
CI K Mogili.
గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు రిమాండ్
తంగళ్ళపల్లి నేటి దాత్రి..
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి రూరల్ సిఐ కె మొగిలి . తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి.మాట్లాడుతూ. నమ్మదగిన సమాచారం ప్రకారం. తంగళ్ళపల్లి గ్రామ శివారులోని స్మశాన వాటిక వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా తెలిసిన సమాచారం ప్రకారం పోలీస్ సిబ్బంది. సంయుక్తంగా దాడి చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా వారిని పట్టుకుని విచారించగా. వారి పేర్లు. ఎండి సాదిక్. మైనారిటీ. గ్రామం బద్దెనపల్లిగా. రెండవ అబ్బాయి.తంగళ్ళపల్లి రాజేష్. కులం అవుసుల గా. గ్రామం . బద్దెనపల్లి. గ్రామానికి చెందిన వారిని.పట్టుకొని విచారించగా. వీరు గత కొంతకాలంగా తంగళ్ళపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో. గంజాయి తాగేవారికి గంజాయి.అమ్ముతున్నట్లుగా తెలిసిందని. ప్రస్తుతం వీరిద్దరి వద్దనుండి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని. విచారణ అనంతరం ఇద్దరు నేరస్థులను ఈరోజు సిఐ. గౌరవ సిరిసిల్ల కోర్టు కు. రిమాండ్‌కు తరలించడం జరిగిందని. అలాగే రూరల్ సిఐ మొగిలి మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో ఎవరైనా గంజాయి సేవించిన లేదా గంజాయిని విక్రయించిన. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవరైనా గంజాయి సేవించిన విక్రయించిన వారి వివరాలను. ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచు. వారి వివరాలను బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని.చట్ట వ్యతిరేకత చర్యలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. గంజాయి కేసులో నిందితులను . చాక. చక్యంగా. వ్యవహరించి పట్టుకున్న తంగళ్ళపల్లి . ఎస్సై. ఉపేంద్ర చారిని.ఏఎస్ఐ
ఆర్ రవీందర్ ని.. కానిస్టేబుల్. నరేందర్ ను. ప్రశాంత్. శ్రీకాంత్. అబ్బాస్. అలీ. రామ్మోహన్‌లను. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని రూలర్ సిఐ కే మొగిలి ప్రత్యేకంగా అభినందించారు