తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా ఫోరమ్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా కో-ఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు.సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాస పథకంలో 20% శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించి నెలకు 25 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారులకు ప్రమాద బీమా ఐదు లక్షలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారుల విభాగం నాయకులు ఎల్ల పోశెట్టి, ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొజ్జ కనకయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెంగళ వెంకటేశం,బొడ్డు రాములు,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
నిద్రమత్తులో విద్యాశాఖ అధికారులు
పుస్తకాలు అమ్ముతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకొని అధికారులు
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వెంకటేష్,మచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలోని నారాయణ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాశాఖ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ధర్నా చేస్తూ పుస్తకాలు అమ్ముతున్నారని డిఈఓ, ఏంఈఓకి సమాచారం ఇచ్చిన పట్టించుకోకుండా రాకుండా స్పందించలేదు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్ లు మాట్లాడుతూ నారాయణ పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా మరియు కరీంనగర్ జిల్లాలో నారాయణ విద్యా సంస్థలలో ఎట్లాంటి ప్రభుత్వాల అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు బుక్కులు, పెన్నులు, షూ ,టై వంటి అక్రమంగా అమ్ముతూ లాభార్జన ధ్యేయంగా నడిపిస్తున్నారని అన్నారు. జీవో 1,10,92,42 లను ఉల్లంఘించి జిల్లా కేంద్రంలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, పెంచిన ఫీజులను నోటీస్ బోర్డ్ లో పెట్టకుండా, స్మార్ట్ పేర్లను జోడిస్తూ గ్రౌండ్, నిబంధనలకు అనుగుణంగా విశాలమైన తరగతి గదులు లేకుండా నడిపిస్తున్నారనీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలో నారాయణ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవస్థను నడుపుతున్నాయని. ఇది విద్యను వ్యాపారంగా మలచే దిశగా తీసుకెళుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర భారం మోపుతోంది.వెంటనే అధికారులు మొద్దు నిద్ర వదిలి విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా శాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నగర అధ్యక్షకార్యదర్శులు కేశాబోయిన రాము, మామిడిపల్లి హేమంత్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు.
పేదల సొంతింటి కల నెరవేరుతుంది ఇచ్చిన హామీలను నెరవేస్తున్న కాంగ్రెస్ పార్టీ.
మొగులపల్లి నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అమ్మ గార్డెన్ లో BRS పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే.
గండ్ర వెంకట రమణారెడ్డి మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లపై అవకతవకలు జరిగినవని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తూ.
ఈరోజు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమార్ స్వామి మాట్లాడుతూ ఇందిరమ్మ.
ఇళ్లలో అవకతకులు జరిగినట్లు మీరు చూపించడానికి సిద్ధంగా ఉంటే మండలంలోని ఏ గ్రామంలోనైనా చర్చకు మేము సిద్ధమే సమయం వేదిక మీరు ఎక్కడ కోరిన మేము అక్కడికి రావడానికి ఏ చర్చ కైనా దేనికైనా మా కాంగ్రెస్ పార్టీసిద్ధమే అని ఆయన అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ జిల్లా నాయకులు మండల రవీందర్ ఏలేటిశివారెడ్డి దండ వెంకటేశ్వర రెడ్డి.
యారా రవికుమారు గుండారపు తిరుపతి మాజీ సర్పంచులుకాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి జమ్మికుంట:నేటిధాత్రి
స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించాలని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం రోజున జమ్మికుంట మండల కమిటీ సమావేశం కామ్రేడ్ జక్కుల రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ,పట్టణ కేంద్రంలో ప్రజలు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సమస్యలను అధ్యయనం చేసి ఎక్కడికక్కడ నిర్దిష్ట కార్యాచరణతో ఆందోళన, పోరాటాలు నిర్వహించాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు నిరంతర పోరాటాలు చేయాలన్నారు.
భూ సమస్యలు పరిష్కరించాలన్నారునిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి కేటాయించాలని డిమాండ్ చేశారు.
యాసంగి రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయ జోక్యం లేకుండా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానం చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు లేనటువంటి అర్హులకు వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజా అనుకూల నిర్ణయాలను స్వాగతిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.
పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు.
మహిళలకు నెలకు 2500 రూపాయలు వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న రెండవ దఫా దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తుందన్నారు.
