అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్.

అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్

జహీరాబాద్. నేటి ధాత్రి:

తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారము ఉదయం జహీరాబాద్ నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తాజా మాజీ సర్పంచులు చిన్న రెడ్డి (శేఖపూర్) విజయ్ ( రాయిపల్లి డి) లను జహీరాబాద్ రూరల్ పోలీసులు ఇంటి వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు తమ పదవి కాలం ముగిసి పదమూడు నెలలు గడిచిపోయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రోజు రాష్ట్ర సర్పంచుల జెఎసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జాహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉదయమే హైదరాబాద్ కు తరలి వెళ్ళడానికి సిద్ధం కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమానికి సిద్ధమైనట్టు తెలిపారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పంచాయతీలో నిధులు అందుబాటులో లేకపోయినప్పటికీ సర్పంచులు అప్పు చేసి మరి అభివృద్ధి పనులు చేశారని ఆ బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని ఆవేద వ్యక్తం చేశారు బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు గ్రామ ప్రథమ పౌరులుగా ఉండి ప్రజలకు సేవలందించిన మాజీ సర్పంచ్ లు తమ బిల్లుల కోసం అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్టు చేయడం తగదని వారు ఖండించారు తదనంతరం పోలీసులు సొంత పూచీకత్తు పై విడుదల చేసారు .

ఉద్యోగాల పేరుతో మోసం.

ఉద్యోగాల పేరుతో మోసం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ కిలాడీ లేడీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇపిస్తామని ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ ఆసుపత్రిలో ఉద్యోగం ఆశ చూపించి సుమారు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసింది. అధికారులు స్పందించి ఉద్యోగం లేదా తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

ఇమామ్ మరియు ముజ్జిన్‌లకు అభినందనలు.

పాత బాగ్దాద్ మసీదులో తరావీహ్‌లో ఖురాన్ పూర్తి చేసినందుకు ఇమామ్ మరియు ముజ్జిన్‌లకు అభినందనలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నగరంలోని పురాతన మరియు చారిత్రాత్మకమైన బాగ్దాదీ మసీదులో, హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ ఖాద్రీ షహీద్ బాగ్దాదీ మందిరం లోపల ఉన్న తరావీహ్ ప్రార్థనల సమయంలో ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ ప్రతిరోజూ మూడు అధ్యాయాలను పఠిస్తూ మొత్తం ఖురాన్ షరీఫ్‌ను పఠించే అధికారాన్ని పొందారు. హజ్రత్ సయ్యద్ షా అజీజుద్దీన్ ఖాద్రీ సాహిబ్ ఖిబ్లా మరియు సయ్యద్ షా హుస్సాముద్దీన్ ఖాద్రీ ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్, హఫీజ్ ముహమ్మద్ షకీల్ నూరి మరియు బాగ్దాదీ మసీదు డిప్యూటీ ముజ్జిన్ ముహమ్మద్ ఖైరుద్దీన్ లపై పూల వర్షం కురిపించి, వారికి అభినందనలు మరియు నైవేద్యాలను అందించారు. ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ పవిత్ర ఖురాన్ పారాయణంతో అభినందన కార్యక్రమం ప్రారంభమైంది. రిటైర్డ్ ఏఎస్ఐ ముహమ్మద్ జిలానీ నాత్ షరీఫ్ పారాయణం చేశారు. మసీదులో సింహరాశి కూడా పంపిణీ చేయబడింది. ఇది షామ్ జహీరాబాద్‌లోని ఒక పెద్ద మరియు ప్రత్యేకమైన మసీదు అని గమనించాలి, ఇక్కడ మసీదులోని ఎక్కువ మంది ఆరాధకులు ఉంటారు మరియు తరావీహ్ ప్రార్థనల సమయంలో వెయ్యి మందికి పైగా ఆరాధకులు వినయం మరియు భక్తితో పవిత్ర ఖురాన్ వింటారు. మరియు రంజాన్ మాసంలో, తరావీహ్ సమయంలో ఖురాన్ యొక్క మూడు పారాయణలు ఏర్పాటు చేయబడతాయి. ఈ సత్కార కార్యక్రమంలో ఖాజీ సయ్యద్ జియావుద్దీన్ ఓం, ఖతీబ్ ఈద్గా మరియు హఫీజ్ ముబిన్ అహ్మద్ ఖాస్మి, ముహమ్మద్ మోర్, మియా సికందర్ ఆసిద్ షకీర్, ఉస్తాద్ ముహమ్మద్ హషీం, ముహమ్మద్ రఫీ, ముహమ్మద్ రిషాద్ డానిష్ హుస్సేన్ రఫీక్ అన్సారీ, ఆరిఫ్ టోరి ముహమ్మద్ బాబా నిష్, ముహమ్మద్ అజీమ్ బారిల్, షానవాజ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదిర్ మరియు మసీదు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శకత్వ బాధ్యతలను సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నిర్వర్తించారు.

