వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది.

*వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది

బిజెపి మాజీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు జన్నేమొగిలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల నూతన కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజర య్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది భారతదేశం 2047 నాటికి ఒక పూర్తిగా వికసిత దేశంగామారా లన్న దృష్టితో ఏర్పడిన అభిప్రా యం భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికిదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన దేశంగా నిలిపే లక్ష్యంతో నరేంద్ర మోడీ పని చేస్తున్నారు

వికసిత్ భారత్ లక్ష్యం

 

 

Former BJP

 

 

ఆర్థిక అభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దడం,ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగావకాశాలను సృష్టించడం, ఐటీ, మానుఫా క్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధిసమాజ పరంగా సమగ్రత సామాజిక సమానత్వం, లింగ సమాన త్వం, విద్యావృద్ధిఆరోగ్య సదుపాయాల వృద్ధిపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం పరిశుభ్రమైన, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తుల ప్రోత్సాహంకాలుష్య నియంత్రణ, నీటి వనరుల పరిరక్షణసాంకేతికత ఆధారిత అభివృద్ధిడిజిటల్ ఇండియా అభియాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజ భారత విలువలు మరియు సంస్కృతిని పరిరక్షించుకుంటూ అభివృద్ధి సంస్కృతి,భాషలు, సంప్రదా యాలను గౌరవిస్తూ ఆధుని కతను అంగీకరించడం భారత యువతకు ఒక ప్రేరణాత్మక దిశను చూపుతుంది.దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు,సంస్కరణలు ఒక దీర్ఘకాలిక దృష్టికోణంతో అమలవుతాయి.ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ స్థానం మరింత శక్తివంతంగా మారుతుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి లాడే శివ, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విజయ్, భూతం తిరుపతి, మండల కార్యదర్శులు మేకల సుమన్, వంగరి శివ శంకర్, కొంగరి భారతి, సీనియర్ నాయకులు మోత్కూరు సత్యనారాయణ, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, వంగల భాస్కర్ రెడ్డి, మును కుంట్ల చంద్రమౌళి,కన్నెబోయిన రమేష్, మూడేడ్ల పైడి, పరుష బోయిన శంకర్, బత్తుల రాజే ష్, కొంగర సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి, మూడేడ్ల రాంప్ర సాద్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకుందాం.

ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకుందాం.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం లో భాగంగా గ్రామ కూడలిలో గ్రామ సభ గ్రామస్తులు, విద్యార్థుల చే నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు, రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గిపోతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే పాఠశాల లు మూత పడి పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని, కావున ప్రభుత్వ బడుల పరిరక్షణ కొరకు ప్రతి గ్రామస్తుడు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సాధించిన విజయాలపై “కరపత్రాలు “ముద్రించి గ్రామ సభ లో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, పంచాయతీ కార్యదర్శి సరిత, గ్రామ పెద్దలు దూదిగాం గంగాధర్, లక్ష్మి నర్సయ్య, ప్రసాద్, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, రాణి, నర్మదా, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

 

 

తంగళ్ళపల్లి నేటిధాత్రి:

 

 

 

 

మండల చెందిన.కాంగ్రెస్ పార్టీ.సీనియర్ నాయకులు గత కొన్ని రోజులు బాధపడుతున్న నర్రా బాల్రెడ్డిని.ఆయనను తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈరోజు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పరామర్శించి మనోధైర్యం ఇచ్చి అన్ని రకాలగా ఆదుకుంటామని పెద్దలదృష్టికి తీసుకెళ్లి సహాయ అందిస్తామని.ఆయనకు హామీ ఇవ్వడంతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ళ నరసింగం.గౌడ్ డైరెక్టర్ బాలు శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆచారి బాల్రాజ్ మనోజ్ ఉమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. పేద ప్రజల ప్రభుత్వం అని పేదల సంక్షేమానికి కాంగ్రెస్ నైజం అని ఇందిరమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండడానికి అనేక పథకాలు తీసుకొచ్చామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామం జిల్లాల గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని. జిల్లాలలో పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ఇందిరమ్మ కాలనీ జిల్లాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిభూమి పూజలో పాల్గొనడం జరిగిందని. అలాగే రాష్ట్ర పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని. రాష్ట్రాన్ని గత పాలకులు ఎంతో అప్పుల్లో కూర్చున కూడా దాన్ని అధిగమిస్తూ. రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని. అలాంటిది లేనిపోని అబండాలు వేసి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దయచేసి అభివృద్ధి పథంలో భాగ్యస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఎంత కష్టమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్న ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గo గౌడ్. డైరెక్టర్ బాలు. శ్రీనివాస్ రెడ్డి. గడ్డం మధుకర్. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఆసరి బాలరాజు. మనోజ్. ఉమేష్. తిరుపతి గౌడ్. నరసయ్య. సలీం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలు గెలిపించాలి.

పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల కేంద్రంలో మండల కార్యవర్గ సమావేశం బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారాధ్యంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం ఎల్లవేళల శ్రమిస్తూ నరేంద్ర మోడీ ని ఆయన తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధిక స్థానాల్లో గెలుపొందే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ రావుల రాకేష్ బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య మండల ఉపాధ్యక్షులు సుధా గాని శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ రెడ్డి చింతల రాజేందర్ మండల కార్యదర్శి చెన్నవేని సంపత్ బిజెపి సీనియర్ నాయకులు మాచర్ల రఘు, కంచ కుమారస్వామి బూత్ అధ్యక్షులు వల్లల ప్రవీణ్ తీగల వంశీ బుర్రితిరుపతి జైపాల్ చందు వివేక్ తోట్ల మహేష్ గొప్పగాని రాజు మాదారపు రాజు శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి…

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

 

 

 

చత్తీస్ ఘడ్ లో బీజేపీ, నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరా సాగిస్తున్న నరమేధాన్ని నిలుపుదల చేసి, కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎమ్ -ఎల్ మాస్ లైన్ పార్టీల జిల్లా కార్యదర్శులు విజయసారధి, సాధుల శ్రీనివాస్, గౌని ఐలయ్య, కొత్తపల్లి రవి, మధార్ లు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరుపాలని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, గత 18 నెలలుగా మధ్య భారత అడవుల్లో భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో హత్యకాండ కొనసాగిస్తుందని తెలిపారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కొరిందని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు కోరుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కగార్ ని వెంటనే నిలిపివేసి, బలగాలను వెనక్కి రప్పించాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు సమ్మెట రాజమౌళి, బానోత్ సీతారామ్, బండారి ఐలయ్య,అజయ్ సారధి రెడ్డి, మండల వెంకన్న, గునిగంటి రాజన్న, పెరుగు కుమార్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్ నూతన కమిటీని సన్మానించిన వరికెల.

ఫర్టిలైజర్ నూతన కమిటీని సన్మానించిన వరికెల

పరకాల నేటిధాత్రి

 

పరకాల మండల ఎరువులు పురుగు మందులు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు, ఎర్ర లక్ష్మణ్ లను తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు,కార్మిక సంఘ నాయకులు లంకదాసరి అశోక్ లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా నూతన కమిటీ కృషి చేయాలని కోరారు.

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం..

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం..

విజేతలకు నగదు షీల్డ్ అందజేసిన సిరికొండ ప్రశాంత్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం జన్నె యుగంధర్ అధ్యక్షతన జరగగా ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పార్టీలకతీతంగా యువత కోసం ఎక్కడైనా వస్తానని ప్రాణమై నిలుస్తానని

ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆటలకు యువత దూరమవుతున్న నేటి పరిస్థితులలో క్రీడలను ప్రోత్సహించాలని సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

క్రీడలు అంటే తనకు పంచ ప్రాణమని క్రీడలు ఆడేవారన్న చాలా ఇష్టమని అందుకనే పార్టీలకతీతంగా క్రీడలకు సహకరిస్తానని ఆయన తెలిపారు భూపాలపల్లి ని జిల్లా చేయడంతో పాటు అద్భుతమైన అభివృద్ధి చేసిన మాజీ స్పీకర్ బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తనయుడిగా ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషిచేయడమే కాకుండా ప్రజల కష్టాలలో పాలుపంచుకుంటానని తెలిపారు గత వారం రోజులుగా క్రికెట్ క్రీడలను కొనసాగిస్తూ విజయవంతం చేసిన నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ గెలుకున్న విజేతలకు ప్రశాంత్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

విజేతలు మొదటి విజేతలుగా కేకేఆర్ జట్టు నిలువగా రెండవ విజేతలుగా విక్టరీ లేవన్ జట్టు మూడవ విజయంశాలుగా ఛాలెంజర్ జట్టు నాలుగవ విజేతలుగా ఎలిమినేటర్ జట్టు నిలిచాయి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతగా దాసరపు మహేష్ నిలిచారు కాగ మొదటి జట్టుకు ట్రోఫీతో పాటు 40 వేల రూపాయల నగదును ద్వితీయ బహుమతిగా 20వేల రూపాయల నగదు షీల్డ్ ను సిరికొండ ప్రశాంత్ విజేతలకు అందించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ శశికాంత్ గౌడ్ జన్నె యుగంధర్ మాజీ సర్పంచ్ రాములు కార్యక్రమం నిర్వాహకులు వేల్పుల రాజ్ కుమార్ గడ్డం నితిన్ లవన్ బాబులు రంజిత్ వెంకన్న ప్రకాష్ కన్నా పూర్ణ యాదవ్ గురుకుంట్ల కిరణ్ సంగా రాజేందర్ కోడెల రాజమల్లు కోడెల నంది గొల్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ సందర్భంగా.

ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ సందర్భంగా మెరుగైన పరిశుభ్రత సేవల

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కోహిర్ మండల జమాతే ఇస్లామీ హింద్ కోహీర్.
ఆధ్వర్యంలో మున్సిపాల్ కమిషనర్ ను ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ
ఒక లేఖ పత్రాన్ని సమర్పిస్తూ రేపు రాబోయే ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ సందర్భంగా మెరుగైన పరిశుభ్రత సేవలను నిర్ధారించడం గురించి మా ఆందోళనను తెలియజేయడానికి మేము వ్రాస్తున్నాము. బక్రీద్ అనేది 3 ప్రధాన మతపరమైన వేడుకల రోజులలో జరుపుకుంటుంమని. 7 జూన్ నుండి 9 జూన్ 2025 వరకు ఈ పండుగ రోజున ముస్లింలు ప్రవక్త ఇబ్రహీం (అ) సున్నత్‌ను అనుసరించి మత విశ్వాసంలో భాగంగా ఆచారబద్ధమైన జంతులను బలి ఇస్తారు.ఈ 3 రోజుల పండుగ పెద్ద బలి, ఇది చుట్టుపక్కల అవాంఛిత వ్యర్థాలను పెంచుతుంది.
కాబట్టి ఇళ్ల నుండి వ్యర్థాలను సేకరించి, జనసాంద్రత ఉన్న ప్రాంతానికి దూరంగా నియమించబడిన ప్రదేశానికి పారవేయడం ద్వారా శుభ్రమైన మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.కోహిర్ పౌరులకు పెద్ద డిస్పోజల్ బ్యాగులను అందించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము,తద్వారా వారు వ్యర్థాలను సంచిలో వేయవచ్చు మరియు తరువాత దానిని మున్సిపల్ కార్మికులు సేకరించవచ్చు. దీని ద్వారా కోహిర్ పరిశుభ్రమైన మరియు పరిశుభ్రమైన నగరంగా ఉండేలా మేము నిర్ధారించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

కొండూరు గ్రామంలో బడి బాట కార్యక్రమం.

కొండూరు గ్రామంలో బడి బాట కార్యక్రమం.

నేటిధాత్రి, రాయపర్తి.

 

 

 

 

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వ ఆదేశానుసారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కొండూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత మాట్లాడుతూ పాఠశాలలో మంచి నైపుణ్యము, ఉన్నత విద్యార్హతలు కల ఉపాధ్యాయులు ఉన్నారని పిల్లలకు అన్ని విధాల విద్యా సంబంధమైన విషయాలు, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందించుటకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులను వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేస్తూ వారు మంచి ప్రయోజకులు అయ్యే విధంగా అన్ని విధాల వారికి సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రఘు, నాగరాజు, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్యా నాయక్, స్వామి, అమర స్వర్ణ, శివకృష్ణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, రజినీకాంత్, అనిత, గౌతమిలు పాల్గొన్నారు.

సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు మిథున్ రాజ్, బొల్లారం రత్నం , మాజి సర్పంచ్ సంజీవ్,కళాకారుడు సునీల్,నాయకులు జూబీర్,అమీర్,జగన్ తదితరులు .

మున్సిపల్ కార్యాలయంలో “ముద్దులు”..

మున్సిపల్ కార్యాలయంలో “ముద్దులు”..

గ్రేటర్ వరంగల్ బల్దియా కార్యాలయంలో “హద్దులు” మీరిన కొత్త “ఉద్యోగులు”.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షణ కరువు?

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న బల్దియా కార్యాలయం?

వరంగల్, నేటిధాత్రి

 

 

 

 

కామానికి కాదేది అడ్డు అన్నట్టు, ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో ముద్దులు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల ముద్దులు, హగ్గులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది.

బల్దియా కార్యాలయం అకౌంట్స్ సెక్షన్ లో ఇటీవలే ఉద్యోగంలో చేరిన వివాహిత మహిళా, అదే విభాగంలో పనిచేసే ఓయువకుడు ఇద్దరు కలిసి సాయంత్రం వేళ ఏకంగా కార్యాలయంలోనే ముద్దులు పెడుతున్న వీడియో వైరల్ అవుతుంది.

