పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ మున్సిపాలిటీ పరిధిలో వివిధ కారణాల వలన మరణించిన ఒంటేరు సారమ్మ, కోయిల సుమలత,మాధాసి భార్గవి ల పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ కమిటీ నాయకులు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్,ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రవణ్,వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,మాజీ ఎంపిపి ఒంటేరు రామ్మూర్తి,జిల్లా సేవదళ్ బొచ్చు చందర్,ఎస్సి సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,సీనియర్ నాయకులు గోనాధ్,బొచ్చు కట్టయ్య,బొచ్చు బాబు,చంగల్,గూడెల్లి సదన్ కుమార్,ఒంటేరు రవికుమార్,గొట్టె రమేష్,బొచ్చు అనంత్,సంపత్,భిక్షపతి మరియు తదితరులు పాల్గొన్నారు.
Category: తాజా వార్తలు
రైతుల మోటార్లు దొంగిలిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు
రాత్రి పగలు రైతులకు తప్పని తిప్పలు
అధికారులు మాకు న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని జైపూర్,నర్వ, దుబ్బపల్లి, వెంకట్రావుపల్లి, రసూల్ పల్లి, గ్రామంలో రైతులు పొలాల దగ్గర ఏర్పాటు చేసుకున్న మోటార్లు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తున్నారు.
గత కొన్ని రోజులుగా జైపూర్ మండలంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు పొలాల దగ్గర ఇంటి స్థలం దగ్గర వేసుకున్న బోర్లను మోటార్ పైపుల తో సహా దొంగిలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని బాధిత రైతులు, వాళ్ల గోడును జైపూర్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు విన్నవించుకున్నారు. బాధిత రైతులు మాకు తగిన న్యాయం చేయాలని పోలీస్ అధికారులే మాకు దిక్కు అని రైతులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకెవరికి జరగకూడదని పోగొట్టుకున్న తమ మోటార్లను మాకు అప్పగించాలని త్వరలోనే నిందితులను పట్టుకొని మాకు తగిన న్యాయం చేయాలని జైపూర్ సాయి చరణ్, సమ్మయ్య నర్వ, భీమేష్ దుబ్బ పల్లి బాధిత రైతులు వేడుకుంటున్నారు
ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
హసన్ పర్తి: నేటిధాత్రి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గం ప్రత్యెక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణలో భాగంగా శనివారం వర్ధన్నపేట నియోజక వర్గంలోని హసన్ పర్తి మండలం గోపాలపురం జవహర్ కాలనీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అశ్విని తనాజి వాఖేడే తో కలసి ఓటర్ల నమోదు రిజిస్టర్లను పరిశీలించి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
22వ తేదిని సెలవు దినంగా ప్రకటించాలి
కట్టగాని శ్రీకాంత్ గౌడ్
బిజీవైఎం జిల్లా అధికార ప్రతినిధి
పరకాల నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన సెలవు రోజుగా ప్రకటించాలని భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కట్టగాని శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచ ప్రజలందరు ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు దినం గా ప్రకటించక పోవడం సిగ్గు చేటుఅని వెంటనే సెలవు దినంగా ప్రకటించాలి దైవ కార్యక్రమంను ప్రజలందరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు.ప్రపంచ నలు దిశల అయోధ్య మందిరం ప్రాణ ప్రతిష్ట దైవ కార్యక్రమం కోసం ప్రజలందరు చూడటం చాలా సంతోషకరం అని కట్టగాని శ్రీకాంత్ అన్నారు.
ఆదాయం మిన్న…అభివృద్ధి సున్న!
https://epaper.netidhatri.com/
`మంత్రి సురేఖగారు మీరన్నా నిధులివ్వండి!
`అవినీతి ఉద్యోగులను తొలగించండి.
`ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని సాగనంపండి.
`రాజన్నకు పూర్వ వైభవం కల్పించండి.
`వేములవాడ ఎందుకో వెనుకబడ్డది!
`దక్షిణ కాశీకే దిక్కులేకుంటున్నది.
`ఉమ్మడి రాష్ట్రంలో రాజన్నకు అన్యాయమే!
`తెలంగాణలో అభివృద్ధికి ఆమడ దూరమే!
`ఏటా వంద కోట్లన్నారు…ఏనాడో మర్చిపోయారు.
`రాజన్నకే శఠగోపం పెట్టారు.
`పాలకులు అలా…ఉద్యోగులు ఇలా!!
`దేవుని సొమ్ము ఏళ్లుగా మెక్కుతున్నారు!?
`పదేళ్లకు పైగా పదమూడు మంది తిష్ట!
`ఉద్యోగుల అవినీతిపై విచారణ.
`నిజనిర్థారణ జరిగినా చర్యలు లేవు.
