హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్,బిజెపి పార్టీకు చెందిన 50 మందికి పైగా బీఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంగళవారం రోజున బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు.వారిని బీఅర్ఎస్ పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని,వారికి ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాన్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలిచాయన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారిందన్నారు.ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని బీఅర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.సాధారణ ఎన్నికలలో బీఅర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా బీఅర్ఎస్ పార్టీ గెలుపును అపలేరన్నారు.పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు అల్లం సత్యనారాయణ,హరికాల శ్యామ్రావు,బయ్య రమేష్,బొజ్జo రాజు,దోబిల రాజు,బిజెపి నాయకులు బాణాల అనిల్,బోజ్జo రాము,రాజేష్,శ్రీకాంత్,తాల్ల రాంప్రసాద్,శ్రీకాంత్,రాసమల్ల రాజుకూమార్,పల్లెబోయిన సిద్దు,బండి ఉదయ్ కరణ్,సాయి కిరణ్,రఘుపతి, బోల్లికొండ మనోహర్,చిట్టిమల్ల లక్ష్మణ్,తాళ్ళ బన్నీ,బోజ్జం శ్రీరామ్,దుమాల బన్నీ,విజయ్ లతో పాటు 50 మందికిపైగా చేరారు.ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ,నాయకులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాలమండలంలోని చైన్ పాక గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ,ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రచారం చేశారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరెళ్ళ దేవేందర్ రెడ్డి చైన్ పాకబిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
గుండాల మండలం లో మావోయిస్ట్ కరపత్రాలు సంచలనం అయినాయి. ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయండి, సమస్యలు పరిష్కరించబడే వరకు ఎన్నికలను బహిష్కరించండి’ అని కోరుతూ మావోయిస్టు పార్టీ ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ పేరిట గుండాల మండలంలోని జామరగూడెం లో ఆంజనేయుని విగ్రహం వద్ద కరపత్రాలు దర్శనమిచ్చాయి.దాదాపుగా దశాబ్దం
కాలనంతరం మళ్లీ గుండాల మండలంలో మావోయిస్టు కరపత్రాలు వెలువడి కలకలం రేపుతోన్నాయి. ‘మహిళల్లారా.. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలను, నాయకులను నిలదీయండి అని. మీ సమస్యలను పరిష్కరించే వరకు ఎన్నికలను బహిష్కరించండి అని మహిళల మనుగడకు అడ్డంకిగా ఉన్న మనువాద పితృస్వామ్య భావజలాన్ని రూపుమాపుతారా? ….అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలను కల్పించగలరా?’ అని కరపత్రాల్లో రాసి ఉంది. ‘స్త్రీ-పురుష సమానత్వం కోసం కృషి చేయగలరా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాలయాల్లో నూటికి 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించగలరా? మహిళలపై ఏ విధమైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఉండవని సమాజంకై హామీని ఇవ్వగలరా? మా బతుకులను ఆగం చేస్తున్న మద్యంపై సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తారా? మహిళల ఎదుగుదలకు ఉచిత విద్యను హామీని ఇవ్వగలరా? వరకట్నాన్ని, వరకట్న వేధింపులను, హత్యలను రూపుమాపగలరా? మహిళా ప్రత్యేక చట్టాలను చిత్తశుద్దితో అమలు చేయగలరా? పరువు హత్యలను ఆపగలరా?’ అని మావోయిస్టు పార్టీ ప్రశ్నించింది.విద్యార్థులను కేజి టు పిజి ఉచిత విద్య కై ఉద్ఘాటించాలి అని.అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ,కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాల లను పునరుద్ధరించాలని ,పాఠశాలల్లో కాలిగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేయాలని కరపత్రం లో పొందు పరిచారు.రైతులు వారి సమస్యలను ,అలాగే ప్రతి కౌలు రైతుకి రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేయలని ఉంది.ప్రాజెక్టుల పేరిట పర్యావరణ కి జరిగే విధ్వంసాన్ని ఆపగలరా అని కరపత్రం లో ప్రశ్నించారు.
ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.
మీడియాతో మంత్రి హరీశ్ రావు..
రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశాడు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాము.
