
MLA Demands Action Over Market Demolition"
ప్రజల ఆస్తులను ద్వసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గత 20 ఏండ్ల నుండి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో “మా ఊరి సంత” పేరుతో నిర్మించిన కూరగాయల రేకుల షేడ్లు, మూత్రశాలలను గురువారం జేసీబీ సాయంతో కూల్చివేసే క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడిన విషయం విధితమే.
ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గణపురం మండల కేంద్రానికి చేరుకొని కూల్చివేతలు చేపట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగడి నిర్వహించుకునే ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు, అలాగే వారాంతపు సంతలో కూరగాయలు అమ్ముకునే వారికి సౌకర్యవంతంగా ఉండేలా షెడ్లు గత ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే, ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎటువంటి ముందస్తు నోటీసులు,పర్మిషన్ లేకుండా కూల్చివేతలు చేపట్టడం సరైన పద్ధతి కాదని,ప్రజల ఆస్తిని కూల్చివేసిన వారి పై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్, ఐలోని రామచంద్ర రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి,గంజి జనయ, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి,మామిండ్ల సాంబయ్య,రాజిరెడ్డి,మల్లారెడ్డి,జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటుగౌడ్ ,వాజిద్ ,సింహాచలం ,కొమురయ్య,శ్రీనివాస్,యాకయ్య,రఘు,తదితరులు ఉన్నారు