`విచారణ నివేదిక బుట్ట దాఖలు చేశారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ఉద్యమానికి వేముల వాడ రాజన్న ఆశీస్సులు వున్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్ధానం, ఆట,పాట అంతా వేముల వాడ రాజన్న చుట్టే తిరుగాయి. అందుకే తెలంగాణ వచ్చింది. వేములవాడ రాజన్న కనికరమే తెలంగాణకు వరమైంది. తెలంగాణ ఉద్యమం ఊరూ, వాడ చేరేందుకు, రాజన్న పేరు మీద పాటలు కైగట్టి పాడని కవిగాయకులెందరో వున్నారు. అలా రాజన..ఓ రాజనా…ఎత్తుర తెలంగాణ జెండ…రాజన ఓ రాజన్నా..అంటూ పాటలు పాడారు. అసలు రాజన్న పదం లేకుండా తెలంగాణ పాటే లేదు. అంత గొప్పది రాజన్న దీవెన. ఆయన దీవెనతోనే మలి దశ తెలంగాణ సాధ్యమైంది. కాని తిరుపతి వెంకన్నకు తెలంగాణ మొక్కులు చేరాయి. విజయవాడ దుర్గమ్మకు మొక్కులు నెవరేరాయి. యాదగిరి నర్సన్నకుకొత్త కోవెల వచ్చింది. వెయియ కోట్లతో కొత్త గుడి నిర్మాణం జరిగింది. కాని తెలంగాణ ఉద్యమం మొత్తం తన పేరు చుట్టూ తిరిగిన రాజన్న ఆలయం మాత్రం అలాగే వుంది. అక్కడే వుంది. యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి చేసిన తర్వాత అందరూ ప్రశ్నించడంతో నాడు కేసిఆర్ ఎముడాల రాజన్నకే ఏటా వంద కోట్లు ఇస్తామని మాట తప్పాడు. పదవి పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు. తెలంగాణలో వేముల వాడ రాజన్న అంటే ఎంతో మహిమాన్వితమైన దేవుడు. తెలంగాణలో అత్యంత పురాతమైన దేవాయాలలో వేములవాడ రాజన్న ఆలయం ఎంతో విశిష్టమైంది. పశ్చిమ చాళుక్యుల కాలం కోనేరులో వున్నాననిచెప్పి, గుడి కట్టమని స్వయంగా శివుడే ఆదేశిస్తే గుడి నిర్మాణం జరిగింది. నాటి నుంచి రాజన్న పూజలందుకుంటున్నాడు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్నాడు. నిత్యం లక్ష మందికి పైగా వేముల వాడ రాజన్నను భక్తులు దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు కొంగు బంగారమైన దేవుడు రాజరాజేశ్వర స్వామి. ఇప్పుడు బస్సు సౌకార్యలు, ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. ఆరోశతాబ్ధంలో నిర్మాణమైన ఆలయం చాళుక్యుల కాలం నుంచి వెలుగు వెలుగుతోంది. రాజన్న ఆలయ కోనేరులో స్నానమాచరిస్తే శారీరక రోగాలన్నీ మాయమౌతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలా కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణలో విరాజిల్లుతున్న గొప్ప శైవక్షేత్రం. ఉమ్మడి పాలకులు ఏనాడు వేముల వాడను పట్టించుకోలేదు. వసతుల సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పటికీ వేముల వాడలో వున్న గృహ సముదాయాలు కొన్ని వందల ఏళ్ల కాలం నాడు నిర్మాణం చేసినవే తప్ప, ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ వచ్చిన తర్వాత గాని చేసిన నిర్మాణాలు లేవు. తెలంగాణలోని కొన్ని లక్షల కుటుంబాలు ఏటా రాజన్నను దర్శించుకోకుండా వుండరు. తెలంగాణలోని అన్ని దేవాలయాలకన్నా, ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వేముల వాడ నుంచే లభిస్తుంది. అయినా పాలకులు ఏనాడు వేముల వాడ అభివృద్దిపై దృష్టిసారించలేదు. గతంలో ఏటా వంద కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కేసిఆర్ మాటలు మాత్రం అనేకం చెప్పారు. వేముల వాడ టెంపుల్ ఏరియా అధారిటీ ఏర్పాటుచేశారు. పురుషోత్తమ రెడ్డిని సీఈవోగా నియమించారు. తొలిసారి ప్రకటించిన వంద కోట్లలో కూడా కొంత మాత్రమే ఇచ్చారు. కొంత దేవాలయ స్ధలాన్ని చదను చేసి వదిలేశారు. ఆ తర్వాత నిధులు మంజూరు మర్చిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం కొత్త క్యూలైన్ కూడా ఏర్పాటు చేయలేదు. నిర్వహణ లోపం గతం కన్నా అద్వాహ్నం చేశారు. సానిటేషన్ గురించి పట్టించుకునే నాధుడు లేడు.
