గంజాయి తాగిన గుట్కాలు అమ్మిన కేసులు
పోలీసుల గట్టి నిఘా
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లాను నషాముక్తి జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్, నషాముక్త్ భారత్ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు.
మత్తు పదార్థాల సేవించడం వల్ల జరిగే నష్టం పై యువతకు అవగాహన కల్పించాలని, విద్యా శాఖ అధికారులతో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు గట్టి నిఘా ఉంచాల ని గంజాయి తాగే వారిని రవాణా, చేసే వారిని అరికట్టాలని సూచించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య మాట్లాడుతూ తమ పిల్లలు మత్తుపానియాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలపై నిఘావేసి ఉంచాలని కోరారు. విద్యాలయాలు, ఆసుపత్రుల దగ్గర వ్యాపారులు గుట్కాలు , సిగరెట్ వంటి పదార్థాలు అమ్మకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్పెషల్ క్యాంపెయిన్ లు నిర్వహించి యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల ఆవరణలో మత్తు పదార్థాలు గంజాయి తాగడం వల్ల జరిగే నష్టలపై ఫ్లెక్సీ లు ఏర్పాట్లు చేసి అవగాహన కల్పించాల్సిందిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు డి.సి.ఆర్.బి. డి.ఎస్పీ ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలో 2017 నుంచి గంజాయి కేసులు నమోదు అవుతున్నాయని, ఇటీవల వీపనగండ్ల మండలంలో ఒక పశువుల కాపరి గడ్డి వాములో గంజాయి దాపెట్టి ఉంచిన ఉదంతం వచ్చిందని అన్నారు గంజాయి తాగే వారు, రవాణా చేసే వారి పై పోలీస్ శాఖ గట్టి నుఘావేసి ఉంచిందని వారు దొరికిన వెంటనే కేసులు బుక్ చేసి జైలుకు పంపిస్తున్నట్లు తెలిపారు జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డీఆర్డిఒ ఉమాదేవి, ఆబ్కారీ శాఖ, విద్యా శాఖ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
–