పాలనను భ్రష్టుపట్టిస్తున్న అవినీతి ఉద్యోగులు

ఆదాయం వున్న పోస్టులకు అధిక డిమాండ్‌

అందినకాడికి దండుకోవడమే లక్ష్యం

వేలంపాటలో అధిక మొత్తం చెల్లించినవారికే అటువంటి పోస్టులు

పెట్టిన పెట్టుబడికి లాభంకోసం ప్రజలను పీడిస్తున్న ఉద్యోగులు

కొందరు చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా కోట్ల విలువైన ఆస్తులు

అవినీతికి స్వేచ్ఛనిస్తున్న మన ప్రజాస్వామ్యం

ఏసీబీ అంటే భయపడే రోజులు పోయాయి

పట్టుబడినా పోస్టులు పదిలం…అవినీతికి లేదు అడ్డం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమనే రథానికి అధికార యంత్రాంగం చక్రాలవంటివారు. వీరు లేకపోతే పాలన సాగదు. అందువల్లనే పాలనా యంత్రాంగానికి అంతటి ప్రాధాన్యత. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించాల్సిన వివిధ రకాల సేవలు ఈ యంత్రాంగం ద్వారానే జరుగుతాయి. అధికారంలో వున్న పార్టీ తన హామీలను సక్రమంగా అమలు చేయడానికి చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేది ఈ ప్రభుత్వ అధికారులే! మరోమాట లో చెప్పాలంటే ప్రజాసేవలో అధికార్లది అత్యంత కీలకమైన పాత్ర. ఎందుకంటే ప్రభుత్వం తన పాలనా శైలిని మాత్రమే చెబుతుంది. కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసేది ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా కృషిచేసేది అధికార యంత్రాంగమే. ఇంతటి కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నందువల్లనే అడుగడుగునా అవినీతికి ఆస్కారం వుంటుంది. ప్రభుత్వ పాలనను భ్రష్టుపట్టించేది,అధికారపార్టీని అప్రతిష్టపాలు చేసేది కూడా ఈ అవినీతి మాత్రమే! ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులు రిటైరయ్యే వరకు తమ తమ స్థానాల్లో కొనసాగుతారు. అదే ప్రభుత్వానికి నేతృత్వం వహించే పార్టీ పదవీకాలం ఐదేళ్లు మాత్రమే! అందువల్ల పాలనలోని ప్రతి అంశాన్ని మంత్రులకు వివరించడం ద్వారా, సదరు పార్టీ తన హామీలను చట్టబద్ధమైన రీతిలో అమలు చేసేలా సలహాలు ఇచ్చి దిక్సూచిగా వ్యవహరించేది ఉన్నతాధికార్లు.

ప్రజాస్వామ్యంలో ఇంతటి ప్రధాన పాత్ర పోషించే పాలనా యంత్రాంగంలోకి అవినీతి వేరుపురుగు ప్రవేశిస్తే, సర్వం భ్రష్టమైపోతుంది. ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడి కుప్ప కూలే అవకాశముంది. అందువల్ల ఈ పాలనా యంత్రాంగం ఎప్పుడూ ప్రభుత్వ ఆధీనంలో, ని బంధనల మేరకు పనిచేయించగలిగే ఫ్రేమ్‌వర్క్‌ ఒకటి రూపొందించబడి వుంటుంది. కానీ అవినీతి పెచ్చరిల్లినప్పుడు, ఈ ఫ్రేమ్‌వర్క్‌ పనిచేయడంలేదు. ప్రభుత్వాలు మారేకొద్దీ ఈ అధికార యంత్రాంగంలో చాలామంది బలంగా వేళ్లూనుకుపోయి, అవినీతి మార్గాల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడటం వర్తమాన చరిత్ర. ఇది రానురాను మరింత వికృతరూపం దాలుస్తున్నట్టు తెలంగాణలో జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ముఖ్యంగా దిగువస్థాయి అధికార్లు ఏదశకు చేరుకున్నారంటే, అవసరమైతే తమ అక్రమ సంపాదన దన్నుతో మంత్రులపై తప్పుడు ప్రచారాలు చేయించి, వారి పదవులకే ఎసరుపెట్టే స్థాయికి ఎదగడం వర్తమాన వైచిత్రి!

ప్రజాసంబంధాలకు సంబంధించిన శాఖల్లో పనిచేసే ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువ. కొందరు నిజాయతీ పరులైన అధికార్లు లేకపోలేదు. కానీ వీరిశాతం చాలా తక్కువ. అవినీతి అధికార్లు సంపాదన ఎక్కువగా ఉండే పోస్టులకు వెళ్లడానికి అవసరమైనంత చెల్లించడానికిఎంతమాత్రం సంకోచించడంలేదు. రానురాను ఇదొక వేలంపాటగా మారిపోయింది. అంటే ఉ ద్యోగులే తమకు కావలసిన పోస్టులకోసం పై అధికార్లకు పెద్దమొత్తాల్లో లంచాలు సమర్పించుకొని ఆ పోస్టులో నియామకమైతే, ప్రజలను ఏ స్థాయిలో పీడిరచుకు తింటారో అర్థం చేసుకోవ చ్చు. ఒకప్పుడు లంచం అంటే చాటుమాటుగా, భయంగా తీసుకునే పద్ధతికి ఎనాడో కాలం చె ల్లింది. ఇప్పుడంతా బహిరంగమే. ఒక్కొక్క పనికి ఇంత మొత్తం అని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. పై అధికార్లకు అప్పటికే నజనారానాలు చెల్లించి పోస్టులోకి రావడంవల్ల ఎవ రూ అడగరనే ధైర్యం పెరిగిపోయింది. తాము లంచంగా ఇచ్చిన మొత్తానికి రెట్టింపు లాభార్జన వసూళ్ల రూపంలో సంపాదించాలన్న యావ బాగా ముదిరింది. ఈ కారణంగానే కొన్ని శాఖల్లో దిగువస్థాయి ఉద్యోగుల ఆస్తులు వందలకోట్లకు చేరుతున్నాయి. ఒకవేళ అవినీతి నిరోధక శాఖ అధికార్లకు పట్టుబడినా వీరిలో భయం ఏకోశానా కనిపించంలేదు. తాము సంపాదించిన మొత్తంలో కొంత ఖర్చుచేసి కేసులనుంచి బయటపడి తిరిగి పోస్టుల్లో చేరుతున్నారు. ఎ.సి.బి.కి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు కోర్టుకెళ్లి ఏదోరకంగా తిరిగి తమ పోస్టుల్లో కొనసాగుతున్నారు.

