బెంగళూరు తొక్కిసలాట.. కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు.

బెంగళూరు తొక్కిసలాట.. కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు

 

Virat Kohli: నేటిధాత్రి

 

 

 

 

 

ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో కోహ్లీపై కూడా ఫిర్యాదు దాఖలైంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫిర్యాదు దాఖలైంది. శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎమ్ వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పోలీసు స్టేషన్‌లో కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే రిజిస్టరైన కేసులో భాగంగా ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇక బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరో 50 మంది గాయపడ్డారు. ఆర్సీబీ ప్లేయర్లను సత్కరించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడి డ్రెయిన్‌పై ఉన్న మూత కూలడంతో జనాల్లో కంగారు బయలుదేరి తొక్కిసలాటకు దారి తీసింది. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వారు ఉన్నారు.

మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటీ కమిషనర్ బీ దయానందతో పాటు పలువురు పోలీసు ఉన్న ఉన్నతాధికారులు సస్పెండ్ చేసింది.

అనంతరం, సీమంత్ కుమార్ సింగ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది. ఇక ఆర్సీబీ టీమ్‌, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏ నెట్వర్క్ తోపాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేని పోలీసులు అరెస్టు చేశారు. డీఎన్ఏ నెట్‌వర్క్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సొసాలేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు చట్ట వ్యతిరేకమంటూ సొసాలే కోర్టును ఆశ్రయించారు.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం.

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమోఘమైన పథకం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు.

ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య.

“నేటిధాత్రి”,బాలానగర్. (హైదరాబాద్):

 

 

 

 

ప్రభుత్వం నుండి నేరుగా మహిళలకు అందే పథకం ఏదైనా ఉందని అడిగితే అది కేవలం ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమేనని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి తిరునగరి లావణ్య అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవమైన పథకం అని ఇందులో ఎలాంటి బేషజాలు ఉండకూడదని ఆమె అన్నారు. బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయని, మహాలక్ష్మి పథకం లేనపుడు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. రోజు బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు మహాలక్ష్మి పథకం ముందు వెనుక ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఉచితం అని అందరూ బస్సుల్లో చేయడం లేదని ఇతర వాహనాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారని ఆమె తెలిపారు. అంతే గానీ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పెట్టిన పథకాలను అగౌరవపరచకుండా , మన హక్కుగా భావించి అవసరాల నిమిత్తం మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. కేవలం మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు పథకం మాత్రమే రద్దు చేయాలనీ కొంతమంది కోరుకోవడం తగదని ఆమె అన్నారు. మహిళల కోసం పెట్టిన పథకాలను కొంతమంది సాటి మహిళలలే విమర్శించడం ఒక బాధ్యత గల పౌరురాలిగా తీవ్రంగా ఖండిస్తున్నాని ఆమె తెలిపారు. అనేక వ్యయ ప్రయాసలకోర్చి మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు.

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు.

సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు వస్తాయని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండలం అమీన్‌బాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

 

High profits through integrated farming system.

వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ రైతులు ఒక నెల వరి పంటను ఆలస్యంగా వేస్తున్నారని ఇకనుండి ముందుగా వేయాలని సూచించారు.ముఖ్యంగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వరిని తొందరగా విత్తడం వలన అధిక దిగుబడి సాధించవచ్చని, తెగుళ్లు మరియు చీడ పీడలప్రభావం తగ్గించవచ్చని అలాగే ముందుగా వరి కోయవచ్చని వివరించారు. అలాగే, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలని అలాగే రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలన్న సూచనలు చేశారు.రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ,చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను కూడా చేయాలని, సమగ్ర వ్యవసాయ విధానం ను అనుసరించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ వివరించారు.

రైతుల ఆదాయాన్ని పెంచడమే కాక, వ్యవసాయాన్ని స్థిరీకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో 1.8 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించబడినదని విషయాన్ని వారు మరోసారి గుర్తు చేశారు. అదేవిధంగా, చిన్న తరహా వ్యవసాయ యంత్రాల వాడకం ద్వారా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వివరించారు. రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమం లో మరియు వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని రైతులకు సూచించారు.వికాషిత్ కృషి సంకల్ప్ జిల్లా నోడల్ ఆఫీసర్ డా. రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్, కేవికే మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు, కార్యాచరణ అంశాలు గురించి రైతులకు వివరించారు.