అధికారులు ఎన్ని సార్లు చెప్పిన కొందరి ప్రవర్తన మారట్లేదు అనేది అంటున్నారు తోటి ఉద్యోగులు.

ఆఫీసులో ఇలాంటి పనిచేయడం ఏంటి అని తిడుతున్నారు మరి కొందరు సిబ్బంది.

 

Municipal Office.

 

నిత్యం ప్రజలు తిరిగే పబ్లిక్ కార్యాలయంలో కామక్రీడలు చేయడం హాట్ టాపిక్ అయింది.

సీసీ కెమెరాలు లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వీరికి కలిసొచ్చింది అనే చెప్పొచ్చు.

ఏది ఏమైనా మరోసారి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు కొందరు ఉద్యోగులు.

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఎమ్మెల్యేకు ఎంసిపిఐ(యు) నేతల వినతి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నెలకొన్న సమస్యల పట్ల ఎంసిపిఐ(యు) నేతలు వినతిపత్రం సమర్పించారు.నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో అదే కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగసుధ మాట్లాడుతూ కాలనీలో ముఖ్యంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే వరద నీరుమొత్తం కాలనీలోకి చేరి ఇండ్లు బురద మయంగా మారుతున్నాయని ,దీంతో విష సర్పాలు ఇళ్లలోకి చేరి కాలనీ వాసుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లె అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు కాలనీవాసులు అందరు కూడా అర్హులేనని,వారందరికీ వెంటనే ఇల్లు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని అనర్హులకు కాకుండా అర్హులకు వర్తించేలా చూడాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ యు నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి , స్థానిక నాయకులు గజవెల్లి జగపతి , గణిపాక బిందు ఎండి ఆరిఫ్ , జను జమున , చొప్పరి పద్మ గుజ్జుల శివ , క్రొర్ర మాలమ్మ బైరవైన నరసయ్య ,ఎస్.కె సద్దాం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు.

ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు…

నేటి ధాత్రి -బయ్యారం :-

 

 

 

 

అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి,ప్రజానాయకుడు, మనసున్న మారాజు,అవినీతి లేని నాయకుడు, గిరిజన ముద్దుబిడ్డ,మాజీ కేంద్రమంత్రి కోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బయ్యారం పట్టణ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, మహిళ కమిటీ మండల అధ్యక్షురాలు తగిరా నిర్మల రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తెప్పించి బయ్యారం ఏజెన్సీ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి మల్లయ్య, తగిరి సత్తి రెడ్డి, భూక్యా రవి నాయక్, చెరుకుపల్లి నాగమణి, దాసరి శ్రీధర్, చల్ల గోవర్ధన్, సరోజ, సుజాత, నాగమణి తదితరులు పాల్గొన్నారు

గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి.

గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి – భజరంగ్ దళ్.

అచ్చంపేట/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎస్పీని కలిసి, గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ అచ్చంపేట ప్రఖండా సంయోజక్ శివ చంద్ర మాట్లాడుతూ, గోవధ వల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. గోవులను రక్షించడం మనందరి బాధ్యత అని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ గారు వినతి పత్రాన్ని స్వీకరించి, సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో భజరంగ్ దళ్ కమిటీ సభ్యులు శివాజీ నరేష్, చందులాల్ చౌహాన్, అమర్, అజయ్, చైతన్య చారి, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.

వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం.

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం

జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహణ

ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న బోధన వసతులు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలి

బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదు చేయాలి

ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాలు వసతులు తల్లిదండ్రులకు తెలియచేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తేదీ జూన్ 6 నుండి 19 వరకు జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంపొందించడం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాల, బాలిక తప్పనిసరిగా పాఠశాలల్లో ఎనరోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణ పై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, అంగన్వాడి ఆయా ఏఎన్ఎం వివోఏలు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాలికల ఎనరొల్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ నూతన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న మెరుగైన నాణ్యమైన విద్యా బోధన, వసతులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వివిధ పోటీ పరీక్షలు జేఈఈ నీట్ ఎంట్రన్స్ పరీక్ష కోచింగ్ డిజిటల్ క్లాస్ రూమ్ తరగతులు, విశాలమైన ప్లే గ్రౌండ్ మొదలగు వివరాలు తల్లిదండ్రులకు వివరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలు ఎక్కడ డ్రాప్ ఔట్ కాకుండా చూడాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు విద్య పట్ల ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

పదవ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికల పై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలలో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు.

