బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలి.

సిరిసిల్ల జిల్లా చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది నిర్వహించే వాహనాల ఎంట్రీ రికార్డ్ లను పరిశీలించి,చెక్ పోస్ట్ లో గల సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగినది.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవడం జరిగిందని, గోవుల అక్రమ రవాణా గోవధ నివారించేందుకు జిల్లా సరిహద్దుల జిల్లెళ్ల, పెద్దమ్మ, మానాల క్రాస్ రాడ్ వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,తనిఖీల్లో సరైన పత్రాలు ఉన్న రైతులకు సంబంధించిన లేదా వ్యవసాయనికి సంబంధించిన పశువుల రవాణాకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది విధులు నిర్వహిచాలని తెలియజేశారు. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ యంత్రాంగామంతా సమన్వయముతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్.ఐ శంకర్ నాయక్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు.

ఘనంగా హ‌రీష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు

జహీరాబాద్ నేటిధాత్రి:

మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే మాణిక్ రావు కేక్ కట్ చేసిన అనంతరం గులాబీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద‌ర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాట్లాడుతూ ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ వెన్నంటి నడిచిన నిజమైన గులాబీ సైనికుడు హ‌రీష్ అని అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హ‌రీష్ రావు గార‌ని కొనియాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్టీ వెన్నెముక, క‌ష్ట‌కాలంలో నిలుస్తూ.. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతున్న యోధుడు హ‌రీష్ రావుగార‌ని అన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల ప్ర‌భుత్వ పాల‌న‌లో నీటి పారుద‌ల‌, ఆర్థిక మంత్రిగా వారు రాష్ట్రానికి ఎన‌లేని సేవ‌లు చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే కాళేశ్వ‌ర ప్రాజెక్టు సాకారంలో కేసీఆర్ గారితో పాటు హ‌రీష్ గారు శ్ర‌మ, కృషి మ‌రువ‌లేనిద‌ని అన్నారు. హ‌రీష్ రావు నిండు నూరేళ్లు అష్టైశ్వ‌ర్యాల‌తో , సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ముఖ్య‌మంత్రిగా తిరిగి కేసీఆర్ గారిని చేయ‌డంలో హ‌రీష్ రావు గారి నాయ‌క‌త్వాన్ని తెలంగాణ కోరుకుంటోంద‌ని అన్నారు.కార్య‌క్ర‌మంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,చిన్న రెడ్డి,వెంకట్, నర్సింహ రెడ్డి,ఇబ్రహీం,దేవదాస్,గణేష్,సురేష్ ,నరేష్ రెడ్డి,జాకీర్,అశోక్ రెడ్డి,ఇమ్రాన్ ,నాయకులు కార్యకర్తలు త‌దిత‌రులు పాల్గొన్నారు

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు.

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు

పెద్దమ్మతల్లి దేవాలయ విగ్రహాలకు లక్ష సహాయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామంలో ముది రాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మా ణానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మిట్టపల్లి సతీష్ యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచి,దేవాలయంలో ప్రతిష్టిం చే పెద్దమ్మతల్లి, పోతరాజుల విగ్రహాల కోసం లక్ష రూపాయ లు అందజేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి చిందం రవి, గ్రామస్తుల ఆధ్వర్యంలో సతీష్ విగ్రహాలను కొనుగోలు చేసి, గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈనెల 6న విగ్రహాల ప్రాణప్ర తిష్ట కార్యక్రమం నిర్వహించ నున్నారు. తన వయసుకు మించి గ్రామం కోసం పాటు పడుతున్న సతీష్ ను బుచ్చిరెడ్డి, చిందం రవి, గ్రామస్తులు హృదయపూ ర్వకంగా అభినందించి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

 

ఝరాసంగం మండల్ పరిధిలోని కుప్పానగర్ గ్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్ స్థానిక ప్రజలకు రైతులకు నకిలీ విత్తనాలు, సైబర్, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలపై వారికి వివరించారు. రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు. ఒకటికి.. రెండు సార్లు సరి చూసుకుని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ ఆర్గనైజర్ వద్దే విత్తనాలు తీసుకోవాలన్నారు. వాటిని రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆర్గనైజర్ నుంచి రశీదు పొందాలన్నారు. అలాగే తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తి అయ్యేవరకు రైతులు తమ వద్దే దాచాలన్నారు. ఆయా విత్తనాలను సాగు చేయడం వల్ల రైతు నష్టాలు పొందినట్లైతే సంబంధిత ఆర్గనైజర్ ను, కంపెనీని, బాధ్యులను చేయుటకు రైతు తీసుకున్న రశీదు, ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడుతాయని, ఆ ఆర్గనైజర్, కంపెనీపై కఠిన చర్యలు తీసుకొనుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

 

మొగుళ్ళపల్లి, నేటి ధాత్రి:

 

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ సునీత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అంకుషాపురం రంగాపురం గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను తహసిల్దార్ నేరుగా స్వీకరించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆర్డీవో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చి అవకాశం వినియోగించుకోవాలని సూచించారు రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. 5/06/2025 రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు గుడిపాడు వేములపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించబడుతుందని ఆ గ్రామాలలో ఉన్న రైతుల భూమికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న వారి దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రైతులుఅవకాశాన్ని వినియోగించుకోవాలని తాసిల్దారు కోరారు కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు

నిజాంపేట నేటి ధాత్రి:

జాతీయ ఉపాధి హామీ పనుల పై సామజిక తనిఖీ అధికారులు సర్వే చేపట్టారు. ఈ మేరకు మండలం లోని నస్కల్ గ్రామంలో బీఆర్పి అధికారులు మూడు రోజులుగా గ్రామం లోనీ ఇంటి ఇంటికి వెళ్లి కూలీలు ఎంత పని చేశారు. ఎంత డబ్బులు పడ్డాయనే దానిపై సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లాడారు.. 2024 – 25 సంవత్సరంలో 18 పనులు జరిగాయని ఈ పనులకు సంబంధించి కూలీ వేతనాలు, సామాగ్రి తో కలుపుకొని రూ,, 33,04,117 వచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో నూతన పని బుక్కులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందం, గ్రామ కార్యదర్శి అరిఫ్ హుస్సేన్, దేశెట్టి సిద్ధ రాములు, సుధాకర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు ఉన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసిన విత్తనాలనే… మేలు

శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసిన విత్తనాలనే… మేలు

కేసముద్రం/ నేటిదాత్రి

 

 

 

 

కేసముద్రం రైతు వేదిక యందు,నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి, వరి మరియు పెసర మూల విత్తనాల కిట్లను, కేసముద్రం మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల రైతులకు, ప్రతి రెవిన్యూ గ్రామం నుంచి ముగ్గురు అభ్యుదయ రైతులకు ప్రతి రెవెన్యూ గ్రామానికి రెండు వరి మరియు ఒక పెసర మిని కిట్లను, కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న అధ్యక్షతన, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్, గంటా సంజీవరెడ్డి మరియు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గంటా సంజీవరెడ్డి, మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి, నాణ్యమైన వరి మరియు పెసర విత్తనాలను, అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటువంటి విత్తనాలను గ్రామస్థాయిలో అభ్యుదయ రైతులు శాస్త్రవేత్తల సలహా సూచనలతో ఉత్పత్తి చేసి గ్రామంలో ఉన్న రైతులకు పంపిణీ చేసి వచ్చే సీజన్లో తక్కువ ఖర్చుతో విత్తనాలను సరఫరా చేయాలని వారు సూచించారు దీనివలన విత్తన ఖర్చులు తగ్గి రైతుకు మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చి,నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. అదేవిధంగా రైతులు విత్తన కంపెనీల మీద ఆధారపడకుండా వారి యొక్క విత్తనాలను వారి గ్రామంలోని స్వతహాగా తయారు చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మాట్లాడుతూ కేసముద్రం మండలానికి 15 రెవెన్యూ గ్రామాలకు గాను 30 వరి కిట్లను, 15 పెసర కిట్లను అభ్యుదయ రైతులకు పంపిణీ చేశామని తెలిపారు అదే విధంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విత్తనం వేసినప్పటినుంచి పంట చేతికి వచ్చే వరకు విత్తన ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేసముద్రం, ఉపాధ్యక్షులు, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు మహబూబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ రావుల మురళి, మరియు సొల్లేటి జయపాల్ రెడ్డి , బండారు వెంకన్న , కదిరే సురేందర్ , గుగులోతు దశ్రు నాయక్ , వివిధ గ్రామాల అభ్యుద రైతులు, కేసముద్రం మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, డి రాజేందర్, శ్రీనివాస్, సాయిచరణ్ రవి వర్మ, లావణ్య లు పాల్గొన్నారు.

