంలోకి రావడంలో పాత్ర వున్న వారున్నారు.

-వారిని కాదని సామాజిక సమీకరణాలంటే సాధ్యపడేనా!

-పదుల సంఖ్యలో క్యూలో వున్నారు.

-అందరూ మాకే కావాలంటున్నారు!

-ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు!

-అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు.

-అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే!

-నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే.

-భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేయడమే!

-మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరమే.

-లేని లీకులతో మీడియా చేసేది గందరగోళమే!

-పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువే.

-రేటింగ్‌ కోసం పాకులాటలో లేని ఆశలు రేపడం అలవాటే.

-గందరగోళం సృష్టించి వార్తలు వండిరచడమే!

-అభ్యర్థుల పేర్లు కూడా డిసైడ్‌ చేసేది మీడియానే.

-వాళ్లకు టికెట్‌ రాకపోతే అన్యాయం జరిగిందని లొల్లి చేసేది మీడియానే.

-నాయకులంతా నిమిత్త మాత్రులే.

-ఈసారి టికెట్‌ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!

 

తెలంగాణలో శాసన మండలి ఎన్నికకు మరో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కాంగ్రెస్‌ నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు గత ఎడాది కాలంగా బిజీబిజీగానే వున్నారు. అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం ప్రసన్నం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ తమకే ఇవ్వాలంటూ అభ్యర్థనలు పంపుతూనే వున్నారు. వీలు చిక్కినపుడుల్లా ఎక్కే ఫ్లైట్‌ దిగే ఫ్లైట్‌ అన్నట్లు డిల్లీ వెళ్లి తమ గోడు చెప్పుకుంటూనే వున్నారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంటూనే వున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ రానే వచ్చింది. అందులో నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ వచ్చే అవకాశం వుంది. రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతూనే వుంది. మొదట్లో వున్న లిస్ట్‌కు ఇప్పుడు వినిపిస్తున్న లిస్ట్‌కు పొంతనే లేదు. ఒకింత చాంతాడంత పెరిగిపోయింది. అయినా ఎమ్మెల్సీలెవరికి దక్కేనో! అన్నది ఉత్కంఠగా మారిపోయింది. ఇక ముందుగా చెప్పాల్సి వస్తే కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. గత ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికలలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన జీవన్‌ రెడ్డికి ఆ అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఆయనే వద్దన్నారన్న ప్రచారం కూడా వుంది. పైగా ఆయన సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వినయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ దరి చేరారు. ఇది జీవన్‌ రెడ్డికి సుతారం ఇష్టం లేదు. అయినా కాంగ్రెస్‌ పార్టీ జీవన్‌ రెడ్డి అలకను పట్టించుకోలేదు. కానీ ఆయనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అధిష్టానం అనుకుంటే తప్ప ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు. ఇక మొదటి నుంచి అన్యాయం జరుగున్న నాయకుడు అద్దంకి దయాకర్‌. ఈసారైనా అద్దంకికి అడ్డంకులు తొలిగేనా? అనే ప్రశ్న వుండనే వుంది. ఆయన పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భరోసా మీదనే ఆధారపడి వున్నారు. అయినా ఎక్కడో ఏదో అనుమానం ఆయన వ్యక్తం చేయకపోయినా లోలోన గుబులు వుండనే వుంది. తుంగతుర్తి నియోజకవర్గం తనదే అన్న ధీమాతో ఆది నుంచి వున్నారు. 2019 ఎన్నికలలో అద్దంకి దయాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఒక దశలో అద్దంకి దయాకర్‌ గెలిచినట్లే వార్తలు వచ్చాయి. ఆఖరు క్షణంలో ఫలితం తారుమారైంది. అప్పటి నుంచి ఆయన తుంగతుర్తిని వీడలేదు. ఆ నియోజకవర్గం ఎప్పటికైనా నాదే అని పనులు చేసుకుంటూ వెళ్లారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకే టికెట్‌ అధిష్టానం ఇచ్చింది. ఇందులో ఏం జరిగిందనేది అద్దంకికి తెలుసు. పార్టీకి తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. తర్వాత పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా అద్దంకికి టికెట్‌ వచ్చినట్లే అనుకున్నారు. వరంగల్‌ సీటు వస్తుందని ఆయన కూడా భరోసాతోనే వున్నారు. ఆఖరు నిమిషంలో కడియం కావ్యకు టికెట్‌ వెళ్లింది. అద్దంకి అలా మరో సారి అన్యాయం జరిగింది. ఇప్పుడైనా అద్దంకి ఎమ్మెల్సీ అవుతారా లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొనే వుంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డికి పాద నమస్కారం కూడా చేసిన సందర్భం వుంది. ఇక ఇప్పుడు ఆయన భవిష్యం తేలకపోతే భవిష్యత్తు రాజకీయం కష్టమే. కాంగ్రెస్‌కు వచ్చేవే నాలుగు స్థానాలు. బిసి నినాదం బలంగా వినిపిస్తోంది. ఆ నాలుగు మాకే కావాలని బిసిలు కోరుతున్నారు. అందులో కనీసం రెండు సీట్లైనా బిసిలకు పోతే అద్దంకి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా మిగులుతోంది. పైగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ కూడా రేస్‌లో వున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సీట్లు ఎక్కువ ఇచ్చారన్న వాదన వుండనే వుంది. వరంగల్‌ పార్లమెంటు విషయం అన్యాయం జరిగిన దొమ్మాటి సాంబయ్య కూడా సీటు నాకే ఇవ్వాలంటూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అద్దంకికి ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోతే ఇక ఆయన నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి. ఒకవేళ అద్దంకి అదృష్టం బాగుండి, ఎమ్మెల్సీ అయితే మాత్రం మంత్రి కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అందువల్ల అద్దంకిని అడ్డుకోవడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కూడా తమ వంతు రాజకీయం సాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్సీ అయితే మంత్రి వర్గ విస్తరణలో ఆ ఇద్దరు నేతలు ఆశలు వదులుకోవాల్సి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. నాలుగు స్థానాలలో సామాజిక న్యాయం సాధ్యమయ్యేనా! అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా మైనారిటీ వర్గం నుంచి మంత్రులు ఎవరూ లేరు. మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ ఎమ్మెల్సీ రేసులో వున్నారు. ఈసారి అవకాశం వస్తే మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. పైగా నిజామాబాదు ఉమ్మడి జిల్లాకు మంత్రి వర్గంలో చోటు దక్కాల్సి వుంది. కానీ త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరగాల్సి వుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సొంత గూటికి వచ్చేశారు. అయినా ఆయన అంత సంతోషంగా లేరు. సుప్రీంకోర్టు లో వున్న కేసులో తీర్పు ఎలా వుంటుందో చెప్పలేనిది. అందువల్ల హైదరాబాద్‌ కు మంత్రి వర్గంలో చోటు కల్పించడం కోసం ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తారనే అంటున్నారు. ముఖ్యంగా ఫిరోజ్‌ ఖాన్‌ ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. అంతే కాకుండా మాజీ టీం ఇండియా క్రికెట్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్‌ లో కొనసాగుతున్నారు. యూపి లోని ఫిరోజాబాద్‌ నుంచి రెండు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ అనుభవంతో పాటు అధిష్టానం వద్ద అజహరుద్దీన్‌కు మంచి వెయిట్‌ వుంది. ఇక సీనియర్లలో ఎక్కువగా బిసిలు వున్నారు. వారిలో ఇప్పటికీ ఆక్టవ్‌గా వున్న వి. హనుమంత రావు ఫ్లీజ్‌ అంటున్నారు. నిజామాబాద్‌ మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ నాకేం తక్కువ అంటున్నాడు. పైగా రాహుల్‌ గాంధీకి సన్నిహితుడు అనే గుర్తింపు వుంది. వీళ్లతో పాటు సికింద్రాబాద్‌ మాజీ ఎంపి. అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పోటీ పడుతున్నాడు. సీనియర్లు అడ్డుపడితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మొదటికే మోసం వచ్చేనా? ఎందుకంటే ఆశావహులు చాలా మంది వున్నారు. సీటు మాకంటే మాకే అంటూ కాచుకొని కూర్చున్నారు. పార్టీ కోసం ఇంత కాలం త్యాగాలు చేసిన వారు వున్నారు. అంతే కాకుండా ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో కృషి చేసిన వాళ్లు వున్నారు. వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నాయకులు వున్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి, మరొకరు ఖైరతాబాద్‌ నియోజకవర్గం పార్టీ ప్రెసిడెంట్‌ రోహిన్‌ రెడ్డి. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ వస్తుందని కూడా అంటున్నారు. ఇకపోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా మారి పూర్తి సీట్లు సాధించడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైంది. గత పార్లమెంటు ఎన్నికలలోనే ఖమ్మం సీటు ప్రసాద్‌ రెడ్డికి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. అప్పుడే ఎమ్మెల్సీ హామీ పార్టీ ఇచ్చిందనేది సమాచారం. ఇన్ని చిక్కు ముడుల మధ్య సామాజిక సమీకరణాలంటే సాధ్యపడతాయా! అధికారంలో వున్నప్పుడు సామాజిక సమీకరణాలతో అన్యాయం జరిగితే నాయకుడు ఊరుకుంటారా? తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ లో పదుల సంఖ్యలో క్యూలో వున్నారు. అందరూ మాకే కావాలంటున్నారు! ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు! అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే! అన్న మాటలే వినిపిస్తున్నాయి. నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే అని అంటున్నారు. భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేస్తామంటే నాయకులు సంతృప్తి చెందుతారా? ఇక సందిట్లో సడే మియా లాగా మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరం నింపుతోంది. లేని లీకులతో మీడియా చేసేది గందరగోళం సృష్టిస్తోంది. పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువైపోయింది. నాయకులంతా నిమిత్త మాత్రులే. ఈసారి టికెట్‌ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