కార్యక్రమం ద్వారా రైతులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించి, మెరుగైన వ్యవసాయ పద్ధతులు అమలు చేయడం లక్ష్యమని చెప్పారు. అలాగే డా. తమ్మీ రాజు గారు పశు పోషణ, టీకాలు మరియు పరి శుభ్రమైన పాల ఉత్పత్తి గురించి వివరించారు.జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం నేలలో భూసారం పెరుగుతుందని మరియు అధిక దిగుబడి రకాల గురించి వివరించారు. పశుసంవర్ధక శాఖజాయింట్ డైరెక్టర్, డా. బాలకృష్ణ మాట్లాడుతూ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద ఎవరైనా లోన్ తీసుకొని పశువుల పెంపకం చేపట్టాలని తెలిపారు. నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్తలు డా. రాజు మరియు శతీష్ చంద్ర , స్థానిక మండల రెవిన్యూ అధికారి ఫణికుమార్ , మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి గార్లతో పాటు రైతులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

భూభారతి రెవెన్యూ సదస్సుల పరిశీలించిన కలెక్టర్

అనంతరం చెన్నారావుపేట మండలం అమినాబాద్ లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించి రైతులు అందించిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
రైతులకు సులభతరమైన విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధి కారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ నెల 20 వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
ధరఖాస్తు కోసం వచ్చే వారికి కేంద్రంలో ఏర్పాట్లు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాలని ఆన్నారు.
రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఫణి కుమార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి పెద్ద పండుగ..

ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి పెద్ద పండుగ..

-కాంగ్రెస్ తోనే పేదలకు సొంతింటి కల సాకారం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హత గల నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబానికి నేడు పెద్ద పండుగ అయ్యిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.కాంగ్రెస్ తోనే పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని, పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరనం కనిపిస్తుందని మాధవరెడ్డి రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా శుక్రవారం నర్సంపేట పట్టణానికి చెందిన, 01,04,14,15,17,18,వార్డుల్లో మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముగ్గులు పోయించి కొబ్బరికాయలు కొట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లులేని ఊరు ఒక్క గ్రామం కూడా లేదని అన్నారు.

పదేళ్లలో పరిపాలించిన బిఆర్ఎస్ పాలకులు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు.

పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అర్హులకు మాత్రమే ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అర్హులకు న్యాయం చేయాలనేదే నా ఆకాంక్షాన్ని, ప్రతిపక్షాల మోసపూరిత మాటలలో పడద్దని ఎమ్మెల్యే దొంతి చెప్పారు.

ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.

 

MLA Donthi Madhav Reddy

 

 

ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, హౌసింగ్ డిఈ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్,టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

బడిబాట కార్యక్రమం ప్రారంభం.

బడిబాట కార్యక్రమం ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి బాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యురాలు శ్రీలత బడిబాట కార్యక్రమం కరపత్రం ఆవిష్క రించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య గూర్చి తెలియజేశారు.

అనంతరం శాయంపేట కూడలి వద్ద ఉపాధ్యాయులతో కలిసి ప్రధానోపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలల బలోపే తం గూర్చి ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ప్రధానో పాధ్యా యురాలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తు న్నామని ప్రభుత్వం విద్యార్థు లకు ఉచిత పుస్తకాలు అంది స్తూ భోజన సౌకర్యం కల్పిస్తుం దన్నారు.

ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో నే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

Govt Schools Principal Srilatha.

 

 

 

అంతకుముందు పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమం లో 2025 ఎస్ ఎస్ సి ఫలితా లు అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన అక్షయ,సాయి,ఎండి.

అమ్రీన్ లకుప్రధానోపాధ్యాయు రాలు టి.శ్రీలత ప్రశంసా పత్రా లు అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు శేఖర్ బాబు, సుజాత , లక్ష్మీబాయి ,రేణుక ,గీత, కుమారస్వామి, రంజిత్ కుమార్, విజయలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ మెంబర్స్, పాఠశాల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

నేత్ర వైద్య విద్యకు తోడ్పాటు..

నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపు నేత్ర వైద్య విద్యకు తోడ్పాటు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండలంలోని తోపనపెల్లి గ్రామ వాసి ఒంటెల యకమ్మ 90 గారు మరణించగా, దుఃఖం లో యుండి కూడా కుటుంబ సభ్యులు కుమారులు పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి మధుసూదనరెడ్డి, మనుమడు కరుణాకర్ రెడ్డి మనుమలు ‘’సమాజ హితం కోరి, ‘’నేత్రదానం చేయడానికి అంగీకరించగా, “” తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో “” వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ టెక్నీషియన్ లక్షమన్ ద్వారా నేత్రదానం కార్నియా సేకరణ చేయనైనది.మృతురాలు యాకమ్మ గారి నేత్రదానంతో ఇద్దరి అందులకు చూపునివ్వడం తో పాటు భావి వైద్యుల నేత్ర వైద్య విద్యకు ఉపయోగ పడినవారయ్యారన్నారు కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపి నేత్రదాన సర్టిఫికెట్ ఇవ్వనైనది.మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరి అందులకు చూపునిద్దాం మరియు నేత్ర వైద్య విద్యకు తోడ్పడుదాం సామాజిక బాధ్యత నెరవేర్చుకుందాం అని అసోసియేషన్ ప్రతినిధి అన్నారు. వివరాలకు 8790548706, 9908088011సెల్ నెంబర్ లలో సంప్రదించవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమములో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లీ ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి,పాల్గొన్నారు. ‎

ఇదే నిజమైన ఇందిరమ్మ రాజ్యం…

ఇదే నిజమైన ఇందిరమ్మ రాజ్యం…

ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్

కేసముద్రం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని మహబూబాబాద్ శాసనసభ్యులు డా.మురళీ నాయక్ స్పష్టం చేశారు.

శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలోని పలు గ్రామాలు మరియు రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు.

 

This is the real Indiramma Rajyam…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ, ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..

పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు.

కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న,రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం.

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ప్రారంభించడం జరిగింది.
శుక్రవారం రోజు మండలంలోని సూరారం మూల మలుపు వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇంధన విక్రయ కేంద్రం, వినాయక ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడిన వినాయక పెట్రోల్ పంతులు, బాజీ జడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ ప్రారంభించారు, మారుమూల ప్రాంతంలో ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అన్నారు. పెట్రోల్, డీజిల్ కొరకు రైతులు మండల కేంద్రానికి, రావాల్సి వస్తుండేదని గ్రామంలో ఇండియన్ ఆయిల్ సబ్ డిస్ట్రిబ్యూటర్ ఇందాన కేంద్రం కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వినాయక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన యజమాని కిరణ్ కు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలుపుతూ, నాణ్యత పరిమాణాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు పెట్రోల్ డీజిల్ అందించాలని కోరారు. వినాయక ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభంలో గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి..

ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి.

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాఅధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరానికి గాను (ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి) అంటూ

 

quality education

ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేష ను) సిరిసిల్ల ..కళాశాల అధ్యాపకులు స్థానిక వెంకంపేట ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రభుత్వం కల్పించే వసతులను పొందాలని వారు తెలిపారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో చేరిన పిల్లలకు ఉచిత పుస్తకాలు, నాణ్యమైన విద్య, ఎంసెట్ తదితర విషయాలలో నైపుణ్యాలు అందించడమే కాకుండా ఇంటర్మీడియట్ అనంతరం ఇంజనీరింగ్ విద్యలో ఉచిత విద్యను పొందవచ్చు అని వారు తెలిపారు. ఈ అడ్మిషన్ డ్రైవ్ లో ప్రిన్సిపాల్ శ్రీ విజయ రఘునందన్,అధ్యాపకులు సామల వివేకానంద ,ఆంజనేయులు ,శ్రీనివాస్ ,
చంద్రశేఖర్ ,రాజశేఖర్ పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం.

మల్లక్కపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం

పరకాల నేటిధాత్రి

 

 

హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండగ అని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, పంచాయతీ కార్యదర్శి సుమలత,పాఠశాల చైర్మన్ దుమాల లక్ష్మి, కారోబార్ ఆనందరావు,అంగన్వాడీ టీచర్ ఉప్పరి భద్రమ్మ ఆయాలు,తల్లిదండ్రులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేట గ్రామం రాచన్న స్వామి ఆలయంలో ఓ వివాహ వేడుకలో శుక్రవారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు మాణిక్ రావు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, గ్రామ పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా, దీపక్ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

మద్రిలో ఇందిరమ్మ ఇళ్ళ పనులు ప్రారంభం.

