
11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
నిజాంపేట, నేటి ధాత్రి నస్కల్ కు రోడ్డు వేయాలని 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని నస్కల్ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వము స్పందించని ఎడల ధర్నాలు రాస్తారోకోలు, వంటావార్పు , తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగానే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టు లింగం, బక్కన్న గారి నరేష్ గౌడ్, పాతూరి…