ఇటీవల ఎ.సి.బి.కి పట్టుబడిన అధికార్లు తమపై కేసులు నిరూపణ అయ్యే వరకు పోస్టుల్లోనే కొనసాగించాలని, నేరం నిరూపణ అయితే అప్పుడే కఠిన శిక్ష విధించవచ్చునని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు చెప్పడం వారిలో మనోధైర్యాన్ని రెట్టింపు చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈవిధంగా పట్టుబడి సస్పెండ్‌ అయిన అధి కార్లను, కేసు పూర్తయ్యేవరకు పోస్టులోకి తీసుకోదు. కానీ కోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సదరుశాఖ మంత్రివద్దకు తీసుకెళ్లి, తమకు తిరిగి పోస్టుల్లోకి తీసుకోవాలని ఇటీవల అటువంటి అధికార్లు సంబంధిత శాఖ మంత్రివద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు మం త్రి ససేమిరా అనడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదే సమయంలో మంత్రి నిజాయతీగా పనిచేయమంటూ హితోక్తులు పలకడం వారికి ఎంతమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు లం చాల రూపంలో విపరీతంగా ఆదాయాన్ని పొందుతున్న ఈ అధికార్లకు ఇప్పుడు కేవలం జీతం రాళ్లతోనే బతకాలంటే మనసు ఎంతమాత్రం ఒప్పుకోదు. తప్పుడు మార్గాల్లో వచ్చే అధికాదాయంద్వారా విలాసాలకు, ఆస్తులు సమకూర్చుకోవడానికి అలవాటుపడిన అధికార్లు ఇప్పుడు మంత్రిపై గుర్రుగా వున్నారు. విచిత్రమేమంటే సదరు మంత్రివర్యులు, ఈ అధికార్ల అవినీతిబాగోతంపై ఒక పత్రికలో వచ్చిన వార్తలను చూపించి, నిజాయతీగా పనిచేసుకోవాలని కోరడం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.

వెంటనే వారు తమకు అనుకూల మీడియా వ్యక్తుల వద్దకు వెళ్లి, పరిస్థితిని వివరిస్తే, యూనియన్‌ నేతల వద్దకు వెళ్లి సదరు వార్తలను ఖండిరచమని కోరమని సలహా ఇవ్వడంతో వారు అదేవిధంగా తమ యూనియన్‌ నాయకులపై ఒత్తిడి తెచ్చారు. ఇక వార్తలు రాసిన పత్రిక విలేకర్లు త మను రూ.20లక్షలు డిమాండ్‌ చేయగా తాము అంగీకరించకపోవడంతో, తప్పుడు వార్తలు రాసినట్టు ఈ అధికార్లు తమకు అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం, ప్రసారం చేయ డం మొదలుపెట్టారు. ఆవిధంగా తమకు అనుకూలంగా పనిచేసిన మీడియాకు కొంత ముట్టజె ప్పారు. పనిలోపనిగా ఇదే మీడియా సహాయంతో తమకు హితవు చెప్పిన మంత్రికి వ్యతిరేకంగా వార్తలను వండటం మొదలుపెట్టారు. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటమే కాకుండా, అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఈ అధికార్లు తాము సంపాదించిన పాపపు సొమ్ముతో, మంత్రులనే ఏకంగా టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారంటే వారి ఆర్థిక మూలాలు ఎంత బలంగా వున్నాయో అర్థమవుతుంది.

అవినీతి సంపాదన ఒకస్థాయి దాటిన తర్వాత, పార్టీ టిక్కెట్లకోసం రాజకీయ నాయకులతో పోటీపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక సంఘటనలో ఒక అధికారి ఒక ప్రముఖ పార్టీ నేత వ ద్దకు వెళ్లి తనకు పార్టీ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తూ, రూ.25కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చేందుకు ముందుకు రావడమే కాదు, ఎన్నికల్లో తన ఖర్చు తానే పెట్టుకుంటానని ఆఫర్‌ ఇచ్చాడంటే ఆయన అవినీతి సంపాదన ఏస్థాయిలో ఉన్నదో చెప్పల్సిన అవసరం లేదు. ఒకప్పటి వరంగల్‌ జిల్లాకుచెందిన ఒక చిన్నస్థాయి ఉద్యోగి తన కుమార్తెకు ఏకంగా రూ.5కోట్లు కట్నం చెల్లించాడంటే అవినీతి సంపాదన ఏస్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది నెలల క్రితం ఇదే జిల్లాకు చెందినఒక రెవెన్యూ అధికారి కుమారుడికి వివాహం నిశ్చయమైంది. సరిగ్గా ఇదే సమయంలో రూ.7కోట్ల విలువైన ఆయన ఆక్రమ ఆస్తులు జప్తుకు గురయ్యాయి. పెళ్లి ఆగిపోతుందని అంతా భయపడ్డారు. కానీ పిల్ల తరపువారు మాత్రం, ‘జప్తు అయింది ఏడుకోట్లే కదా! ఇంకా చాలా కోట్ల ఆస్తి వుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. మన అమ్మాయి సుఖపడుతుంది’ అంటూ వివాహా న్ని చక్కగా జరిపించేశారు. అవినీతి ఇస్తున్న భరోసాకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఒకరకంగా చెప్పాలంటే అవినీతి ‘చట్టబద్ధతను’ సంతరించుకున్నదనుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. రెవెన్యూశాఖలో లంచాలు మరిగిన అధికార్లు పహణీల్లో పేర్లు మార్చడానికి కూడా వెనుకాడటంలేదు. పట్టేదారు పాస్‌పుస్తకం కావాలంటే ఎకరానికి రూ.లక్ష డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈమొత్తం మరింత ఎక్కువ వుంటోంది. రెండెకరాలున్న రైతు రెండు లక్ష లు లంచంగా ఇవ్వగలడా? కానీ తప్పడంలేదు. లంచం ఇవ్వు…సేవను పొందు అనేరీతిలో ప్ర భుత్వ సేవలు తయారయ్యాయి. దీన్నే ‘అవినీతిలో నీతి’ అని సరిపుచ్చుకోవాలో తెలియని దుస్థితి! వచ్చేకాలంలో ఈ అవినీతి మరింత జడలువిప్పి కొత్త పోకడలతో ప్రజలను ‘అలరించ’వచ్చు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు ఫీజుకు రె ట్టింపు చెల్లిస్తే తప్ప పనులు జరగడంలేదు. అంటే చెల్లించే రెట్టింపు మొత్తం అధికార్లు పంచుకోవడానికి సరిపోతోంది. 

