సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు.

సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

◆ అపూర్వం.. అద్వితీయం..!

◆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

◆ 22 ఏళ్లకు కలిసిన మిత్ర బృందం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 వి ద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూ ర్వ విద్యార్థులు గురువారం పాఠశాల ఆవర ణలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించా రు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు స ర స్వతీ, మధుసూదన్, పద్మజ, జ్యోతి, నాగిశెట్టి, ఈ శ్వర్లకు పాదపూజ నిర్వహించి ఆశీర్వాదం తీసు కున్నారు. జ్ఞాపిక లందించి ఘనంగా సన్మానిం చారు. అనంతరం అలనాటి మధుర స్మృతులు నెమరువేసుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులంతా కలిసి సహపంక్తి భోజనం చేశారు. సుమారు 50 మంది విద్యార్థులు హాజర య్యారు. 22 ఏళ్ల తర్వాత విద్యార్థులు కలవడంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఆనంద భాష్పాలు రాల్చారు.

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి…

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు,ఏకరూప దుస్తులు,మధ్యాహ్న భోజన పథకం,ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చిన్న కిష్టాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాటోత్ ప్రసాద్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దేశ్య తండ, సర్వన్ తండ, ఎస్ టీ కాలనీ, మంగలి తండ గ్రామాలలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శనగా బయలుదేరి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా జాటోత్ ప్రసాద్ మాట్లాడుతూ, నేడు విద్యారంగం వ్యాపార వస్తువుగా మారిందని, కొనుక్కునే వాడికే విద్య అందుబాటులోకి వచ్చిన ఫలితంగా పేద,మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేకుండా విద్యార్థి కేంద్రీకృత విధానంలో మెరుగైన విద్యాబోధన నేర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, యువతి, యువకులు తమ గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేలా చైతన్య పరచాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సయ్య, కిరణ్, గ్రామ యువకులు ఎం. సురేష్, అంగన్వాడీ టీచర్ లు మాలోత్ నీలా దేవి, బోడ భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని కవేలి గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో బడిబాట గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ దొండి రావు పెట్లోళ్ల మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలను ఉచిత పుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం భోజనంలో వారానికి మూడుసార్లు గుడ్డు, రాగి జావ వడ్డిస్తారన్నారు.

శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాల.

శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నాపూర్ గ్రామానికి చెందిన గుడిసె ఆకాశ్ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-మంజూరైన LOC మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు ,మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి ,నాయకులు అందజేశారు.
ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కోర మీసాలు,ఉగ్రరూపంలో వేట వెంకటేశ్వర స్వామి…

కోర మీసాలు,ఉగ్రరూపంలో వేట వెంకటేశ్వర స్వామి…

కొలిచిన వారికి కొంగు బంగారం…

ఆపద మొక్కులు తీర్చే వేట వెంకటేశ్వర స్వామి…

వేటకు వచ్చి మర్రిగూడెంలో వెలసిన వేట వెంకటేశ్వర స్వామి…

మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు…

నేటి ధాత్రి – గార్ల :-

 

 

 

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న వేట వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు.

ఈ ఆలయం భక్తులకు అత్యంత ప్రితిపాత్ర మైనది.

వేట వెంకటేశ్వర స్వామికి భక్తులు నిత్యం యాటపోతులను బలి ఇచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

కోరిన కోరికలను తీర్చమని ముడుపులు కట్టి మేకపోతుని బలి ఇస్తారు.

వెంకటేశ్వర స్వామికి మేకను బలివ్వడం ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.

వినడానికి వింతగా అనిపించిన ఈ ఆచారం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది.

వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో అశ్వ వాహన రూపాన్ని వదిలి వెంకటేశ్వర స్వామి రూపాన్ని ధరించిన ప్రదేశంలో గోపాద ముద్రలు దర్శమిస్తాయి.

ఇక్కడికి వచ్చే భక్తులు ముందు గోపాదాన్ని దర్శించుకున్న తర్వాతే వేట వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు.

సంతానలేమిటో బాధపడే భార్యా,భర్తలు కళ్యాణం కోసం ఎదురుచూసే యువతి,యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నించే ఉద్యోగార్థులు, ఇంట్లో అనేక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు

 

Venkateswara Swamy.