 

School Walk Program

 

 

జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, హోటల్స్, ఇట్టుక బట్టిలను తనిఖీ చేసి ఎవరైనా బాల కార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలల్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలలో నమోదయ్యేలా జాగ్రత్త వహించాలని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని, పిల్లలు చదువుకొని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ శేషాద్రి, జిల్లా వైద్య అధికారి రజిత ,విద్యాశాఖ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పురస్కారాలు.

విద్యార్థులకు.. పురస్కారాలు

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూల్ కల్వకుర్తి మండలంలోని,
పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం పదవతరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ మహిళ సంఘం అధ్యక్షురాలు గోవిందు మౌనిక సంతోష్ యువజన విభాగం అధ్యక్షుడు సంబు తరుణ్ కుమార్ ఆద్వర్యంలో మెమెంటో లతో సన్మానం కార్యక్రమం నిర్వహిoచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులుగా దేశానికి ముందు నడపాలని విద్యార్థుల చేతుల్లోనే దేశ బాధ్యత ఉంటుందని ఇలాగే చదివి మంచి ప్రతి కనబడచాలని మరి అబ్దుల్ కలాం లాగా దేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండలం అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, వాస శేఖర్ ఆర్యవైశ్య సంఘం మండల, పట్టణ మహాసభ నాయకులు, ఆర్యవైశ్య సంఘం మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొత్తపేటలో భూభారతి సదస్సు.

కొత్తపేటలో భూభారతి సదస్సు.

రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్..

నేటిధాత్రి, కొత్తపేట, వరంగల్

 

 

 

వరంగల్ మండలం పరిధిలో గత మూడు రోజులుగా రెవెన్యూ అధికారులు భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నిన్న పైడిపల్లిలో దరఖాస్తులు స్వీకరించిన వరంగల్ మండల రెవెన్యూ అధికారులు. వాటిలో బాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ కొత్తపేట గ్రామంలో ఎన్నో ఏండ్లగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామ దరఖాస్తులను కూడా భూభారతిలో పరిశీలించి పట్టా చేయుటకు వరంగల్ తహసిల్దార్ కు దరఖాస్తు అందచేశారు కొత్తపేట రైతులు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రైతులు నేరెళ్ల రాజు, లంక రాజగోపాల్, బల్లని ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి.

ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి

-బడిబాట కార్యక్రమం ను విజయవంతం చేయాలి

-ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

–మండల విద్యాశాఖ అధికారిణి శ్రీమతి పొదెం మేనక

మంగపేట-నేటిధాత్రి

 

 

 

ప్రభుత పాఠశాలల్లో విద్యార్థుల నమోదును అధిక సంఖ్యలో చేసి ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దీనికోసం చేపట్టే బడిబాట కార్యక్రమంను విజయవంతం చేయాలని మంగపేట ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ లో పాల్గొన్న మంగపేట మండల విద్యాశాఖ అధికారి మరియు మంగపేట ఉన్నత పాఠశాల గెజిటెడ్
ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పొదేం మేనక
అన్నారు.

 

Quality education

 

ఈసందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గూర్చిఅవగహన కల్పించడం జరిగింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్య ,ల్యాబ్ సౌకర్యం,ఆటపాటలతో కూడిన విద్యార్థి కేంద్రీకృత విద్యాబోధన,ఉచిత యూనిఫాంలు,పుస్తకాలు, నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం,ఆడపిల్లలకు కరాటే శిక్షణ,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తదితర ఎన్నెన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని ,కావున విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాల్లో నమోదు చేపించి ప్రభుత్వం పాఠశాల లకు పూర్వ వైభవం కల్పించాలని ,ఈ దిశగా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా సహకరించాలని,తద్వారా నేటినుండి చేపట్టబడినప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంను విజయ వంతం చేయాలని అన్నారు.

 

Quality education

 

ఈ సందర్భంగా బడిబాట ర్యాలీ ని కూడా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీ ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వెంకటస్వామి,ఉపాధ్యాయులు , సానికొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి, అనంత రావు ,వందన మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొనడం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన.

ప్రభుత్వ పాఠశాలలోనే నాన్యమైన బోధన
• గ్రామ సభలో గ్రామస్తులకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో శుక్రవారం “మనబడి మన – బాధ్యత” అనే కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దని ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులతో కూడిన విద్యాబోధన లభిస్తుంది అని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఎంసీ చైర్మన్ వడ్ల నర్మద, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు గణేష్, దశరథం, అంగన్వాడి టీచర్ జ్యోతి, ఆశ వర్కర్ పుష్పలత, గ్రామస్తులు బురాని మంగ, బురాని వాణి, ఉడెపు శ్రీశైలం, మంగలి అమరేందర్ లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version