బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు
– అనుమతి లేకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం,ధర్నా
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ధర్నాచేసిన బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు చేసారని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ తేది 13-03-2025 రోజున అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని శాసనసభ సమావేశాలకు సస్పెండ్ చేసినదానికి భేషరతుగా జగదీశ్వర్ రెడ్డి పైన వేసిన సస్పెన్షన్ వేటును వెంటనే ఉపసంహరించుకోవాలని, శుక్రవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఎలాంటి అనుమతి లేకుండా వాహన దారులను అడ్డుకొని వారికి ఇబ్బంది కల్గించి ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ధర్నా చేసిన బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యక్తల పై కేసు నమోదు చేసినట్లు తెలిపినారు.