 

ఈ వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి తమ కోరికలను తీర్చాలని,తమ కష్టాలను గట్టేక్కించాలని మొక్కుకుంటారు.

శాలివాహన శకం 1525 శ్రీముఖ నామ సంవత్సరం అశ్వయుజ శుద్ధ విదియ శుభదినాన స్వామి వారు ఇక్కడ అవతరించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.

క్షేత్ర పాలకూడిగా హనుమంతుడు కొలువై ఉన్న ఈ దేవాలయంలో ఆల్వారుల విగ్రహాలు కనిపించడం విశేషం.

ప్రతి ఏటా అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున వేట వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు.

వెంకటేశ్వర స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం భారతదేశమంతట ఎక్కడ వెతికిన దొరకదు.

ఈ వింత ఆచారం మర్రిగూడెంలోని వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

పాతకాలం నాటి పంచలోహ విగ్రహాలను, స్వామివారి ఆభరణాలను ఉత్సవాల అనంతరం గార్ల దేవాలయం లో భద్రపరిచి ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినాన

ఈ ఆభరణాలతో స్వామివారిని అలంకరించడం రివాజు.

 

 

Venkateswara Swamy.

 

 

అశ్వయుజ పౌర్ణమి నాడు ఆలయ ప్రాంగణంలో జరిగే కళ్యాణానికి డోర్నకల్ మండలం, అమ్మపాలెం గ్రామం నుంచి తెచ్చిన తలంబ్రాలతో వేద పండితులు కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తారు.

తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వయంగా వేటాడుతూ ఈ ప్రాంతానికి విచ్చేసి మర్రిగూడెం సమీపంలో వెలసినట్టు భక్తుల విశ్వాసం.

ఆలయం ఎదుట గల కోనేరు తేప్పోత్సవమును ఘనంగా నిర్వహిస్తారు.

తిరునాళ్ల ఉత్సవానికి మహబూబాబాద్ జిల్లా నలుమూలల నుండి కాక, వరంగల్, నల్గొండ, ఖమ్మం, కృష్ణ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకిస్తారు.

ఇంతటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం అభివృద్ధికి ఎమ్మెల్యేలు,ఎంపీలు చొరవ చూపాలని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఆలయం అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు.

 

Venkateswara Swamy.

 

వీధి కుక్కల దాడిలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.

వీధి కుక్కల దాడిలో.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

 

వెల్దండ /నేటి ధాత్రి.

 

 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో చర్చి సమీపంలో నివాసం ఉంటున్న జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై గురువారం రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఆంధ్రయ్య పై ఒక్కసారిగా దాదాపు 10 కి పైగా వీధి కుక్కలు మీద పడి ముఖంపై దాడి చేశాయి. దీంతో కల్వకుర్తి ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి నాగర్ కర్నూలుకు వైద్యులు రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగు బిల్లులకై,వినతి పత్రం అందజేత.ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన రంగం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సంబంధించి దాదాపు 5 నుంచి 6 నెలల మే స్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, అలాగే గౌరవ వేతనం దాదాపు నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నవి. దీనివల్ల కార్మికుల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొద్ది రోజుల్లో స్కూలు తిరిగి ప్రారంభం అవుతున్న సందర్భంగా వంట చేయడానికి చేతులు డబ్బులు లేనందున విద్యార్థులకు భోజనాలు పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వం గౌరవ వేతనం 10000, రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 15 నెలలు పూర్తికావస్తున్న కూడా ఎక్కడ కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గౌరవ వేతనం 2000, కూడా దాదాపు నాలుగు నెలల నుంచి కార్మికులకు ఇవ్వడం లేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సి.ఐ.టి.యు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.కావున కార్మికులకు రావాల్సిన 5 నెలల పెండింగ్ మెస్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే అందించి, గౌరవ వేతనం 10000 ,రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సి.ఐ.టి.యు అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్, మరియు కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

ఖుర్బానీ.. స్ఫూర్తిదాయకం.

ఖుర్బానీ.. స్ఫూర్తిదాయకం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం హజ్రత్ ఇబ్రాహీం (అలై), ఆయన కుమారుడు ఇస్మాయీల్ (అలై) అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించిన కాబా గృహం నేడు గొప్ప ఆరాధనా స్థలంగా మారింది.

