కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం-బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం వారికి మనస్పూర్తిగా యావత్ తెలంగాణ మరియు భారతదేశ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెళ్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కాడే నర్సింగమ్, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిత్తవేణి అంజిబాబు, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల యువ మోర్చ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేమ్ కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.