మరి ఇంతటి విచ్చలవిడి అవినీతికి అంతం పలకలేమా? అంటే ఇందుకు ఒక్కటే మార్గం! కీలక మైన ప్రజాసంబంధాల శాఖల్లో పోస్టులకు ఉద్యోగ భద్రత వుండకూడదు! చిన్న అవినీతి లేదా తప్పు జరిగినా తక్షణం ఉద్యోగం వూడుతుందన్న భయం వుండాలి. అవినీతికి సంబంధించిన వి చారణలో బాధితులు చెప్పే అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. నిజాయతీ అధికార్లకు ప్రోత్సాహం, తగిన అండదండలు అందించాలి! ఉద్యోగ యూనియన్లకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు! యూనియన్లు గుదిబండలు తప్ప ప్రజాసేవకు పనికిరావు! 

ప్రైవేటు సంస్థలు విజయవంతమవుతున్నాయంటే పై అంశాలను పాటించడమే ప్రధాన కారణం.కానీ మన వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిపోయిందంటే, ఈ లంచం అనే భూతం, ఓటు వేసేదగ్గరి నుంచి మొదలై పై స్థాయి వరకు ఊడలు పాకిపోయింది. రాజకీయమే పెట్టుబడిగా మారినప్పు డు అవినీతి మాత్రమే లాభాలు తెచ్చిపెడుతుంది. నిజాయతీగా వుండేవాడు ఎందుకూ కొరగా కుండా పోయే రోజులివి! కానీ నిజాయతీగా వ్యవహరించే అధికార్లు ‘నిప్పు’లాగా ఎప్పుడూ వెలుగుతూనే వుంటారు. వారికి సమాజంలో వుండే గౌరవం, అవినీతి అధికార్లకు వుండదు. డబ్బు విలాసవంతమైన జీవితాన్నిస్తుంది కానీ, నైతికతతో కూడిన ప్రశాంతతను మాత్రం ఇవ్వదు! అవినీతిలో మునిగిన వారి జీవితం ‘మీటరు’ సక్రమంగా పనిచేయని ఆటో ప్రయాణం వంటిది. వేగంగా పెరుగుతూ, ఒక్కసారిగా పడిపోతుంది! ఇక లేవడం కష్టం!

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం.!

బోడంగిపర్తి గ్రామానికి చిట్యాలనుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
బోడంగిపర్తి గ్రామానికి చిట్యాల నుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.మంగళవారంచండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, దేవరకొండ నుండి , ఉదయం 5 గంటలకు బయలుదేరి వయా చండూరు మీదుగా బోడంగపర్తి గ్రామానికి ఏడు గంటలకు చేరుకుని చిట్యాలకు పోయే విధంగా మళ్లీ సాయంత్రం చిట్యాల నుండి బయలుదేరి బోడంగి పర్తి గ్రామానికి మూడు గంటలకు చేరుకుని మళ్లీ దేవరకొండ పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు.
. ఈ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 500 పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 600 మంది, కొత్త పింఛన్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందనిఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని ఆయన అన్నారు. వేసవి వస్తుండడంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండాఅధికారులు చూడాలని, ఇంకా అనేకమంది పేదలు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, పింఛన్ల కోసం ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రైతాంగానికి నేటికీ సక్రమంగా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారనిఆయనఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిట్యాల నుండి వయా మునుగోడు,బోడంగిపర్తి చండూరు, నాంపల్లిదేవరకొండకు పోయే విధంగామళ్లీ సాయంత్రం ఇదే విధంగాఈ గ్రామాల మీదుగా దేవరకొండ నుండి చిట్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట కార్యక్రమంలోప్రజలు బాధలు పంచుకుంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించని యెడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం, యాదయ్య,నరసింహ, గ్రామ ప్రజలుముత్తయ్య,శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి హుండీ లెక్కింపు.!

నేడు..శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి హుండీ లెక్కింపు

కల్వకుర్తి /నేటి ధాత్రి.

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాల గ్రామంలో వెలసిన శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు దేవాలయంలో హుండీ లెక్కింపు ఉంటుందని.. భక్తులు, గ్రామప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు అందరూ పాల్గొనాలని కోరారు.

సాగు నీటి కోసం రమణన్న పోరుబాట..!

సాగు నీటి కోసం రమణన్న పోరుబాట..!