25 కేజీల బియ్యం వితరణ.

25 కేజీల బియ్యం వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి జంగేడు 14వ వార్డులో అట్కాపురం కోటి వల్ల అమ్మమ్మ చనిపోయి 6వ రోజున కాంగ్రెస్ జిల్లా నాయకులు దుర్గం అశోక్ &టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ కూనమళ్ళ రాజా కొండముచ్చుల నాగరాజు గారు, మరియు యాత్ నాయకులు ఆకుల సాయి చరణ్, దొంగల అనిల్,బొద్దుల వినయ్,కటకం చందు, దుర్గం అనిల్, దుర్గం సాగర్ పాల్గొన్నారు,

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

 

బాలానగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో.. భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. గ్రామంలోని పలువురు రైతులు భూ సమస్యలను భూభారతి రెవెన్యూ సదస్సు ఫారంలో వివరాలు పొందుపరిచి తహసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. మండలంలోని భూముల సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారంలో వివరాలు నిశితంగా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ.

నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి బుధవారం అంకురార్పణ చేశారు. పంబాల పూజారి రౌతు కిషోర్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ఎస్సీ కాలనీ సమీపంలో పాత స్థలాన్ని మరోసారి గుర్తించి, పసుపు కుంకుమ సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ… ఆలయ నిర్మాణానికి ఇదే గ్రామానికి చెందిన బైరెడ్డి వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలు దాతలుగా ముందుకు రావడం జరిగింద న్నారు. ఇందులో భాగంగా నేడు స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈనెల 11న ఉదయం 7 గంటలకు ఆలయ నిర్మాణానికి ముగ్గు పోయడం జరుగుతుందని కావున గ్రామ మహిళలు పసుపు కుంకుమ కొబ్బరికాయలతో అధిక సంఖ్యలో హాజరై పూజలో పాల్గొని విజయవంత చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు
పెరుమాండ్ల రాజేశ్వర్, గట్టు మహేందర్, బిరుదు రాములు, వడ్లకొండ నాగరాజు, ఎర్రం సతీష్ కుమార్, పెరుమాండ్ల నవీన్,కన్నూరి కుమార స్వామి,కత్తి తిరుపతి, ముక్కెర రాజు, పైతరి సదయ్య, గాజుల వెంకటస్వామి, సుంకరి ప్రమోద్, గట్టు రమేష్, తోడేటి విజేందర్, కసుబోజుల రమేష్,పబ్బ రాజు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
• భూభారతిలో సమస్యల శాశ్వత పరిష్కారం
• మెదక్ ఆర్డిఓ రమాదేవి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

భూ భారతిని మండల వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భూ భారతిలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం అవుతాయని మెదక్ ఆర్డీవో రమాదేవి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును ఆమె సందర్శించి రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు.. ప్రజలు భూ సమస్యల నివృత్తి కోసం రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 12 వరకు తేదీల వారిగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భూభారతిలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం అవుతాయని ఆమె పేర్కొన్నారు. భూ సమస్యల పై అధికారులకు దరఖాస్తుల రూపంలో వారి సమస్యలను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసులు, నయాబ్ తాహసిల్దార్ రమ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, ధరణి కంప్యూటర్ ఆపరేటర్ రాజు, గ్రామ ప్రజలు ఉన్నారు.

రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండల్ నర్సింగాపూర్, మిట్టపల్లి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు ప్రజల వద్దకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు చేపట్టి వారి సమస్యలు పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,తహసిల్దార్ వనజా రెడ్డి, వివిధ శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్, నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండల్ నర్సింగాపూర్, మిట్టపల్లి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు ప్రజల వద్దకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు చేపట్టి వారి సమస్యలు పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,తహసిల్దార్ వనజా రెడ్డి, వివిధ శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం.

జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం

 

మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి

 

ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్
మెట్ పల్లి జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం అని జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్నామని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ అన్నారు.
ప్రతినెలా నాలుగవ తారీఖున జరిగే సాధారణ సమావేశం బుధవారం రోజున ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్ మహ్మద్ అజీమ్ లు మాట్లాడుతూప్రెస్ క్లబ్ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా సభ్యులందరికీ 15 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇట్టి ఇన్సూరెన్స్ లోని ప్రయోజనాలు యాక్సిడెంటల్ డెత్ కి15 లక్షలు, శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, అత్యవసర వైద్యానికి లక్ష రూపాయలు, విద్యా ప్రయోజనానికి లక్ష రూపాయలు, వివాహ ప్రయోజనానికి లక్ష రూపాయలు, అంత్యక్రియల ఖర్చుకు 5000 రూపాయలు, ఏదైనా ఎముకలు విరిగినప్పుడు 25 వేల రూపాయలు, కాలిన గాయాలకి 10000 రూపాయలు, పాలసీదారుడు కి హాస్పిటల్ లో రూమ్ కోసం రోజుకి 1000 రూపాయలు చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్ కోసం రూమ్ కి 2000 రూపాయల చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న స్కీమ్ సభ్యులందరికీ చేయించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పానుగంటి మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఏసవిని గణేష్ ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.

బ్రెయిన్ ట్యూమర్ బాధితురాలికి ఎల్ఓసి అందజేత.

బ్రెయిన్ ట్యూమర్ బాధితురాలికి ఎల్ఓసి అందజేత…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి ఏరియాలో గల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎనగందుల స్వాతి అనే పేద మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా బాధపడుతూ తగిన చికిత్స అందుకోలేని పరిస్థితిలో ఉన్న సమాచారం చెన్నూరు శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కి తెలియడంతో వెంటనే స్పందించి, ఆమె చికిత్స కోసం అవసరమైన ఎల్ఓసి ని మంజూరు చేశారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు బుదవారం బాధిత మహిళకు ఆమె నివాసంలో ఎల్ఓసి ని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడారు.పేద ప్రజల పట్ల ఎమ్మెల్యే వివేక్ కు ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని అన్నారు.స్వాతి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వివేక్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ, తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి ప్రయాణమయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మొట్టె సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గుర్రం అనిల్ కుమార్, యువజన నాయకులు కునారపు శివకుమార్ , ఊటూరి చంద్రయ్య, యాదగిరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయానికి సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి.

వ్యవసాయానికి సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి.

కారేపల్లి నేటి ధాత్రి

 

 

 

 