ఇక ఉద్యోగుల అవినీతికి లెక్కే లేదు.
అంత పెద్ద గుడికి పూర్తి స్ధాయి ఈవో ఎప్పుడూ వుండడు. ఎప్పుడూ ఇన్‌చార్జి ఈవోలే దిక్కవుతారు. ఏటా కనీసం వంద కోట్ల ఆదాయం వేముల వాడ నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ఆలయంలో ఓ పదమూడు మంది ఉద్యోగులు దశాబ్ద కాలానికి పైగా తిష్టవేశారు. వారు చేసే అవినీతి అంతా ఇంతా కాదు. వీరి అవినీతి మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. సుమారు31 పేజీల నివేదిక తయారు చేశారు. విజిలెన్స్ అధికారులు ఒక్క రోజే రెండు లక్షల లడ్డూల రికవరీ చేసినట్లు రాశారు. రాజన్న భక్తుల కోసం కొనుగోలు చేసిన వస్తువులలో 25రూపాయలకు పైగా సరుకులు మాయమైనట్లు నిర్ధారణ చేశారు. ఇక కాళ్యాణ కట్టలో జరిగే అవినీతి, ధర్మశాల కిరాయిలలో చేతి వాటాలలకు లెక్కేలేదు. రీజినల్ జాయింట్ కమీషనర్ రామకృష్ణ మొత్తం ఎంక్వైరీ చేసి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చారు. కాని అది బుట్ట దాఖలైంది. ఎలా పైనుంచి కింది దాకా రాజన్న సొమ్మును తింటున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. భక్తులకు అసౌకర్యాలు సృష్టిస్తున్నారు.
ఎముడాల రాజన్న.. మా పార్టీ అధికారంలోకి రావాలని, నాయకులు ఎన్నికల్లో గెలవాలని మొక్కులు మొక్కుతారు. కోడెలు కట్టేస్తారు.
పదవుల కోసం పాహిమాం..పాహిమాం అంటారు. రాజకీయాలతో రాజ్యమేలాలని రాజన్నా, రాజన్నా అని కొలుస్తారు. తీరా కోర్కెలు తీరగానే, పదవులు రాగానే రాజన్నను మర్చిపోతారు. ఇది ఇప్పటి తరం నాయకులు పరిస్ధితి. అయినా రాజన్న అందర్నీ చల్లగానే చూస్తాడు. తప్పులు చేసిన వారిని కూడా క్షమిస్తాడు. దీవెనార్తులు ఇస్తూనే వుంటాడు. అందుకే పాలకులు తప్పు చేసినా, ఉద్యోగులు ఆలయాన్ని ఊడ్చుకుతింటున్నా ఊరుకుంటున్నాడు. ఉన్నది మేస్తున్నా కనికరిస్తున్నాడు. అవును…నిజమే..లేకుంటే దశాబ్ధాల తరబడి పూచిక పుల్ల కూడా వదిలిపెట్టకుండా దోచుకుతింటూ, దేవుని సొమ్మునే కైంకర్యంచేస్తూ, గుడికి చెందాల్సిన సొమ్మును దోచేస్తుంటే కూడా ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. ఎంత మంది భక్తులు పిర్యాధులు చేసినా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు ఎక్కడిక్కడ ఎవరికి అందినంత వారు దోచేస్తున్నారు. ఆలయానికి వచ్చిన ఆదాయానికి కన్నం పెడుతున్నారు. రాజన్న భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. దేవుని సొమ్ము స్వాహా చేస్తున్నారు. దక్షిణాదిలో వైష్ణవాలయాలు వెలిగిపోతుంటే, శివాలయాలు దీపానికి కూడా నోచుకోవడం లేదని కొత్త బాష్యాలు చెప్పిన గత ముఖ్యమంత్రి కేసిఆర్ వేముల వాడను అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పాడు. రాజన్నను కూడా మాయ చేశాడు.
కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది.
ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇద్దరు మంత్రులున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర సయమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్నను దర్శించుకున్నారు. ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ వున్నారు. త్వరలో సమ్మక్క`సారక్క జాతర పెద్దఎత్తున తెలంగానలో జరగనున్నది. తెలంగాణ నలు మూలలనుంచి సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు చాల వరకు ముందు వేముల వాడ రాజన్నను దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్కతీర్ధం వెళ్తారు. అందువల్ల ఈ సమయంలో వేములవాడ అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని భక్తులు ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా గత పదేళ్లకాలంలో వేములవాడలో జరిగిన అవినీతిపై కూడా మంత్రి కొండా సురేఖ దృష్టిసారించాలని కోరుతున్నారు. దశాబ్ధానికి పైగా పాతుకుపోయిన ఉద్యోగులు, ఈవోతో సహా అనేక అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ ఎంకైరీలో తేలింది. రిపోర్టు కూడా సంబంధిత శాఖ వద్ద కూడా వుంది. వెంటనే ఎంతో పవిత్రమైన రాజన్న ఆలయంలో తప్పు చేసిన వారికి శిక్షలు పడాల్సిందే. దేవుని సొమ్మును దోచుకున్నవారి భరతం పట్టాల్సిందే. లేకుంటే కొత్త ప్రభుత్వం మీద కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పాలకులు మారినా రాజన్న ఆలయంలో తిష్ట వేసుకొని కూర్చున్న అవినీతి పరులను కదల్చడం ఎవరి తరం కాదన్న అహం వారిలో మరింత పెరుగుతుంది. భక్తులకు సౌకర్యాల కల్పనలో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి, రాజన్న ఆలయానికి మంచి రోజులు, భక్తులు మెరుగైన సౌకర్యాలు, సేవలు కల్పించాలని కోరుతున్నారు.
బావి తవ్వుతుండగా బయటపడిన పురాతన రాములవారి విగ్రహం
లక్షేటిపేట (మంచిర్యాల) నేటిదాత్రి;
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజంపేట గ్రామంలో వ్యవసాయ బావి తగ్గుతుండగా పురాతన రాముడు విగ్రహం బయటపడింది. రైతు ఆ విగ్రహాన్ని బయటకు తీసి పూజలు నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు రాముల వారి విగ్రహాన్ని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ అయోధ్య రామయ్య గుడి నిర్మాణ సందర్భంలో రాముల వారి విగ్రహం బావిలో బయటపడడం ఆనందంగా ఉందని తెలిపాడు. రాజంపేట గ్రామస్తులందరూ సాయంత్రం భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి, రాములవారి గుడి నిర్మిస్తామని తెలియజేశారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మా సంకల్పం వికసిత భారతం
ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ జనార్ధన్.
నల్లబెల్లి, నేటి ధాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అనేక రకాల బీమాలు యువతకు ప్రోత్సాహకాలు అందించడమే మా సంకల్పం వికసిత భారతం అని స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ టి జనార్ధన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ నానబోయిన రాజారాం అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయా శాఖల కు సంబంధించిన అధికారులు హాజరై కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మేనేజర్ జనార్ధన్ మాట్లాడుతూ.. బ్యాంకుల ద్వారా. పోస్ట్ ఆఫీస్ ల ద్వారా అందించే కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రధానమంత్రి జనగాని యోజన. పీఎం సురక్ష బీమా యోజన. పీఎం జీవనజ్యోతి బీమా యోజన. అటల్ పెన్షన్ యోజన. పీఎం స్వామిజి యోజన. తో పాటు బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంకల్ప యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా సుకన్య సమృద్ధి యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా వంటగ్యాస్ కలెక్షన్. పీఎం ముద్ర యోజన. ప్రతి కుటుంబం పౌష్టికాహారంతో జీవించడమే సంపూర్ణ ఆరోగ్య భారతానికి దూరపడుతుందని స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ అధికారి జె కుమారస్వామి పేర్కొన్నారు. వ్యవసాయ రంగం ద్వారా పిఎం కిసాన్. కిసాన్ సమృద్ధి యోజన పథకాలతో పాటు ఆహార భద్రతకు భరోసా కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకమని వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పిఎం జనారోగ్య యోజన. పీఎం భారతీయ జనఉషధి పరియోజన కార్యక్రమం ద్వారా నాణ్యమైన ఔషధాలను అతి తక్కువ ధరకు ప్రజలకు అందించేందుకు ప్రతి గ్రామ మండల కేంద్రాల్లో ఆరోగ్య సెంటర్ల పటిష్టత కార్యక్రమం చేపట్టడం జరిగిందని స్థానిక వైద్యాధికారి పిబి ఆచార్య పేర్కొనడం జరిగింది. వీటితోపాటు వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేయడం తోపాటు అవగాహన కల్పించి భాగస్వాములు కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో. స్థానిక ఎంపీటీసీ జన్ను జయరావు పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్. వెలుగు ఏబీఎం సునీత. వివిధ శాఖల అధికారులు. అంగన్వాడి లు ఆశా వర్కర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
బి. జె. పి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కు శుభాకాంక్షలు
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అద్యక్షులుగా మూడవసారి ప్రతాప రామకృష్ణ ను రాష్ట్ర పార్టీ నియమించడం పట్ల జిల్లా బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు వారి నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్
రెడ్డి ,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ , బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు,నాయకులు అన్నారం శ్రీనివాస్, గడ్డమీధి శ్రీనివాస్,రాపెల్లి శ్రీధర్ సగ్గు రాహూల్,అన్ని మండలాల కార్యకర్తలు అన్ని మండలాలఅధ్యక్షులు,జిల్ల పథాది కారుల,ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్ట పరచాలి.
