మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని ఆర్ఐ కిరణ్ అన్నారు.
ఎవరినైనా కించపరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రోజు పౌరహక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య సూచించారు. దళిత జాతుల వారిని కించపరిస్తే చట్టప్రకారం శిక్ష పడుతుందన్నారు. ప్రతి నెలాఖరులో గ్రామాల్లో సివిల్స్ రైట్స్ డే కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
అంటరానితనాన్ని నిర్మూలించాలి
రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎచ్ డబ్ల్యూ ఓ శివకుమార్ అన్నారు. నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఐ. ఎస్ గాయత్రీ మాట్లాడుతూ, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఎక్కడైనా పౌరహక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివక్ష లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆర్ ఐ కిరణ్ , హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, ఆర్ఐ. గాయత్రి, పంచాయతీ కార్యదర్శి సుస్మిత , నేరేటి బుచ్చన్న వార్డు సభ్యులు, కోస్గి వెంకటయ్య, కొల్లూరు జనార్ధన్, కార్ బార్ వేణుగోపాల్, సి.లక్ష్మీనారాయణ, బ్యాగరి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.