నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
మండలములోని వంగపల్లి గ్రామములో కిరాణా దుకాణం లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేరకు కమలాపూర్ ఎస్ఐ వీరభద్రం ఆధ్వర్యములో పోలీసులు తనీకీలు నిర్వహించారు.వారి తనికీల్లో పంజలా వెంకన్న కిరాణా షాపు లో రూ.4870/-(నాలుగు వేల ఎనమిది వందల డెబ్బై రూపాయల) విలువ గల మద్యం లభించినట్లు ఎస్ఐ తెలిపారు.అతడిని అదుపులోకి తీసుకుని కేస్ నమోదు చేసినట్లు తెలిపారు.