29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కూల్ గా గా చేసిందని, కార్మికుల శ్రమను పెట్టుబడుదారులు దోచుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సామాజిక, ఆర్థిక భద్రతకు విఘాతం కలిగిస్తుందన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలు తెస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసిందన్నారు.
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం నిర్వహించాలని సిపిఎం శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జమ్మికుంట మండల కార్యదర్శి శీలం అశోక్, మండల కమిటీ సభ్యులు కన్నం సదానందం, వడ్లూరి కిషోర్, దండి గారి సతీష్, చల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్ర మందారాలు మూవీ షూటింగ్ ప్రారంభంలో గొలనకొండ వేణు
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జనగాం జిల్లా పెంబర్తి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఛండికా సోమేశ్వర స్వామి దేవస్థానములో జరిగిన “ఎర్ర మందారాలు” తెలుగు సినిమా ప్రారంభోత్సవంలో నిర్మాత వై. జగన్ ఆహ్వానం మేరకు ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గొలనకొండ వేణు పాల్గొన్నారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.తొలి ప్రయత్నంలో వేణు స్నేహితుడు “ఎర్ర మందారాలు” తెలుగు సినిమా నిర్మాత యెలికట్టె జగన్నాథం గౌడ్ మణికంఠ ఫిలిమ్స్ పై నిర్మిస్తూ రాజ్ కుమార్ కథానాయకుడిగా యుగేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తెలుగు సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని, ఆహ్లాదపరుస్తుందని, మనసుకు హత్తుకుంటుందని వేణు అన్నారు. బలమైన కథతో త్వరలో మీ ముందుకు రాబోతున్న ఎర్ర మందారాలు సినిమా సంచనాలతో రికార్డ్ సృష్టిస్తుందని ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులతో పాటు తెలంగాణ, ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఆదరించి విజయవంతమైన సినిమాగా నిలిపి ఓరుగల్లు కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ప్రారంభోత్సవంలో ఆర్టీసీ బీసీ సంఘం నర్సంపేట డిపో అధ్యక్షుడు కందికొండ మోహన్ పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన బత్తిని శంకర్
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని శివశంకర్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మధుసూదనాచారికి అతి సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిబిజి కే స్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గణపురం మండల అధ్యక్షుడు మాజీ నాయకులు జి రామకృష్ణగౌడ్, శ్రీకాంత్, ఎం నిఖిల్, కే. వికాస్ గౌడ్, ఎన్. అరవింద్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
*అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల పట్ల డిఈఓ పిర్యాదు *
పాఠశాలలను సీజ్ చేయాలి…గడ్డం నాగార్జున
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలని కోరుతూ ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కు ఆయన కార్యాలయంలో మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25 ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్ ఉంటే , అనధికారికంగా 14 ప్రైవేట్ పాఠశాలలు అందులో గీతాంజలి స్కూల్, డఫోడిల్స్ హై స్కూల్ , విజ్డమ్ హై స్కూల్, మదర్స్ లాండ్ హై స్కూల్ , కేఎస్ఆర్ శ్రీఅభ్యాస్ హై స్కూల్, ఎస్.పి.ఎస్ హై స్కూల్ తదితరుల స్కూలు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టా రాజ్యాంగ వివరిస్తున్న కూడా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా వదిలేయడం సిగ్గుచేటని అన్నారు.
Education Officer.
పట్టణంలో అనధికారికంగా నడపబడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై డిఈఓ సమగ్ర విచారణ జరిపించి తక్షణమే వాటిని మూసివేసి,విద్య శాఖను తప్పుదోవ పట్టిస్తున్న ఆ స్కూల్ యాజమాన్యాలపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి,జిల్లా నాయకులు పోలబోయిన రాజు, జావాజి శ్రిజిత్ తదితరులు పాల్గొన్నారు.
రాత పుస్తకాలు అందజేసిన_మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి
నడికూడ నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వము అందించిన ఉచిత రాత పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరము నుండి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలను అందజేస్తుందని అన్నారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు,రాత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,రాగి జావా,వారానికి మూడుసార్లు కోడిగుడ్లు,అన్ని ఉచితంగా కల్పిస్తున్నది. కావున విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని,ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి గ్రామ ప్రజలది మరియు తల్లిదండ్రులదని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒకటవ తరగతికి మూడు,రెండవ తరగతి మూడు,మూడో తరగతి నాలుగు,నాలుగవ తరగతికి ఐదు,ఐదవ తరగతి ఆరు నోటుబుక్కులను ఉచితంగా అందజేసిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా నోట్బుక్కులు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్ మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో 9000 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ కావడంతో రైతు సంబరాలకు రాష్ట్ర పార్టీ ఆదేశించగా మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతులు బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్, నాయకులు ఏడాకుల సంపత్ రెడ్డి, జెట్టి రామ్మూర్తి, జిల్లా మునీందర్, చిట్యాల ఉపేందర్ రెడ్డి బత్తిని మహేష్, తదితరులు పాల్గొన్నారు.