*ఇక్కడి వారు రైతులు కారా!
అక్కడి వారే రైతులా!*

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంప ల్లి గ్రామంలో రైతుల పంట పొలాలకు నీరు కోసం పోరుబాట మహా ధర్నాను నిర్వహించడం జరిగింది కచంలో కూడున్న తినలేని పరిస్థితి అన్నట్లు ధర్మసాగర్ వరకు నీటిని పంపు చేసే చలివాగు ప్రాజెక్ట్ చేరువలో ఉన్న ఇక్కడి రైతులకు సాగు నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతన్న దిగ్భ్రాంతి చెంది రైతు ఆత్మహత్యలకు పాల్పడు తున్న కనీసం కనీకరం చూపించని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో రైతులు,బిఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతోఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపు హౌస్ సీఈ అశోక్ కుమార్ ప్రాజెక్ట్ వద్ద నుండి ఫోన్ చేసి చలివాగు ప్రాజెక్ట్ లో కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు చేపట్టి ఇటు చలివాగు ఆయకట్టు వెంట పండే పంట పొలాలకు సాగు నీరు విడుదల చేసిన తరువాతే పైకి ధర్మసాగర్ కి నీటిని పంపిణీ చేయాలని, అలా కాదని ఇక్కడి రైతులు రైతులు కాదన్నట్టు,వారే రైతులు అన్నట్టు ఇక్కడి పంట పొలాలను ఎండబెట్టి పైకి నీటిని తీసుకెళ్ళాలని చూస్తే,చూస్తూ ఊరుకునేది లేదని పంపు మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు.
నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటిని విడుదల బంధు పెట్టడం వల్లే ఈ సమస్య ఏర్పడింది.మా డిమాండ్ ఒక్కటే ఇక్కడి రైతులకు సాగు, తాగు నీటిని విడుదల చేసిన తరువాత కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకొని తరువాత పైకి నీటిని పంపు చేయాలి.నీటి మట్టం పెరిగే వరకు మోటార్లు బంధు పెట్టాలని డిమాండ్ చేశారు.

Water

రైతే రాజు అన్న బీఆర్ఎస్ పార్టీ

అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న నా తెలంగాణ రాష్ట్రాన్ని అనాలోచిత పరిపాలన అసమర్థత వల్ల, చేతకానితనం వల్ల ఈ రోజు రైతులు ఎంతో ఆందోళనతో తీవ్రమైన నిరాశ నిస్పహల మధ్య రైతులు ఉన్నారు.అందుకే ఈ రోజు రైతుల పక్షాన,ప్రజల పక్షాన చలివాగు ప్రాజెక్టు వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అనాలోచిత పరిపాలన అని ఎందుకు అన్నమంటే జనవరి నెలలో దాదాపు నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటి పంపిణీ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన 4 నుండి 5 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం,స్పందించ కపోవడంతో అక్కడి వర్కర్స్ జీతాలు ఇవ్వకపోవడం వల్ల పంపింగ్ బంధు చేయడంతో ఈ సమస్య ఏర్పడింది.
రైతులకు సంబంధించిన విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.

ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం

ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, పైనుండే పొలాలకు నీళ్లు పోతాయి ఇక్కడి పంట పొలాలు ఎండగొడితే మాత్రం ఎకరాకు రూ.50000/- ల నష్ట పరిహారం ఈ ప్రభుత్వం బేషరతుగా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.దీక్ష చేస్తూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన తరువాత ఈ సందర్భంలో ఇక్కడికి ఇరిగేషన్ ఈఈ ఇక్కడికి వచ్చి 6 రోజుల లోపుల 15 అడుగుల నీటిమట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.ఒకవేళ కనుక 15 అడుగుల నీటిమట్టం రాకుండా ఇక్కడి పంట పొలాలు ఎండగోడితే మాత్రం రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం.అవసరం అయితే మేమే తాళాలు పగలగొట్టి, మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు.

Water

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు పంటలు సమృద్ధిగా పండాయి

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారం రోజులకు ఒక్కసారి చలివాగు నీటిమట్టం పై అధికారులతో మాట్లాడి నీటి మట్టం తగ్గితే మోటార్లు బంధు పెట్టించి నీటి మట్టం పెరిగిన తరువాత పంపింగ్ చేయమని అధికారులకు చెప్పేది వాళ్ళు కూడా అదే విధంగా సహకరించేవారు. పర్యవేక్షణ లోపమా,నాయకత్వ లోపమా, చేతకాని తనమో తెలియదు కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది.మాకే ఉద్దేశ్యం లేదు,రైతుల సమస్యలపై రాజకీయం చేసే అవసరం లేదు.రైతుల పంట పొలాలు ఎండిపోకుండా చలివాగు ఆయకట్టు వెంట చిట్యాల, రేగొండ, మొగుళ్ళపల్లి, టేకుమట్ల వరకు వారి పంట పొట్ట దశలో ఉంది, అందరూ కూడా రైతులే,ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకొని చలివాగు తూము ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలనీ డిమాండ్ చేస్తున్నాం. డిబిఎం38 ద్వారా రావలసిన నీటి యొక్క వాట మాకు రావడం లేదు,పైనున్న వారే ఎక్కువ వాడుకోవడం వల్ల మాకు అన్యాయం జరుగు తుంది. డిబిఎం 38 ద్వారా గొరికొత్తపల్లి వరకే నీళ్ళ వస్తున్నాయి.నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఒక్క పర్యవేక్షణ పెట్టి పోలీసు అధికారులు,మా ప్రజాప్రతినిధుల సహాయంతో చిట్యాల,టేకుమట్ల వరకు నీటిని తీసుకెళ్ళి చిన్న చిన్న చెరువులని నింపి మత్తడి స్థాయి వరకు తీసుకెళ్ళం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాయంపేట, గోరికొత్తపల్లి, రేగొండ,చిట్యాల, మొగుళ్ళపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.!

‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు’

‘పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తాం’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

MLA

అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. ధర్మాపూర్, కోడూరు, అప్పాయపల్లి, జమిస్తాపూర్ గ్రామాలలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అంతకుముందు పాలమూరు యూనివర్సిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, మేఘా రెడ్డి, కుర్వ తిరుపతయ్య, గూడెం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకే తలమానికం. ఎన్డీఎస్ఎల్.