వ్యవసాయ సీజన్ ఒక నెల ముందు ప్రారంభం కావడంతో రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు విత్తనాలు నాణ్యమైన ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచే రైతులను ఆదుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు.
మంగళవారం నాడు కారేపల్లి మండలం టేకులగూడెంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ మహాసభలో ముఖ్యఅతిగా పాల్గొని ప్రారంభిస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు పొద్దున లేస్తే రైతు గురించి రైతు సంక్షేమం గురించే మాట్లాడుతున్నారని రైతు సంక్షేమం గురించి పాలకులు ఉన్న ఈ దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతును వేధించటం సరికాదని ఆయన అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా లాంటి తదితర పథకాలను 100% అమలు చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు లక్షలాదిమంది ఆదివాసి గిరిజనులు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న వేల ఎకరాలకు ఈనాటి కోడి భూములకు పట్టాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఉందని ఆయన అన్నారు అనంతరం అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు ఆవల వెంకటేశ్వరావు మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలను నిల్వచేసుకునేందుకు వీలుగా అన్ని మండలాలలో గిడ్డంగులు నిర్మించాలని చెప్పి వారు కోరారు మోడీ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల మార్కెట్ విధానం మొత్తం ప్రైవేటు వారి చేతుల్లోకి వెళుతుందని దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర రాకపోగా మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముందు రైతు సంఘం జెండాను జిల్లా కార్యదర్శి ఆవులు వెంకటేశ్వర్లు ఎగరవేయగా అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఈ సభలో రైతు సంఘం నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు కేలోతు లక్ష్మణ్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ ఝాన్సీ ప్రసంగించగా ఈ మహాసభకు గుగులోత్ తేజ నాయక్ అధ్యక్షత వర్గంగా వ్యవహరించగా నాయకులు రాకేష్ గుమ్మడి సందీప్ బిక్కసాని భాస్కర్ సత్తిరెడ్డి లక్పతి వీరబాబు మదర్ సాహెబ్ సక్రు నాగయ్య పాపారావు సరోజిని అనసూర్య తదితరులు పాల్గొన్నారు అనంతరం ఖమ్మం డివిజన్ నూతన కమిటీని 17 మందితో ఎన్నుకోగా డివిజన్ అధ్యక్షులుగా ధరావత్ లక్ష్మణ్ కార్యదర్శిగా తేజ నాయక్ ఉపాధ్యక్షులుగా సత్తిరెడ్డి భాస్కర్ పుప్పాల రామారావు వీరబాబు లతో కూడిన 17 మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది.

శ్రేయాన్స్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.

శ్రేయాన్స్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.
• ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
• ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు గుర్తించాలి.
 ప్రమాదం జరగడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
• ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ
జడ్చర్ల నేటి ధాత్రి:
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే సహించేది లేదని, అందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో బుధవారం విద్యుత్ షాక్ తో శ్రేయాన్స్ అనే పదేళ్ల బాలుడు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లనున్నాయని వాటి కారణంగా ప్రజల ప్రాణాలకు ఆపద వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని స్పష్టం చేసారు. ప్రత్యేకించి వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని ప్రాంతాల్లోనూ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను గురించి సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి కోరారు. రక్షణ లేని ట్రాన్ఫర్మర్ల వద్ద ప్రమాదాలు జరగడంతో పాటుగా గాలి వానలకు విద్యుత్ వైర్లు తెగిపడటం వల్ల కూడా ప్రాణాలు పోయే ప్రమాదాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే అధికారులు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాతంతాలను గుర్తించి, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. దీని కోసం అవసరమైతే అదనపు నిధులను ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి తాను కృషి చేస్తానన్నారు. అయితే ఇటీవల జడ్చర్లలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో అధికార సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే తాను సహించేది లేదని, అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.

హృదయం ద్రవించిపోయింది

బుధవారం జడ్చర్లలోని 3వ వార్డులో విద్యుత్ షాక్ తో మరణించిన శ్రేయాన్స్ ను చూసి తన హృదయం ద్రవించి పోయిందని, జరిగిన సంఘటన తనను కలచివేసిందని అనిరుధ్ చెప్పారు. శ్రేయాన్స్ తండ్రి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొక్కా రాఘవేందర్ ను ఎమ్మెల్యే ఫోన్ లో పరామర్శించారు. బంగారు భవిస్యత్తు కలిగిన బాలుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం ఎంతో బాధాకరమని చెప్పారు. ఆ చిన్నారి బాలుడు మృతితో ఆ కుటుంబానికి ఏర్పడిన లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. ఈ ఆపద సమయంలో ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి శశికళారెడ్డి శ్రేయాన్స్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాఘవేందర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజి పాక్స్ చైర్మన్ బస్వరాజు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఝరాసంగం పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్ , బస్వరాజ్ తదితరులు.

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్యాలారం బసవరాజ్ ఝరాసంగం పట్టణంలోని నూతనంగా గృహప్రవేశం చేస్తున్న బసవరాజ్ గారికి గృహప్రవేశం శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వాడితోపాటు కాంగ్రెస్ నాయకులు కుతుబుద్దీన్ సత్తార్ భాయ్ ఎజాస్ బాబా బిజీ సందీప్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version