Kakatiya Puraskar

గత 25 సంవత్సరాలుగా యోగాలో పోశాల శ్రీనివాస్ చేస్తున్న విశేష సేవలను గుర్తించిన ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ పురస్కారాన్ని ముఖ్య అతిధి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందించటం జరిగిందని పురస్కార గ్రహీత యోగ గురువు పోశాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని భావించి, మానసిక మరియు శారీరక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందని భావించి గత 25 సంవత్సరాలుగా భారతీయ సనాతన ధర్మంలోని యోగ విద్యను 150 గ్రామాలలో సుమారు రెండు లక్షల మందికి యోగాలో ఉచిత శిక్షణను అందించినందుకుగాను ఈ పురస్కారం లభించిందని తెలియజేస్తూ, యోగా శిక్షణతో పాటు అనేక దేశభక్తి, ఆధ్యాత్మిక,సామాజిక మరియు సాంఘిక కార్యక్రమాల్లో చేసిన విశేష సేవలను గుర్తించి ఇండస్ ఫౌండేషన్ అధినేత ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఈ పురస్కారానికి ఎంపిక చేయటం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ అధినేత ఏనుగుల రాకేష్ రెడ్డి, శ్రీ సి ఎస్ రంగరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, స్వామి ప్రణవానంద దాస్ , జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి.దయాకర్ రావు, తాటికొండ.రాజయ్య, వొడితల.సతీష్ బాబు పాల్గొన్నారు.

ఫోటో గ్రాఫర్ ను పరామర్శించిన చిలువేరు సమ్మి గౌడ్.

ఫోటో గ్రాఫర్ ను పరామర్శించిన చిలువేరు సమ్మి గౌడ్

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బండారు శీనుకు ఇటీవల పక్షవాతం వచ్చి వరంగల్ హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి గురువారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు…అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఇకనుండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఫిజియోథెరపీ ద్వారా త్వరగా కోలుకుంటావని, ఇక నుండి అన్ని విధాల మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో చీకటి కిరణ్,బండారు గోపి పబ్బతి సారంగం, మోరపాక యాకయ్య, రేగుల వెంకటరమణ, ఎసల్ల సత్యనారాయణ, చాగంటి శ్రీను,కొండేటి కళాధర్,పబ్బతి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బియ్యల జనార్దన్ కు ఘన నివాళి..