తెలంగాణకే తలమానికం. ఎన్డీఎస్ఎల్

మెట్ పల్లి మార్చి 11 నేటి ధాత్రి

చక్కర కర్మగారాన్ని నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పసుపునకు రూ. 12వేల మద్దతు ధర ఇవ్వాల్సిందే చెరుకు రైతుల కోసం ఉద్యమించేది బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని మెట్ పల్లిలో చెరుకు రైతులకు మద్దతుగా బీజేపీ మహాధర్నా
మెట్ పల్లితెలంగాణకే తలమానికం ఎన్డీఎస్ఎల్ కర్మగారాలు అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని అన్నారు. మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు, రైతు సంఘ ప్రతినిధులతో కలిసి మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు హాజరై మాట్లాడారు.
1947లోనే బోధన్ లో ఎన్డీఎస్ఎల్ కర్మాగారం ప్రారంభమైందన్నారు. కొన్ని సంవత్సరాలు చెరుకు రైతులకు లాభదాయకంగా ఉన్న ఎన్డీఎస్ఎల్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2015లో లే ఆఫ్ ప్రకటించి మూసివేసారన్నారు. దీంతో సుమారు 15 వేల ఎకరాల్లో పంటను చెరుకు రైతులు నష్టపోతున్నారన్నారు. కర్మగారాలను అర్థంతరంగా మూసివేయడంతో చెరుకు రైతులకు ఉపాధి లేక వారితో పాటు, వారి పిల్లల సైతం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
కాగా 2013లోనే బీజేపీ ఆధ్వర్యంలో ముత్యంపేట చక్కర కర్మగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లిలో రైతులతో కలిసి పార్టీలకతీతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కర్మాగారం మూతపడడంతో చెరుకు రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు నవోదయ పాఠశాలలను మంజూరు చేయించిన ఘనత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దక్కుతుందన్నారు. ఒకటి కోరుట్ల నియోజకవర్గంలో, మరొకటి జక్రాన్ పల్లిలో మంజూరు చేయించామని. ఇప్పటికైనా పాలకులు స్పందించి చెరుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే చక్కర కర్మగారాన్ని తెరిపించాలని, కర్మాకారానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఆది నుంచి రైతుల సంక్షేమానికి బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన కృషి మేరకు పసుపు బోర్డును సాధించుకున్నామని, పసుపు రైతుల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, ధర్నా కార్యక్రమ కన్వీనర్, రాష్ట్ర నాయకులు ఏలేటి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా – సుఖేందర్ గౌడ్, నరేష్, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేపీ నాయకులు, రైతు సంఘం నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, గుంటుక సదాశివ్, వడ్డేపల్లి శ్రీనివాస్, పంచిరి విజయ్, రాజ్ పాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బింగి వెంకటేష్, దొనికెల నవీన్, డాక్టర్ వెంకట్ రెడ్డి, పీసు రాజేందర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, బొడ్ల నరేష్, గుగ్గిళ్ళ తుకారం గౌడ్, బొడ్ల ఆనంద్, పన్నాల రాఘవరెడ్డి, బొడ్ల గౌతమ్, జక్కుల జగదీష్, సదాశివ్, మహేష్, బొమ్మెల శంకర్, జుంగల ఆనంద్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, సుంచు రణధీర్, రాజారెడ్డి, కొయ్యల లక్ష్మణ్, శ్రీధర్ రెడ్డి, చెట్లపల్లి సాగర్, కలాల సాయిచందు, ఇట్యాల నవీన్, కుడుకల రఘు, కలిగోట శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.!

నేడు అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
చిల్పూర్( జనగామ) నేటిధాత్రి
చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేడు( బుధవారం) శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆలయ కార్యనిర్వహణ అధికారిని బి.లక్ష్మీ ప్రసన్న తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్టపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ చిల్పూరు గుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.అదేవిధంగా కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం శేషాద్రి నిలయంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాలయ అర్చకులు రంగాచార్యులు, రవీందర్ శర్మ, కృష్ణమాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఆర్.పి.ఎస్ మండల సమన్వయ కమిటీ సమావేశం.

ఎం.ఆర్.పి.ఎస్ మండల సమన్వయ కమిటీ సమావేశం
సమన్వయ కమిటీ ఇంచార్జిగా బరిగెల ఏలీయా నియామకం

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-

అయినవోలు మండల్ ఎంఆర్పిఎస్. ఎంఎస్పి అనుబంధ సంగాల అధ్యక్షులు చింత అశోక్ మాదిగ, ఇసురం బాబు అధ్యక్షతన మంగళవారం మండల కార్యవర్గం సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొక్కల నారాయణ మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మందకృష్ణ మాదిగ ఆదేశాల అనుసారంగా వర్గీకరణలో కమిషనర్ ఇచ్చిన రిపోర్టును సరిదిద్దుకొని ఏబిసిడిలుగా విభజించి జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు మరియు ఉపకులాలకు రావలసిన వాటా జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసి అధికారికంగా వర్గీకరణ ప్రకటించాలని కోరారు. అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ను నిలిపివేసి వర్గీకరణ అయిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. ఐనవోలు మండల సమన్వయ కమిటీ ఇన్చార్జి గా నందనం గ్రామానికి చెందిన బరిగల ఏలియాను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. రేపటినుండి జరిగే కార్యక్రమాలను మరియ ఉద్యమ నిర్మాణాలను విజయవంతం చేయుటకు ఈ కమిటీ పనిచేస్తుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల సీనియర్ నాయకులు బర్ల బాబు,కట్కూరి రమేష,సింగారపు చంద్రమౌళి,మరుపట్ల దేవదాస్, బరిగేల ఆరోగ్యం,ఆరూరి కుమారస్వామి, బొక్కల అనిల్ మాదిగ. మాదాసి కరుణాకర్ ఆకులపల్లి సాగర్, జలగం ఎల్ల కుమార్, ఆకులపల్లి రాజు,కట్కూరి అరుణ్ మాదిగలు పాల్గొన్నారు.