‘ఈ గృహాన్ని సకలజనావళికి కేంద్రంగా, శాంతి నిలయంగా రూపొందించాం.

ఇబ్రాహీం ఆరాధన కోసం నిలిచిన ఈ పవిత్ర ప్రదేశాన్ని శాశ్వత నమాజు స్థలంగా ఏర్పాటుచేయమని ఆదేశించాం.

అలాగే ఈ గృహానికి ప్రదక్షిణ, అందులో ఏతెకాఫ్, రుకూ, సజ్దాలు మొదలైనవన్నీ పాటించేవారి కోసం ఈ స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచమని ఇబ్రాహీంను, ఇస్మాయీలును నిర్దేశించాను’ అని ఖురాన్లో అల్లాహ్ పేర్కొన్నాడు.

అందుకే ముస్లింలు ఏటా మక్కా వెళ్తారు. అక్కడ ఖుర్బానీ ఇస్తారు.

పండుగకు ముందురోజైన ‘యౌమె అరపా’ నాడు ఉపవాసం పాటిస్తే..

వారు గత సంవత్సరం చేసిన పాపాలు క్షమకు నోచుకుంటాయని ప్రవక్త (స) తెలియజేశారు.

హజ్ యాత్ర

 

Qurbani.. inspiring.

 

 

 

ఇస్లాం ఐదు మూలస్తంభాల్లో హజ్ ముఖ్యమైంది.

స్తోమత ఉన్న ముస్లింలు జీవితకాలంలో ఒక్కసారైనా తప్పక చేయాల్సిన ధార్మిక విధి.

ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, ఆర్ధిక ప్రయోజనాలున్న విశిష్ట ఆరాధన ఇది. ఏటా లక్షలాదిమంది ముస్లింలు మక్కాకు వెళ్తారు.

ప్రపంచం నలుమూలల నుంచి అల్లాహ్ పట్ల భక్తితో ఆయన ఆహ్వానానికి జవాబుగా ‘లబ్బైక్’ (హాజరయ్యాను) అని పలుకుతూ కాబాగృహానికి వస్తారు.

జాతి, ప్రాంతం, భాషా భేదాలు అక్కడ కనిపించవు.

అందరూ ఒకేరకమైన నిరాడంబరమైన వస్త్రాలు ధరించి, ఒకే విధమైన హజ్ కర్మలు నిర్వర్తిస్తారు.

సర్వమానవ సమానత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తారు.

హజ్ యాత్రికుల హృదయాల్లో అల్లాహ్ పట్ల అంతులేని విశ్వాసం, ప్రేమ తొణికిసలాడుతుంటాయి.

హజ్ యాత్రికుల అంతరంగంలో దేవుడొక్కడే అనే భావన, సమాజపరంగా అందరూ ఒక్కటేనన్న ఆలోచన బలపడతాయి.

హజ్ యాత్ర ప్రజల్లో సమానత్వాన్ని, సహోదర భావాన్ని దర్శింపజేస్తుంది.

ఒకే దైవం, ఒకే ప్రవక్త (స) అన్న విశ్వాసం, ఒకే జీవిత లక్ష్యం (ఖురాన్), ఒకే జీవన విధానం (కిల్లా.. కాబా ప్రదక్షిణ) ఇవన్నీ సామాజిక సమైక్యతకు బలమైన పునాదులు

ఇబ్రాహీం గాథ

 

 

Qurbani.. inspiring.

నేటికి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అరబ్బు భూభాగంలో దైవగృహం సాక్షిగా జరిగిన ఇబ్రాహీం గాథను, ఆయన త్యాగస్ఫూర్తి, సహనశీలతలను బక్రీద్ నాడు స్మరించుకుంటారు.

ఇబ్రాహీం (అలై) మహా దైవప్రవక్త.

ఆయనకు ఖలీలుల్లాహ్ (దేవుని మిత్రుడు) అనే బిరుదు కూడా ఉంది.

ఒకనాడాయన తన పుత్రుడి గొంతు కోస్తున్నట్లు కలగన్నారు.

దీన్ని దైవాజ్ఞగా భావించి పుత్రుణ్ణి సంప్రదించారు. ‘ఆ ఆదేశాన్ని వెంటనే నెరవేర్చండి.

నేను సిద్ధంగా ఉన్నాను.