తెలంగాణ ఉద్యమనీకి ఊపిరి పోసిన బియ్యల జనార్దన్ సార్ కు ఘన నివాళి

కొత్తగూడ,నేటిధాత్రి :

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆదివాసీల ఆత్మ బంధువు బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
ధనసరి సీతక్క
ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వద్ద సారయ్య ఆధ్వర్యంలో
బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి సందర్భంగా కొత్తగూడ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంతం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన దళిత పీడిత బహుజన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడి ఆదివాసీల ఆత్మబంధువై పేరు లిఖించుకున్న ఉద్యమకారుడు బియ్యాల జనార్దన్ రావు సార్ గారు మన మధ్య లేకపోవడం ఈ ప్రాంతానికి తీరని లోటు.. తెలంగాణ ఉద్యమంలో తన వాక్కు చతుర్యంతో ప్రతి పల్లెలో ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ పోరాటంలో మన కొత్తగూడ మండలానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారని జోహార్ జనార్దన్ సార్ జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు..ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ చల్ల నారాయణరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు వీరనేని వెంకటేశ్వర్రావు, డిసిసి జనరల్ సెక్రెటరీ బానోత్ రూపుసింగ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఇర్ప రాజేశ్వర్ , కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి, ఓబీసీ జనరల్ సెక్రటరీ వల్లెపు రంజిత్, యూత్ ఉపాధ్యక్షులు చొప్పారి కుమార్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలం వెంకన్న, బానోత్ దేవేందర్, యాదగిరి కిరణ్, మెకానిక్ వెంకట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,,,

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ను పర్యవేక్షించిన డీసీపీ,సీఐ

పరకాల నేటిధాత్రి
వరంగల్, ఖమ్మం,నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పరకాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కలాశాలలో పోలింగ్ సరళిని డిసిపి పి రవీందర్ పర్యవేక్షించారు.అనంతరం పోలీస్ సిబ్బందికి తగిన సలహా సూచనలను తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మార్వో విజయలక్ష్మి,సీ.ఐ క్రాంతి కుమార్,ఎస్ఐ రమేష్ బాబు.ఆర్ఐ దామోదర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట లో ముగిసిన పోలింగ్.

నిజాంపేట లో ముగిసిన పోలింగ్

నిజాంపేట: నేటి ధాత్రి

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలకు సంబందించిన ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఈ మేరకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు మండల తహసిల్దార్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా 531 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా 375 ఓట్లు, టీచర్స్ 35 ఓట్లు ఉండగా 35 ఓట్లు పోలయన్నారు. మొత్తం 70 శాతం పోలయ్యని తెలిపారు అలాగే మెదక్ ఆర్డిఓ రమాదేవి పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు

అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన..

అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

కల్వకుర్తి /నేటి ధాత్రి.

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.15 లక్షలతో అండర్ డ్రైనేజ్ పనులను గురువారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో.. గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,మిన్నాల డేవిడ్, రేణు రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రమౌళి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రకంటి శివ కుమార్, మాజీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఏదుల శంకర్, రాములు, మట్ట అంజయ్య, ఏదుల మచ్చేందర్, జక్కుల మల్లేష్, డేరంగుల శ్రీశైలం, పరమేష్, రత్నయ్య, జగన్, కృష్ణయ్య, యాదయ్య, అంజయ్య, ఏదుల అశోక్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

న్యాల్కల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓ.!

న్యాల్కల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓ

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన న్యాల్కల్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాన్ని జహీరాబాద్ ఆర్డీఓ రామిరెడ్డి గురువారం ఉదయం స్వయంగా సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.

సజావుగా సాగిన గ్రాడ్యుయేట్,ఎమ్మెల్సీ ఎన్నికలు.!

సజావుగా సాగిన గ్రాడ్యుయేట్,ఎమ్మెల్సీ ఎన్నికలు

ఓటు హక్కు వినియోగించుకున్న తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల్ జిల్లాలో ఒకటి టీచర్స్,రెండు గ్రాడ్యుయేట్ స్థానాలనికి పోలింగ్ కేంద్రాలలో సంబంధిత ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను చేపట్టారు.జైపూర్ మండల కేంద్రం మండల పరిషత్ సెకండరీ పాఠశాలలోని మూడు పోలింగ్ భూతులలో గురువారం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ వనజ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకుని మాట్లాడారు.పోలింగ్ ఏర్పట్లను బ్రహ్మాండంగా చేశామన్నారు.దీనితో ఎన్నికల విధానం సక్రమంగా కొనసాగిందన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి రథోత్సవ వెడుకలు..

వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమం..

*భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు..

*హర హర మహాదేవ శంభో శంకర…ఓం నమశ్శివాయ నామస్మరణతో మార్మోగిన మాడ వీధులు..

శ్రీకాళహస్తి(నేటి ధాత్రి) 

శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 లో భాగంగా నేడు 7 వ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం కార్యక్రమం ఉదయం 11 30 గంటలకు ప్రారంభం అయింది. స్థానిక ఎమ్మెల్యే, అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భక్తిశ్రద్ధలతో హర హర మహా దేవ శంభో శంకర,ఓం నమ: శివాయ నమ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి,ఆలయ ఈఓ,ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు..

ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్.!

ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్

ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రూరల్ ఏసిపి

అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు….

గంగాధర నేటిధాత్రి :

MLA Medipalli Satyam

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గంగాధర లోని ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఉదయం నుండి పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించారు. గంగాధర పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ సందర్శించి పోలింగ్ సరళిని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అయన వెంట స్థానిక ఎస్సై నరేందర్ రెడ్డి ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఊహించిన విధంగా ఓటేసేందుకై పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై ఓటు వేసేందుకు బారులు తీరడం కనిపించింది. అధిక సంఖ్యలో చిన్నారులను తీసుకొని పోలింగ్ కేంద్రాల్లో ఓట్టు వేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు పోటా పోటీగా బరిలో దిగగా వారికి ధీటుగా ఓటర్లు కూడా అధిక శాతం హాజరు కావడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఏదేమైనప్పటికిని గతంలో ఎన్నడు లేని విధంగా పట్టభద్రులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి స్థానిక ఎన్నికలను తలపించే విధంగా ఓటర్లు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సిఐ..

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: సిఐ

మందమర్రి నేటి ధాత్రి:

election

 

మందమర్రి లోని సింగరేణి హైస్కూల్ లొ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు:ఏర్పాటు చేసిన మంచిర్యాల్ జిల్లా
మందమర్రి సర్కిల్ పరది లోని పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం కమిషనరెట్ ఆదేశాలు తో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో మందమర్రిలొసింగరేణి హైస్కూల్ ఎన్నికల సెంటర్ లో పట్టభద్రుల,4182 టీచర్స్216 ఓటర్లు కొరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మందమర్రి సిఐ శశిదర్ రెడ్డి తెలిపారు. రెండు జిల్లాల్లో 108 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగేలా అందరూ సహకరించాలని మందమర్రి సిఐ శశిదర్ రెడ్డి కోరారు.

election

తిరుపతి జిల్లాకు ఎరువుల సరఫరా పెంపు అవసరం.!

*తిరుపతి జిల్లాకు ఎరువుల సరఫరా పెంపు అవసరం..

*ఎంపీ మద్దిల గురుమూర్తి..

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27:

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి 2025-26 ఖరీఫ్ మరియు రబీ సీజన్‌ల కోసం అవసరమైన ఎరువుల సరఫరా పెంచేందుకు తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లకు లేఖ రాశారు.
2024-25 వ్యవసాయ సంవత్సరంలో 1,19,141,
మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించబడ్డాయని తెలిపారు.రైతుల అవసరాలను, పెరుగుతున్న వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2025-26 సంవత్సరానికి 25% పెరుగుదల అంటే 1,54,131 మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా అవసరమని తన లేఖలో పేర్కొన్నారు.
రైతులకు ఎరువులు సకాలంలో అందించేందుకు, జిల్లాలో రిటైల్ డీలర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం 258 ప్రైవేట్ డీలర్లు, 36 వ్యవసాయ సహకార సంఘాలు ఎరువుల పంపిణీలో ఉన్నాయని, పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా డీలర్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు.
రైతుల ఉత్పాదకత పెంపు, ఆహార భద్రత లక్ష్యాలను సాధించేందుకు సరఫరా పెంపు ఎంతో కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తగిన చర్యలు తీసుకుని, అవసరమైన ఎరువుల నిల్వలు సమర్థవంతంగా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన..!

జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన..

ఏ ఎస్ పి, శ్రీ శివ ఉపాధ్యాయ
ఐ పి యస్…

నూగుర్ వెంకటాపురం (నేటి దాత్రి )
ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలం లో

గురువారం నాడు జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా ఏటూరు నాగారం ఏ ఎస్ పి శ్రీ శివ ఉపాధ్యాయ ఐ పి యస్,వెంకటాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని మరియు వాజేడు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంకటాపురం మండల సిబ్బందికి. వాజేడు మండల సిబ్బందికి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించలని ఉపాధ్యాయులంతా క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవాలని పాలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం వాజేడు,సిఐ శ్రీ బండారి కుమార్, వాజేడు మండల ఎస్సైరాజ్ కుమార్,,వెంకటాపురం మండల ఎస్సై కే.తిరుపతిరావు సిబ్బంది పాల్గొన్నారు.

సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి..

 రేపు సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి

జహీరాబాద్. నేటి ధాత్రి:

జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించాలని డిఈవో వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో 21 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. సెన్స్ కార్యక్రమ వేడుకలను ఫోటోలు వీడియోల రూపంలో డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. పూర్తి వివరాలకు సెన్స్ ఆఫీసర్ సిద్ధారెడ్డి 6302290235న సంప్రదించాలని చెప్పారు.

శివాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క..

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని..

గుండం శివాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

కొత్తగూడ, నేటిధాత్రి :

అఖిలాండకోటి బ్రహ్మాండ లోకాల అధిపతి అయినటువంటి ఆ పరమశివుడి మహాశివరాత్రి పండుగ ను పురస్కరించుకొని కొత్తగూడ మండల లోని గుండంపల్లి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన గుండం రామక్క గా పేరుగాంచిన గుండం శివాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
ధనసరి సీతక్క ఆలయ నిర్వాహకులు అర్చకులు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల నాయకులు సీతక్క రాకను డప్పు చప్పులతో మంగళ వాయిద్యాలతో అభిమాన నృత్యాలతో స్వాగతం చెబుతూ గుండం శివాలయంలోకి ఆహ్వానం తెలిపారు ముందుగా అర్చకులు మంత్రివర్యులు సీతక్క గారికి పూర్ణకుంభంతో స్వాగతం తెలిపారు గుండం శివాలయం లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివలింగం నీకి ప్రధాన అర్చకులు చే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీతక్క మాట్లాడుతూ..కాకతీయుల కళా సంపద భావ్య ప్రపంచానికి తెలియాల్సి ఉందని శివరాత్రి పండుగ సమీపిస్తున్నదని అభివృద్ధి పనుల కొరకు స్థానిక నాయకులు తనను కలిశారని తన సొంత నిధులతో తో 25 లక్షల రూపాయలను గుండం శివాలయానికి ఇచ్చినట్టు ఈ సందర్భంగా మంత్రిగారు అన్నారు రానున్న రోజుల్లో గుండంపల్లి నుంచి నల్లబెల్లి మెయిన్ రోడ్డు వరకు డబల్ రోడ్ చేసుకుందామని గుండం శివాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకొని నిత్య పూజలు చేసుకొనుటకు ప్రత్యేక అర్చకుని నియమిస్తామని ఈ సందర్భంగా అన్నారు,..

ఘాట్ లను సందర్శన

గుండం శివాలయానికి వచ్చే భక్తులు గుండం చెరువులో స్నాననాలు ఆచరించి గుడిలోకి వెళ్తారు గత పాలకులు నిర్లక్ష్యంతో చెరువులో దిగడానికి ఇబ్బందికరంగా ఉండేది . స్థానిక నాయకులు మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లగా 25 లక్షల రూపాయలను అభివృద్ధి పనులకు మంజూరు చేశారు.. భక్తులు స్తనాలు చేయడం కోసం చెరువు కట్ట నుంచి చెరువులో దిగడానికి ఘాట్లు మెట్లు నిర్మించారు సీతక్క ఘాట్లను పరిశీలించి భక్తులను పలకరించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమాన సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాచలం నేటి ధాత్రి;
జిల్లాలోని 23 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకొనున్న 2022 మంది టీచర్లు*

టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఈ రోజు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పరిశీలించారు.సింగరేణి కాలరీస్ బాలికల ఉన్నత పాఠశాల మరియు పాల్వంచ బొల్లోరుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేయడం జరిగింది.జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 పోలింగ్ కేంద్రాలలో 2022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.

పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27:

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలతోపాటు అన్ని కార్మిక సంఘాలు ఎండగట్టి వ్యతిరేకించాలని ఐఎఫ్టియు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురు వారం పలమనేరు పట్టణములో అంబేద్కర్ సర్కిల్ నందు రెండు ఐ ఎఫ్ టి యు విప్లవ కార్మిక సంఘాలు రాష్ట్రస్థాయి విలీన సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలై స్కీం వర్కర్లు, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచకరణ ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని ప్రజలు, కార్మికుల కష్టార్జితాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫాసిస్తూ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అనేక మంది కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తూ, పనిగంటలను పెంచి కార్మికుల నడ్డి విరిచి కార్పొరేట్ శక్తులను కోటీశ్వరులు చేస్తున్నదని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు షరతులకు తలోగ్గి కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను తాకట్టు పెట్టి ,ప్రజల రక్తాన్ని రాబందుల్లాగా పీల్చి విదేశాల్లో దాచి పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మార్చి 2 వ తేదీ రాజమండ్రి వేదికగా పుష్కరాల రేవు వద్ద చందన సత్రం నందు 2 ఐఎఫ్టియు సంఘాలు విలీన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు, కార్మికుల బలం కన్నా పాలకులు, కార్పొరేట్ శక్తులు బలం ఎక్కువ కావడంతో చట్టాలను శాసిస్తూ హక్కులను అరిస్తున్నారన్నారు ఘాటుగా విమర్శించారు. ఐఎఫ్టియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ, చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు వి. ఆర్. జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ విభజించు పాలించే విధానాన్ని పాటిస్తున్నదని విమర్శించారు. పాలక పార్టీలు చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలోని రెండు బలమైన ఐ ఎఫ్ టి సంఘాలు విలీనం అవుతున్నాయని వాటిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. మార్చి 2న రాజమండ్రిలో జరగనున్న రెండు సంఘాల విలీన సభను జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని ప్రజలు, అన్ని సంఘాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యోగేష్ బాబు, వెంకటరమణ, వెంకటరమణారెడ్డి, ఆనంద్, వెంకటేష్ పాల్గొన్నారు..

గంటపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు.!

రాహుల్ గాంధీ తో సమావేశమైన సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ సభ్యులు

గంటపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు

చర్చల్లో పాల్గొని రాహుల్ గాంధీకి వినతి పత్రం అందజేసిన తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర

సగరుల న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు హామీ

రాబోయే అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సముచిత అవకాశాలు కల్పిస్తుందని రాహుల్ గాంధీ హామీ

శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:-

Salt Makers

దేశ రాజధాని న్యూఢిల్లీ లో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రాహుల్ గాంధీ తో సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమై దాదాపు గంట పది నిమిషాల పాటు చర్చించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న భగీరథుని వారసులు వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలువబడే సగర (ఉప్పర) ల ఆర్థిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆల్ ఇండియా సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి ఓంప్రకాష్ మహతో ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 11 మంది ప్రతినిధులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాలలో సాల్ట్ మేకర్స్ పరిధిలోకి వచ్చే సగర ఉప్పరుల స్థితిగతులపై చర్చించడం జరిగింది. సగరులు అన్ని రంగాలలో ముందడుగు వేసే క్రమంలో సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే పార్లమెంటులో సమస్యలను లేవనెత్తుతానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాబోయే అన్ని ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఉన్న సగరులకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో సముచిత అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో సగరులను బిసి ‘డి’ నుంచి ‘ఏ’ లోకి మార్చాలని, ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చి నిధులు కేటాయించాలని, 59 జీవో ను సవరణ చేసి సగరులకు ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్ సంఖ్య పెంచాలని, కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ పదవి సగరులకు ఇవ్వాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర రాహుల్ గాంధీ కి వినతి పత్రాన్ని అందజేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందిస్తూ సగరుల న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సూచిస్తానని హామీ ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version