రైతు మనస్థాపం చెంది ఆత్మహత్య.

రైతు మనస్థాపం చెంది ఆత్మహత్య.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన రైతు 11-03-2025 మంగళవారం రోజున శాంతినగర్ గ్రామం నుండీ మోత్కూరి సారయ్య అనునతడు తనాకొడుకు ఐనా మోత్కూరి కుమారస్వామి వయస్సు 35 సంలు అనునతడికి వివాహం జరిగి ఒక కొడుకు కూతురు సంతానం, తనకు గల 3 ఎకరాల భూమి లొ గత రెండు సంవత్సరం ల నుండి పత్తి మరియు మిర్చి పంటావేయగా పంట సరిగా రాక పెట్టిన పెట్టుబడి ఎల్లకా చేసిన అప్పులు పెరిగి వాటిని ఎలా తీర్చాలానే బాధతో మనస్తాపం చెంది తన చేను వద్దకు పోయి మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని దరఖాస్తూ ఇవ్వగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నాము అని 2వ ఎస్సై
ఈశ్వరయ్యతెలిపారు,

బస్టాండ్ ను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు.

బస్టాండ్ ను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

మాజీ కౌన్సిలర్ కొమరవెల్లి అనిత సుధాకర్ రెడ్డి

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం మున్సిపాలిటీ 7వ వార్డు ఎస్వి నగర్ మెయిన్ రోడ్ విజయ హాస్పిటల్ గేట్ ప్రక్కన సుమారు 25 సంవత్సరాల నుండి ఉన్న బస్టాండ్ ను స్థానిక మున్సిపాలిటీ నుండి కానీ సంబంధిత ఏ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్ట రాజ్యంగా రాత్రికి రాత్రే తొలగించిన విజయ హాస్పిటల్ యాజమాన్యం ఇట్టి విషయంపై స్థానిక కాలనీ వాసుల ద్వారా సమాచారం అందుకున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 9వ వార్డు మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా బస్సు స్టాండ్ ను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని బస్సు స్టాండ్ ను యాద తదంగా పునర్నిర్మించాలని ముందే వేసవి కాలం కావడంతో నిలువ నీడ లేక స్కూల్ పిల్లలు,కాలేజ్ విద్యార్థులు, మహిళలు, వయో వృద్ధుల బాధలు చెప్పలేనివి అని. తక్షణమే బస్సు స్టాండ్ నిర్మించని యెడల వచ్చే ప్రజావాణి కార్యక్రమంలో కాలనీ ప్రజలం అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతామణి అలాగే సిడిఎంఏ ఉన్నతధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రావు, వీరా రెడ్డి, పంజలా నర్సింహా గౌడ్, మర్రి కొండల్ రెడ్డి,దుడికి ప్రభు కిరణ్, కోటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు

శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం..

రాయికల్ .నేటి ధాత్రి…

Mahotsavam

మార్చి 11.రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం రోజున అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యులు, వేదమంత్రోచ్చారణలతో స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా జరిగింది. కళ్యాణ అనంతరం భక్తులు స్వామి వారికి ఓడిబియ్యం కుడుకలు కనుములు అందజేశారు. తర్వాత స్వామివారిని తులాభారం చేశారు.. అనంతరం భక్తులందరికీ అన్నదానం చేశారు.. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథ చార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, నాయకులు, యువకులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన.

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన నిందితున్ని అరెస్టు చేసిన మద్దూర్ పోలీసులు.

నిందితును వివరాలు
దక్షిణపు శివయ్య, నివాసం పెద్దపలకనూరు, గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్

కేసు వివరాలు చేర్యాల సీఐ శ్రీను తెలియపరుస్తూ

చేర్యాల నేటిధాత్రి…

2025 జనవరి చివరి రోజుల్లో కమలాయపల్లి గ్రామాననికి చెందినటువంటి ధర్మోజీ నారాయణ చారి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది.
ఏమనగా జీటీవీ చూ స్తుండగా కింద జ్యోతిష్యం చెప్పబడును అని ఒక ఫోన్ నెంబర్ కింద స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్ గమనించినటువంటి నారాయణచారి తనకి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి మనశాంతి ఉండట్లేదు, ఇవన్నీ జ్యోతిషం చెప్పించుకుంటే పోతాయని అతని నమ్మి ఆ నెంబరు కాల్ కాల్ చేయగానే పై నిందితుడు ఫోన్ లేపి మాట్లాడుచు పూజలు చేస్తా మంచి జరుగుతది చెప్పగానే అది నమ్మిన బాధితుడు పై నిందితుడు పూజారి చెప్పిన విధంగా మొదట ఒక 50,000 రూపాయలు అతని ఇచ్చిన అకౌంట్ కు డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత పై నిందితుడు పూజారి ఫోన్ చేసి డబ్బులు సరిపోలేదు పూజ సగంలో ఉంది పూర్తి కావాలంటే ఇంకొక 50 వేల రూపాయలు కావాలంటే ఇతను మిగతా 50 వేలు కూడా పంపించిండు. తర్వాత మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు కావాలి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి పూజ పూర్తిగా అవ్వాలి లేకపోతే మీకు చెడు జరుగుతుంది అని ఇతనికి చెప్పటం వల్ల ఇతను ఆ మాటలు నమ్మి ఆ మాయమాటలవల్ల అనుమానం వచ్చి, ఇప్పటికే లక్ష రూపాయలు ఇచ్చాను అప్పుచేసి ఇంకా తన దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి అని ఆలోచించి, సైబర్ క్రైమ్కు మోసానికి గురి అయినానని పోలీసు వారు చేసే ప్రచారాన్ని గమనించి 1930 అనే నెంబర్ కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అతను రిపోర్టు చేయడం జరిగింది. దాని మీద మాకు అట్నుంచి వచ్చిన దానిమీద నారాయణ దగ్గర పిటిషన్ తీసుకొని సైబర్ క్రైమ్ ప్రకారంగా కేసు నమోదు చేసి పరిశోధన చేస్తుండగా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పై నిందితున్ని ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించగా జాతకాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నానని ఒప్పుకున్నాడు. పై నేరస్థుని వద్ద ఉన్న సెల్ ఫోన్ సీజ్ చేసి నిందితుని వద్దనుండి బాధితుడికి లక్ష రూపాయలు రిఫండ్ చేయడం జరిగింది, పై నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కుపంపించడం జరిగింది.

అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఈ జ్యోతిష్యం గాని ఇంకేదైనా యాడ్స్ దేనికి కూడా స్పందించకుండా, ఎవరికి కూడా జ్యోతిష్యాల వల్ల మంచిగా అయితదనో, ఫోన్లో పూజలు చేస్తే మంచిగా అయితదనో అని చెప్తే నమ్మొద్దు అని, అమాయకులను మోసం చేయడం కోసం ప్రయత్నించుచున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి మీకు ఎవరైనా చేస్తే 1930 నెంబర్ కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా చేర్యాల శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి*

SC రిజర్వేషన్ల వర్గీకరణ ను అమలు చేశాకే ఉద్యోగ ఫలితాలు విడుదల చేయాలి

వర్దన్నపేట 11మార్చ్ (నేటిదాత్రి):

వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం MRPS మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ బిర్రు మహేందర్ మాదిగ మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగలు హాజరై దీక్షలు ప్రారంభించి మాట్లాడం జరిగినది తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి జరుగు అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి జస్టిస్ షమీమ్ అక్తర్ గారు ఇచ్చిన నివేదికలో ప్రకారం 15 లక్షలు ఉన్న మాలలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడు 32 లక్షల పైగా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనాభా తామాషా వర్గీకరణ చేయాలని వర్గీకరణ బిల్లు పెట్టేంత వరకు ఉద్యోగ ఫలితాలను విడుదల చేయకూడదని

సిరిసిల్ల పట్టణంలో మోనో కార్పస్ చెట్ల వలన వాయు కాలుష్యము.

సిరిసిల్ల పట్టణంలో మోనో కార్పస్ చెట్ల వలన వాయు కాలుష్యము

పట్టించుకోని మునిసిపల్ అధికారులు

సిరిసిల్ల టౌన్:(నేటిదాత్రి)

సిరిసిల్ల పట్టణంలో ఉన్న (గత ప్రభుత్వ హయంలో లో ) పెట్టిన మోనో కార్పస్ చెట్లవలన వాయు కాలుష్యము ఏర్పడుతుందందని, ఇది ఏమాత్రం మంచిది కాదని పిల్లలకు, పెద్దలకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతుందని గతంలో కూడా మున్సిపల్ అధికారులకు చెప్పిన వారు పెడచెవిన పెట్టారు.
వాటి వలన ఏలాంటి ఇబ్బంది లేదంటే మోనో కార్పస్ మొక్కలు ప్రతి అధికారి ఛాంబర్లో టేబుల్ మీద ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న దాదాపు 10 చెట్లను తొలగించినారు. ( వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా).
కానీ పట్టణంలో డివైడర్ మధ్యలో, పార్కులల్లో అలాగే ఉంచారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని అట్టి చెట్లను తొలగించగలరని బూర యాదగిరి అనే సామాజిక కార్యకర్త తెలిపారు…

గ్రామాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

గ్రామాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం రోజు న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది, మండలంలోని గోపాలపురం ముచనిపర్తి చల్లగరిగే, జూకల్, తిర్మలాపూర్, చిట్యాల, మోడల్ స్కూల్ ఆవరణలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తుందని, రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు,మరిన్ని అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజాపాలన జరుగుతుంద ని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమ, ఎంపీడీవో జయ శ్రీ ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

నేటి ధాత్రి ;

గత శనివారం మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మంగళవారం మృతి చెందారు. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పోతరాజు గంగాధర్ (45) శనివారం ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాగ మంగళవారం ఉదయం మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి.

సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి

ఇర్ప రాజు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు*

నేటి ధాత్రి ; భద్రాచలం;
ఏజెన్సీ ప్రాంతంలో గల ఆదివాసీ మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ లను తక్షణమే పునః ప్రారంభించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు.ఇందులో బాగంగా మార్చి 11,2025; మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఆదివాసీ ప్రజల ఉపాధిని దెబ్బకొట్టేందుకు ఇసుక ర్యాంప్ లను నిలిపి పాలకులు రైజింగ్ కాంట్రాక్టర్లతో బేరసారాలకు తెరలేపారని ఆరోపించారు.నిజంగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచన పాలకులకు ఉంటే రైజింగ్ కాంట్రాక్టర్ విధానం లేకుండా ప్రతి మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ కు పెట్టుబడి నిమిత్తం ముందస్తు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అమ్మ పెట్టదు అడుక్కతీననివ్వదు అనే చందంగా రేవంత్ సర్కారు తయారైందని విమర్శించారు.ఇసుక అక్రమాలు కట్టడి అంటూ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొకోక పోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.ఇందకు స్థానిక సంస్థల ఎన్నికలే సమాధానం చెపుతాయని అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version