#ప్రభుత్వ పథకానికి తూట్లు పొడుస్తున్న నాయకులు. నల్లబెల్లి, నేటి ధాత్రి;
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నాయకుల వ్యవహార శైలితో గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు చేయకుండా. తమకు నచ్చిన వ్యక్తులకు ఇండ్లు మంజూరు చేయించి ఆర్థికంగా బలోపేతం కావడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారని అర్హులైన లబ్ధిదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు నిర్మించేందుకు ఐదు లక్షల రూపాయలను వెచ్చించి ఇల్లు నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా పథకాన్ని దిగ్విజయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటే గ్రామాలలో ఉన్న చోటామోటా నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం అర్హులైన లబ్ధిదారులను పక్కనపెట్టి. కమిషన్లు ఇచ్చే వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేసి పబ్బం గడుపుతున్నారని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అవకతలపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని నిరుపేద కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామ గ్రామాన M R P S జండా ఎగరవేయాలి భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో M R P S మొగుళ్లపల్లి మండల ఇంచార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ మరియు రేణుకుంట్ల సంపత్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ముఖ్య కార్యాలర్తల సమావేశానికి ముఖ్య అతిధులుగా M R P S భూపాలపల్లి నియోజక వర్గ ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు అంబాల చంద్రమౌళి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ జన్మదిన వేడుకలు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరపాలని పిలుపునివ్వడం జరిగింది మహాజన నేత మంద కృష్ణ మాదిగ అన్న ఎస్సీ లలో మాదిగ , ఉపకులాల కు ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా అన్యాయం జరుగుతుందని గుర్తెరిగి మాదిగ దండోరా (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) స్థాపించి పల్లె పల్లేనా మాదిగలను, ఉపకులాలను ఏకం చేసి సబ్బండ వర్గాల ప్రజలందరి మద్దతు కూడగట్టి ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని అలుపెరుగకుండా ముప్పై ఏండ్లు సాగించి ఫలితాన్ని సాధించి పీడిత వర్గాల ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసాడని అన్నారు. మాదిగల, ఉపకులాల పక్షాన ఉద్యమిస్తూనే సమాజం లో ఏ వర్గం కు ఆపద వచ్చిన ఆయా సామాజిక వర్గాలకు అండగా నిలిచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంతడుపుల సారంగ పాణి జీడీ సంపత్ రొంటాల రాజ్ కుమార్ బండారి రామస్వామి నిమ్మల భద్రయ్య మంగళ పల్లి శ్రీనివాస్ గుడిమల్ల రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు
వానాకాలం రైతు భరోసా రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు జమ చేసి రికార్డు సృష్టించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మక్సుధ్ హైమద్ ఆన్నారు. మంగళవారం మొగుడంపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు.
ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండల్ వెల్దండ గ్రామపంచాయతీ జోగు రవి కుమార్ s/o యాదయ్య గారు,రాష్ట్ర నాయకులు మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ రిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇల్లు నిర్మాణం కోసం సిమెంట్ పంపించారు. మంగళవారం నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా సిమెంట్, ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారుసిద్ధగొని రమేష్ గౌడ్ , మధుసూదన్ రెడ్డి, జోగు రవి కుమార్, ప్రభాకర్ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
యువకులారా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారండి భావితరాలకు మంచి భారతాన్ని అందిద్దాం
మాదకద్రవ్య రహిత సమాజం కోసం పాటుపడదాం
రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
జైపూర్,నేటి ధాత్రి:
మాదక ద్రవ్యాలు,గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్తుని,అందమైన భారతాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మత్తుపదార్థాల వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
అందులో భాగంగా మంగళవారం రోజున జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ ముఖ్య అతిదిగా పాల్గొనడం జరిగినది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,భవిష్యత్తు రోజుల్లో మాధకద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యార్థుల చేతిలోనే ఉంది అని అన్నారు.
విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు జీవిత లక్ష్యం పై మాత్రమే ఉండాలని,నిషేధిత గంజాయి డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సీపీ సూచించారు.
గంజాయి డ్రగ్స్ అలవాటు వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.
మాదక ద్రవ్యాల నిర్ములన గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యం గా రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ కృషి చేస్తోందని అందులో బాగంగా విద్యాసంస్థలు,గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
మత్తుకు బానిస అవడానికీ అనేక కారణాలు ఉంటాయి పరిసరాల ప్రభావం,చెడు స్నేహితులు, సన్నిహితుల వలన చెడు మార్గాల వైపు వెళ్లకుండా జాగ్రత్త ఉండాలని అన్నారు.
గంజాయి,డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్ లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు.మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత,విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని తెలిపారు.
ఈరోజు ఇక్కడ తెలుసుకున్న విషయాలను కుటుంబ సభ్యులకు,స్నేహితులకు, బంధువులకు తెలియజేసి డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
Police Commissioner Amber Kishore Jha IPS
అదేవిధంగా విద్యార్థులు ఎక్కువ సమయం స్కూల్స్,హాస్టల్ లలో ఉంటారు కావున ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ,వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా జాగ్రత్త వహించాలన్నారు.
మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, సేవిస్తున్నట్టు తెలిస్తే వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వాలని కోరారు.యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూన్న వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.
ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన,సరఫరా చేసిన,సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు,గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు.
మేము డ్రగ్స్ తీసుకొము,బంధుమిత్రులు, చుట్టుపక్కల వారు,స్నేహితులు మాధకద్రవ్యాలకు అలవాటు బారిన పడకుండా వారిని చూసుకునే బాధ్యత మాదే అని డ్రగ్స్ వల్ల కలిగే అనార్ధాల గురించి వారికి వివరిస్తాం అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.
Police Commissioner Amber Kishore Jha IPS
ఈ కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఐపిఎస్.జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లా రెడ్డి,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,జైపూర్ ఎస్సై శ్రీధర్,భీమారం ఎస్సై శ్వేతా,శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్,సిసి హరీష్,కస్తూర్బా ప్రిన్సిపాల్.ఫణి బాల,సాంఘిక సంక్షేమ ప్రిన్సిపాల్,కోలా నాగేశ్వరరావు,సాంఘిక సంక్షేమ కోటపల్లి ప్రిన్సిపాల్ బి.రమేష్ బాబు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు,నార్కోటిక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు…పండగ
◆ రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న
◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి
న్యాలకల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద నిర్వహించిన రైతు నేస్తం,రైతు భరోసా విజయోత్సవ సభలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాలో విడుదల చేసిన శుభ సందర్భన్నీ పురస్కరించుకుని మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మండలంలోని రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగుంది.అనంతరం రైతులందరు ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తంచేశారు, మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కేవలం18 నేలలో రైతు రుణమాఫీ,రైతు భరోసా,రైతు బోనస్లు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ డీసీసీ ప్రధాన కార్యదర్శి.భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,pacs చైర్మన్లు.సిద్దిలింగయ్య స్వామి,జగ్గానాథ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ.గౌసోద్దీన్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,తదితరులు పాల్గొన్నారు.