మద్రిలో ఇందిరమ్మ ఇళ్ళ పనులు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి అధికారులు శుక్రవారము ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు.కొహీర్ మండల పరిధిలోని మద్రిలో గ్రామానికి చెందిన లబ్ధిదారురాలకు అధికారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పరచి నిర్మాణ విధానాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు అజీమ్, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ.

24న హైదరాబాద్ లో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల మహాసభ

మహాసభను జయప్రదం చేయాలి

వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు పిలుపు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

ఈనెల 24 న రోజున హైదరాబాద్ లో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గొలనకొండ వేణు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనున్న అధిక సంఖ్యలో ఉన్న ఆర్టీసీ బీసీ ఉద్యోగులు దైనందిక ఉద్యోగ జీవితంలో, విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల స్థానం రోజు రోజుకు బలోపేతం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగాలన్నారు. మహిళా, పురుష ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించి దారి చూపాలన్నారు. ప్రతి నెల న్యాయబద్ధంగా ఆర్ఎం స్థాయి అధికారితో జరుగవలసిన జాయింట్ మీటింగ్ లో బీసీ ఉద్యోగుల వ్యక్తిగత, తదితర సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆయన కోరారు.

 

Congress

 

 

ప్రతి రెండు సంవత్సరాలకొక సారి జరిగే ఈ రాష్ట్ర స్థాయి మహాసభను ఈనెల జూన్ 24న, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమశాఖ మాత్యులు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించెదరు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇలాయ్యా, ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం, భవిష్యత్తు కార్యచరణ కొరకై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 9 డిపోలు వరంగల్ -1, వరంగల్ -2, హనుమకొండ, జనగాం, పరకాల, భూపాలపల్లి, తొర్రూర్, నర్సంపేట, మహబూబాబాద్ డిపోలకు చెందిన బీసీ ఉద్యోగులు డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, మెకానిక్ లు, మహిళా ఉద్యోగులు,వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభను జయప్రదం చేయవలసిందిగా వేణు పిలుపునిచ్చారు

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత.

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

వీణవంక మండల కేంద్రంలో అతి పెద్ద కల్వల చెరువు పై ఆధారపడి సుమారు 300 మంది మత్స్యకారులు జీవన ఉపాధి కొనసాగిస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా చెరువు యొక్క తూము మరమ్మత్తులు చెడిపోయి నీరు వృధాగా పోవడం వలన చెరువులలో చేపలు చనిపోతున్నాయి దీనివలన మత్స్యకారుల జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తూము మరమ్మత్తులు చేయగలరని మా యొక్క మనవి వారు కోరినారు ఈ కార్యక్రమంలో వీణవంకమత్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మోటం,వెంకటేష్ సెక్రెటరీ రాయిశెట్టి కుమారస్వామి డైరెక్టర్ చుక్కల రవీందర్, సభ్యులు రాయిశెట్టి వెంకటేష్, గట్టు రామయ్య, రాయిశెట్టి రమేష్, చొప్పరి సునీల్, నాయిని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ముంగి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

ముంగి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శుక్రవారము నాడు నూతన రెవిన్యూ చట్టం భూ భారతిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ప్రబులు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్ర పరిధిలోని ముంగి గ్రామంలో శుక్రవారము భూ వివాదాల సమస్యల పరిష్కారానికై రెవిన్యూ సదస్సు కార్యక్రమాన్ని పంచాయితీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ నెల 3 నుంచి 20 వరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. భూమి సంబందించిన సమస్యలు ఉన్నట్లు అయితే రెవిన్యూ సదస్సు సమావేశంలో దరఖాస్తులు ఇచ్చినట్లు అయితే తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ రాజిరెడ్డి జూనియర్ అసిస్టెంట్ బి అశోక్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్ రికార్డ్ అసిస్టెంట్ రాములు కంప్యూటర్ ఆపరేటర్ మొహమ్మద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

ఇల్లు మంజూరు అయిన వారు 15 రోజులలోపు నిర్మాణం ప్రారంభం చేసుకోవాలి

ఇల్లు మంజూరు అయిన వారు 15 రోజులలోపు నిర్మాణం ప్రారంభం చేసుకోవాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

 

 

 

