పైసలు ఇయ్యకుంటే
పనులు ఎట్లా చెయ్యాలే…
◆:- ఏం చేయమంటారు…? ఎలా చేయమంటారు….!
◆:- ముందుకు సాగని ప్రత్యేక అధికారుల పాలన
◆:- ఒక్క ప్రత్యేక అధికారి కూడా గ్రామాలలో తిరగని వైనం
◆:- పంచాయతీ కార్యదర్శిలపై ఆర్థిక భారం
◆:- నిధులు, బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతుంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు. అభివృద్ధి కుంటుపడుతుంది. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కార్యదర్శిల పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల జగదేవపూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి సొంత డబ్బులతో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టిన గ్రామంలో విష జ్వరాలు విజృంభించడం ఇద్దరు అకాల మరణం చెందడం వల్ల పారిశుధ్య లోపం కారణమని చివరికి కార్యదర్శిని అధికారులు సస్పెన్షన్ చేశారు.
1. చెత్త సేకరణ ట్రాక్టర్లతో తిప్పలు…..
పల్లెల్లో పారిశుద్ధ నిర్వహణ చాలా ముఖ్యం. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్ తో పాటు వాటి మరమ్మతులు చేపట్టడానికి కార్యదర్శులు సొంతంగా వారానికి రూ. వేయి రూపాయల నుంచి రెండు వేల వరకు వెచ్చిస్తున్నారు. వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ పనులు తాగునీటి వసతి బోర్ల మరమ్మతులు పైప్ లైన్ లీకేజీలు తదితర పనులకు నెలకు పదివేల పైగానే ఖర్చు అవుతున్నాయి. కార్యదర్శులు ఆర్థిక భారంతో సతమతమవు తున్నారు. మొన్న ముగిసిన వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు కూడా అదనంగా భారం పడిందని కార్యదర్శులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటును కూడా అంతంత మాత్రమే. చేపట్టారు.
2. నిధులు రాక… గ్రామాల అభివృద్ధి గాలికి…
గ్రామాల్లో ప్రత్యేక అధికారులు 2024 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన 15 ఆర్థిక సంఘం, రాష్ట్రం నుంచి ఎస్ఎఫ్ సి నిధులు నిలిచిపోయాయి. ఇంటి, నల్లా, వాణిజ్య పనులను వసూలు చేసి ఖజానాలో జమ చేసిన తర్వాత విడుదల చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జిపిల విద్యుత్ బిల్లులు చెక్కులు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నప్పటికీ జమ కావడం లేదు. ఆర్థిక భారం భరించలేక పలువురు కార్యదర్శులు వసూలైన పన్నుల డబ్బులను ఖర్చులను నిమిత్తం వినియోగిస్తూ బిల్లులు పెట్టుకుంటున్నారు. అందుబాటులో
3. బతుకమ్మకు ఏర్పాట్లు ఏట్లా…
బతుకమ్మ దసరా పండుగకు ఇక మిగిలింది పది రోజులే గ్రామాల్లో బతుకమ్మ కుంటల మరమత్తు పనులు విద్యుత్ దీపాలు అలంకరణ వంటి సౌకర్యాలు కల్పించాలి. గ్రామపంచాయతీ లో డబ్బులు లేకపోవడం ఇప్పటికే అదనంగా కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టుకొని వివిధ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ బతుకమ్మ దసరా ఉత్సవాలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని కార్యదర్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించి మంజూరు చేయాలని కోరుతున్నారు.
4. గ్రామాల్లో తిరగలేక పోతున్నాం….
ప్రజల నుండి వచ్చే సమస్యలను తీర్చలేక సొంత డబ్బుల తో, మరియు అప్పులు తెచ్చి చేస్తున్నాం. అతివృష్టి వలన కలిగిన వానలతో డ్రైడే నిర్వహించి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూస్తున్నాం. టాక్టర్ల ద్వారా పిచ్చి మొక్కలను, నీటి నిల్వలను శు భ్రం చేస్తున్నామన్నారు. ఇప్పుడు వచ్చే ఈ పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించగలని కోరుతున్నారు.