తమ భారీ పండుగ అమ్మకాలతో ఖమ్మం లో సంచలనం సృష్టిస్తోన్న రాయల్ ఓక్
ఖమ్మం, 31 అక్టోబర్ 2023:గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు సంప్రదాయాలకు నిలయంగా ఉన్న ఖమ్మం, ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అయిన రాయల్ ఓక్ కు నిలయంగా ఉంది. రాయల్ ఓక్ ఖమ్మం ఈ ప్రాంతంలో అత్యుత్తమ నాణ్యత గల ఫర్నిచర్‌కు చిరునామాగా మారింది, నూతన ప్రమాణాలను నెలకొల్పింది మరియు నగరంలో తనదైన ముద్ర వేసింది.
21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రాయల్ ఓక్ ఖమ్మం, ఈ ప్రాంతంలో అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్‌గా నిలుస్తుంది, అమెరికా, ఇటలీ, మలేషియా మరియు భారతదేశం నుండి ప్రీమియం ఫర్నిచర్ ఎంపిక అవకాశాలను ప్రదర్శిస్తుంది, మార్కెట్‌లో అత్యంత సరసమైన ధరలకు అందిస్తుంది.
విభిన్న బడ్జెట్‌లకు తగినట్లుగా ఈ స్టోర్ ఆకట్టుకునే ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది, వీటిలో :రిలాక్సేషన్, సౌకర్యం మరియు శైలి కోసం, సాటిలేని ధర రూ. 15,000 నుండి రిక్లైనర్లను అందిస్తున్నారు .
విలాసవంతమైన, సొగసైన బెడ్స్ కేవలం రూ. 19,000 నుండి అందుబాటులో ఉన్నాయి
అద్భుతమైన డైనింగ్ సెట్‌లు, విశేషమైన రీతిలో రూ. 14,000 నుండి ప్రారంభమవుతాయి.
అంతేకాకుండా, ఈ స్టోర్ అద్భుతమైన కుండీలు, వాల్ ఆర్ట్స్, గడియారాలు, అద్దాలు మరియు మరిన్నింటితో సహా విస్తృతమైన గృహాలంకరణ వస్తువులను అందజేస్తుంది, కార్పొరేట్ బహుమతి పరిష్కారాలతో సహా విలక్షణమైన మరియు ఆలోచనాత్మకమైన బహుమతి ఎంపికల కోసం ఇది ఒక గమ్యస్థానంగా మారుతుంది.
పండుగ ఉత్సాహం మధ్య, రాయల్ ఓక్ ఖమ్మం తమ అద్భుతమైన గ్రేట్ ఫెస్టివ్ సేల్‌ను ప్రకటించడం పట్ల సంతోషంగా ఉంది, వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 70% వరకు తగ్గింపును పొందే అవకాశాన్ని అందిస్తోంది. నాణ్యత, సరసమైన ధరలు మరియు అసాధారణమైన కస్టమర్ సేవకు పర్యాయపదంగా ఖమ్మం లో రాయల్ ఓక్ నిలుస్తుంది.
రాయల్ ఓక్ ఖమ్మం లో ఫర్నిచర్ ను ప్రత్యక్షంగా తిలకించడం కోసం ఈ రోజే సర్వే నెం 16 బైపాస్ రోడ్, భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎదురుగా, రాపర్తి నగర్, ఖమ్మం, తెలంగాణ 507002 లేదా సంప్రదించండి –
శ్రీ రామకృష్ణ, ఖమ్మం స్టోర్ మేనేజర్ & శ్రీ మహేష్, తెలంగాణ రాష్ట్రం ఏరియా మేనేజర్.