మండల పరిధిలోని కామారెడ్డి పల్లి లో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారుల కొరకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి యంపీడీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మరియు నిర్మాణంలో ఏలాంటి అవకతవకలు జరుగకుండా ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే నిర్మించాలని,ఇంటిని 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే నిర్మించాలని ఎక్కడ జియో కోఆర్డినేట్స్ తో ముగ్గు పోస్తే అక్కడే నిర్మాణం చేయాలని అన్నారు.ఇంటి నిర్మాణం ప్రారంభం కాగానే పంచాయతీ కార్యదర్శులు యంపీడీఓ కు ఇసుక మరియు మట్టి కొరకు లేఖ ఇస్తే తహసీల్దారు నుండి ఉచిత టోకెన్ తెప్పించి ఇవ్వ బడునని ట్రాన్స్పోర్టేషన్ మాత్రం లబ్ధిదారులే భరించాలని,మంజూరు విషయంలో కానీ చెల్లింపు విషయంలో కానీ మధ్యవర్థుల ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎప్పటి కప్పుడు పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇస్తే సంబందిత అధికారుల వచ్చి రికార్డు చేసి వెంటనే బిల్లు చెల్లించడం జరుగుతుందని అన్నారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా లబ్దిదారులకు సహకరించాలని సంవత్సరం లోపు అందరూ గృహ ప్రవేశం చేయాలని సూచించారు

 

Mandal Parishad Development Officer Peddi Anjaneyulu.

అనంతరం నాగారం గ్రామంలో 38 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా అందులో 11 ఇండ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ శ్రీలత,మాజీ సర్పంచ్ కట్కూరి స్రవంతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్.

నూతన వదూవరులను ఆశీర్వదించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

నర్సంపేట పట్టణ గౌడ సంఘం సీనియర్ లీడర్ కీశే. వేముల బుచ్చమ్మ,- బొందయ్య గౌడ్ ల పుత్రుడు శుష్మ-రాజేష్ గౌడ్ ల వివాహ రెసెప్షన్ నర్సంపేట పట్టణం లోని సిటిజెన్ క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాచర్ల రమేష్ గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, సుందరగిరి మల్లయ్య గౌడ్, కక్కేర్ల బాబు గౌడ్, ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కొయ్యేడి సనత్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్,కోతి వెంకటేశ్వర్లు గౌడ్,రామకృష్ణ, నాగేల్లి శివరాం కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

కేజిబివిలలో ఎంఎల్టీ నూతన కోర్స్ ప్రారంభం.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

వరంగల్ జిల్లాలో గల దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను
రాష్ట్ర ప్రభుత్వము కళాశాల స్థాయిలో (ఇంటర్ మీడియట్) (ఎంఎల్టీ) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నూతన కోర్స్ లను ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు.ప్రతీ కళాశాలలో ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లను మంజూరు చేయడం
జరిగిందన్నారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోగలరని తెలిపారు. అంతే
కాక 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్ర మరియు జిల్లా ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలు కేజిబివిలు
సాధించయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జిల్లాలో గల 09 కేజిబివిలలో ఖానాపూర్, రాయపర్తి మరియు వర్ధన్నపేట
కేజిబివిలలో ఎంపీసీ,బైపిసి కోర్సులు ,చెన్నారావుపేట, గీసుగొండ, నల్లబెల్లి,సంగెం కేజిబివిలలో సిఈసి,ఎంపీహెచ్ డబ్ల్యు,(మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్) కోర్సులు ఉన్నాయని అలాగే దుగ్గొండి, పర్వతగిరి కేజిబివిలలో ఎంఎల్టి కోర్సులలో అధిక
మొత్తంలో గ్రామీణ ప్రాంతంలోని పేద బలహీనవర్గాల బాలికలు ప్రవేశాలను పొందగలరని జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కోరారు.

శంకర్ కు ఉత్తమ అవార్డు.

శంకర్ కు ఉత్తమ అవార్డు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల ఎంఈఓ శంకర్ కు మల్టీ జోనల్-2లో ఉత్తమ పర్యవేక్షణ విద్య అధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాదులో ఎస్సిఆర్టి డైరెక్టర్ రమేశ్, ఆర్జేడి విజయలక్ష్మి చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న శంకర్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు రావడంతో ఉపాధ్యాయులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే.

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే

జడ్చర్ల /నేటి ధాత్రి

 

జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో రెండు రోజుల క్రితం ఇంటి ముందు సైకిల్ పై వెళ్తుండగా.. విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్ తో శ్రేయన్స్ (10) బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శ్రేయాన్స్ తండ్రి బొక్క రాఘవేందర్ ను పరామర్శించారు. ధైర్యం కోల్పోకూడదని ఓదార్చారు. కరెంట్ షాక్ తో శ్రేయాన్స్ చనిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version