
Fertilizer Dealer.
ఎరువుల డీలర్ పై కేసు నమోదు.
#6 ఏ కేసు నమోదు చేసి యూరియా నిలువల అమ్మకాలు నిలిపివేశారు.
#యూరియా కొరతను డీలర్లు సృష్టిస్తే పీడీ యాక్ట్ తప్పదు.
#ఏడిఏ దామోదర్ రెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
యూరియాను కృతిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి డీలర్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని నర్సంపేట ఏ డి ఏ దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేపట్టారు. ఆదివారం రాత్రి యూరియా కోసం మండలంలోని బిల్లా నాయక్ తండా చెందిన రైతులు యూరియా కోసం మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ షాపు వెళ్ళగా యూరియా నిలువలు ఉండంగా లేదని దురుసుగా రైతులపై మాట్లాడడంతో సదరు డీలర్ గోదాం దగ్గరికి వెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంత పరిచి సమాధానం చెప్పడంతో రైతులు శాంతించగా.

ఈ సంఘటన రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సంచలనం కాగా అధికారులు స్పందించి కర్ర కృష్ణారెడ్డి డీలర్ల వద్ద ఉన్న ఎరువుల నిలువలపై స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి 1000 బస్తాలు ఉండడంతో అట్టి యూరియా నిలువలను అధికారులకు సమాచారం ఇవ్వకుండా అమ్మరాదని సదర్ డీలర్ కర్ర కృష్ణారెడ్డిని హెచ్చరించారు. అనంతరం ఆయనపై 6 ఏ కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలంలోని ఏ డీలర్ కూడా యూరియాకు లింకు పెట్టి అమ్మితే చట్ట రిత్యా చర్య తీసుకొని సంబంధిత డీలర్ లైసెన్సును రద్దు చేయబడుతుందని ఆయన పలువురు డీలర్లకు సూచించారు. ఆయన వెంట ఏవో బన్న రజిత, ఏ ఈ ఓ శ్రీకాంత్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.