మంగపేట మండలం రాజుపేట గ్రామం రైస్ మిల్ దగ్గర ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అభ్యర్థి ప్రచారం షెడ్యూల్ వివరిస్తున్న మెట్టు శ్రీనివాస్ (టి ఎస్ ఆర్ డి సి) చైర్మన్ మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన 20 మంది పైగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ను వీడిన వారిని బీఆర్ఎస్ పార్టీలోకీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు దేశంలో వేరే రాష్టలలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీల నుండి ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహా లో ఏ ఒక్క సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదు ఇలా ఐతే మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా పతకాలను అమలు చేస్తారు అని ప్రజలు నమ్ముతారు?అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రలలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి చూపించారూ అని వారు హితోపలికారు బడే నాగజ్యోతి కి ఓటు వేసి నాగజ్యోతిని దీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, క్లస్టర్ ఇంచార్జ్ లు, వత్సవాయి శ్రీధర్ వర్మ, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,ఎడ్లపెల్లి నర్సింహారావు, కొమరం రాంమూర్తి,బడిశా నాగరమేష్ ఈ క్లస్టర్ లో ,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, మహిళలు,బూత్ ఇంచార్జీలు సోషల్ మీడియా ఇంచార్జులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బాబాజీ నగర్ కాలానికి చెందిన 150 కుటుంబాలు మన మంత్రి కేటీఆర్ గెలపుకి అన్ని కుటుంబాలు మంత్రి కేటీఆర్ కే నని 150 కుటుంబాలు అందరం కలిసి కేటీఆర్ కే మద్దతుగా ఓటు వేస్తామని తీర్మానం చేశారు అలాగే కేటీఆర్ నామినేషన్ ఖర్చులకు 1016 రూపాయలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానస రాజు మాట్లాడుతూ బాబాజీ కులస్తులు అందించిన స్ఫూర్తితో ముందు ముందు ప్రచారంలో ఉత్సాహంగా పనిచేస్తామని మంత్రి కేటీఆర్ కి లక్ష ఓట్ల మెజారిటీ కచ్చితంగా వస్తుందని వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం ఖాయమని తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన బాబాజీ కులస్తులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచ్ రవీందర్ గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ రంగు ప్రసాద్ బొగ్గు లింగం బిక్షపతి పార్టీ నాయకులు కార్యకర్తలు బాబాజీ కులస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన సిందుజ రెడ్డి.!!
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కొప్పుల ఈశ్వర ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని వెల్గటూర్ మండల బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కోమటిరెడ్డి.సిందుజ రెడ్డి ముక్కట్రావుపేట్ గ్రామంలోనీ మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆగండ్ల తిరుపతి.ఉప సర్పంచ్ కరిడే మల్లవ్వ. గ్రామ శాఖ అద్యక్షుడు కూస మధుకర్. ప్రధాన కార్యదదర్శి కరిడే శేఖర్ .కొప్పుల ప్రసాద్. మ్యాకల రాజేశ్వరి. బత్తినీ వసంత.మ్యాకల్ నాగమణి మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు..
పార్టీలో కష్టపడి అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామంలో వివిధ కారణాలతో మృతిచెందిన మృతుల వివరాలు:గొనెల నర్సమ్మ, మేడిపెళ్ళి ఐలమ్మ, మాదాసి రాజు, బొల్లం రాజు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.వారితో మాట్లాడుతు అధైర్య పడవద్దని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
> మిగతా పార్టీలు మా గ్రామంలో ప్రచారం చేయొద్దంటూ తీర్మానం..
> మా ఓట్లన్నీ బీఆర్ఎస్ కే..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
”మా ఊరిలో ఇతర పార్టీల వాళ్లు ప్రచారం చేసినా ప్రయోజనం లేదు, మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే, మా మద్దతు జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కే ” అంటూ కుర్వగడ్డపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కురువగడ్డపల్లి గ్రామస్తులంతా అభివృద్ధికి పట్టం కట్టేందుకు నడుం బిగించారు. గత 9 ఏళ్లలో తమ గ్రామంతో పాటు మండలం, నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనించిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అర్హులకు మంచిగా అందుతున్నాయని అన్నారు. అందుకే తామంతా బిఆర్ఎస్ పార్టీకే మరోసారి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇతర పార్టీల వారు తమ గ్రామంలో ప్రచారం చేసిన దండగే అని మంచి చేస్తున్న ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రజాపతి నీధులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో గడపగడపకు తెలంగాణ ఇచ్చిన అమీలపైప్రచారం చేస్తు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి పథకాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో గడపగడపకు అందాయని తెలియజేశారు అలాగేవారు మాట్లాడుతూ తెలంగాణ ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మూడవసారి ముఖ్యమంత్రి ఐ మన తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలో పదంలో ముందు ఉంచుతారని