క్యాన్సర్ పట్ల అవగాహన ఎంతో అవసరం*
వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ .
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లోని క్యాన్సర్ చికిత్స వార్డులో వ్యాధిగ్రస్తులకు పండ్లను అందించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ మాట్లాడుతూ “క్యాన్సర్ పట్ల సరైన అవగాహన లేక క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. వివిధ రకాల క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించగలిగి, డాక్టర్ సలహాలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ ను ముందే గ్రహిస్తే చికిత్స సులభతరం అవుతుందని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకున్న వారిని ఉదాహరణగా తీసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండి, సరైన నియమ నిబంధనలు పాటిస్తే క్యాన్సర్ ను ఎదుర్కొనవచ్చును అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం.జి.యం. ఆర్.యం.ఓ.డాక్టర్ మహేందర్, డా.భాస్కర్ (అంకాలజిస్ట్), పారా లీగల్ వాలంటీర్ వై.సింధూజ, ఏ.యన్.యం.లు తదితరులు పాల్గొన్నారు.