అది దైవచిత్తమైతే మీరు నన్ను సహనవంతునిగా చూస్తారు’ అన్నాడు.

దీంతో ఇబ్రాహీం తన ప్రాణం కంటే మిన్న అయిన పుత్రుడి మెడ నరికేందుకు కత్తి తీసుకున్నారు.

బాల ఇస్మాయీల్ తన మెడ కోయడానికి వీలుగా నేలపై పడుకున్నాడు.

మెడపై కత్తి పెట్టగానే ‘ప్రియమైన ఇబ్రాహీం!

నువ్వు నీ కలను నిజం చేయడానికి పూనుకున్నావు.

నా ఆజ్ఞను అమలుచేసేందుకు మీరిద్దరూ మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను ప్రసన్నుడనయ్యాను.

పరీక్షలో అత్యుత్తమంగా ఉత్తీర్ణులయ్యారు.

ఇక భౌతిక చర్యగా మిగిలిన బలి తతంగంతో నాకు నిమిత్తం లేదు.

ఇది మీ పరిపూర్ణ విశ్వాసానికి మచ్చుతునక అంటూ దైవవాక్కు వినిపించింది.

స్వర్గం నుంచి పొట్టేలు ప్రత్యక్షమై ఇస్మాయీల్ స్థానంలో కనిపించింది.

దాంతో పుత్రుడికి బదులు పొట్టేలును బలి ఇచ్చారు. ఇలా బలివ్వడాన్ని ఇస్లామీయ పరిభాషలో ఖుర్బానీ అంటారు.

బక్రీద్ అంటే త్యాగోత్సవం.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకు 540 మందిని చట్ట విరుద్ధంగా హత్య చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ మూలంగా మృతుల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అక్కడి ప్రజలు భయానక స్థితిలో జీవనం కొనసాగించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడ్డాయని ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు
ఈ చట్టవిరుద్ధ హత్యలను సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన సాగుతుందన్నారు. శత్రు దేశాలపై యుద్ధం చేసినట్లు మధ్య భారతంలో భారత పౌరులపై యుద్ధం చేయడం సరికాదన్నారు. ఉగ్రవాద సంస్థలతో గత ప్రభుత్వాలు చర్చలు జరిపాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు చర్చలు చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. శాంతి చర్చల కమిటీ, 10 వామపక్ష పార్టీలు, లౌకిక శక్తుల ఆధ్వర్యంలో ఈ నెల మూడు నుంచి ఆరు వరకు అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో సభలు, సమావేశాలు జరపాలని, ఈనెల 14న హైదరాబాదులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయని, వీటన్నింటినీ జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భూముల సమస్యలు పరిష్కరించేందుకే.!

భూముల సమస్యలు పరిష్కరించేందుకే రెవిన్యూ సదస్సులు

తహశీల్దార్ కృష్ణవేణి

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కృష్ణవేణి అన్నారు. మరిపెడ మండల పరిధిలోని రాంపురం, ఉల్లెపల్లి,భూక్య తండ, లూనావత్ తండా గ్రామాలలో నాల్గవరోజు నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా రాంపురం గ్రామపంచాయతీలో తాసిల్దార్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రజలు, రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో రైతులు పడుతున్న బాధలపై,ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. మండల తాసిల్దార్ కృష్ణవేణి స్వయంగా ప్రజలతో మమేకమై వారు ఇచ్చే అర్జీలను కూలంకషంగా పరిశీలిస్తూ, సరైన రీతిలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. వారికి భూభారతి ద్వారా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది, ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ తాసిల్దార్ కృష్ణవేణి, గిర్ధవర్ శరత్ గౌడ్,జూనియర్ అసిస్టెంట్లు సందీప్,ప్రవీణ్,నరేష్,గ్రామపంచాయతీ సిబ్బంది హాఫీజ్,మెకానిక్ వెంకన్న,గ్రామ రైతులు రాంపల్లి నాగన్న,వంగ చిన్న వెంకన్న,సుదగానికి శంకర్,దిడ్డి వెంకన్న,చింతపల్లి మల్లేశం,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్యమిత్రులు ..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-

 

 

 

చిన్ననాటి కాలంలో వారితో పాటు చదువుకున్న మిత్రుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి విద్యార్థులు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో వారితోపాటు విద్యను అభ్యసించిన ఎనగందుల రాజు ఇటీవల మల్లయ్య పల్లె గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పట్లో రాజు తో చదువుకున్న మిత్రులందరూ రాజు కుమార్తె పేరు మీద ఉన్నత చదువులు కొరకు రూ. ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిదుల రవీ గుండ్లపల్లి శ్రీనివాస్ వంగ కుమార్ గడ్డం ఉపేందర్ ఐలయ్య రవి పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో పిల్లల నమోదు పెంచుదాం.