అలాగే మన మంత్రి కేటీ రామారావు మన నియోజకవర్గానికి దొరకడం అదృష్టంగా భావించాలని ఇప్పటివరకు ఎలాంటి నాయకుడు చేయాలని అభివృద్ధి చేసి నిరూపించాడని వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో పైగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అది మన బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు నామినేట్ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు మాజీ సర్పంచులు జిల్లా నాయకులు మండల నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచార నిర్వహించారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నేరుగా ప్రజలను కలుస్తూ ఓటు అభ్యర్థిచిన గండ్ర వెంకట రమణా రెడ్డి వేశాలపల్లి ప్రధాన కూడలి వద్ద ఏర్పటు చేసిన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ ఒక కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించి పూర్తి సహకారం అందిస్తాం అంటున్న తరుణం చాలా సంతోషం కలిగింది. 2009 కి ముందు అభివృద్ధి కి దూరంగా ఉన్న భూపాలపల్లి ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి నేను ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత భూపాలపల్లి పరిసర గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది.రోడ్ల విస్తరణ,సేడ్ డ్రైన్ ల నిర్మాణలు చేపట్టి స్థానిక ప్రజాల జీవన ప్రమాణాలు పెంచడం జరిగింది.నేను రెండవ సారి ఎమ్మెల్యే గా గెలిచిన ప్రకృతి సహకరించక పోయిన మొదటి రెండు ఏళ్ళు కరోన లో అభివృద్ధి నామమాత్రంగా ఉన్న గడిచిన మూడు ఏళ్లలో ప్రభుత్వ సహకారంతో వేశాలపల్లి వార్డును ప్రత్యేక దృష్టితో సెంటర్ లైటింగ్ సిస్టం తో రోడ్డు ను నిర్మించుకున్నాం. వేశాలపల్లి లో అత్యధికంగా ST సోదరులు ఎక్కవగా ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచించాలి 60ఏళ్ల పాలనలో 6శాతం గా ఉన్న రిజర్వేషన్లను కేంద్ర సహజారించక పోయిన అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం తెచ్చి 10శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం బి ఆర్ ఎస్ అని గుర్తు పెట్టుకోవాలి. వేశాలపల్లి ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా రెండు పడకల ఇళ్లను నిర్మించుకున్నాం. ముఖ్యమంత్రి రానున్న 5ఏళ్లకు సరిపడా మేనిఫెస్టో విడుదల చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారో మాట ఇచ్చారు అంటే తప్పకుండా నెరవేర్చుతారు. మరొక్క సారి అవకాశం కల్పించండి ఆగి ఉన్న అభివృద్ధి పనులను, రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను,గృహలక్ష్మీ లను,బీసీ బంధు లను కొనసాగించుకుందాంఅని తెలిపారు. నేను కుట్రలకు పోను, కుతంత్రాలు చేయను ఒక్కసారి వేటు వేస్తే 5ఏళ్ళు పాలేరు లెక్క పనిచేస్తా తప్ప పాలకుడిగా ఏ రోజు అనుకోను. ఎన్నికల అనంతరం కేసీఆర్ చెప్పిన మేనిఫెస్టోలోని ప్రతి పథకాలను అమలు చేస్తాం 10వేలు ఉన్న రైతు బంధు 16000 లకు పెంచుతుంది కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం క్రింద ఎలాంటి మరణం సభవించిన రూ.5లక్షల భీమా సౌకర్యం కల్పిస్తాం.. భీమా పథకం క్రింద రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉన్న 93లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. అన్నపూర్ణ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తాం.. 1200 ఉన్న గ్యాస్ ధరలను రేపు అధికారంలోకి రాగానే 400కె వంట గ్యాస్ అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇంటి జాగా లేని నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలను సమకూర్చడం జరుగుతుంది. కల్పిస్తుంద 2016 ఉన్న ఆసరా పెన్షన్ లను 5016, 3016 ఉన్న దివ్యంగులా పెన్షన్ ను 6000 అందిస్తారు. కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు 15లక్షల వరకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తుంది. సౌభాగ్య లక్ష్మీ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన ఒంటరి మహిళలకు ప్రతి నెల 3000 లను అందిస్తుందని తెలిపారు. 11వ వార్డు కౌన్సిలర్ రజిత జమ్మూలాల్ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్ధు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ రమేష్ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రాజు వార్డు అధ్యక్షుడు రాజు పద్మ
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామ మల్లన్నపల్లికి చెందిన దుర్గం పూజ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారియొక్క కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న చోప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సతీమణి సుంకే దీవెన కుటుంబ సభ్యులకు యాభై కిలోల బియ్యం అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు జాడి లస్మయ్య, సింగల్ విండో డైరెక్టర్ దుర్గం పద్మ, బిఆర్ఎస్వై చొప్పదండి నియోజకవర్గం ఉపాధ్యక్షులు భక్తు విజయ్ కుమార్, బిఆర్ఎస్వై చొప్పదండి మండల ప్రధాన కార్యదర్శి బండారి సంపత్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భక్తు తిరుపతి, భక్తు లక్ష్మయ్య, భక్తు సాగర్, బండారి మల్లయ్య, భక్తు లచ్చయ్య,భక్తు శంకర్ నారాయణ, గోళ్ళే రాజ్యలక్ష్మి, పైడి మధునమ్మ, తదితరులు పాల్గొన్నారు.
*ముదిగంటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో…. విస్తృత సార్వత్రిక ఎన్నికల ప్రచారం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో అనంతపల్లి గుండన్నపల్లి గ్రామాల్లో మంగళవారం బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగిని పల్లి రవీందర్రావు, ముదుగంటి సురేందర్ రెడ్డి, చిన్నాడి అమిత్ రావు ఆధ్వర్యంలో, బి ఆర్ ఎస్ పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ బి ఆర్ ఎస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడప బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను చొప్పదండి నియోజకవర్గ రెండవసారి ఎమ్మెల్యేగా సుంకే రవిశంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, స్థానిక సర్పంచులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.
గణపురం గ్రామంలో మంగళవారం మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గణపురం మండల బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పత్తేమ్ శివ తన అనుచరుల పాలకుర్తి భరత్,కెంబార్తి సదయ్య, ఉప్పు సత్తయ్య గార్లతో కలిసి భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు గణపురం సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ గార్ల సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతు జరగబోయే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి గారి గెలుపుకు కృషి చేస్తూ,గెలుపులో మేము కూడ బాగామావుతాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, Bc సెల్ మండల అధ్యక్షులు పోతర్ల మల్లికార్జున్ యాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, నాయకులు అంపోజ్వల రవీందర్ రెడ్డి, మోటపోతుల చందర్, కొవ్వూరి శ్రీను, సలువది సురేష్,గాజర్ల చింటూ, మార్క సాయి,దూడపాక శ్రీనివాస్,సోషల్ కన్వినర్ హఫీజ్ పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
సర్పంచ్ మోటే ధర్మరావు
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ అక్టోబర్ 31
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ ధర్మారావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మన్న మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో రైతుబంధు సంవత్సరానికి 16000, అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం lతో పాటు ఇల్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, ఆసరా పింఛను 5,016, దివ్యాంగులకు 6000 రూపాయలు, సౌభాగ్య లక్ష్మి అర్హులైన పేద మహిళ కు జీవనో భృతి కింద 3000 రూపాయలు, అసైన్డ్ భూములపై యజమాన్య హక్కు కల్పించుట, అనాధలైన పిల్లలకు ప్రత్యేక పాలసీ, ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పథకాలు రావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు , ఉప సర్పంచ్ సరోజన బాపురావు, భారత రాష్ట్ర సమితి గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముడుపు రవీందర్, భారత రాష్ట్ర సమితి మండల నాయకులు పడిదల జగ్గారావు, సంపెల్లి వెంకన్న, భారత రాష్ట్ర సమితి యూత్ మండల అధ్యక్షులు శివాజీ, దేవునూరి కుమార్, చెక్క శ్రీధర్, మంగళపల్లి శ్రీనివాస్, బండారి రామస్వామి, శనగరపు ఎర్ర భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
`పక్కింట్లో బిడ్డ పుడితే ఈ ఇంట్లో కుళ్ల కుట్టుకున్నట్లుంది?
`కర్ణాటకలో గెలిచారని తెలంగాణ లో కలగంటున్నారు?
`తెలంగాణ లో కాంగ్రెస్ ను నమ్మే వాళ్లే లేరంటున్న రాజ్యసభ సభ్యుడు, కొత్తగూడెం, ఇల్లందు బిఆర్‌ఎస్ ఇన్ ఛార్జ్
వద్దిరాజు రవిచంద్ర, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ప్రచార సరళి, కాంగ్రెస్ పరిస్థితి ఆయన మాటల్లోనే…
`గోబెల్స్ ప్రచారం తో గట్టెక్కుతామనుకుంటున్నారు?
