కాంగ్రెస్‌ ప్రచారం పాలపొంగు!?

https://epaper.netidhatri.com/

`బలం లేదు…పార్టీ బలపడిరది లేదు!

`పక్కింట్లో బిడ్డ పుడితే ఈ ఇంట్లో కుళ్ల కుట్టుకున్నట్లుంది?

`కర్ణాటకలో గెలిచారని తెలంగాణ లో కలగంటున్నారు?

`తెలంగాణ లో కాంగ్రెస్‌ ను నమ్మే వాళ్లే లేరంటున్న రాజ్యసభ సభ్యుడు, కొత్తగూడెం, ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇన్‌ ఛార్జ్‌

వద్దిరాజు రవిచంద్ర, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ప్రచార సరళి, కాంగ్రెస్‌ పరిస్థితి ఆయన మాటల్లోనే…

`గోబెల్స్‌ ప్రచారం తో గట్టెక్కుతామనుకుంటున్నారు?

`పగటి కలలుగంటున్నారు?

`ప్రచారం ఎంత చేసినా ప్రజలు నమ్మడం లేదని ప్రస్టేషన్‌ లో కాంగ్రెస్‌?

`హత్యా రాజకీయాలు తెలంగాణ లో చెల్లవు?

`కాంగ్రెస్‌ నమ్ముకున్న గుండా గిరికి తెలంగాణ లో తావు లేదు?

`గాంధీగిరితో తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ వున్నాడు?

`కర్ఫ్యూ ల కాంగ్రెస్‌ ను ప్రజలు ఎప్పుడూ నమ్మరు?

`స్కామ్‌ ల కాంగ్రెస్‌ పనెప్పుడో అయిపోయింది?

`టిక్కెట్ల అమ్మకాల కోసమే కాంగ్రెస్‌ వుంది!

`టిక్కెట్ల దగ్గరే మోసాలు చేసిన వాళ్లు ప్రజలను వంచించరా?

`కాంగ్రెస్‌ కు కావాల్సింది అధికారం.

`బీఆర్‌ఎస్‌ కు కావాల్సింది ప్రజా సంక్షేమం.

`అన్ని రంగాలలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం.

హైదరబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో కాంగ్రెస్‌కు బలం లేదు. బలంగం లేదు. ప్రజల ఆదరణ లేదు. అసలు ప్రజల్లోనే కాంగ్రెస్‌ లేదు. చెప్పుకోవడానికి లీడర్లు లేరు. ప్రజలకు విశ్వాసం కల్గించే వారేలేరు. ఏ జిల్లాలనూ పార్టీకి యంత్రాంగం లేదు. ఓటుకు నోటుతో తెలంగాణ అసి ్దత్వాన్ని దెబ్బతీయాలని చూసిన రేవంత్‌ను చూసి జనం ఓట్లేస్తారనుకుంటే పొరపాటు. అసలు రేవంత్‌రెడ్డిని సొంత నియోజకవర్గ ప్రజలే ఓడిరచారు. ఈసారి కూడా గెలిచే పరిస్దితి లేదు. ఇష్టాను సారం టిక్కెట్లను అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాయకులు తిరుగుబాట్లు చూస్తూనే వున్నాం. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటున్నట్లే రేపు రాష్ట్రాన్ని అమ్ముకుంటాడని ఆ పార్టీకి చెందని నేతలే రేవంత్‌ను తూర్పాపడుతున్నారు. ఇక ఆ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే. పొరపాటును కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు. పదవుల కోసం నిత్యం కొట్లాడుకుంటారు. తెలంగాణను గాలికి వదిలేస్తారు. గతం మన కళ్లముందే వుంది. అంతే కాకుండా కాంగ్రెస్‌ అంటే హత్యా రాజకీయాలు. తెలంగాణలో ఎప్పుడూ ఆ సంస్కృతి లేదు. అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైంది. కాని రేవంత్‌ నాయకత్వం వాటిని కూడా నమ్ముకొని రాజకీయాలు చేయాలనిచూస్తోంది. నిత్యం అబద్దాలు, అసత్యాలే కాదు దుర్మార్గాలు కూడా నేర్చింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్న సమయంలో హైదరాబాద్‌లో అల్లర్లు, విద్వంసాలు. ఎప్పుడు కర్ప్యూ విధిస్తారో అర్ధం కాని పరిస్ధితుల్లో బిక్కుబిక్కు మంటూ ప్రజలు బతికిన రోజులు అనేకం వున్నాయి. కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా అదికారంలో రావాలని మళ్లీ పాత రోజులు తీసుకురావాలని చూస్తోంది. ప్రజలు బాగా గమనించాలి. కాంగ్రెస్‌ హయాంలో ఎక్కడ చూసినా, గుండాలు,రైడీలు రాజ్యమేలేవారు. గుండా గిరితోనే రాజకీయం సాగించేవారు. కాని తెలంగాణనే గాంధీ గిరి తో సాదించిన నాయకుడు కేసిఆర్‌. ఆయన పాలనలో తెలంగాణ శాంతియుతంగా వుంది. సంతోషంగా వుంది. ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా పదేళ్లుగా ధైర్యంగా వుంటున్నారు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా వుంది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ కుయుక్తులు పన్నుతోంది. కుట్రలు చేస్తోంది. అసలు కాంగ్రెస్‌ ఏం చూసుకొని ఇంతలా మిడిసిపడుతోందో హత్యా రాజకీయాలను చూస్తే అర్ధమౌతోంది. . పక్కింట్లో బిడ్డ పుడితే ఈ ఇంట్లో కుళ్ల కుట్టించుకున్నట్లు కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపుకు, తెలంగాణలో ఆదరణకు అసలు సంబంధమేలేదు. చూస్తుండండి. గతంలో కన్నా ఎక్కువ సీట్లతో బిఆర్‌ఎస్‌గెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు ఈసారి బిఆర్‌ఎస్‌ సాధిస్తుంది. కాంగ్రెస్‌ను నమ్మేవారు లేరంటున్న రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో ప్రచార విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