సర్కారు బడుల్లో పిల్లల నమోదు పెంచుదాం

సర్కారు బడిని బలోపేతం చేద్దాం

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు , సర్కారు బడిని బలోపేతం చేద్దామని డీఈవో రవీందర్, ఎంఈఓ అనిత దేవి ఆదేశానుసారం మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం మరిపెడ మండల కేంద్రం లోని రాంపురం, చిల్లంచర్ల, భావోజిగూడెం, వెంకంపాడు గిరిపురం,తానంచర్ల, మండలంలోని వివిధ గ్రామాల్లో బడి బాట కార్యక్రమం చేపట్టారు, రాంపురం గ్రామంలో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణవేణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో విద్యార్థులను చేర్పించాలని వారు కోరారు.గ్రామాల్లోని పిల్లలను వారి తల్లిదండ్రులు ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని సూచించారు.ఆర్థిక భారం తగ్గించుకుందామని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, ఇంగ్లీష్ మీడియం తో పాటు, కంప్యూటర్ విద్యాబోధన జరుగుతుందని వారు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఉదయం అల్పాహారం,మధ్యాహ్న భోజనం,రాగి జావా, పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్, అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శశిధర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్, పంచాయతీ కార్యదర్శి అజయ్,ఉపాధ్యాయులు జయపాల్ రెడ్డి,హరి శంకర్, గణేష్,శ్రీనివాస్,కిన్నర శ్రీను, మన్సూర్ ఆలి,చంద్ర ప్రకాష్ విద్యార్థుల తల్లిదండ్రులు పరశురాములు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మొత్తం 24 మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రంజిత్ నోటు పుస్తకాలను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ రామచంద్రయ్య తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత.

విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కరేటేలో ఝరాసంగం సిద్దు మాస్టర్ విద్యార్థుల ప్రతిభ జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సదాశివపేట పట్టణంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ ను తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ జిల్లా ఎగ్జామినర్ శంకర్ గౌడ్ మాస్టర్ జిల్లా చీఫ్ చందర్ మాస్టర్ ఎగ్జామినేటర్గా విద్యార్థులను పరీక్షించారు. ప్రతిభ కనబరిచిన సైఫ్ సంగమేశ్వర్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ లో గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దు మాస్టర్ సతీష్ గౌడ్. శ్వేత వారిని అభినందించడం జరిగింది

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన.

ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద ప్రజల కొరకు ఇందిరమ్మ గృహ నిర్మాణం శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఝరాసంగం మండలం లో గల కొల్లూరు,కక్కరవాడ,జోనవాడ,ప్యారవరం మరియూ లో గల వివిధ గ్రామాలలో ఈ రోజు ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల అధికారి MPDO సుధాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ గారు,కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, నందు పాటిల్, యూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, లక్ష్మారెడ్డి,ఆలయ ఛైర్మన్ రాజేందర్, వీరన్న పాటిల్,నర్సింలు, విజయ్ కుమార్, ఎం విష్ణు, సి సుబాకర్, సి ప్రకాష్, సతీష్ గౌడ్,మాజీ సర్పంచ్ సిద్ధిరాములు, శ్రీశైలం,రమేష్, దేవదాస్, నర్సింలు మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మరియు వివిధ పార్టీల మండల నాయకులు,సంఘనాయకులు, వివిధ గ్రామల ప్రజలు పాల్గోని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చెయ్యడం జరిగింది.

సిబ్బందికి జీతాలు చెల్లించాలి.

‘సిబ్బందికి జీతాలు చెల్లించాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి: జహీరాబాద్లోని 1962 పశుసంచార వాహన సేవల సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం జీతాలు చెల్లించాలని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూగ జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న వీరికి సకాలంలో జీతాలు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన

ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవo.