-బాధితునికి మొబైల్ ఫోన్ ను అందజేసిన ఎస్పై దీకొండ రమేష్..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే వ్యక్తి మొబైల్ పోగొట్టుకున్నాడు సెంట్రల్ ఎక్యుప్ మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ (సి ఈ ఐ ఆర్) ద్వారా రికవరి చేసి మొబైల్ ఫోన్ ను బాధితులకు అప్పగించిన ఎస్ ఐ దీకొండ రమేశ్ | పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ మొబైల్ ఫోన్ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ను, సంబంధిత మొబైల్ ఫోన్ల ఐ ఎం ఈ ఐ నెంబర్ల ద్వారా ఆతని వివరాలు తెలుసుకొని ఆతని నుండి మొబైల్ ను పోత్కపల్లి ఎస్ఐ రికవరీ చేశారు. మొబైల్ ను ఎస్ఐ పోలీసు స్టేషన్ నందు బాధితునికి అప్పగించారు. మొబైల్ విలువ సుమారు రూ.28,000/- ఉండును. ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్ ఐ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నట్లయితే వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా నెంబర్ ను వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఘనంగా జిల్లా కేంద్ర లో వేడుకలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర లో జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ. జక్కన్న సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనునిత్యం బీసీల హక్కుల కోసం పోరాడుతున్న యోధుడు అని అభివర్ణించాడు, బీసీల కోసం దేశంలోనూ రాష్ట్రంలోనూ బీసీల కులగణన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమర నిరాహార దీక్ష చేసి చావు చివరి అంచుల వరకు వెళ్లి కుల గణన సాధించిన వీరుడని , ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు కోసం మేమెంతో మాకు అంత సాధించాలనే అనే ఉద్దేశంతో బీసీలను చైతన్య పరుచుతూ గ్రామ గ్రామాన చైతన్యపరచాలని కొండ లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలమైన వంకాడి నుండి అలంపూర్ వరకు రథయాత్ర నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా నాయకులు బండి రమేష్ , కృష్ణ , నేరెళ్ల కుమార్, కాటిపెల్లి సతీష్ , ఉమర్ ఆలీ, శ్రీను , రామకృష్ణ , అనిల్, తదితరులు పాల్గొన్నారు.
కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం.. బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పెద్దపెల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.దీనితో పాటు గ్రామంలోని దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాల ను సందర్శించి అక్కడ ఒక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బీజేవైఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరు పృథ్వీరాజ్ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఎలిగేడు మాజీ మండల అధ్యక్షులు నారాయణస్వామి సుల్తానాబాద్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి మహేందర్ కొలనూరు మాజీ సర్పంచ్ కైరునిస తాజ్ పుల్ల సదయ్య అనిల్ రావు దాత రాకేష్ సత్యం రెడ్డి శంకర్ బిక్షపతి కొంగర అనిల్ తదితర మూర్చ నాయకులు బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ అమెరికా దేశాలు ఇరాన్ దేశంపై యుద్ధం వెంటనే ఆపాలని కోరారు.ప్రపంచ దేశాలు శాంతి నెలకు కొలపాలని వారన్నారు. యుద్ధం సరైన పద్ధతి కాదన్నారు.అమెరికా సామ్రాజ్య వాదాన్ని నెలకొల్పాలని పచ్చిమ ఆసియాపై ఆదిపత్యం చేసుకోవాలని దురుద్దేశంతో ఇరాన్ పై దాడులు చేపించడం జరుగుతుందన్నారు.ఇరాన్ ఆణుఅయుధాలను తయారు చేస్తుందని ప్రపంచానికి తప్పుడు సంకేతాలు తీసుకవచ్చి యుద్ధం చేస్తున్నారని అన్నారు. యుద్దాల వల్ల వేలాదిమంది ప్రజలు అన్యాయంగా చనిపోతున్నారని, పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరుగుతుందని తెలిపార. యుద్ధం వద్దు శాంతి ముద్దు అని ట్రంపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ సుధాకర్ రెడ్డి మాతంగి రాంచందర్ క్యాతరాజు సతీష్ నెరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ పీక రవికాంత్ గోనెల తిరుపతి రమేష్ చారి గోలి లావణ్య శ్రావణి పల్లెర్ల రజిత శ్రీలత వాసం రజిత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 05 వ తేదీ నుండి జూలై 13 వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.
యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.
ప్యాకేజీ వివరాలు : (ఐదు జ్యోతిర్లింగ యాత్ర – SCZBG43):* ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్) – త్రయంబకేశ్వర్ – భీమశంకర్ – ఘృష్ణేశ్వర్).
ఈ యాత్రలో మహాకాళేశ్వర్ / ఓంకారేశ్వర్ / త్రయంబకేశ్వర్ / భీంశంకర్ / ఘృష్ణేశ్వర్ / ఎల్లోరా / మోవ్/ నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు.
ఈ యాత్ర జూలై 05 వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంట్టుంది.
దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14700, 3 ఏసీ ధర 22900, 2 ఏసీ ధర 29900 ఉంటుంది.
ఈ యాత్ర సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ నాందేడ్ ముధ్ఖడ్ మరియు పూర్ణ మీదుగా వెళ్తుంది.
సౌకర్యాలు :రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం.
ప్రతి రైలు లో 718 మంది ప్రయాణికులు ఉంటారు.
ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు.
కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు.
టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701,9281495843,9281030750,9281030749 లకు సంప్రదించాలని మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రధించాలని తేలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.