కాంగ్రెస్‌ కలలు నెరవేరేవి కాదు.
అసలు కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ మీద అవగాహన లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియదు. అసలు ఎకరానికి ఎంత నీరు కావాలో తెలియని వాళ్లు పాలకులైతే రైతన్న నిండా మునిగిపోతాడు. తెలంగాణలో ఎన్ని రకాల భూములున్నాయో.. వాటికి ఎంతనీరు అవసరమో? అన్నది కూడ తెలియకుండా మూడు గంటల కరంటు చాలు అని చెప్పిన రేవంత్‌ రెడ్డిని తెలంగాణ రైతు నమ్మే పరిస్ధితే లేదు. అంతే కాదు ఇటీవలే కర్నాకటకు చెందిన నాయకుడు డికే. శివకుమార్‌ స్పష్టంగా కర్నాకటలో కేవలం ఐదు గంటల కరంటు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. అది తెలంగాణ ప్రజలు విన్నారు. తెలంగాణ రైతులకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరంటు అందుతోంది. పొరుగు రాష్ట్రంలో ఐదు గంటల కరంటు ఇస్తున్నకాంగ్రెస్‌ పార్టీ మొత్తం ఒకే విధమైన ఆచరణ దేశమంతటా చేపడుతుంది. అంటే పొరుగున కర్నాటకలో ఎంత కరంటు ఇస్తున్నారో అంత కూడా ఇవ్వకపోవచ్చు. ఎన్నికల సమయంలో కర్నాకటలో ఏడు గంటల కరంటు ఇస్తున్నామని చెప్పి, ఇప్పుడు ఐదు గంటలే ఇస్తున్నామని అంటున్నారంటే వాగ్ధానం గంగలో కలిపినట్లు కాదా? తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రచార అస్త్రాలన్నీ బిఆర్‌ఎస్‌ కాపీలే. ఒక్కటైనా కొత్త పధకం వుందా? కాని బిఆర్‌ఎస్‌ పధకాలు దేశంలో ఎక్కడ లేవు. రైతు బంధు అనేది దేశానికే ఆదర్శం. మరి కర్నాకటలో రైతు బంధు కాంగ్రెస్‌ ఎందుకు ఇవ్వడం లేదు.