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దేవాలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని,స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించి,స్వామి వార్ల ఆశీస్సులతో గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది…ఈసందర్భంగా
ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు మాట్లాడుతూ…తమ గ్రామంలో ఆంజనేయ స్వామి నూతన దేవాలయ నిర్మాణంలో బాగంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కలిసిన వెంటనే దేవాలయానికి తన వంతు సహకారంగా దాదాపు రూ.5,00,000/-(ఐదు లక్షలతో) పెయింటింగ్ పనులు పూర్తి చేసి దేవాలయ అభివృద్ధికి సహకారం అందించినందుకు గ్రామస్తులందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో…గ్రామ మాజీ సర్పంచ్ పి.లింగారెడ్డి, సీనియర్ నాయకులు అల్వాల్ రెడ్డి బన్నె శ్రీధర్,పి.పరమేశ్వర్, ఎల్.తిరుపతయ్య, ఎల్.లాలయ్య, జి.బాలస్వామి,లింగం శ్రీను,బన్నె శ్రీను,బన్నె మల్లయ్య,ఎం.బుచ్చిరెడ్డి లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి నేటిధాత్రి : 

 

భూపాలపల్లి రూరల్ మండలం నేరేడుపల్లి గ్రామంలో తాసిల్దార్ శ్రీనివాస్ భూభారతి రెవెన్యూ అవగాహన న సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 3 నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహిస్తా ప్రజలు తమ భూమికి సంబంధించిన దరఖాస్తు ఇవ్వాలని సూచించారు ప్రతి దరఖాస్తుదారుడు లెక్క పక్కగా ఉండేటందుకు రిజిస్ట్రేషన్ లో నమోదు చేస్తాం అని వారు అన్నారు నేరేడుపల్లి గ్రామంలో మొత్తం 363 దరఖాస్తులు వచ్చాయి వాటిని పరీక్షిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రామస్వామి ఏఎస్ ఓ విజయ్ కుమార్ టైపిస్ట్ రాజు రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు

ఇండ్ల స్థలాల భూమి అక్రమ పట్టాకు గురైంది

ఇండ్ల స్థలాల భూమి అక్రమ పట్టాకు గురైంది
జమ్మికుంట: నేటిధాత్రి

– భూ భారతి సదస్సులో దళిత కాలనీ వాసులు ఫిర్యాదు
– ధరణి మా దళితుల బ్రతుకులు దరిద్రంగా మార్చిందని ఆవేదన
– తిరిగి తమ భూమి తమ కాలనీ పేరు మీద పట్టా చేయాలని విజ్ఞప్తి

జమ్మికుంట మండలం,తనుగుల గ్రామం:-

మా మూడు వందల కుటుంబాల ఇండ్ల స్థలాల పట్టా భూమి,అక్రమ పట్టాకు గురైందని,వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని,గురువారము దళిత కాలనీ వాసులు గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి సదస్సులో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా దళిత కాలనీవాసులు మాట్లాడుతూ…తమకు గ్రామ శివారులో సర్వే నెంబర్ 169/a లో 2.31 గుంటల ఇండ్ల స్థలాల పట్టా భూమి కలదని దానిని తమ గ్రామానికి చెందిన నిమ్మకాయల నర్సయ్య తండ్రి మల్లయ్య అక్రమ పత్రాల సృష్టించి గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రం ఆధారంతో ధరణిలో అక్రమ పట్టా చేసుకున్నాడని తెలిపారు.ధరణితో మా దళిత కుటుంబాల బ్రతుకులు దరిద్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై తాము గత మూడు సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ పట్టా చేసుకున్న నిమ్మకాయల నర్సయ్య తండ్రి మల్లయ్య పేరును,భూ రికార్డుల నుంచి తొలగించి,తిరిగి తమ దళిత కాలనీ పేరు మీద పట్టా మార్పిడి చేయాలని వేడుకున్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

 

గచ్చిబౌలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అనే పంచభూతాలు ప్రకృతిలో భాగమని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగితే భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

protection

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, లత, రోజా, నాయకులు సయ్యద్ గౌస్, సంఘ, దేవేందర్, అమన్, బాలరాజు సాగర్, సందీప్ ముదిరాజ్, నవీన్ ముదిరాజ్, నర్సింహ గౌడ్, టోనీ, విజయ్, కిరణ్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version