ఎం సిపిఐ యు కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: ప్రజా వ్యతిరేక అనువాద పాలకులకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలను సిద్ధం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అందుకు పార్టీ శాఖలను పటిష్ట పరచాలని ఎంసిపిఐయు కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి దామ సాంబయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం మనువాద భావజాలాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందని పోరాడే వ్యక్తులను శక్తులను నియంతృత్వ ధోరణితో తప్పుడు కేసులు పెట్టి నిర్బంధానికి గురి చేసి మళ్లీ గద్దెనెక్కెందుకు ప్రజలను మభ్యపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుందని మత రాజకీయాలకు పాల్పడుతూ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టి మత రాజకీయాలు చేస్తున్న మతోన్మాది బిజెపి పార్టీనీ గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అలాగే ఎన్నికల్లో ఎన్నో ఆశాజనకమైన హామీలను ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేనియెడల గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర నాయకులు నాగేల్లి కొమురయ్య, కుసుంబా బాబురావు, కన్నం వెంకన్న, డివిజన్ నాయకులు జన్ను రమేష్, మార్త నాగరాజు, కర్నే సాంబయ్య, నాగేల్లి వెంకటేష్, ఏసేభ్ తదితరులు పాల్గొన్నారు.
డీన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన — ఆచార్య గాదే సమ్మయ్య
ఆచార్య గాదే సమ్మయ్య డీన్ ఫ్యాకల్టీగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈరోజు నుండి రెండు సంవత్సరాల కాలం పదవిలో కొనసాగనున్నారు. డీన్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ను పటిష్ట పరచడంలో ముఖ్యపాత్రను పోషిస్తారు. ఆచార్య సమ్మయ్య బీ.ఫార్మసీ మరియు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మసీ కళాశాలలో పూర్తి చేశారు. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ ని బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో పూర్తి చేశారు. ఈయన పర్యవేక్షణలో 4 డాక్టరేట్ డిగ్రీ ప్రధానం చేయడం జరిగింది, 3 డాక్టరేట్ డిగ్రీ సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మరో 4 గురు ప్రస్తుతము వారి యొక్క రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. ఆచార్య సమ్మయ్య గారి ఆధ్వర్యంలో 73 ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించడం జరిగినది. ఆచార్య సమ్మయ్య కు డిఎస్టి మరియు యూజీసీ యాంటీ క్యాన్సర్ మరియు ఆంటీ హెచ్ఐవి కొరకు కొత్త మాలిక్యులు తయారు చేయడం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగినది. ఆచార్య గాదె సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రస్తుతము 65 మంది మాస్టర్ ఆఫ్ ఫార్మసి కోర్సును పూర్తి చేశారు మరో 23 మంది ప్రస్తుతం వారి యొక్క పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఆచార్య సమ్మయ్య గారి పరిశోధన లు ముఖ్యముగా యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్, కోవిడ్-19, ఆంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్,ఆంటీ ఆక్సిడెంట్, అల్జిమర్ మరియు పార్కిన్సోనీ వంటి రోగాల పై మాలిక్యుల్ తయారు చేయడం కొరకు ప్రస్తుతము విస్తృత రీసెర్చ్ కొనసాగుతున్నది. ఆచార్య సమ్మయ్య గతంలో ప్రిన్సిపాల్ అండ్ హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ గా హెల్త్ సెంటర్ మెంబర్ ఇంచార్జి గా మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా కీలకమైన పదవి బాధ్యతలు చేపట్టారు. మెంబర్ ఇంచార్జ్ ఫర్ హెల్త్ సెంటర్ గా ఉన్నప్పుడు విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయం అందించడం కొరకు తన వంతు బలమైన కృషి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో అంబేద్కర్ గారి యొక్క విద్యా విధానంను మరియు బుద్ధుని యొక్క ప్రవచనములు మరియు నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్సు, వర్క్ షాప్స్, గెస్ట్ లెక్చర్స్,ఎన్నో నిర్వహించడం జరిగింది. కొత్తగా డీన్ గా పదవి బాధ్యతలు ప్రొఫెసర్ నరసింహ రెడ్డి గారి నుండి చేపట్టిన ఆచార్య సమ్మయ్య గారిని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రసాద్, ప్రొఫెసర్ కృష్ణవేణి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్, డాక్టర్ స్వరూప, డాక్టర్ సాహిద, డాక్టర్ నాగరాజు మరియు ఆచార్య సుధీర్ కుమార్, ఆచార్య వెంకటేశ్వరరావు, చల్ల శ్రీనివాసరెడ్డి, ఆచార్య విజయకుమార్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సునీత, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ భాగ్య డాక్టర్ సుజాత డాక్టర్ ఉషాకిరణ్, వై డాక్టర్ శశిధర్, రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి శ్రీ రమ్య, స్వర్ణలత, మంజుల, సుష్మిత, మరియు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు, బీఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు పుష్పగుచ్చం లు మరియు శాలువ లాతో ఆచార్య సమ్మయ్య గారిని సత్కరించారు.
