వ్యక్తి అదృశ్యం పై కేసు నమోదు
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ మండల పరిధిలోని అల్గోల్ గ్రామానికి చెందిన ఏర్పుల రాజు వయస్సు 40 సంవత్సరలు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై ఎం. కాశీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్గోల్ గ్రామానికి చెందిన ఏర్పుల పద్మ చర్చికి వెళ్లే ముందు భర్తతో పాటు తన కూతురు ఇంట్లోనే ఉందని ఆయన తెలిపారు ఎప్పటిలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన ఏర్పుల పద్మ చూసేసరికి భర్త లేకపోవడంతో చుట్టుపక్కల వారిని అడగగా వారి నుంచి కూడా కనిపించలేదని సమాధానం వచ్చిందని ఆయన తెలిపారు. రాజు భార్య ఏర్పుల పద్మ జహీరాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కాశీనాథ్ తెలిపారు.