`పగటి కలలుగంటున్నారు?
`ప్రచారం ఎంత చేసినా ప్రజలు నమ్మడం లేదని ప్రస్టేషన్ లో కాంగ్రెస్?
`హత్యా రాజకీయాలు తెలంగాణ లో చెల్లవు?
`కాంగ్రెస్ నమ్ముకున్న గుండా గిరికి తెలంగాణ లో తావు లేదు?
`గాంధీగిరితో తెలంగాణ తెచ్చిన కేసిఆర్ వున్నాడు?
`కర్ఫ్యూ ల కాంగ్రెస్ ను ప్రజలు ఎప్పుడూ నమ్మరు?
`స్కామ్ ల కాంగ్రెస్ పనెప్పుడో అయిపోయింది?
`టిక్కెట్ల అమ్మకాల కోసమే కాంగ్రెస్ వుంది!
`టిక్కెట్ల దగ్గరే మోసాలు చేసిన వాళ్లు ప్రజలను వంచించరా?
`కాంగ్రెస్ కు కావాల్సింది అధికారం.
`బీఆర్‌ఎస్ కు కావాల్సింది ప్రజా సంక్షేమం.
`అన్ని రంగాలలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం.
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో కాంగ్రెస్‌కు బలం లేదు. బలంగం లేదు. ప్రజల ఆదరణ లేదు. అసలు ప్రజల్లోనే కాంగ్రెస్ లేదు. చెప్పుకోవడానికి లీడర్లు లేరు. ప్రజలకు విశ్వాసం కల్గించే వారేలేరు. ఏ జిల్లాలనూ పార్టీకి యంత్రాంగం లేదు. ఓటుకు నోటుతో తెలంగాణ అసి ్దత్వాన్ని దెబ్బతీయాలని చూసిన రేవంత్‌ను చూసి జనం ఓట్లేస్తారనుకుంటే పొరపాటు. అసలు రేవంత్‌రెడ్డిని సొంత నియోజకవర్గ ప్రజలే ఓడిరచారు. ఈసారి కూడా గెలిచే పరిస్దితి లేదు. ఇష్టాను సారం టిక్కెట్లను అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాయకులు తిరుగుబాట్లు చూస్తూనే వున్నాం. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటున్నట్లే రేపు రాష్ట్రాన్ని అమ్ముకుంటాడని ఆ పార్టీకి చెందని నేతలే రేవంత్‌ను తూర్పాపడుతున్నారు. ఇక ఆ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే. పొరపాటును కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. పదవుల కోసం నిత్యం కొట్లాడుకుంటారు. తెలంగాణను గాలికి వదిలేస్తారు. గతం మన కళ్లముందే వుంది. అంతే కాకుండా కాంగ్రెస్ అంటే హత్యా రాజకీయాలు. తెలంగాణలో ఎప్పుడూ ఆ సంస్కృతి లేదు. అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైంది. కాని రేవంత్ నాయకత్వం వాటిని కూడా నమ్ముకొని రాజకీయాలు చేయాలనిచూస్తోంది. నిత్యం అబద్దాలు, అసత్యాలే కాదు దుర్మార్గాలు కూడా నేర్చింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న సమయంలో హైదరాబాద్‌లో అల్లర్లు, విద్వంసాలు. ఎప్పుడు కర్ప్యూ విధిస్తారో అర్ధం కాని పరిస్ధితుల్లో బిక్కుబిక్కు మంటూ ప్రజలు బతికిన రోజులు అనేకం వున్నాయి. కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అదికారంలో రావాలని మళ్లీ పాత రోజులు తీసుకురావాలని చూస్తోంది. ప్రజలు బాగా గమనించాలి. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా, గుండాలు,రైడీలు రాజ్యమేలేవారు. గుండా గిరితోనే రాజకీయం సాగించేవారు. కాని తెలంగాణనే గాంధీ గిరి తో సాదించిన నాయకుడు కేసిఆర్. ఆయన పాలనలో తెలంగాణ శాంతియుతంగా వుంది. సంతోషంగా వుంది. ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా పదేళ్లుగా ధైర్యంగా వుంటున్నారు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా వుంది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోంది. కుట్రలు చేస్తోంది. అసలు కాంగ్రెస్ ఏం చూసుకొని ఇంతలా మిడిసిపడుతోందో హత్యా రాజకీయాలను చూస్తే అర్ధమౌతోంది. . పక్కింట్లో బిడ్డ పుడితే ఈ ఇంట్లో కుళ్ల కుట్టించుకున్నట్లు కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు, తెలంగాణలో ఆదరణకు అసలు సంబంధమేలేదు. చూస్తుండండి. గతంలో కన్నా ఎక్కువ సీట్లతో బిఆర్‌ఎస్‌గెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు ఈసారి బిఆర్‌ఎస్ సాధిస్తుంది. కాంగ్రెస్‌ను నమ్మేవారు లేరంటున్న రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నేటి ధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో ప్రచార విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్ కలలు నెరవేరేవి కాదు. అసలు కాంగ్రెస్ నేతలకు తెలంగాణ మీద అవగాహన లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియదు. అసలు ఎకరానికి ఎంత నీరు కావాలో తెలియని వాళ్లు పాలకులైతే రైతన్న నిండా మునిగిపోతాడు. తెలంగాణలో ఎన్ని రకాల భూములున్నాయో.. వాటికి ఎంతనీరు అవసరమో? అన్నది కూడ తెలియకుండా మూడు గంటల కరంటు చాలు అని చెప్పిన రేవంత్ రెడ్డిని తెలంగాణ రైతు నమ్మే పరిస్ధితే లేదు. అంతే కాదు ఇటీవలే కర్నాకటకు చెందిన నాయకుడు డికే. శివకుమార్ స్పష్టంగా కర్నాకటలో కేవలం ఐదు గంటల కరంటు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. అది తెలంగాణ ప్రజలు విన్నారు. తెలంగాణ రైతులకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరంటు అందుతోంది. పొరుగు రాష్ట్రంలో ఐదు గంటల కరంటు ఇస్తున్నకాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకే విధమైన ఆచరణ దేశమంతటా చేపడుతుంది. అంటే పొరుగున కర్నాటకలో ఎంత కరంటు ఇస్తున్నారో అంత కూడా ఇవ్వకపోవచ్చు. ఎన్నికల సమయంలో కర్నాకటలో ఏడు గంటల కరంటు ఇస్తున్నామని చెప్పి, ఇప్పుడు ఐదు గంటలే ఇస్తున్నామని అంటున్నారంటే వాగ్ధానం గంగలో కలిపినట్లు కాదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార అస్త్రాలన్నీ బిఆర్‌ఎస్ కాపీలే. ఒక్కటైనా కొత్త పధకం వుందా? కాని బిఆర్‌ఎస్ పధకాలు దేశంలో ఎక్కడ లేవు. రైతు బంధు అనేది దేశానికే ఆదర్శం. మరి కర్నాకటలో రైతు బంధు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదు.
రాజస్ధాన్‌లో,చత్తీస్‌ఘడ్‌లో ఎందుకు అమలు చేయడం లేదు. ఇక్కడ మాత్రం పేరు మార్చి ఇస్తామని ప్రగల్భాలు పలుకుతుంది. కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇస్తామంటూ కాంగ్రెస్ వారిని మోసం చేసే కుట్ర చేస్తోంది. ఎట్టి పరిస్ధితుల్లో అవకాశం లేదు. అలాంటి అవకాశం వుంటే ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పుడో అమలు చేసేవారు. కాని భూ యజమానులకు, కౌలు రైతులకు మధ్య తగాదా పెట్టి రాజకీయం చేయాలని కేసిఆర్ అనుకోలేదు. కాంగ్రెస్ వారి మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేయాలనుకుంటుంది. ఇక కళ్యాణ లక్ష్మి అనేది కూడా దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన తెలంగాణలోనే వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలోనే అత్యుత్తుమ పథకాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌కు స్ధానం అంటే గాలిలో దీపం లాంటిదే.. కాంగ్రెస్ నేతలు కళ్లుండి కబోదులుగా మాట్లాడుతున్నారు.