రాజస్ధాన్‌లో,చత్తీస్‌ఘడ్‌లో ఎందుకు అమలు చేయడం లేదు. ఇక్కడ మాత్రం పేరు మార్చి ఇస్తామని ప్రగల్భాలు పలుకుతుంది. కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇస్తామంటూ కాంగ్రెస్‌ వారిని మోసం చేసే కుట్ర చేస్తోంది. ఎట్టి పరిస్ధితుల్లో అవకాశం లేదు. అలాంటి అవకాశం వుంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో అమలు చేసేవారు. కాని భూ యజమానులకు, కౌలు రైతులకు మధ్య తగాదా పెట్టి రాజకీయం చేయాలని కేసిఆర్‌ అనుకోలేదు. కాంగ్రెస్‌ వారి మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేయాలనుకుంటుంది. ఇక కళ్యాణ లక్ష్మి అనేది కూడా దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన తెలంగాణలోనే వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలోనే అత్యుత్తుమ పథకాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌కు స్ధానం అంటే గాలిలో దీపం లాంటిదే..
కాంగ్రెస్‌ నేతలు కళ్లుండి కబోదులుగా మాట్లాడుతున్నారు.

కొత్తగా కాళేశ్వం ప్రాజెక్టు గురించి ప్రజలను మాయ చేసే మాటలు మాట్లాడి నాలుగు ఓట్లు పొందాలని చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఐదేళ్లవుంది. ఈ ఐదేళ్లలో అనేక వరదలను తట్టుకొని నిలబడిరది. అయినా ప్రాజెక్టు నిర్మాణ సంస్ధనే నిర్వహణ బాధ్యతతో కూడి వుంది. ప్రాజెక్టు విషయంలో ఏం పొరపాటు జరిగినా బాధ్యత ఆ కంపనీదే. అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న పగులు అన్నది పెద్ద సమస్య కాదు. దాన్ని ఎలా మరమ్మత్తు చేయాలో ఆ కంపనీ చూసుకుంటుంది. గతంలోనూ పంపులు మునిగిపోయాయంటూ గగ్గోలు పెట్టారు. మళ్లీ కంపనీ వాటిని పూర్తి స్ధాయిలో వినియోగంలోకి తెచ్చారు. ఇది కూడా అంతే…తెలంగాణను డెబ్బై సంవత్సరాలు పాలించి, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా, తెలంగాణను నీళ్లివ్వకుండా రైతును అరిగోస పెట్టిన కాంగ్రెస్‌కు మాట్లాడే నైతికత అసలే లేదు. నల్లగొండ లాంటి ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు మంచినీళ్లు అందించమంటే కూడా అందించలేని దౌర్బాగ్యమైన కాంగ్రెస్‌ ఏనాడు తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడలేదు. తెలంగాణ చెరువులు చెదిరిపోతున్నా పట్టించుకోలేదు. తెలంగాన పల్లెలు మోడువారుతున్నా చూసి చలించలేదు. పల్లెలన్నీ వలసబాట పట్టి ఊళ్లన్నీ ఖాళీ అవుతున్నా అయ్యో అనలేదు. పైగా తొండలు గుడ్లు పెట్టవంటూ ఎద్దేవా చేసిన వారితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన నాయకులు కాంగ్రెస్‌ వాళ్లు. అలాంటి నాయకులకు తెలంగాణ ప్రయోజనాలు ఏనాడు పట్టలేదు. కాంగ్రెస్‌కు కావాల్సింది అధికారం. పెత్తనం. ప్రజల గురించి ఏనాడు ఆలోచించలేదు. అంతెందుకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నసమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయికూడా ఇవ్వమంటే మాట్లాడలేని దద్దమ్మలు కాంగ్రెస్‌ నాయకులు. అలాంటి నాయకులు ఇప్పుడు నీతి వాఖ్యాలు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. కాంగ్రెస్‌ అంటే అంటేనే స్కామ్‌లు. దేశంలో స్కామ్‌లన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయి. అందుకే ప్రజలు పదేళ్లుగా పక్కనపెట్టేశారు. జాతీయస్ధాయిలో ఆ పార్టీకి 45 సీట్లు వచ్చాయంటే ఎంతటి పాతాలని పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అయినా వారిలో మార్పు రాలేదు. ప్రజలను ఎలా వంచించాలని చూసే కాంగ్రెస్‌కు తెలంగాణ లో ఆదరణ అన్నది జరిగేది కాదు. ఆ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్సే.. హాట్రిక్‌ కొట్టుడే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *