
Ganja Found in Cotton Field
పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల చాల్కి గ్రామ సరిహద్దులో చాల్కి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వయస్సు గల ఒక రైతు తన సొంత పట్టా భూమిలో పత్తి పంటను సాగు చేస్తూ అంతర్ పంటగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని పండించిన విషయం మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న సంగారెడ్డి ఎక్సైజ్ క్లూస్ టీం,హద్నూర్ ఎస్సై సుజిత్, మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారి ధనరాజ్ లు కలిసి మంగళవారం రాత్రి దాడి నిర్వహించగా, ఈ దాడిలో 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.