
N. Maurya
త్రాగునీరు వృథా కాకుండా పైపులైన్ మరమ్మత్తులు చేపట్టండి..
*కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 23:
నగరంలోని ప్రజలకు సరఫరా అయ్యే త్రాగునీటి పైపులైన్లు మరమ్మత్తులు చేసి నీరు వృథా కాకుండా అరికట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని 45 వ వార్డులో ప్రజల నుండి వచ్చిన సమస్యలను కార్పొరేటర్ అనీష్ కుమార్, అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలుచోట్ల త్రాగునీటి పైప్ లైన్ పగిలి నీరు వృథా అవుతోందని పిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇంజినీరింగ్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించాలని అన్నారు. త్రాగునీటి తో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ ఆఫీసర్ రవి, ఏసిపి మూర్తి, డి.ఈ.లు రమణ, శిల్ప, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.