కొత్తగా కాళేశ్వం ప్రాజెక్టు గురించి ప్రజలను మాయ చేసే మాటలు మాట్లాడి నాలుగు ఓట్లు పొందాలని చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఐదేళ్లవుంది. ఈ ఐదేళ్లలో అనేక వరదలను తట్టుకొని నిలబడిరది. అయినా ప్రాజెక్టు నిర్మాణ సంస్ధనే నిర్వహణ బాధ్యతతో కూడి వుంది. ప్రాజెక్టు విషయంలో ఏం పొరపాటు జరిగినా బాధ్యత ఆ కంపనీదే. అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న పగులు అన్నది పెద్ద సమస్య కాదు. దాన్ని ఎలా మరమ్మత్తు చేయాలో ఆ కంపనీ చూసుకుంటుంది. గతంలోనూ పంపులు మునిగిపోయాయంటూ గగ్గోలు పెట్టారు. మళ్లీ కంపనీ వాటిని పూర్తి స్ధాయిలో వినియోగంలోకి తెచ్చారు. ఇది కూడా అంతే…తెలంగాణను డెబ్బై సంవత్సరాలు పాలించి, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా, తెలంగాణను నీళ్లివ్వకుండా రైతును అరిగోస పెట్టిన కాంగ్రెస్‌కు మాట్లాడే నైతికత అసలే లేదు. నల్లగొండ లాంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు మంచినీళ్లు అందించమంటే కూడా అందించలేని దౌర్బాగ్యమైన కాంగ్రెస్ ఏనాడు తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడలేదు. తెలంగాణ చెరువులు చెదిరిపోతున్నా పట్టించుకోలేదు. తెలంగాన పల్లెలు మోడువారుతున్నా చూసి చలించలేదు. పల్లెలన్నీ వలసబాట పట్టి ఊళ్లన్నీ ఖాళీ అవుతున్నా అయ్యో అనలేదు. పైగా తొండలు గుడ్లు పెట్టవంటూ ఎద్దేవా చేసిన వారితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన నాయకులు కాంగ్రెస్ వాళ్లు. అలాంటి నాయకులకు తెలంగాణ ప్రయోజనాలు ఏనాడు పట్టలేదు. కాంగ్రెస్‌కు కావాల్సింది అధికారం. పెత్తనం. ప్రజల గురించి ఏనాడు ఆలోచించలేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నసమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయికూడా ఇవ్వమంటే మాట్లాడలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు. అలాంటి నాయకులు ఇప్పుడు నీతి వాఖ్యాలు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. కాంగ్రెస్ అంటే అంటేనే స్కామ్‌లు. దేశంలో స్కామ్‌లన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. అందుకే ప్రజలు పదేళ్లుగా పక్కనపెట్టేశారు. జాతీయస్ధాయిలో ఆ పార్టీకి 45 సీట్లు వచ్చాయంటే ఎంతటి పాతాలని పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అయినా వారిలో మార్పు రాలేదు. ప్రజలను ఎలా వంచించాలని చూసే కాంగ్రెస్‌కు తెలంగాణ లో ఆదరణ అన్నది జరిగేది కాదు. ఆ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్సే.. హాట్రిక్ కొట్టుడే…
శాయంపేట మండలంలో ఉన్న కల్లుగీత కార్మికుల సొసైటీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద కల్లుగీత కార్మికులు సమావేశం అయి నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. శాయంపేట మండల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షునిగా పెరుమాండ్ల చేరాలు గౌడ్ ఎన్నుకోవడం జరిగినది. అధ్యక్షునిగా తడుక కుమారస్వామి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.ఉపాధ్యక్షునిగా బండి రాములు గౌడ్, న్యాతి గోవర్ధన్ గౌడ్,ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీధర్ గౌడ్, సహాయ కార్యదర్శి గట్టు రమేష్ గౌడ్,తాటికొండ శ్రీకాంత్ గౌడ్,బొడిగ కొమురయ్య గౌడ్ కార్యనిర్వాహక కార్యదర్శి ముక్కెర మొగిలి గౌడ్,తడుక శ్రీనివాస్ గౌడ్,కూనూరు రాజు గౌడ్ ,సలహాదారులుగా బొనగాని రాజేష్ గౌడ్ మాచర్ల బాలకిషన్ గౌడ్ కోశాధికారి బండి చేరాలు గౌడ్ వలుగుల రమేష్ గౌడ్, తడుక సదానందం గౌడ్ 11మంది సభ్యులతో మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా మండల కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు తనను అధ్యక్షునిగా ఎంపిక చేసిన మండలంలోని అన్ని సంఘాల సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.