బాల రాముడి పునర్ ప్రతిష్టను రాజకీయం చేయడం తగదు
ఎంపి. బండి సంజయ్
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
ఈ నెల 22న అయోధ్యలో బాల రాముడి పున ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకేయం చేయాలని చూడడం సరైన విధానం కాదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి రామాలయాన్ని దర్శించుకోని ఆలయంలో శుద్ధికరణ పనులలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఈ నెల 22న ప్రపంచ వ్యప్తంగా బాలరాముడి పునర్ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకునేందుకు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరని అన్నారు. ప్రభుత్వం కూడా ఆ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 22న అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు చూస్తుందని. ఇది సరైన విధానం కాదని గుర్తు చేశారు. దేవుడి అక్షింతలను తమకు రేషన్ బియ్యంతో పోలుస్తున్నారని. కొంగ్రెస్ నాయకులు కావాలనుకుంటే సాంబమాశుర బియ్యమే సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నేను అయోధ్యలో పూజ చేసిన సన్న బియ్యాన్ని తీసుకచ్చి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చురకలు అంటించారు. భక్తతో చెపట్టే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరు భక్తిభావంతో పాల్గొని హిందుత్వాన్ని చాటి చెప్పాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు తిరుపతిరెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, సంపెల్లి సంపత్ రావు, కృష్ణారెడ్డి, రాకేష్ ఠాకూర్, రాజేష్ ఠాకూర్, పుల్లూరి ఈశ్వర్, దొగ్గల రవి, ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం
*-వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పాటు ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణకై పనిచేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ నెల 15వ తేదిన నుండి వచ్చే నెల ఫిబ్రవరి 14వ తారీఖు నిర్వహింబడే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకోని వరంగల్ పోలీస్ అధ్యక్షతన వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయమలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబడిరది. రాష్ట్ర రోడ్డు రవాణా విభాగం, పోలీసు అధికారులు, స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్, బులియన్ మర్కెట్, ఇతర వ్యాపార సముదాలకు చెందిన కార్యవర్గ సభ్యులు పాల్గోన్న ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దేశం వ్యాప్తంగా గంటకు యాబైకి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే ఇందులో 19మంది మరణిస్తున్నారని. రోజు రోజుకి వాహనాల సంఖ్య ఘననీయంగా పెరుగడంతో అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని. ఈ ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలు రోడ్డున పడటంతో పాటు వారి కుటుంబ సభ్యుల జీవితాలు చిద్రమవుతున్నాయని. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజలు సైతం భాగస్వాములు కావాలని. ఇందుకోసం ముందుస్తూ ప్రణాళిక రూపోందించుకోవాల్సిన అవసరం వుందని, ఇందుకోసం హై స్పీడ్ వాహనాల వినియోగంలో వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదాలపై అవగాన కల్పించాలని, అలాగే అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రిమించడం లాంటి చర్యలకు వాహనదారులు పాల్పడకుండా కళాశాల విధ్యార్థులతో పాటు, ప్రజలకు అవగాహన తరగతులను నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకై జాతీయ, స్టేట్ ప్రధాన రోడ్డు మార్గాలను కలిపే రోడ్లకు అనుసంధానమైన గ్రామాల్లో రోడ్డ సేఫ్టీ కమీటీలను ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడం ద్వారా మరణాలను శాతాన్ని తగ్గించగలమని. ప్యాసింజర్ వాహనాలదారుల్లో మార్పు వచ్చే సంబంధిత అధికారులు తగు చర్యలుతీసుకోవాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్ సెఫ్టీ విభాగానికి చెందిన ఇన్స్‌స్పెక్టర్ రవి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై అధికారులు పలుసూచనలు చేసారు. అనంతరం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై రవాణా శాఖ రూపోందించిన వాల్‌పోస్టర్లు కరప్రతాలను పోలీస్ కమిషనర్ అవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా డిప్యూటి ట్రాన్స్‌పోర్ట్ అఫీసర్ పురుషోత్తం, ఆర్టీఓ రంగరావు, ఏసిపిలు జితేందర్ రెడ్డి, రమేష్‌కుమార్, ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, యం.వి.ఐలు రమేష్ రాథోడ్,రవీందర్, స్వర్ణలత, షాలిని, ఫహిమా, శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, బిలియన్ మార్కెట్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్‌తో ఇతర వ్యాపారస్తులు పాల్గోన్నారు.
*వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము*
లంబాడీ హక్కుల పోరాట సమితి మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ధరంసోత్ స్వప్నబాలు నాయక్ ఎన్నిక
మహబూబాబాద్ జిల్లా జనవరి 19
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక చేశారు. ఈ నూతన కమిటీలో కంచర్లగూడెం గ్రామానికి చెందిన ప్రస్తుత ఉప సర్పంచ్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ధరంసోత్ స్వప్నబాలు నాయక్ గారిని నియమించినట్టు ఆ సంఘం రాష్ట్ర కో కన్వీనర్ భీమా నాయక్ తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ భీమ నాయక్ మాట్లాడుతూ ధరం సోత్ స్వప్న గత పది సంవత్సరాలుగా ఎల్ హెచ్ పి ఎస్ నందు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరికన్నా ముందుండి సంఘాన్ని నడిపించడంలో తనదైన పాత్ర చూపించి అందరి మన్ననలు పొందారు. కావున ధరం సోత్ స్వప్నబాలు నాయక్ కి మహబూబాబాద్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమిస్తున్నాము. స్వప్న బాయి మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం భవిష్యత్తులో రాజి లేని పోరాటాలు నిర్వహిస్తానని, నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతలకు కట్టుబడి ఉంటానని, సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్, గుగులోతు హరి నాయక్, రాష్ట్ర కో కన్వీనర్ గుగులోతు భీమా నాయక్ కి ధన్యవాదాలు తెలిపారు.
జడ్చర్ల నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు
అనిరుధ్ రెడ్డి, రాజేశ్ రెడ్డి.
పత్రికలు ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిగా ఉండాలి.
సూర్య దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, రాజేశ్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని హిల్ పార్క్ హోటల్ ఆవరణలో శుక్రవారం రోజు సూర్య తెలుగు దినపత్రిక 2024 సంవత్సర క్యాలెండర్ ను పాత్రికేయుల కోరిక మేరకు సూర్య పత్రిక క్యాలెండర్ ను రాష్ట్ర రవాణా శాఖ & బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయలేదని, తమ ప్రభుత్వ హయాంలో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి,నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
> బీఆర్ఎస్ నాయకులు బట్టలు చించుకోకండి
> రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
>”కొల్లూరు” పర్యటనలో టిఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు
> శ్రీ చింతల పూరి చిన్మయ స్వామి మఠం స్వాగత తోరణ ప్రారంభోత్సవం
హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించిన శ్రీ చింతల పూరి చిన్మయ స్వామి మఠం స్వాగత తోరణం (ముఖ ద్వారం) ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గోన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) మరియు శ్రీశైల పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధిరామ పండితారాద్య శివాచార్య, శ్రీశైలం దేవస్థానం పూజారి గంతల నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమాల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
కాలేశ్వరం కడితే కృంగిపోయిందని, పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదని అసలు రాష్ట్రానికి చెప్పుకోదగ్గ పని ఏం చేశారని? మంత్రి ప్రభాకర్ ప్రశ్నించారు. ఊరికే బీఆర్ఎస్ నాయకులు బట్టలు చింపుకోవద్దని పద్ధతిగా ఉండాలంటూ హితవు పలికారు. ప్రజల చేత తిరస్కరింపబడ్డాక కూడా బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం తగదని సూచించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపడుతాము చూడండి అంతవరకు ఎదురుచూడండి అప్పుడే విమర్శలకు దిగడం సమంజసం కాదంటూ హితవు పలికారు. అసెంబ్లీలో కూర్చుని బయటికి వచ్చి ఏదో చెమటోడ్చి కష్టపడ్డట్టు శ్వేత పత్రం అంటూ గగ్గోలు పడుతున్నారని విమర్శించారు. విభజన హామీలు కేంద్రం నుండి ఎన్ని తెచ్చారని మంత్రి ప్రభాకర్ ప్రశ్నించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్
మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ సూచించారు. శుక్రవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ, ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని, వీక్షకులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, డివైజిఎం, ఈఅండ్ఎం జి నాగరాజు, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు, ఏరియా స్టోర్ ఎస్ఈ (ఈఅండ్ఎం) పైడిశ్వర్, రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ డివైసీఎంవో ఎం ఉష, పలు డిపార్ట్మెంట్ల అధికారులు, అన్ని గనుల మేనేజర్లు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
డ్రగ్స్ తో దుష్పపరిమాణాలు అనేకం
జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు అవగాహన సదస్సు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జిల్లా పోలిసు శాఖ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అంశంపై మెడికల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా, ఎస్పి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం ప్రాణాంతకమన్నారు. మాదక ద్రవ్యాలు దేశ శక్తిని, యువతను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ సమాజ మనుగడకు, యువత జీవితానికి వినాశనకారి అన్నారు. దీన్ని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల్లాంటి వాటిని దగ్గరికి రానివ్వద్దని మెడికల్ విద్యార్థులకు సూచించారు. జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా కష్టపడి చదివి ఉన్నత స్ధానంలో ఉండాలన్నారు. జిల్లాలో డ్రగ్స్ రవాణా, వినియోగంపై పటిష్ట నిఘా పెట్టినట్లు ఎస్పి వెల్లడించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ చైర్ పర్సన్ గా ఏడుగురు సభ్యులతో కూడిన ‘యాంటీ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేశామని, డ్రగ్స్ వినియోగం, రవాణా నిరోధానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజు దేవ్ డే, భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, వైస్ ప్రిన్సిపల్ కే. రాజేశం, డాక్టర్ వందన, చిట్యాల సిఐ వేణు చందర్, ఘనపురం ఎస్ఐ సాంబమూర్తి, మెడికల్ కాలేజీ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
అధికారులపై ఈడి కి పిర్యాదు చేస్తాం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి డిమాండ్
బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి రిజిస్టేషన్లు రద్దు చేయాలి
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడాలో గల సర్వే నెంబర్ 149 లోని ప్రభుత్వ భూమి 58,59 జీవో ను అడ్డం పెట్టుకొని అక్రమంగా ఇతర వ్యక్తులకు కట్టబెట్టిన వైనం పై గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడంతో శుక్రవారం రోజు స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో కలిసి శుక్రవారం రోజు సదరు కబ్జా కు గురైన భూమిని పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే గాంధీ తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మీడియా తో మాట్లాడుతు గతం లో ఇక్కడ పనిచేసిన రెవిన్యూ అధికారులపై శాఖా పరమైన విచారణ చేపట్టిన అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 58,59 జీవో లను అడ్డం పెట్టుకొని ఎవరి అండతో అధికారులు ఈ అవినీతి కి పాల్పడ్డారో, వారందరి రిజిస్ట్రేషన్ లను రద్దు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలన్నారు.వేరే వేరే వ్యక్తుల ద్వారా డబ్బుల ట్రాన్సక్షన్స్ జరిగాయాని, గజం 3 లక్షల ధర పలికే నానక్ రామ్ గూడ లో కేవలం గవర్నమెంట్ రేటు 27 వేల చొప్పునే వేల గజాల ప్రభుత్వ భూమిని ప్రయివేట్ వ్యక్తులకు ఎలా దారాధత్తం చేస్తారని ప్రశ్నించారు. అధికారుల చేత ఈ పనులు చేయించిన రాజకీయ నాయకులపైన కూడా ఉన్నతాదికారులకు పిర్యాదు చేస్తామని, ఎట్టి పరిస్థితి లోను భూములను వదిలే ప్రసక్తే లేదన్నారు. కబ్జాలకు గురైన భూములను ప్రభుత్వానికి అప్పగించే వరకు విశ్రామించభోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, తిరుపతి ,సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్,శేఖర్,మన్నే రమేష్, అరుణ్ గౌడ్, నర్సింగ్ రావు, గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, స్థానిక నేతలు,కార్యకర్తలు,పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను సన్మానించిన ముదిరాజ్ సంఘ సభ్యులు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో రామడుగు మండల ఉపాధ్యక్షులు కట్ల శంకర్, మాల కుమార్, పోచమల్లు, శంకర్, కిషన్, కొండయ్య, రాజేష్, మహేష్, లచ్చయ్య, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
నవోదయ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణంలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో శనివారం నిర్వహించబోయే నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పరీక్షా చీఫ్ సూపరింటెండెంట్, పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణారెడ్డి తెలిపారు. కాగజ్ నగర్ నవోదయ విద్యాలయ హిందీ టిజిటి ఉమేష్ కుమార్ పాల్ తో కలిసి పాఠశాలలో పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 143మంది విద్యార్థులకై నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు పట్టణంలోని ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులందరూ ఉదయం 10గంటల 30నిమిషాలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, అదేవిధంగా పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్నులు, హాల్ టికెట్, ఫోటో ఐడెంటిటీ కార్డు మొదలగు వాటితో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. పరీక్ష శనివారం ఉదయం 11గంటల 30నిమిషాల నుండి, మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.